మనమధ్యన ఉన్నది స్నేహంకాదని
అది ప్రేమానుబంధంగా మారిందని
నా మనసు మాట వినకున్నదని
చెప్పాలనుకున్నా చెప్పలేకున్నా!
నీకు అర్థంకాదని తెలుసుకున్నా!
కనులు కనులతో కలిపిచూడమని
నా హృదయంలో పదిలంగా ఉండమని
నీ ప్రేమలో నన్ను బంధించమని
విన్నవించాలి అని అనుకున్నా!
చెవిటివాని చెవిలో రాగమేలనుకున్నా!
రేయింబగలు నీధ్యాస నాకేలని
నీ తలపులలో నేనున్నానా అని
నీఅడుగులో అడుగవనా అని
ఎన్నో అడగాలి అనుకున్నా!
ఆడిగి అలుసవనేల అనుకున్నా!
బాగుందండి! ఇంతా చేసి చెప్పాడా లేదా ? :)
ReplyDeleteహమ్మయ్య...ఇన్నాళ్ళకి నాకు అర్ధం అయ్యే కవిత ఒకళ్ళు రాసారు...
ReplyDeleteబావుంది.....థాంక్స్ అండీ-))
చెప్పాడా ? అదేమీ ప్రశ్న వంశీ ? అమ్మాయి కదా ఆలోచిస్తుంది :)
ReplyDeleteబాగుందండి కవిత !
మీరింత బాగా వ్రాసినా కూడా
ReplyDeleteనేనింత ఆలశ్యంగా చూశానని
మీ బ్లాగులోకి మిమ్మల్ని అబినందించాలని
వచ్చానని చెబుదామని చెప్పుతున్నాను
ahaaa... mee baavoodwegam chaalaa bagundi andi... yentainaa meeru..... r......si kadaa...
ReplyDeleteచాలా సరళంగా అందంగా చాలా బాగుంది పద్మార్పిత గారు.
ReplyDeleteమీ బ్లాగు మొత్తం చదివి వచ్చాను, ఫొటొలు - కవితలు పోటీపడి బాగున్నాయి.
ReplyDeleteహమ్మయ్య....మళ్ళీ ప్రేమార్పిత కనపడింది ఈ కవితలో:)
ReplyDeleteనిజంగా అమ్మాయిలు అంతలా ఫీల్ అవరనుకుంటా!
ReplyDeleteMeeru naa blog lo post chesina comments ki chala thanks!
ReplyDeleteMeeru post chesina comments valana, mee blog lo konni kavitalu chadivanu eeroju... migilinavi kooda chaduvutaanu. kavitalu chala baagunnai.
చాలా రోజుల తర్వాత... కుశలమే కదండీ.. కవిత, ఫోటో పోటీ పడుతున్నాయి...
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteAwesome kavitha..
ReplyDelete