కంటిభావాలకే కరిగిపోయానంటూ...
శరీరాన్ని సాంతం స్కాన్ చేసి చూసేవు
నవ్వితేనే చాలు తీయని తేనంటూ...
గ్లూకోస్ లెవెల్ పెరిగిందని కంగారుపడేవు
కోరుకున్న కోరికలు ఏం లేవంటూ...
కల్లబొల్లి కబుర్ల కొలెస్ట్రాల్ లెవెల్ దాటేవు
స్నేహానికి కొత్తర్థం చెప్పేద్దామంటూ...
ఎదసవ్వడి వినమని ఎకో పరీక్ష చేసేవు
ప్రేమ లేదంటే గుండెతూట్లంటూ...
కనబడని కన్నాల ఆంజియోగ్రాం చూపేవు
ఉన్నమాటంటే ఉసూరుమంటూ...
నీరసించి హిమోగ్లోబిన్ ఏదో తగ్గిందంటావు
పరీక్షలన్నీ ప్రేమరోగ సాక్ష్యమంటూ...
పదికాలాల ఆయుషుని పదిలంగా కోరతావు
శరీరాన్ని సాంతం స్కాన్ చేసి చూసేవు
నవ్వితేనే చాలు తీయని తేనంటూ...
గ్లూకోస్ లెవెల్ పెరిగిందని కంగారుపడేవు
కోరుకున్న కోరికలు ఏం లేవంటూ...
కల్లబొల్లి కబుర్ల కొలెస్ట్రాల్ లెవెల్ దాటేవు
స్నేహానికి కొత్తర్థం చెప్పేద్దామంటూ...
ఎదసవ్వడి వినమని ఎకో పరీక్ష చేసేవు
ప్రేమ లేదంటే గుండెతూట్లంటూ...
కనబడని కన్నాల ఆంజియోగ్రాం చూపేవు
ఉన్నమాటంటే ఉసూరుమంటూ...
నీరసించి హిమోగ్లోబిన్ ఏదో తగ్గిందంటావు
పరీక్షలన్నీ ప్రేమరోగ సాక్ష్యమంటూ...
పదికాలాల ఆయుషుని పదిలంగా కోరతావు
మేడం... ఎదురుచూపుల్లో ఏదో ఒక రోగమొచ్చి పోతామనుకునేలోపే, మా రోగాన్ని నయం చేసే చక్కని కవిత రాసారు... హ్యాట్సాఫ్ ..
ReplyDeleteపద్మార్పిత ఫాన్స్ గుండెలభారం దించే మాత్రలో గుళికలో ఇస్తుందే తప్ప, ఏ రోగమో రొచ్చో వచ్చే రాతలు రాయలేదండి. :-)
Deleteఆలస్యంగా రాసినా అలరించారు. ఆలస్యానికి కారణం అనారోగ్యం కాదని కాకూడదని ఆశిస్తూ.
ReplyDeleteఅర్పిత ఏదో కాస్త పనిలో పడి చేసిన ఆలస్యమే కానీ అనారోగ్యానికి అంతటి ధైర్యమా తనని తాకడాని :-)
Deleteమాట్లాడేందుకు మాటల్లేవ్ .. మౌనంగా మీరు రాసీంది చదవడం భావోద్వేగం మూగవాన్ని చేశాయి చాలా బాగుంది పద్మాగారు
ReplyDeleteమాటల్లేవు సరే మరి అక్షరాలు ఉన్నాయి కదండి కమెంటడానికి :-)
Deleteఇదేం మాయరోగమో మరి పరీక్షలు పెట్టి ప్రేమ ప్రేమ అని అరవడం.....చిత్రం భళారే విచిత్రం !
ReplyDeleteచిత్ర విచిత్రాల సమ్మేళనమే జీవితం.....ఇంక రోగమో రొచ్చో రాదా మరీ :-)
Deleteఆ రోగానికి మాటల మందేసి మాయచేసేయి పద్మ:-)
ReplyDeleteఅన్ని రోగాలకీ ఒకటే మందంటారా :-)
Deleteఅలా ఓరచూపు విసిరితే ప్రేమ రోగం పట్టుకోక ఏమవుతుంది. గ్లూకోజ్ లెవలే కాదు... హార్ట్ బీట్ అమాంతం పెరిగి
ReplyDeleteఇక నీ దగ్గర ఉండను... ఆమె దగ్గర వాలిపోతానని మనసు వెంపర్లాడిపోతోంది. ప్రేమ రోగం లక్షణాలను రమ్యంగా వర్ణించారు. మరి ఆ రోగానికి మందు... ఆ చిన్నదాని దగ్గరే ఉంది కదా... మరి.. కాస్త ఆ ప్రిస్కిప్షన్ ఇస్తే...
చాలా బాగుంది... మధురమైన ప్రేమ రోగం.
ఇలా మీరు చెబున్న లక్షణాలన్నీ ఖచ్చితంగా ఆ మాయరోగానివే (ప్రేమరోగం :-)
Deleteముందు పద్మార్పితకు ఇప్పటి పద్మకు ఎంతో వ్యత్యాసం....??????ఎందుకు
ReplyDeleteఏ కోణంలో చూసి ఇలా సెలవిచ్చారో! ఏమో?
Deleteఏ సబ్జెక్ట్లోనైనా అలకవోలుగా రాయగల నిష్ణాతులు మీరు . ఎంత సునాయాసంగా అల్లగలరు పదాలను పద్మార్పిత గారూ . అల్లరి కలలను అందించి అయోమయంలో పడేస్తారు , ఆప్యాయతను జోడించి అబ్బుర పరుస్తారు. అపారమైన జ్ఞానసంపదను సొంతం చేసుకున్న మీరు నిజంగా అభినందనీయులు. ఇంత పరిజ్ఞానాన్ని ఎలా పొందుపరుచుకున్నారు ?
ReplyDeleteకిటుకేమైనా చెప్పరూ ప్లీజ్ .
Amazing really ... keep it up.
* శ్రీపాద
ధడాల్ మని మునగ చెట్టు పైనుండి పడ్డాను మీ పొగడ్తలు విని :-) కిటుకు లేదు కణికట్టూ లేదండి అంతా మీ భ్రమ :-) Thank you _/\_
Deleteఅంత అందమైన బొమ్మ పెట్టి ఇలా మరీ స్కాన్ చేసే కవితేంటండీ పద్మాజీ.. ఏమైనా మీరు ఎప్పటికప్పుడు కొత్త సబ్జెక్టుతో వస్తారు. మేం ఢమాల్..
ReplyDeleteఇంతకీ సబ్జెక్ట్ కి ఢమాల్.. ? లేక బొమ్మకా? :-)
Deleteరోగికి చికిత్స చేయగల సత్తా కూడా తమరి సొంతమే కదా! సెలవీయండి శిరసావహిస్తాం :-)
ReplyDeleteచికిత్స అని సింఫుల్ గా అంటే ఎలా... సర్జరీ అంత ప్రాసస్ ఉంది :-)
Deleteడాక్టర్ కోర్స్ ఎప్పుడు పూర్తి చేశావో తెలియచేయకపోయినా , ఈ కవితా రచన ద్వారా పి హెచ్ డి పూర్తి చేశావని తెలియ వస్తుంది .
ReplyDeleteఅమ్మో బహుకాల దర్శనం శర్మగారు......"ఏదో రోగం" వచ్చిందనుకుని పరామర్శించబోయి పి.హెచ్.డి పట్టాతో ప్రసంశించారా :-)
Deleteఅమ్మాయిని చూస్తుంటే అక్షరాలు చదువుతున్నట్లే..,చాలా బాగుంది.
ReplyDeleteఅమ్మాయిలో అందం కాకుండా అక్షరాలని చదవడం మీ గొప్పతనం.
Deleteజీవితాన్న ఉన్న రోగాలు చాలవంటూ ప్రేమరోగానికి కూడా ఇన్ని పరీక్షలా?:-)
ReplyDeleteపరీక్షలేకుండా పాస్ అయిపోవాలంటే ఎలా జీవితమైనా రోగమైనా :-)
Deleteమొత్తానికి వైద్యం చేయకుండానే ముత్యమంటి మాటలతో మనసుని ఆరోగ్యవంతం చేసారు.
ReplyDeleteఆకాంక్ష.....మీరేం తక్కువా కంటి చూపంటి కమ్మని కమెంట్ తో కట్టేసారుగా :-)
Deleteకొత్త వైరస్సేమో.. దూరంగా ఉండండి..
ReplyDeleteకంప్యూటర్ కి వైరస్ వస్తే ఫార్ మేట్ చేస్తారేమో కానీ మనిషికి వైరస్ వస్తే దూరమెందుకు జరగడం....జాలో దయో చూపించి కొన్నాళ్ళు బ్రతకనీయక :-)
Deleteఒకరి కల్పవల్లి ఒకరి నిత్యాలంకారి
ReplyDeleteఒకరి మనసులో నిక్షిప్తమైన భరిణ,
ఒక అమ్మ ఒక చెల్లి ఒక భార్య
కాని ఎక్కడ చూసిన మగువ తన ఉనికిని మనకు తెలుపుతూనే ఉంది
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత వీర వనీతలందరికి,
నేటి మేటి యువరాణులకి, నవయుగపు మహిళమణులకు కావ్యాంజలి బ్లాగ్ తరుపునుండి నా శుభాభినందనలు
ధన్యవాదాలండి.
Deleteప్రేమరోగం అంటుకుంటే కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్కాన్ తీసిన
ReplyDeleteనీరసించే మనసుని ఆహ్లాదపరిచేందుకు టోటల్ పార ఎంటేరాల్ న్యూట్రిషన్ డ్రిప్స్ వేసిన
ప్రేమిక కై వేచి చూసి ఎల్_డి_ఎల్ , ఎచ్_డి_ఎల్, లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్స్ తీసిన
ప్రేమలోక విహారానికి వెళుతూ ఎలక్ట్రో కార్డీయో గ్రాఫ్ లు, PQRST కర్వ్ లు స్టడీ చేసిన
ప్రేమిక కనబడితే టాకీ కర్డియా కనబడకుంటే బ్రాడి కర్డియా వచ్చి అర్రిథ్మియా వచ్చే లక్షణాలు కనిపించిన
ప్రేమ వాహిని లో అంజిఒగ్రామ్ పరీక్షా చేసిన అంజిఒ ప్లాస్టి చేసిన ప్రేమ అనేది తరగని గని
కలల్లో విహరిస్తూ ప్రేయసి కై తపిస్తూ, నిద్రాహారాలు మాని తిండి తిప్పలు కరువైనక
ఎరిత్రోసిన్ సెడిమేంటేషన్ రేట్ తగ్గినా ఎచ్ బి వేల్యూ 10 కన్నా తగ్గి నుట్రోఫిల్స్ పెరిగి అస్వస్థత చేకూరిన
దిఫిబ్రలటర్ వేసి ప్రేమలేక మొద్దుబారిన గుండెను తట్టిలేపిన పల్మనరీ కంజెషన్ వచ్చి డైలషన్ లేకా వెంటిలేషన్ ఎం సరిపోతుంది ప్రేమ గాలిని నిత్యం పీల్చే ఆ వింత రోగికి గుండెకి
మహాద్భుత కవిత పద్మ గారు
మీ కవితకు దీటుగా రాయాలని చేసిన చిరుప్రయత్నం ఇది పద్మ గారు,
చిత్రం చాలా చాల బాగుంది, ఇంటర్నేషనల్ విమెన్ డే ను ప్రతిబింబించే లాగ ఆ చిత్రం అప్ట్ గా ఉంది
నా కవితకు ధీటుగా ఏంటండి.....మెడిసిన్ లో మాస్టర్స్ లా దంచేసారు...అయినా కవితలు రాయడంలో ఒకరికొకరు పోటీ కాదు. ప్రేమరోగానికి సరైన చికిత్సా లేదు :-)
DeletePadma Arpita garu ... meeru sprushinchani amsham antoo ledemo...chala baga raastaarandi...
ReplyDeleteఏది రాసినా మనసుని తాకాలన్న ఆశ అంతేనండి. Thank you.
Deleteఇంకేం మిగిలాయి మీరు టచ్ చేయాల్సిన సబ్జెక్ట్.
ReplyDeleteనాదేముందని.....సముద్రంలో కాకి రెట్టంత :-)
Deleteఏ రోగమైనా మందు మాత్రం అర్పిత చేతిలోను, భావాలలో ఉందనటంలో అతిసయోక్తి లేదు.
ReplyDeleteరోగానికి మందిస్తే వేసుకుని మత్తుగా పడుకోక ఫీజు చెల్లించడం మరువకండి :-)
Deletehai hai kavita super padma:-) prema rogam gurinchi chala baga cheppavu:-) ika pic asalu kekoo keekaa:-)
ReplyDeleteకేకో కేక అంటూ అరవడం కూడా ప్రేమరోగ లక్షణమేనంటా :-)
Deleteజవాబులు ఇస్తారో?జాబుగా కవితతో అలరిస్తారో!
ReplyDeleteఇప్పటికి ఇలా అడ్జస్ట్ అయిపోదురూ :-)
Deleteచికిత్సా విధానంలో కుడా ప్రేమ చిత్ర విన్యాసాలని చక్కగా చెప్పావు.
ReplyDeleteమీకన్నా మాడం
Deleteమండువేసవి మొదట్లో బ్లాగు పై ఈ శీతలకన్నేల? జవాబులు ఇవ్వండి మేడం.:-)
ReplyDeleteవేసవిలో అలసిపోకుండా ఇప్పుడు రెస్ట్ :-)
Deleteఅందరూ మనస్ఫూర్తిగా మన్నించండి......ఆలస్యంగా సమాధానాలు రాసి మిమ్మల్ని బాధపేట్టినందుకు _/\_
ReplyDeleteఇన్ని సమస్యలున్నా పదికాలాల ఆయుషుని పదిలంగా కోరుతున్నాడంటే ఆ ప్రియుడు గొప్ప వాడే ...ఇదేదో ప్రేమ కవితల్లో ప్రయోగాత్మకంగా ఉంది ..అయినా పద్మార్పిత కలం నుంచి జాలువారింది కాబట్టి బాగుంది ..
ReplyDeleteసమస్యల్లోని సారాన్ని తీసుకుని శాంతంగా బ్రతకడమే సుఖమయ జీవితంకదా...:-)
Deleteభలేగా నచ్చేసారు మీరు,
ReplyDelete