పేదవాని ప్రార్థన!

జీవితమా....మా ఇంట అడుగిడుమా
మా స్థితిగతులను కాస్త కనుమా
తెలుపనా మాఇంటి చిరునామా
నాలుగు వైపులా గోడలే లేవుసుమా!

జీవితమా....లేదు నీకు తలుపు తట్టవలసిన అవసరం
గుబులుతో గుమ్మం పలుకుతుంది మీకు స్వాగతం
పైకప్పుకి తెలుసు ఎండావానల తులాభారం
కటికనేల పైనే నిన్ను కూర్చుండబెట్టే పేదలం!

జీవితమా....మా ఇంట అడుగిడుమా
మా ఇంటి మారుపేరు ప్రేమా
నీ నీడలో మమ్ము తలదాచుకోనీయుమా
కాస్త చేయూతనిచ్చి మమ్ము కాపాడుమా!

జీవితమా....మా అభిమానమే నీకు ఆతిధ్యం
బోర్లించిన బొచ్చెలని చూసి నీవు చేయకు పరిహాసం
మా ఇంట ఏమున్నది నీకు తెలియని రహస్యం
నీ ఆదరణతో విరియాలి మా పెదవులపై దరహాసం!

జీవితమా.... మా ఇంట అడుగిడుమా
ఆకలి తీర్చి మా ప్రాణాలని నిలుపుమా
ఆగలేక అర్థిస్తున్న మా గోడు కాస్త వినుమా
మా ఇంట ఆనందాలని కురుపించుమా..ఓ జీవితమా
!

26 comments:

 1. బాగా చెప్పారు పేదవాడి జీవితం గురించి.

  ReplyDelete
 2. oka peda vadiki ii kavitha chupisthe mimmalni oka devatha laga chuse avakasam undi...!!!

  naku oka doubt..manchi manchi bommalu pedtharu..avi kuda meeru vestahara?

  ReplyDelete
 3. గణేష్ గారు Thank Q!

  మధురవాణిగారు ధన్యవాదాలండి!

  kiran...మరీ దేవతతో పోల్చడం ఏమిటి???:) ఇంక బొమ్మల విషయానికి వస్తే పెయింటింగ్ అంటే నాకు ఎంతో ప్రియం, సాధ్యమైనంత వరకు నా కవితలకి నేను వేసినవే పెట్టాలి అనుకుంటాను కాని అన్నింటికీ కుదరక వీలున్నప్పుడు నేను వేసినవి పెడుతుంటాను.thanks for compliment!

  ReplyDelete
 4. కలివిడిగాకాక విడివిడిగా బ్రతుకుతున్న నేటి జీవన విధానంలో కుటుంబమంతా కలిసి భోంచేస్తే అదే పెద్ద సోషలిజం.మరి మీ కవిత అంతకు మించిన హ్యూమనిజంతో పేద బ్రతుకుల జీవన నిజాలను తెలపి వెన్ను చరచింది.

  ReplyDelete
 5. "మా ఇంటి మారుపేరు ప్రేమా
  నీ నీడలో మమ్ము తలదాచుకోనీయుమా"

  నిజమండి. ప్రేమే జీవితాలని నడిపిస్తోంది. ప్రేమకి పేదరికం లేదు.

  మీ పెయింటింగ్ కూడా చాలా బాగుంది. keep it up.

  ReplyDelete
 6. పేదవాని హృదయాన్ని కూడా చదివేసారా...:)Good!

  ReplyDelete
 7. meeru jeevitam ni chala baga chusaru andi...

  ReplyDelete
 8. nijam ga etharula jeevathalu chadavadam... oka kala.
  Keep it up. God bless you in ur writings.

  ReplyDelete
 9. బాగుందండీ..
  ఫోటో సరిగ్గా అతికినట్టు సరిపోయింది..కవితకు తగిన ఫోటో పెట్టడం మీకు కొట్టిన పిండే ఐనా చూసిన ప్రతీసారీ చెప్పాలనిపిస్తుంది. ఇంతకూ అది మీరు గీసిన పెయింటింగా?

  ReplyDelete
 10. ఉమాదేవిగారికి,సుమిత్రగారికి, సృజనగారికి,నవీన్ గారికి, శేఖర్ గారికి ధన్యవాదాలు!

  ఈ పెయింటింగ్ ఇంకా పూర్తికాలేదు, వేరొకదాన్ని చూసి వేస్తున్నానండి...గమనించారా! కవితకు సరిపోయింది కదా అని కట్ చేసి పెట్టాను. నచ్చినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 11. అంతా నచ్చింది కానీ ఈ రెండు లైన్ల మీద మనసు పారేసుకున్నా

  జీవితమా.... మా ఇంట అడుగిడుమా
  ఆకలి తీర్చి మా ప్రాణాలని నిలుపుమా

  బాగుందండి

  ReplyDelete
 12. kavita and painting both are excellent mam.

  ReplyDelete
 13. ప్రతి లైన్ కదిలించింది..కింది రెండు లైన్ లు మాత్రం పదే పదే చదివా!!

  "తెలుపనా మాఇంటి చిరునామా
  నాలుగు వైపులా గోడలే లేవుసుమా!"

  ReplyDelete
 14. nice one amDi, chala baga chepparu.

  ReplyDelete
 15. This comment has been removed by the author.

  ReplyDelete
 16. నమస్కారం.
  మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
  సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
  తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును.
  సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి.
  సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం.
  మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో సమూహము లింకు ను వుంచి ప్రోత్సహించండి. సమూహము లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి .
  దయచేసి మీ సలహను / సూచలను ఇక్కడ తెలపండి మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
  -- ధన్యవాదముతో
  మీ సమూహము

  ReplyDelete
 17. nice
  mi blog lo pics painting too good

  ReplyDelete
 18. Your blog is outstanding..

  Thanq..

  ReplyDelete
 19. జీవితమా....మా అభిమానమే నీకు ఆతిధ్యం
  బోర్లించిన బొచ్చెలని చూసి నీవు చేయకు పరిహాసం
  మా ఇంట ఏమున్నది నీకు తెలియని రహస్యం
  నీ ఆదరణతో విరియాలి మా పెదవులపై దరహాసం!
  చాలా నచ్చింది. గుడ్..

  ReplyDelete
 20. "తెలుపనా మాఇంటి చిరునామా
  నాలుగు వైపులా గోడలే లేవుసుమా!"

  చాల చాల బాగా చెప్పారు అండి....

  ReplyDelete
 21. పేదవాని ప్రార్ధనా జీవితం పెద్దవారి సుఖజీవనం ప్రేమలేనిదే సమస్తం వ్యర్ధం! చాలాబాగుంది!! కొనసాగించండి!!!

  ReplyDelete
 22. cAlA bAgA cEppAru. abhinandanalu. How did I miss this blog?

  ReplyDelete
 23. This comment has been removed by the author.

  ReplyDelete