మార్పు...

జీవన విధానమే మారిందో????
ఆలోచనా సరళిలో లోపమే ఉందో!
నేను అడుగులు చిన్నిగా వేసినప్పుడు
లోకం బహుపెద్దగా కనపడిందప్పుడు
బడికి వెళ్ళేదారిలో మిఠాయిల బండి
ఇప్పుడక్కడ వెలసింది ఒక పెద్ద మండి

జీవన విధానమే మారిందో????
ఆలోచనా సరళిలో లోపమే ఉందో!
సంధ్యవేళ ఆటపాటలతో గడచిన బాల్యం
పగలు రాత్రులతో అంతమౌతున్న దినం
ఇంటికి రాగానే చేరేదాన్ని అమ్మఒడి
వారానికి ఒక్కసారైందిప్పుడా ఒరవడి

జీవన విధానమే మారిందో????
ఆలోచనా సరళిలో లోపమే ఉందో!
సావాసంలో పెల్లుబికేది స్నేహమాధుర్యం
ఇప్పుడది 'హాయ్''బాయ్'లకే అంకితం
యాంత్రికంగా మారిన మానవ జీవితాలు
పండుగనాడు అందుకుంటున్నాము సందేశాలు

జీవన విధానమే మారిందో????
ఆలోచనా సరళిలో లోపమే ఉందో!
రేపటి కొరకై ఎవరికీ చింతలేదు
ప్రస్తుతం మన అందుబాటులో లేదు
ఆశలు, ఆశయాలు జీవితంలో భాగమైపోగా...
వాటిని కప్పిపుచ్చి బ్రతికేస్తున్నాము ఎంతో హుందాగా!

23 comments:

  1. ఈ రోజులలొ అందరు రేపటి గురించె ఆలొచిస్తున్నరు. వర్తమానం లో ఎవరు జీవిస్తున్నారు చెప్పండి?

    ReplyDelete
  2. బాగుంది ... ఏవి మారినా మారకపొయినా మీరు కవితలు ఎప్పుడూ బాగానే రాస్తారు

    ReplyDelete
  3. కాలంతో పాటు మారిన జీవనవిదానముతో వచ్చిన ఆలోచనా సరలిలోని లోపమే ఈ అనర్తాలన్న టికి కారణము .

    ReplyDelete
  4. మొన్న మీరు నెను అన్నదానికి ఫీల్ అయ్యినారు కదా ఇప్పుదు మీ రాసిన దానిలొ నిజాలు ఉన్నై అండి....
    నెను అడిగింది కూడా ఇలాగే, నాకు చెప్పటం చెతకాలేదు ఆరోజు .... మీరు ఇంకా బాగా వ్రాయాలని ఆశిస్తున్నాను... వ్రాస్తారులే... నాకు తెలుసు... రిప్లయ్ యిచ్చవా దెబ్బలు పడుతాయి....

    ReplyDelete
  5. జీవన సరళి మారి ఆలోచనా విధానాన్ని మార్చింది. బాల్యం కేబుల్ తీగలపై ఊగుతోంది. స్నేహం స్వార్థపు ముసుగేసుకుంటోంది.సమూహంలో ఏకాకిలా జీవిస్తూ, అభద్రతలో,అబద్ధాలచెట్టు నీడలో మనిషి శయనిస్తున్నాడు నిశ్చింతగా!రేపు దర్శించాల్సిన సుందరదృశ్యాన్ని నేడు చిత్రించలేని అయోమయం!

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. బాగా చెప్పారు. మారిన జీవన శైలి, సరళి మనల్ని యంత్రాలను చేస్తోంది. ప్రతీది సరుకుగా మారిపోయి కోల్పోతున్నదేమిటో గ్రహించే లోపే మించిపోతున్నది కాలం.
    ఉమాదేవిగారి వ్యాఖ్య చాలా బాగుంది. ఆమెకు అభినందనలు...

    ReplyDelete
  8. బాగుంది,
    ఇంతకంటే
    చెప్పలేను...

    ReplyDelete
  9. బాగుంది,
    ఇంతకంటే
    చెప్పలేను...

    ReplyDelete
  10. బాగుంది ఎప్పటిలాగే.

    ReplyDelete
  11. జీవన విధానమే మారిందో????
    ఆలోచనా సరళిలో లోపమే ఉందో!
    మీ రాత లో వేగం తగ్గిందో?
    మన మద్య అంతరం పెరిగిందో?
    మౌన వీక్షకుడికే నా పాత్ర పరిమితం అయ్యిందో?
    ఏమైనా నిశబ్ధమే మీకు నాకు ఈ మద్య .

    ReplyDelete
  12. రవిగారు,
    ఎందుకండీ బెదరగొడతారు?
    పోనీ మీరైనా నిశ్శబ్దాన్ని చేధించండి!
    :)

    ReplyDelete
  13. మారిన జీవనసరళి మనల్ని యంత్రాలను చేస్తోంది, బాగుంది ...

    ReplyDelete
  14. మార్పు ప్రకృతి సహజం ...అది మంచైనా చెడైనా ...ఆహ్వానించక తప్పదు కదా!

    ReplyDelete
  15. ఆఖరి పేరా చాలా చాలా నచ్చింది నాకు.. అద్భుతం..

    ReplyDelete
  16. అయ్యో.. ఇప్పుడందరిబాధా రేపటి గురించే కదండీ..

    ReplyDelete
  17. పద్మార్పిత గారు
    Thanks for the comments...So nice of yoU..i've just seen it....

    ReplyDelete
  18. బడిలో మాష్టారు
    బండిలో మిఠాయి
    గతం....గతం.....

    పసితనం..అమ్మఒడి..
    బడి...గుడి..ఇప్పుడు...
    కల్పితం...కల్పితం

    స్నేహం..మాధుర్యం..
    జీవితం...అలోచనలు
    యాంత్రికం యాంత్రికం

    మార్పు...మరపు..
    మనిషి..ముసుగు...
    సహజం..సహజం.

    ఆనందం చిన్నదో పెద్దదో
    దాని అవసరం తీరింది..
    శరీర సౌఖ్యం మితిమీరింది.

    మీ కవితతో ప్రేరణ పొంది....

    A poem is a naked person... Some people say that I am a poet. Bob Dylan

    Increase of material comforts, it may be generally laid down, does not in any way whatsoever conduce to moral growth.- Gandhi

    మీ కవిత బాగుంది..పద్మప్రియ గారు.
    -ఆదిత్య చౌదరి.

    ReplyDelete