కార్తీకమాస వనభోజనాలంటూ అతిరథమహారధులంతా బ్రహ్మాండంగా రుచికరమైన వంటలతో అధరగొట్టేస్తుంటే నేను మాత్రం చదివి ఆహా! ఓహో! అంటే ఏం బాగుంటుంది చెప్పండి???
ఇలా అనడం సులువే కాని ఏంచేయాలో తెలియడం లేదు!!!!
పోనీ ఏమైనా వండేదామా అంటే అది చేయడమే ఒక సాహాసం అనుకుంటే .....జ్యోతిగారు చాన్స్ ఇస్తేగా, షడ్రుచులతో వడ్డించాక ఇంకేం మిగిలిందని???? దానికి తోడు యజమానిచేతితో చేసిన టమాటాపచ్చడి అడిష్నల్ అట్రాక్షన్.... ఫోటోనే యమరంజుగా ఉందికదా! దాన్ని ఇన్స్ఫిరేషన్ గా తీసుకుని పచ్చడిని ప్రెజెంట్ చేద్దాం అనుకుంటే.... మాలాకుమార్ గారు కంది పచ్చడితోనే అందరి కడుపులూ నింపేసారు, జయగారు ముందుగానే డబ్బాలు డబ్బాలు మోసుకొచ్చి ముందుంచారు, మధురవాణీగారు మాఇంటబ్బాయి వంట అంటూ మరో వెరైటీలో కోడిగుడ్డు పొరటో అట్టో అనిచెప్పి ముందుంచారు. వీటితో పాటు అరిసెలు, లడ్డూలు, బూందీ, కారప్పూస..ఇంకా ఇలాంటివి ఎన్నో...జ్ఞాన ప్రసూన గారి పూర్ణాలు, స్వప్నగారి పాలక్ పన్నీర్, హు...ఇంక నేస్తంగారు సరే సరి....ఉలవచారుతో ఒక ఊపు ఊపేసారు. మంచుగారు మార్చికూర్చి పేరేదైనా పాయసమో పరమాన్నమో కాని స్వీట్ విత్ డ్రై ఫ్రూట్స్ తో పసందుగా అందించారు. కృస్ణప్రియగారు టల్లోస్... అనే పేరుతో పెరుగు వంటకాన్ని వడ్డించారు. నెమలికన్ను మురళీగారు నేనేం తీసిపోనంటూ నూడిల్స్ ఇన్ న్యూ స్టైల్ అన్నమాట:).
జేబిగారు తక్కువ తిన్నారా ఏంటి పెసరట్టు+అల్లంపచ్చడితో పాటు కాఫీని కూడా పొద్దున్నే వేడివేడిగా అందించారు. శ్రీలలితగారు ఉసిరి, అనాస ప్రిపరేషన్స్ తో, లతగారు మేతీ చమన్, బ్రెడ్ బాసుందితో, హనుమంతరావుగారు వెరైటీ వంకాయకూరతో రెడీ. రాధిక(నాని)గారు ఆకాకరకాయ కూరతో వచ్చారు. వేణు శ్రీకాంత్ గారు దోసలతో పాటు వెండి పళ్ళాలని...చెంచాలని కూడా అందించారు:) ఇలా ఎన్నెన్నో రకాల రకరకాల వంటలతో వచ్చి వడ్డించిన బ్లాగ్ విస్తరిలో నా వంటకి చోటెలాగో లేదని అయినా ఏదో ఒకటి చేయాలని థింకింగ్....... థింకింగ్......??????
ఐడియా వచ్చిందిగా:):):).....
అన్నీ ఆరగించాక బుక్తాయసంగా ఉందికదండి!!!.....ఇంకెందుకు ఆలస్యం అందుకోండి....
మినరల్ వాటర్ బై మీ... ఓన్లీ సప్లైంగ్ నాట్ ప్రిపేర్డ్:):) (మిగిలింది అదేగా ... ఆలస్యం అయితే అదికూడా ఎవరైనా తెచ్చేస్తారేమో.....)
"అందమైన మట్టి కుండలో
స్వచ్చమైన త్రాగునీరు
అభిమానంతో కలగలిపి
అందిస్తున్నాను... పద్మార్పిత!"
(సరదాకే కాని ఎవరినీ సతాయించాలని కాదని మనవి....
మన్నించండి "మినరల్ వాటర్" ని ఎవరి మనసునైనా నొప్పిస్తే!)
తప్పించుకొనువాడు ధన్యుడు సుమతీ!!
ReplyDeleteమినరల్ వాటర్ తో బాటు తాంబూలం ఇస్తే భుక్తాయాసం తీరేదిగా. ఫుటో వెతికి పెట్టండి.
జ్యోతిగారు...తప్పించుకోవాలనుకుంటే ఇలా ఎందుకు వస్తాను చెప్పండి?
ReplyDeleteతాంబూలం అందిస్తే కట్టివ్వండి చుట్టివ్వండి అంటే కష్టం కదండి:):)
ఆ ఫొటొ ఎంటండి?
ReplyDeleteపద్మ గారూ,
ReplyDeleteమా వంటలు ఎలా ఉన్నా అన్నింటిని ఒక చోట కూర్చిన మీ టపా బ్రహ్మాండం అండీ.థాంక్యూ.
@మంచు గారు ఫోటోలో... పిజ్జా పై పిల్ల:):) (వెరైటీ కోసం)
ReplyDeleteకుండలో మినరల్ వాటర్ (ట్రాన్స్పరెంట్ కదా కనబడవు)
@లతగారు ....మెచ్చినందుకు థ్యాంక్యూ!!!!
hahaha,,bagundi mee vantu
ReplyDeleteNo no...second photo...It says
ReplyDelete" Sorry, unauthorized hotlinking of copyrighted material not permitted worldofstock.com "
చాలా బాగుంది పద్మార్పిత గారు...హమ్మో హెంత తెలివైన వారండి మీరు!
ReplyDelete:)) sooparu
ReplyDeleteబాగుందండి. ఇన్ని వంటలు తిన్నాక స్వచ్చమైన నీరు తాగక పోతే ఎలా. థాంక్సండి నీరందించినందుకు.
ReplyDeleteహహహహహ
ReplyDeleteమీకు బోల్డు వాటర్ ఫ్రీ కదా... :) భలే ఐడియా వేశారు
what an idea padma garu.. :)..asalu ii matram idea nake vachunte..iipatiki andari blog laki supply chese danni.water bottles.. :D..super..!!
ReplyDeleteఇప్పుడే అనుకుంటున్నాను , ఎవరు నీళ్ళు తేలేదేమా అని . :)
ReplyDeleteఇంకా నయం బిల్లు ఇస్తా అన్నారు కాదు ఆఖర్ని
ReplyDeleteఆహా నేను అదే అనుకుంటున్నాను నీళ్ళు తెచ్చే ఐడియా ఎవరికీ రాలేదా అని :-) బాగుంది.
ReplyDeleteహ హ రవిగారు మీ ఐడియా కూడా బాగుందండోయ్:)
vanta baagundi.
ReplyDeleteభలే చెప్పారే అందరి వంటకాల గురించీ! మీ మినరల్ వాటర్ అయిడియా సూపర్! మంచినీళ్ళు లేకుండా అసలే వంటకమైనా తినగలమా! కాబట్టి, వనభోజనాల్లో అందరికంటే మీదే ముఖ్యమైన ఐటెం! :)
ReplyDeleteఅబ్బ! పచ్చడి తినగానే నోరు మంట.తాగటానికి మంచినీళ్ళు లేవు ఎలా అనుకుంటుంటే మీరు మినరల్ వాటర్ పంపించారు.
ReplyDeleteThanks అండి.
:):)
ReplyDeletehahaha,,bagundi mee vanta
ReplyDeletehahaha,,bagundi mee vanta
ReplyDeletehahaha,,bagundi mee vanta
ReplyDeleteSo cool
ReplyDeleteపద్మ గారూ! మీ మంచి తీర్థం మంచు సంచుల్లొ ముంచిన నీటికన్నా చల్ల చల్లగా కూలింగ్ చేసి మరీ అందించారు.చాలా ....చాలా .....చాలా బాగున్నయండీ!
ReplyDelete