కవిత రాయలేను....

ఓ చేతిలో కలంతో కాగితంపై గీస్తూ
మరోచేతి గోళ్ళను మునిపంటితో కొరికేస్తూ
కలువల్లాంటి కళ్ళకి శూన్యాన్ని చూపిస్తూ
మెదడుకు మేతను తినిపిస్తూ.....

హృదయాన్ని తికమక పెట్టేస్తూ
మీ పెదవులపై నవ్వుని విరబూయిస్తూ
మంచి కవితనొకటి రాయాలని యోచిస్తూ
నడిరేయంతా మేల్కొన్నాను ఆలోచిస్తూ....

నాలుగక్షరాలని అటువిటు రాస్తూ
మురిసిపోయాను పైన క్రింద చదివేస్తూ
నా పిచ్చి రాతలనుండి మిమ్మల్ని రక్షిస్తూ
సమయం మేల్కొల్పింది నన్ను వెక్కిరిస్తూ....

17 comments:

  1. నా భావాలన్నీ నాలోనే ఆగాయి
    మరోమాటు మళ్ళా దరిచేరుస్తా

    ReplyDelete
  2. మీరు చూపించే బొమ్మలు చాలా బాగుంటాయండీ!! గీసినది మీరేనా? భావాత్మక కవితలు నాకూ రాయాలనే ఉంటుంది. కానీ పదాలు స్పురించవు, మాట బయటకి రాదు. భావాలు గుట్టుగా విరబూస్తాయి కానీ చెలియలి కట్ట దాటి బయటికి రావు.

    బాగుందండీ...

    నా భావాలనూ యెదొ తొచిన భాష లొ తెలియచెసే నా బ్లాగు కూడా చూడండి.

    ReplyDelete
  3. చాలా బాగుందండి మీ కవిత.

    ReplyDelete
  4. పద్మార్పిత గారు, మీ పిచ్చి రాతలతో మమ్మల్ని గిచ్చినా నొప్పి రానంత బాగా రాసారు...

    ReplyDelete
  5. @ Rao S Lakkarajuగారు మీ భావాలకై ఎదురుచూస్తా!
    @geetika, kiran,yohanth...:):)

    @బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు,మల్లాది లక్ష్మణ కుమార్ గారు,vallisarvani...థ్యాంక్సండి!

    ReplyDelete
  6. Srinivasa Reddy గారు...ధన్యవాదాలండి!
    మీరు అలా అంటే ఇంక ఊరుకుంటానా...గిచ్చను కానీ గీసేస్తా(అదేనండి రాసేస్తా):):)

    ReplyDelete
  7. మీ కవిత and related pic చాలా బాగుందండి.. మీ selection నాకు చాలా ఇష్టం..
    పద్మర్పిత గారు, నేను మీ fan నండి.. నేను మీకు తెలీదు కాని నేను మీ blog regular check చేస్తాను..
    కొన్ని idea లను మీ నుంచి దొంగిలించానండి... నన్ను క్షమించండి.. main గా మీరే నాకు inspiration అండి..
    కాని చాలా నా idea లను కూడా add చేసాను..
    మా వాళ్ళు and friends అందరూ చాలా encourage చేసారు. so continue చేస్తున్నాను..
    నా blog ని కూడా visit చెయ్యండి...

    ReplyDelete
  8. పద్మార్పితా....ఏంటి చిలిపితనం పోయి ఈ హుందాతనం:):)

    ReplyDelete
  9. చాలా బాగుంది ...ఎప్పటి లానే !

    ReplyDelete
  10. Hi teen maar chosaara....:O

    ReplyDelete
  11. బావుందండి, కవిత రాయలనే ఆలొచిస్తూ ఆ భావజాలాన్నే రాయలేనంటు రాసేస్తున్నారు. బవుంది. ఫన్ని గా కూడా ఉంది. ధన్యవాదాలు.

    ఇక్కడ పేర్చిన ఈ బొమ్మ బాపు గారే గీసారని మీకు తెలుసా? తనకి కాబోయే శ్రీమతి గారిని దొంగ చాటుగా తలుపు సందులోంచి చూసాక ఆయన మనసులో ముద్రించుకున్న ఆ రూపానికి ఇలా రంగులలొ కలవో అన్నట్టు ప్రాణం పోసారు.

    ReplyDelete
  12. మీ కలం కదిలితే అది కవితే అయ్యేట్లు౦దండీ ....

    ReplyDelete
  13. every post is very special. I really enjoyed reading your blog.

    ReplyDelete
  14. పద్మార్పిత గారూ
    నేను ఎక్కడైనా చదివినవి,నాకు నచ్చినవి నా బ్లాగ్లో పోస్ట్ చేస్తుంటాను.
    మీకు నచ్చిన "నా కవిత" కూడా అలాగ నాకు "Facebook Telugu Quotes Community"
    లో దొరికింది.

    Link:

    http://www.facebook.com/photo.php?fbid=280810235286675&set=a.198753050159061.49814.198741476826885&type=1&permPage=1

    అంటే ఈ కవిత మీరే రాశారా?
    మరి FaceBook లో మీ పేరు వున్నట్లు నాకు కనిపించలేదు.

    ReplyDelete