చివరికి మిగిలింది!!

నిన్ను చూడకనే నీ చిత్రాన్ని వేయగలను
నిన్ను కలవకనే నీ మదిని చదవగలను
నీ భాధని నా కంటనీరుగా కురిపించగలను
నిన్ను మరువమని నామదికి ఎలా చెప్పను!

అద్దం నన్ను అదే పనిగా అడిగెను
నా పాత రూపం తనకి కావాలి అనెను
పగిలిన మనసుని అయితే అతికించాను
అతుకుని కనపడనీయకుండా ఎలా దాచను!

నిన్ను మరువని మదిని నేనేమి చేయను
ప్రతి కదలికలో నీవే అయితే నేనేమైపోతాను
కునుకు రాని కంట నేను కలలు ఎలా కనను
కలనైనా నిన్నుగానక నేను ఎలా జీవించను!

భారమైన హృదయాన్ని భాధగా నేచూడలేను
భాధకి బానిసనై నన్నునే ఎలా బంధించుకోను
భాధకి కూడా ప్రేమే మందని నాకు తెలుసును
ఎందుకంటే! ప్రేమిస్తే చివరికి భాధే మిగిలేను!

గమనిక:- భగ్న ప్రేమికులకి మాత్రమే.......

13 comments:

  1. nice one anDi...last lines chala bagunnayi....

    ReplyDelete
  2. WoW! చాలా బాగా రాసారండీ.. మనసుని తాకేలా!

    ReplyDelete
  3. ఎంత వేదనో!!! బాగుంది.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. yentandi ala annaru akarunaa.... premisteee badhee migulunu ani... ee vakyam tappa inkaa anni nachaai eee padam bagundi kaani kavita koorpulo baaledu... ending badha anipinchindi... premaki pranam poyandi... neerugarchakandi.... nestam.....

    ReplyDelete
  6. మేము భగ్నప్రేమికులం కాదుగా....కామెంట్ పెట్టొచ్చా!

    ReplyDelete
  7. గమనిక చూశా.. నాకు కాదు కదా అని కవిత చదవలేదండీ :-) సీరియస్లీ.. ఎప్పటిలాగే బాగా రాశారు..

    ReplyDelete
  8. ఓనాటి ప్రేమ అల...
    మనసు తీరం తాకి.....
    మధుర గాయం చేసిందిలా.....
    తీపి ఙ్ఞాపకాల గాయాలు రేపి...
    చేదు అనుభవాలు ఙ్ఞాపకం చేసి...
    అలా కలలా కరిగిపోయింది.....

    ఓనాటి ప్రేమ అల...
    మనసు తీరం తాకి.
    మధుర గాయం చేసిందిలా.....
    ఇద్దరం ఒకటైన క్షణాన్ని...
    ఇద్దరం రెండైన క్షణాన్ని...గుర్తుచేసి
    లిప్తకాలంలో లుప్తమైపోయింది...

    ఓనాటి ప్రేమ అల...
    మనసు తీరం తాకి.
    మధుర గాయం చేసిందిలా.....
    ఎప్పటిదో రాగం..
    అప్పటిదే తాళం...శృతి లేక
    లయలో లయమైపోయింది....

    ఓనాటి ప్రేమ అల...
    మనసు తీరం తాకి.
    మధుర గాయం చేసిందిలా.....
    రెండు గుండెలు వేరని....
    రెండు మనసులు కలువవని...తెలిపి
    గుండెని రెండుగా చీల్చుతూనే ఉంది.

    ఓనాటి ప్రేమ అల...
    మనసు తీరం తాకి.
    మధుర గాయం చేస్తూనే వుంటుందిలా.....
    రుధిర పానం చేస్తూనే వుంటుందిలా...

    ఈ తవిక మీ కవితకి అంకితం....నన్ను స్పందించేలా చేసింది మీ కవిత.
    థాంక్స్..

    ReplyDelete
  9. బాగా రాశారు.

    ReplyDelete
  10. ఒక్కో ఖండికా విడి విడిగా కూడా చదువుకోవచ్చు... చాలా బాగుంది..
    భగ్న ప్రేమికులే చదవాలంటే ఎలా? స్పందించే వారెవరికైనా ఆ బాధ అర్ధమవుతుంది కదా :)

    ReplyDelete
  11. పద్మార్పిత గారు చాల బాగా నచ్చింది మీ కవిత

    ReplyDelete