తెలిసిందిలే....

కరిగిన కలలతో కనులు చెమ్మగిల్లాయి
ఆశల ఎడారిలో ఆశ్రువులు రాల్చాయి

జీవించడానికి కావలసినవన్నీ వున్నాయి
మనసుభారమై అవి దూరమౌతున్నాయి

ఆశలసౌధాలు ఆనందాన్ని ఏమిస్తాయి
ఆనందానికి కలలు కైవసం కానన్నాయి

ఒక్కరికై మరొకరి మనుగడ ఆగకున్నాయి
నలుగురిలో నన్నునన్నే వెతుక్కోమన్నాయి

కల్మషంలేని హృదయాలు హాయిగా నవ్వుతాయి
మంచి మాటలు మనిషిలో తప్పక మార్పునిస్తాయి

నాది నాది అన్న పదాలతో పెదవులు దూరమైనాయి
మనం మనది అన్న మాటలతో అధరాలు ఒకటైనాయి

7 comments:

  1. కల్మషంలేని హృదయాలు హాయిగా నవ్వుతాయి
    మంచి మాటలు మనిషిలో తప్పక మార్పునిస్తాయి


    ఈ వాక్యం నాకు చాలా బాగా నచ్చింది.... మిత్రమా..

    ReplyDelete
  2. కల్మషంలేని హృదయాలు హాయిగా నవ్వుతాయి
    మంచి మాటలు మనిషిలో తప్పక మార్పునిస్తాయి


    ఈ వాక్యం నాకు చాలా బాగా నచ్చింది.... మిత్రమా..

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. మీకేం తెలిసిందో కాని...మీలో ఏదో నిర్లిప్తత దాగివుంది:)

    ReplyDelete
  5. చాలా రోజులైంది పద్మ నీ కవితలు చదివి ...బాగుంది

    ReplyDelete
  6. బాగుందండి....కానీ ఏదో కొరత.

    ReplyDelete