రంగులద్దిన వర్ణం

వసంతోత్సాహకేళి హోలీ నాడు...

గులాల్ లో రసాయనం కలిసిందని

కేసరిరంగులో బూడిద ఎక్కువైందని

పచ్చరంగులో ఏ ఆకుపసరూ లేదని

నీలిరంగు నీరంతా విషపూరితనీడలని

సునేర్ రంగు కాదు కదా!.....మెరుపని

పనికిరాని పంచరంగులకి పిచకారేలని?

వర్ణాక్షరాలు రంగరించి వసంతమాడాలని

పంచవర్ణాల పదజాలం పరవశంగా పేర్చి

పదాలులేని హృదయ కవాటాలని తెరచి

మిళితరంగు స్వచ్ఛ శ్వేతవర్ణ హస్తాలతో

పద్మ అర్పిస్తున్న "హోలీ" శుభాకాంక్షలు

28 comments:

 1. Inni rojulaki...first comment naadenooochhh.:):)adee Holi rojuna...
  happy Holi padmarpita gaaru:) pic chaalaa baagundi. Kavita Holi anta andamgaa undi:):)

  ReplyDelete
 2. రంగులమయ మీ జీవితం రసరమ్యమయం కావాలి. మీకు కూడా హోలీ శుభాకాంక్షలు

  ReplyDelete
 3. పంచవర్ణాల పదజాలం పరవశంగా పేర్చి
  పదాలులేని హృదయ కవాటాలని తెరచి
  మిళితరంగు స్వచ్ఛ శ్వేతవర్ణ హస్తాలతో
  పద్మ గారికి "హోలీ" శుభాకాంక్షలు

  ReplyDelete
 4. వర్ణాలంకృత హరివిల్లుల జల్లు.... హోళీ శుభాకాంక్క్షలు

  ReplyDelete
 5. హోలీనాడు అందించిన రంగుల కానుక... బాగుంది మేడం

  ReplyDelete
 6. remembering old days along with fragrance of your poetic words. wish you happy holi.

  ReplyDelete
 7. బాగుంది.. మీకు కూడా హోలీ శుభాకాంక్షలు

  ReplyDelete
 8. "హోలీ" రోజున రంగులన్నిటినీ రంగరించి అపురూపమైన అనుభూతిని అందించారు. సాంప్రదాయ పద్దతిలో శుభాకాంక్షలను అందించి మా ముఖానా సంతోష రంగుని పులిమినందుకు అభినందిస్తున్నాను . మీకు మా రంగుల శుభాకాంక్షలు పద్మార్పితా.
  ***శ్రీపాద

  ReplyDelete
 9. అన్ని రంగులకూ ప్రత్యేకత ఉంటుంది,అలాగే మీ కవితకు కూడా,
  మీకు హోలీ శుభాకాంక్షలు పద్మగారూ,

  ReplyDelete
 10. రంగులద్దిన శ్వేత వర్ణం మీ మనసులానే వుంది మీ శుభాకాంక్షల కవితోత్సవం పద్మార్పిత గారు. మీకు మా హోళీ శుభాకాంక్షలు..

  ReplyDelete
 11. ఈ పౌర్ణిమ హోళీ పర్వదినమ్నాడు మీ పరిచయం ఆనందదాయకం

  ReplyDelete
 12. నీవైన భావాలకు అందమైన రంగులు అద్దిన అక్షరమాల.

  ReplyDelete
 13. రంగులు మీ సొంతం రంజింపజేయడం మీకే సొంతం

  ReplyDelete
  Replies
  1. పంచ వర్ణాల పదజాలంతో పద్మర్పిత గారు చేసిన మాయాజాలం ఈ కవితారూపం..

   Delete
 14. రంగులన్నీ వసంతమాడాయి మీ కవితలో

  ReplyDelete
 15. baagundi padma holi harmless colors tho aadinchavu

  ReplyDelete
 16. వర్ణాక్షరాల వసంత సమయాన పంచవర్ణ పదజాల హృదయ అర్పిత శుభాకాంక్షలకు పద్మార్పిత గారు!
  శుభోదయం!!

  ReplyDelete
 17. వర్ణాన్ని వర్ణాలతో వర్ణించిన తీరు బాగుంది పద్మ గారు, ఊరు వెళ్లి ఈ రోజే రావడం వల్ల లేట్ గ కామెంట్ ఇస్తున్నందుకు ఏమనుకోవద్దు. ఆదిలాబాద్ వెళ్లి రావడం వల్ల దీనికన్నా ఎక్కువ ఎం రాయలేక పోతున్న ఈ సారి. క్షమించేద్దురు. బిలటేడ్ హోలీ విషెస్ మీ అందరికి.

  ReplyDelete
 18. వసంతోత్సవ వర్ణాల వివరణలో రంగులన్నీ వచ్చినట్లేనా?

  ReplyDelete
 19. రంగులు చల్లుకుంటే ఫిరంగులతో కాలుస్తారా :-)

  ReplyDelete
 20. ఇంత ఆలస్యంగా వచ్చి ఏం కమెంట్ వ్రాయడం ? సింపుల్ గా ఆస్వాధిస్తాను అంతే.

  ReplyDelete
 21. మీ బ్లాగ్ ని కనులవిందుగా మలిచారు పద్మగారు. చాలా బాగుంది. బహుశా పైన ఉన్న ముఖారవిందం మీదేనేమో, ఈ పక్కగా (ఎడమ వైపు ) పెట్టిన నిలువెత్తు ఇమేజ్ కూడా మీదే కామోసు. ఏదేమైనా చాల చక్కగా ఉంది మీ ఈ నవీన ఆన్తర్జాలిక పత్రిక (వెబ్ లాగ్ )

  ReplyDelete
 22. Side ki ala nilabadi bhale andamgaa unnaru. Me artistic pic collection adurs.

  ReplyDelete
 23. ఇంతకు ముందు ప్రొఫైల్ చిత్రంలో చిలిపితనం, ఇప్పుడు హుందాగా నవ్వుతున్నట్లుంది. పరిణితి చెందిన ప్రక్రియ పద్మార్పిత! అభినందనలు.

  ReplyDelete
 24. అమ్మయ్య.....గతరెండు రోజులుగా బెంగ ఇక ఈ నవ్వు మోము చూడలేనేమో అని, మళ్ళీ వచ్చేసారుకదా మనసు ఎగిరి గంతేస్తుంది.

  ReplyDelete