బ్లాగర్స్ పై నా భావాలు...

చాలా రోజుల నుండి నా మదిని దొలిచేస్తున్న విషయం ఇది...ఇలా అని వ్రాస్తే ఏమనుకుంటారో ఎంతమంది ఎన్ని విధాలుగా తిట్టుకుంటారో లేక మెచ్చుకుంటారో, వ్రాయనా వద్దా అని ఆలోచించి ఆగలేక ధైర్యం చేసి వ్రాస్తున్నా... తిట్టినా, మొట్టినా అందరూ నావాళ్ళే కదా అన్న ధీమాయే ఈ టపాకి శ్రీకారం...

ఇక అసలు విషయానికి వస్తే...
ఎవరిదైనా ఒకరి బ్లాగ్ ని తలచుకోగానే నాకు గుర్తుకు వచ్చే చిత్రవిచిత్ర ఆలోచనలివి....వీటికి మీరు లాజిక్కులు, మాజిక్కులు, తర్కణలు, వాదనలు ఏమనుకుని అడిగినా నా దగ్గర సమాధానం లేదండోయ్...చదివి హాయిగా నవ్వుకుంటే నేనూ మీతో జతకలిపేస్తాను, తిట్టుకుంటే ఏంచేస్తాను చెప్పండి మీతో పాటే నేను కూడా, ఇంక మీరు సై అంటారా! నేను సైసై అంటాను...

క్రమబద్దీకరణ కాస్త కష్టమండీ అందుకే గుర్తుకి వచ్చిన వారిని వచ్చినట్లుగా వ్రాస్తాను మన్నించండి, ఇంక మరచిపోయిన వారు మన్నించి తలా నాలుగు తిట్టండి...అదే మహా ప్రసాదం...

విసిగించక విషయం చెప్పమంటరా!!!

కొత్తపాళీ:-నన్నయ్యగారు కొత్తపాళీతో సిరాలేకుండా నిఘంటువుని పుంఖానుపుంఖలుగా వ్రాస్తున్నట్లు...

సాహితీయానం:-బొల్లోజుబాబాగారి నవ్వుతున్న ముఖంతోపాటు రవీంధ్రనాధ్ టాగూర్ గారు గుర్తుకు వస్తారు.

పర్ణశాల:-కత్తిమహేష్ గారు ఖబర్ధార్ తప్పురాస్తే కత్తితో ఖండిస్తా అన్నట్లు...

పరిమళం
:-ఎవరు ఏమి వ్రాసినా తను మాత్రం అందులోని పరిమళాన్ని మాత్రమే ఆస్వాధిస్తున్నట్లు...


ఆలోచనాతరంగాలు
:-అమ్మో! ఇలాంటి మేధవులకి మనం దూరంగా వుండాలన్నట్లు...


జాజిపూలు
:-పిల్లికళ్ళతో అమాయకంగా కనిపిస్తూ అన్ని విషయాలూ మనకి చెబుతూనే ఏ విషయాన్ని పూర్తిగా చెప్పకుండా ఉవ్విళ్ళూరించే సింగపూర్ చిన్నది గుర్తుకు వస్తారు.


రవిగారు
:-నేను వ్రాసే పోస్ట్ ను తప్పక వేరొక కోణంలో ఆలోచించే మొదటి వ్యక్తి...


ఆత్రేయ
:-శివుడు గళం మింగితే, కవితలన్నీ ఈయనగారి కంఠం మింగేసిందేమో అనిపిస్తూ...వెంటనే ఈయన వెనుక కళాస్పూర్తిగారి కుంచె గుర్తుకు వస్తుంది...


లీలామోహనం
:-చేత వెన్నముద్ద చెంగల్వ పూదండా...అనే పద్యం గుర్తుకొస్తుంది...


మధురవాణి
:-మధురమైన గొంతే కాదు, మంచి మనసున్న అందమైన అమ్మాయి గుర్తుకొస్తుంది...


కలల బాటసారి కవితాపధం
:-నా ఒర్కుట్ లో మొదట స్క్రాప్ పెట్టిన మిత్రుడుగా...


డా.ఆచార్య ఫణీంద్ర
:-నిండుకుండ తొణకదనిపిస్తుంది...


జీడిపప్పు:- కాస్త మిరియాలపొడి చిమ్ముకుని తింటే ఆహా! ఏమి రుచి...

నెమలికన్ను
:- మురళీపించుడు ఆలపించని రాగమున్నదా అనిపిస్తుంది.


శ్రుతి
:- నా చిన్నినాటి స్నేహితురాలి నవ్వు గుర్తొస్తుంది...


మరువం ఉష
:-నీవు రాస్తున్నవన్నీ నేను చూస్తున్నాను...జాగ్రత్త! అని హెచ్చరిస్తూ ధైర్యాన్ని ఇస్తున్నట్లు...


హిమబిందువులు
:- ఇప్పటికి కూడా ఇంకా పేరు(చిన్ని కాకుండా) తెలుసుకో లేకపోయానే ఏమై ఉంటుందబ్బా అని...

ఏకాంతవేళ ఉప్పొంగేభావాలు:-మధుమతి హిందీ చిత్రంలో దిలీప్ కుమార్ గుర్తొస్తారు...

స్వేచ్ఛకోసం
:-నేటి సమాజంలోని పేదపిల్లలు వారి జీవితాలు గుర్తుకొస్తాయి...


అర్జునుడి బాణాలు:-చూపులతో కూడా బాణాలు వేయవచ్చని...

పానీపూరీ123
:- అలా ఫోటో పెట్టి ఊరించకపోతే తలో పది తినమనొచ్చుకదా...


స్మృతుల సవ్వడి
:- నా కవిత వాళ్ళ శ్రీవారికి వినిపించి కానీ భోజనం పెట్టరేమో పాపం అంత అభిమానమా అనిపిస్తుంది...


నా స్వగతం
:- కార్తిక్...కార్తిక్...కార్తిక్...ఎవరు ఎవరు ఎవరు???


బాపూజీయం:- శివరామ కృష్ణగారి పుత్రుడు(శిరాకిపుత్ర)...

గీతాచార్య
:-పువ్వు పుట్టగానే పరిమలిస్తుందంటే ఇదేనేమో...


హృదయస్పందనల చిరుసవ్వడి
:-చిలిపి వ్యాఖ్యలతో అల్లరిపెట్టే పక్కింటి కుర్రోడు(ఒకప్పుడు)...పులిహోర తిన్నప్పుడు గుర్తుకువస్తారు(ఇప్పుడు)...


మనసులో కురిసిన వెన్నెల
:-తొలకరి జల్లుతో తడిసిన నేల నుండి వచ్చే మట్టివాసన...


వాలు కొబ్బరిచెట్టు
:- ఒక మంచి పిక్నిక్ స్పాట్ గుర్తుకువస్తుంది...


భాస్కర్ రామరాజు
:- వంటల జోలికి పోకూడదు నలభీములున్నారిచ్చట...


మనస్వి:-జయ "ఒక మంచి అమ్మాయి" కాప్షన్ గుర్తుకువస్తుంది...

కమ్మటికలలు:-అందమైన చిలకలజంట...

శివచెరువు:-క్లోజప్ ప్రొఫైల్...

సుత్తి నా సొత్తు
:-చదవకపోతే సుత్తితో ఒక్కటేస్తా...


అశ్వినిశ్రీ
:- పక్షుల కూనీరాగాలు గుర్తుకొస్తాయి...


ఏటిగట్టు:- ఏటిగట్టున కూర్చుంటే...ఏరు గలగలమంటుంటే అనే మధురమైన పాట గుర్తొస్తుంది.

శిశిర:- తన ప్రొఫిల్ లోని బొమ్మని దొగిలించి వేసిన నా కుంచె గుర్తుకొస్తుంది...

సత్య
:-రెక్కలుంటే ఎంతబాగుంటుందో కదా అనిపిస్తుంది...


సవ్వడి
:- సడిచేయకేగాలి సడిచేయబోకే అనే పాట గుర్తొస్తుంది...


Tears of Yohanth:-అబ్బాయిలు కూడా ఏడుస్తారన్నమాట...

రాకి
:-కవితలా కమెంట్స్ పెట్టే ఒపిక ఎంతమందికుంటుందో అనిపిస్తుంది...


తృష్ణ
:-జగ్జీత్ సింగ్ గజల్స్ గుర్తుకువస్తాయి...


బ్లాగు బేవార్సు
:- బేవార్సు అంటూనే బిజీగా ఉండే వ్యక్తి...


సిరి సిరిమువ్వ
:- స్వచ్ఛమైన నవ్వు గుర్తొస్తుంది...


బృందావనంలో
:- విశ్వమంతా ప్రేమమయం అనిపిస్తుంది...

ఆకాశ వీధిలో:-అల్లరిచేసే క్రియేటీవ్ కుర్రోడు...

అక్షర మోహనం:-ఒకో అక్షరంలో ఒకో భావన...

పిల్లనగ్రోవి
:- రాధికా....కృష్ణా...


జ్యోతి
:-ఈరోజు ఏం క్రొత్త వంట రుచి చూపిస్తారో! ఏం క్రొత్త టాపిక్స్ గురించి చెబుతారో...


ప్రవల్లిక:- స్నేహితురాలు గుర్తుకొస్తుంది...

కిరణ్
:-కుదురుగా కూర్చుని కుంచెతో బొమ్మలుగీస్తున్న అమ్మాయి గుర్తొస్తుంది...


దీపావళి
:-చీకటి వెలుగుల రంగేళీ...


భావన
:-భావాంతరంగాల్లోని భావనలెన్నో...


స్నిగ్ధ కౌముది
:- ప్రణీత స్వాతికి ఈ పేరు ఎలాతట్టిందో...


నాతో నేను నాగురించి
:-వేణుగానం వినసొంపైనది కదా...


ధరణీ ఆర్ట్స్
:-ఫోటోలతో జిమిక్స్ చేస్తూ ఆనందించే వ్యక్తి...


దీప్తిధార:-నయాగరా వాటర్ ఫాల్స్ గుర్తొస్తాయి...

శ్రీలలిత
:-శ్రీలలితా.....శివజ్యోతి....అని పాడుకోవాలనిపిస్తుంది...


నాలోని మరో నేను
:-ఆలోచన అంటే అంత తీవ్రంగా అలోచించాలన్నమాట...


నా భావనలు
:-శ్రీనిక మంచిపేరు మంచి భావాలు...


బుడుగు
:-పేరు చూసి మోసపోకండి...పిట్టకొంచెం కూత ఘనం...


ఇదండీ...బ్లాగ్ బ్లాగ్ పై నా భావాలు...ఇంకా బోలెడంత మంది వున్నారు వారి గురించి ఇంకో పోస్ట్ లో...ఎందుకంటే అందరి తిట్లు, అక్షింతలు ఒకేసారి భరించడం కష్టం కదండి:):):)


గమనిక:- ఇది ఎవరి మనసుని నొప్పించాలని చేసిన ప్రయత్నం మాత్రం కాదండి...

50 comments:

  1. స్నిగ్ధ కౌముది:- ప్రణీత స్వాతికి ఈ పేరు ఎలాతట్టిందో
    లీలామోహనం:-చేత వెన్నముద్ద చెంగల్వ పూదండా...అనే పద్యం గుర్తుకొస్తుంది
    exactly said..

    మీరు నా బ్లాగ్ చూస్తారన్న విషయం నాకు అసలు తెలీదండి.. కాలేజీలో ఒకరిద్దరు తప్ప అమ్మాయిలెవరూ మాట్లాడేవారు కాదు.. బ్లాగుల్లో కూడా నా పాపులారిటీ అంతే అని ఫిక్స్ అయిపోయాను.. :)

    నా బ్లాగ్ గురించి రాసినందుకు నెనర్లు..

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. u r very kind..thnx a lot 4 mentioning my blog name...i never even thought abt that..once again thnx a lot :-)

    ReplyDelete
  4. ..ఎవరిదైనా ఒకరి బ్లాగ్ ని తలచుకోగానే నాకు గుర్తుకు వచ్చే చిత్రవిచిత్ర ఆలోచనలివి...అటూ మొదలుపెట్టిన ఈ ప్రయత్నం గమ్మత్తుగా వుంది! ఇదేవిధంగా కొనసాగించండి....బావుంది.

    ReplyDelete
  5. మంచి ప్రయత్నం.. అదే చేత్తో లింకులు కూడా ఇస్తే బావుంటుంది కదా...

    ReplyDelete
  6. కార్తీక్...ఓహో కాలేజీలో నీతో మాట్లాడిన ఆ రెండో అమ్మాయిని నేనేనా:):)

    రాధిక...మన మధ్య అన్ని థ్యాంక్స్ లు అవసరమా చెప్పు...థ్యాంక్యూ:):)

    ధరణీరాయ్ చౌదరీగారు...ధన్యవాదాలు!!

    జ్యోతిగారు...ధన్యురాలను, నిజం చెప్పాలంటే లింక్స్ జతపరిచే అంత టాలెంట్ లేనిదానను.

    ReplyDelete
  7. పద్మార్పిత గారూ, అంటే నేనిప్పుడు పక్కింటి అబ్బాయిని కాదా ;)? అయినా ఎండలకు కొద్దిగా నల్లబడి మీరీమధ్య మరీ నల్లపూసైపోయారు
    ప్చ్.. పులిహోర తిన్నప్పుడన్నా గుర్తుకొస్తుంన్నందుకు ధన్యవాదాలండి.

    ReplyDelete
  8. అరె ఇంకా నా పేరు ఆలోచిస్తున్నార? బ్లాగ్కి వచ్చిన కొత్తలో 'నా పేరేంటని 'అడిగాను కదా :-)
    నేనైతే "పద్మర్పిత "అనే పేరు భలే సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటాను .అబ్బాయి కలం పేరుతో రాస్తున్నారని ఇప్పటికి సందేహమే :-) తిట్టకండి .

    ReplyDelete
  9. బాగున్నాయి పద్మార్పిత. మీ పోస్ట్, మాల గారి పోస్ట్, ఇంకా ఎవరో కూడా మొత్తం రాసేరు కదా వారి పోస్ట్ బుక్ మార్క్ పెట్టుకుంటే చాలు అన్ని చూడొచ్చు. Nice job. Thanks for adding me in list.

    ReplyDelete
  10. భాస్కర్ గారు...అప్పుడు మీరు చిలిపి వ్యాక్యలతో వెంట పడేవారుగా, ఎంత ఎండలో తిరిగితే మాత్రం అంత నల్లపూసైపోవాలాండీ:)
    ఎలా మరచిపోతాను ఆ పులిహోర కలిపిన చేతులను:)

    చిన్నీగారు...అప్పటి నుండి ఆలోచిస్తూనే వున్నాను.అయినా చక్కని పద్మ అన్న పేరున్న అమ్మాయిని పట్టుకుని అబ్బాయి అంటే నా వెంటపడుతున్న అబ్బాయిలంతా ఏమైపోవాలి పాపం:)
    ఏ యాంగిల్ నుండి మీకు అబ్బాయిగా కనిపించానా అని తిట్టుకోవడం లేదు తింక్ చేస్తున్నానండి:)

    భావనగారు...థ్యాంక్సండి!!!

    ReplyDelete
  11. "లీలామోహనం:-చేత వెన్నముద్ద చెంగల్వ పూదండా"
    చిన్న కృష్ణుడు తలంపులోకి వస్తున్నాడంటే నాబ్లాగు లక్ష్యం నెరవేరినట్లే.కృష్ణున్ని మరచిపోకుండా గుర్తుంచుకున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  12. :) మీ కుంచెనుండి జాలువారిన ఆ బొమ్మని మీ బ్లాగులో పెడతానన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాను. నన్ను కూడా గుర్తుంచుకున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  13. పద్మార్పిత గారూ ! మీ భావ పరంపరలో నాకూ చోటు ఇచ్చినందుకు అదీ అంతందంగా వ్యక్తపరిచినందుకు సంతోషంగా ఉందండీ థాంక్స్ !

    ReplyDelete
  14. THIS IS TWO THOUSAND MUCH ...WER IZ MALAK , EKALINGAM , VIKATAKAVI& MARTHANDA.


    I HURTED AND IM GOING TO WRITE A POST

    ReplyDelete
  15. ఆచార్య ఫణీంద్ర గారు, విజయ మోహన్ గారు, శిశిరగారు, పరిమళంగారు అన్యధా భావించక అంగీకరించినందుకు ధన్యవాదాలండి!

    ReplyDelete
  16. కమల్ గారు...ఎంతమాట వాళ్ళందరినీ మరచిపోయానని ఎలా అనుకున్నారు!
    ఏది ఇక్కడ ఇంకా అక్షింతలు వేయడం పూర్తికానీయండి వారి దీవెనలు అందుకుంటానుగా:):)
    హర్ట్ అవ్వకండీ!....కోపంతో మీరు వ్రాసే పోస్ట్ లో నాగురించి వ్రాయడం మరచిపోకండేం:):)
    Thanks for comment.

    ReplyDelete
  17. పద్మార్పిత గారూ,
    చాలా మంచి పని చేశారు. మీ కవితల్లాగే అందరి బ్లాగర్ల గురించిన మీ భావాలు కూడా అందంగా ఉన్నాయి. నా గురించి అంత అందంగా అన్పిస్తుందా మీకు? ఇది చదివేసరికి నేను గాల్లో తేలిపోతూ 'నీలిమేఘాలలో, గాలి కెరటాలలో..' అంటూ పాటేస్కుంటున్నానండీ! :-)

    ReplyDelete
  18. 'బ్లాగర్స్ పై నా భావాలు' అనే హెడ్డింగ్ చూసి అందరి బ్లాగులలను మీదైన శైలిలో కవితాత్మకంగా చెప్పుంటారని అనుకున్నానండి...

    ఇక మీరు మా అందరి గురించి చెప్పారు కాబట్టి నేను కూడా మీ బ్లాగు చూడగానే ఏమనిపిస్తుందో చెప్తాను..:)

    ఒక అమ్మాయి ఇంక్ పెన్ చేతిలో పట్టుకుని తన chin ని పెన్ తో నెమ్మదిగా కొడుతూ, మనీ ప్లాంట్ పాకిఉన్న ఓ కిటికీ పక్కన కూర్చొని, తల కిటికీ కి ఆన్చి కవిత కోసం ఆలోచిస్తూ, చూడిదార్లో కనిపిస్తుంది..

    ReplyDelete
  19. సుత్తి నా సొత్తు:-చదవకపోతే సుత్తితో ఒక్కటేస్తా...
    అలాగే చదివి కామెంట్ కొట్టకపోయినా సరే సుత్తి తో మరొకటి అన్న మాట ..బాగుంది బాగా రాసారు
    సరే మీ బ్లాగ్ గురించి చెప్పనివ్వండి
    ఏవండీ పద్మర్పితా !
    బాగా రాస్తారు మీరు కవిత
    కవితల్లో అందిస్తారు చేయూత
    ఇలాగే బాగుండాలి మీ బ్లాగ్ భవిత

    ( అంత్య ప్రాస మర్చిపోనండి )
    ( మీరు రాసే కొన్ని కవితల్లో పాజిటివ్ థింకింగ్ బాగుంటుంది )

    ReplyDelete
  20. పద్మ పిల్లి కళ్ళా ..హి హి హి ..:) నేనూ ఆ మధ్య ఇలాంటి ప్రయోగం చేద్దాం అనుకున్నాను ..కానీ మనసులో అనుకున్నది ఉన్నది ఉన్నట్లు వ్రాసేస్తే ఇంకేమన్నా ఉందా :) ఉదాహరణకి మాల గారు అనగానే పద్దెనిమిది ఏళ్ళ బాపూ బొమ్మ లాంటి అమ్మాయి లంగా వోణీ లో బోర్లా పడుకుని పేపర్ మీద ఏదో రాసేస్తున్నట్లుగా ఊహించుకునేదాన్ని మాలగారు తుస్ మనిపించారు.. అలాగే వేణు శ్రీకాంత్ అనగానే రెండేళ్ళ బాబు ని ఎత్తుకుని పెద్ద వాలు జడ ఉన్న భార్యతో అలా షికారుకి వెళుతున్న అబ్బాయి కనిపించేవాడు..తరువాత తెలిసింది తనకు పెళ్ళే కాలేదని (వేణు కి ఈ వ్యాక్యం కనిపించ కూడదు గాక) ఎవరి పోస్ట్ లు చదివినా నా వూహల్లో వారి రూపం కనబడి పోతుంది.. మీరు ధైర్యం చేసి భలే చెప్పేసారే.. :)
    శేఖర్ చూస్తున్నా చూస్తున్నా మీ వ్యాఖ్యలను,పోస్ట్లను ఈ మద్య :P

    ReplyDelete
  21. పద్మర్పితా...మరీ భోజనం పెట్టనంత కాదుకాని మీరు టపా రాసినప్పుడల్లా ఒక సిగరెట్టు కాల్చండి అని చెపితే బాగుంటుందేమో(అలాగైతే నెలలో అయిదో ఆరో కాలుస్తారని ఆశ).
    క్యా ఐడియా హైనా మాడంజీ:)

    ReplyDelete
  22. ఊ, మొత్తానికి నాకు తెలియని నన్ను నాకు పట్టిస్తున్నారు, నేనేమిటి హెచ్చరించటమేవిటీ :) ధైర్యమా, మరే పక్కన ఒకరుండాలని నాకు నేను చెప్పుకోవటానికి మరి!

    మీ అందరికీ ఈ ఓపిక ఎట్లా వస్తుంది అమ్మాయ్? :)

    ReplyDelete
  23. కమ్మటికలలు . . . చిలకల జంట నేనేనాండి ? ( అవుతే బాగుండు )
    ఏయ్ నేస్తం గారూ ,
    ఏమిటీ నేను మీ ఊహను తుస్ మనిపించానా ? హన్నా ?
    మీకు తెలీదేమో , నాకు పద్దెనిమిది ఏళ్ళే , నేనూ లంగా వొణీనే వేసుకుంటాను ఎందుకంటే అది నాఫెవరేట్ డ్రెస్ .

    ReplyDelete
  24. @నేస్తం జీ,
    ఏదో ఈ మధ్య భావుకతతో కూడిన పైత్యం కొంచెం ఎక్కువై అలా రాస్తున్నాను....అంతమాత్రం దానికే మీరలా భయపెట్టేస్తే ఎలాగండీ? :-)

    ReplyDelete
  25. అదే రెక్కలు కట్టుకొని మీ ప్రపంచలో ఒక్కసారి వాలాలని వుంది,
    ఎంచేస్తాం !..భావ ప్రపంచం!! ...ఎవరిది వారికే సొంతం!!!...

    పద్మార్పిత గారూ ధన్యవాదాలు!

    ReplyDelete
  26. "అయినా చక్కని పద్మ అన్న పేరున్న అమ్మాయిని పట్టుకుని అబ్బాయి అంటే నా వెంటపడుతున్న అబ్బాయిలంతా ఏమైపోవాలి పాపం:)
    ఇలా అంటేనే అలా సందేహం వచ్చేది .పోనిలెండి నా కామెంటు చూసి మీ వెంటపడే అబ్బాయిలు వెళ్ళిపోయినా "అమ్మాయిలూ "పడతారులెండి .:-):)

    ReplyDelete
  27. పద్మర్పిత గారు నిజంగా అంత మంచిమనసు గుర్తుకొస్తుందంటారా. థాంక్యూ. నావి పిల్లి కళ్ళు. పిల్లికళ్ళు ఉన్నవాళ్ళది మంచి బుద్ధి కాదట. అందుకే నేను తేనె కళ్ళు అని చెప్పుకుంటాను:)

    ReplyDelete
  28. Anonymous29 May, 2010

    mee blog nundi update vaste maroo super duper kavitha anukunnandiiii....kani terachi chuste routine ki bhinnanga post..chaduvutuu unte...na peru kuda kanipinchindi....Thank u..Thank u..:D..

    so okati decide ayyanu...elagaina mee blog ki vaste nenu santoshangane tirigi velthanu ani..:D

    ReplyDelete
  29. మధురవాణిగారు....థ్యాంక్సండి నేను మీరు "గాల్లో తేలినట్టుందే....గుండె పేలినట్టుందే అంటారనుకున్నా:)

    శేఖర్ గారు...అమ్మో! అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఒక్కటే తక్కువ కిటికీ దగ్గర మనీప్లాంట్ లేదు, పెట్టేస్తానుగా:)

    వంశీకృష్ణ గారు...థ్యాంక్సండి, నా కవితలకి పోటికి వస్తారేమో అని భయంగా ఉంది:)

    నేస్తంగారు...ధైర్యం చేసానంటారా? (మనలో మాట అయినా కొన్ని నిజాలు చెప్పలేదు లెండి):)

    ReplyDelete
  30. సృజనగారు...ఎంత ఆశావాదండి మీరు, క్యా బాత్ హై మాడంజీ:)

    ఉషగారు...ముంజేతి కంకణానికి అద్దమేల చెప్పండి! అందరి ఓపిక గురించి నాకు తెలీదు కాని, మీలాంటివారి వ్యాఖల ప్రోత్సాహమే నా ఓపిక:)

    మాలాకుమార్ గారు...అది నిజంగా కమ్మటి కలే కదండి! నేస్తంకి చెబుతానులెండి మీరు చిలకాకుపచ్చ ఓణీలో మీరు భలేగున్నారని:)

    సునిత...Thank Q!

    ReplyDelete
  31. పద్మార్పితా!!! అదేంటండి అలా అనేసారు, పర్వాలేదులెండి అలాగైనా గుర్తొస్తాను థ్యాంక్యూ.

    ReplyDelete
  32. సత్యగారు...నా ప్రపంచానికి సర్వదా స్వాగతం, రెక్కలు కట్టుకుని రోజూ వచ్చేయండి:)

    చిన్నిగారు...అమ్మాయిని అని నిరూపించుకోవడానికి అమ్మాయిలు , అబ్బాయిలు...
    వీరిలో ఎవరితో స్నేహం చేయాలో చెప్పండి:):)

    జయగారు...నిజంగా నిజం....పిల్లికళ్ళైనా,తేనెకళ్ళైనా మనసు మంచిదైతే అంతా మంచే అని నా అభిప్రాయం:)

    కిరణ్...థ్యాంక్యూ ఎలాగైతేనేమి మిమ్మల్ని సంతోషపెట్టానన్నమాట:)

    యోహంత్...మరోలా అనుకోకండి మీ కవితల్లో విషాదాన్ని చూసి అలా అనుకుంటాను.
    మీ బ్లాగ్ ను తలవగానే కృష్ణుడు అమ్మాయిని ఫ్లూట్ గా మలచి ఊదుతున్నట్లుగా కూడా తలంపుకి వస్తుంది.

    ReplyDelete
  33. నన్ను గుర్తుంచుకునే కొద్దో గొప్పో మంది , సాహితి గానే గుర్తుపడతారు . మీరు కమ్మటి కల గా గుర్తుపెట్టుకున్నారు . బోలెడు థాంకూలు .

    ReplyDelete
  34. మీ బ్లాగ్ లీస్ట్ లో నేను ఎందుకు లెనా అని కుల్లుకునే అంత బాగుందండి మీ ఈ ప్రయత్నం.

    ReplyDelete
  35. మాలాకుమార్ గారు సాహితీ బాగుంటుందండి కాని నాకు కమ్మటికలలే ఇంకా ఇంకా బాగుంటాయి.

    అంతర్ముఖం...అని మీ బ్లాగ్ చూడగానే నాకు మొదట యండమూరిగారి నవల తరువాత నేను పెయింట్ చేసిన ఒక చిత్రం గుర్తుకొచ్చిందండి.నవ్వండి మన లిస్ట్ లో చేరిపోయారుగా:)
    Thanks for visiting my blog!

    ReplyDelete
  36. తరువాయి టపాలో నా బ్లాగ్ కూడా వస్తుందేమో మరి!

    ReplyDelete
  37. ఆ( నేనొప్పుకోను నేనొప్పుకోను...ఎంత నేను ఈ మధ్య కుసింత పని వత్తిడిలో బద్దకించి బ్లాగకపోతే మాత్రం నా బ్లాగ్ గురించి ఓ ముక్క రాయచ్చుగా! .. మీ జట్టు పచ్చి.

    ReplyDelete
  38. బాగుందండీ మీప్రయత్నం కొత్తగా ఉంది.

    ReplyDelete
  39. అహ నా చూపులు ఎప్పుడు చూసారట? చూపులతో బాణాలు వెయ్యొచ్చన్నారు?
    అభినందనీయ ప్రయత్నం

    ReplyDelete
  40. ప్రేరణగారు తప్పకుండా:) థ్యాంక్సండి!

    Shanky..ప్లీజ్ నా జట్టు పచ్చి అనకండి...ఏమో మున్ముందు మీ గురించి కధ వ్రాస్తానేమో!Think positive my friend:)

    విజయ శర్మగారు...ధన్యవాదాలు!

    ఫణిప్రదీప్ గారు లాజిక్కులు అడగొద్దన్నాను కదండీ...చూసారా! మళ్ళీ అవే చూపుల బాణాలు:)థ్యాంక్సండి!

    ReplyDelete
  41. పద్మార్పిత గారూ.. ముందుగా(కొద్దిగా ఆలస్యంగానే) స్నిగ్ధ కౌముది గురించి రాసినందుకు ధన్యవాదాలండీ.
    ఇకపోతే ఆ పేరు నాకెలా తట్టిందంటే...నా బ్లాగ్ లో మొదటి టపా స్నిగ్ధ కౌముది గురించే నండీ. కింద లింక్ లో చదవచ్చు.

    మా అందరి బ్లాగ్స్ గురించి చెప్పారుగా. మరి నాకు మీ బ్లాగ్ లో ఏం నచ్చుతుందో తెలుసా..? పెన్సిల్ స్కెచ్చెస్. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. కానీ డ్రా చెయ్యడం రాదు. మీ కవితలైతే ఇక చెప్పనే అక్కర్లేదనుకోండి.

    మరి ఇంకొక్కసారి నా బ్లాగ్ చూసేయ్యరూ..
    http://snigdhakoumudi.blogspot.com/2009/08/blog-post.html

    ReplyDelete
  42. ఐతే నా ఊహ నిజమే నన్నమాట. ఆ పెన్సిల్ స్కెచ్చెస్ అన్నీ మీరు స్వయంగా వేసినవేనన్నమాట.
    చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగున్నాయండీ (ఇన్ని 'చాలా'లా అనుకోకండే..చెప్పాగా.. నాకు డ్రాయింగ్ అంటే అంత ఇష్టం).

    ReplyDelete
  43. ప్రణీత స్వాతిగారు... అన్ని చాలాలు నాకే కాదండి కొన్ని కాపీ కొట్టేసానుగా:)Thanks a lot!

    ReplyDelete
  44. wat abt my blog? eedi blogkaadu

    ReplyDelete
  45. పద్మార్పిత గారు,
    ఓ నేస్తం చెప్తే చాలా ఆలశ్యంగా చూశాను మీ టపా... మంచి ప్రయత్నం ఇలా వెంటనే వచ్చే ఆలోచనను ఒనె లైన్ లో పంచుకోవడం బాగుంది. నన్ను కూడా తలుచుకున్నందుకు ధన్యవాదాలు :-)

    ReplyDelete
  46. నేస్తంగారూ నే చూసేశాగా :-D

    ReplyDelete
  47. Haaaaaaaaaaaa! Excelent post. I wonder how I missed it :)

    ReplyDelete