ఆటాడుకుందాం రా!

 చిన్ననాట చెడుగుడు ఆడలేదని...
చెయ్యేసి చేసినబాసలు మరువకురా!

కలిసి కప్ప గంతులు వేయలేదని...
కళ్ళగంతలు కట్టి కనికట్టు చేయకురా!

దాగుడుమూతల దోబూచు ఆటలని...
దొంగవై కాక దొరలా నన్ను దోచుకోరా!

చెమ్మాచెక్కాటలో చిలిపితనమేలేదని...
చేరువైనట్లే అయిపోయి దూరమైపోకురా!

అష్టాచెమ్మా ఆటలో ఆంతర్యముందని...
అసుర సంధ్యవేళ ఉసురు తగులనీకురా!

వైకుంటపాళి విధిచేతి విచిత్ర వైఖరని...
విడదీయలేని బంధాన్ని విడిపోనీయకురా!

ఇరు హృదయాల ఊసులాట ఆటేకాదని...
మరమనిషిగా మారి మనసుతో ఆడుకోకురా!

29 comments:

  1. ఇరు హృదయాల ఊసులాట ఆటేకాదని...
    మరమనిషిగా మారి మనసుతో ఆడుకోకురా!
    మనసైనవారికి ఇంతకన్నా అర్థమయ్యేలా ఎలా చెప్పగలం....

    ReplyDelete
  2. చూసి చూసి ఎదురు చూసినందుకు ఎదలోతుల్లో గుచ్చుకునేలే రాసారు. బళ్ళారే !

    ReplyDelete
  3. మనసుతో ఆడుకోకు అని సున్నితంగా చెప్పినా అంతరంగాన్ని తాకింది. మీ భావాధ్బుతాలకు సలాం

    ReplyDelete
  4. మనసు కవయిత్రి పద్మార్పిత :-)

    ReplyDelete
  5. అప్పుడే చిగురించిన పరువపు యెద చప్పుళ్లు వినిపిస్తున్నాయి మీ కవితలో. బాల్యానికి, యవ్వనానికి మధ్య ఉండే సరిహద్దు మానసిక సంఘర్షణకు మీ చిత్రం ఒక ప్రతిబింబం. ఆ క్షణాన ఆశల పల్లకిలో, ఊహల వాకిలిలో... పరువం ఊగిసలాడే వేళ... విరహం బరువుని దించే తోడుకోసం పరితపిస్తున్న జవ్వని మనసుతో ఆడుకోడం... హన్న.. ఎంత పాపం. అంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉందా. పద్మగారు... లేలేత ప్రాయం మొగ్గ తొడిగిన మగువ మనసుని చదివినట్టుంది.

    ReplyDelete
  6. మనసాట మనసైన వారితో ఆడితే తప్పేముందో!!!

    ReplyDelete
    Replies
    1. మనసుతో ఆడుకుని మజా చేసేవారికి వర్తిస్తుంది మీరన్నమాటలు విష్వక్సేనగారు :-)

      Delete
  7. నిర్మలమైన ఓ ప్రేమ భాష్యం, దానికి అంతే నిర్మలంగా ఉన్న రూపం కలిపితే మీ కవిత.
    మనస్సు చికాకుగా ఉన్నవాళ్ళు, ఒక్కసారి మీ బ్లాగ్ దర్శిస్తే ప్రశాంతంగా ఫీల్ అవుతారు,(అతిశయోక్తి కాదు)
    వీసమెత్తు కూడా ఎవ్వరినీ నొప్పించని మీ వాఖ్యలు ఆత్మీయతను మరపిస్తాయి.
    అభినందనలు పద్మా...(బ్లాగ్ కొలనులో విరసిన పద్మం.)

    ReplyDelete
  8. Nice poem with an apt pic... Keep rocking Madam !!!!!

    ReplyDelete
  9. మనసు ఒక మధుకలశం, దాహంతీర్చే ముంతను పడేసుకుంటే ప్రాణం పోతుంది. ప్రాణంలేనప్పుడు ఇంక ఆటలేం ఆడుకుంటాం. మనసుతోటి ఆడుకోకురా అని గోముగా అని హృదయకవాటాల అంచులకు అతుక్కుపోయావు పద్మ.

    ReplyDelete
  10. అప్పుడెప్పుడో ఆడుకోలేదన్న అసూయతో ఇప్పుడు ఆడుకోవాలని ఆటవస్తువుగా మనసునే కోరుకునేవారు కోకొల్లలున్నారు. పద్మార్పిత మనసుతో ఆడుకోదు మనసును మాటలతో దొంగలించే చోరశిఖామణి :-)

    ReplyDelete
  11. ప్రేమంటే మనసుతో చెలగాటం కాదని ఆటాడుకుందాం అంటూనే హృద్యమైన నేపథ్యంతో మనసును హత్తుకునేలా చెప్పారు.. అభినందనలతో...

    ReplyDelete
  12. you have played with words. heart touching

    ReplyDelete
  13. అందమైన దృశ్యకావ్యం

    ReplyDelete
  14. దొంగవు కానక్కరలేదు, కనికట్టు చెయ్యక్కరలేదు, ఉసురు నికు తగలరాదు, యాంత్రికంగా జీవించొద్దు అని .... బాసలు మరువని మనసున్న మనిషిగా జీవించొచ్చుగా అంటూ ....
    అందమైన మనోభావనలకు అక్షర రూపం .... ఈ కవిత
    అభినందనలు పద్మార్పిత గారు! శుభోదయం!!

    ReplyDelete
  15. ఆడలేదని.................మరువకురా!
    వేయలేదని...............చేయకురా!
    ఆటలని...................దోచుకోరా!
    లేదని.....................దూరమైపోకురా!
    వుందని...................తగులనీకురా!
    వైఖరని....................విడిపోనీయకురా!
    ఆటేకాదని.................ఆడుకోకురా!

    ఇదన్న మాట.............ఆటాడుకుందాం రా!

    వెయ్యాలి...................కలిసి కప్ప గంతులు!
    బాగుంది...................కళ్ళగంతలు కట్టిన కనికట్టు!
    రాత...
    గీత...
    మోత...

    ReplyDelete
  16. అచ్చంగా అన్నీ తెలుగు ఆటలు ఆడినా ఆడకపోయినా మనసుతోటి ఆడుకోకు అని అర్పిత చెప్పడం అభిమానులు వినకపోవడమునా, ఆటాడుకుందాం రా అంటే ఏదో పదవిన్యాసం అనుకున్నా.....జాణవులే నెరజాణ :-)

    ReplyDelete
  17. ఆటవిడుపుగా అర్పితగారు ఆటలాడిస్తారు అనుకుంటే......కవితతో కట్టిపడేసారు.

    ReplyDelete
  18. మనసుతోటి ఆడుకునేవారు ఉన్నారు కనుకనే మైండ్ బ్లాక్ అయిన పిచ్చోళ్ళు ఎందరో ఉన్నారు.

    ReplyDelete
  19. ఆటలకి ఏదో కొత్త అర్థం చెప్పి ఆటలాడిస్తావు అనుకుంటే ఇక్కడ కూడా అందమైన నిర్వచనం చెప్పి అనిర్వచనీయమైన భావానికి గురిచేసావు.

    ReplyDelete
  20. బహుశ ఈ టపా కి నా వ్యాఖ్యా సరితూగాదేమోనని చెతులెత్తెశా పద్మ గారు,
    అక్షరాలతో ఆటలాడోచ్చు అని ఇప్పుడే తెలిసింది
    మాటలగారడి బూరడి కొట్టించే రోజులివి, తస్మాత్ జాగ్రత అని చెప్పినట్టు చెప్పకనే చెప్పారు (నాకు ఇలా అర్ధం అయ్యింది లెండి)
    మనసు చాంచల్యం ముందు ఏ ఆటా పరిపాటి ?
    రాగద్వేషాల నడుమ ఏమి ఎరుగని మనసుతో కూడా ఆటలాడే కాలం ఇది కాదంటారా పద్మ గారు

    బహుచక్కని విశ్లేషణ, అంతకు మించి తార్కికత భేష్.

    లేట్ గా వ్యాఖ్యానించినందుకు ఏమనుకోవద్దు పద్మ గారు

    ReplyDelete
  21. ఎంత బాగా ఆడుకుంటారండి మీరు .... పదాలతో... వాహ్ !!

    ReplyDelete
  22. mam wht hapnd? waitng for reply n poem

    ReplyDelete
  23. I think you might be very busy madam. Take care and come soon with rocking poetry.

    ReplyDelete
  24. పద్మార్పితకు పదాలు కరువైనాయా ఏంటి? పలకడంలేదు.
    బ్లాగ్ కొలనులో కలువబాల కవితలే కరువైనాయి ఎందుకో?

    ReplyDelete
  25. అనివార్యకారణాల వలన ఆలస్యంగా రిప్లైయ్ ఇస్తున్నందుకు మన్నించాలి. మీ అభిమాన ఆప్యాయ స్పందనలకు పద్మార్పిత ప్రణామములు _/\_

    ReplyDelete

  26. ఆటలన్నీ ఆడించారు ... బాల్యాన్ని గుర్తు చేసారు . నిజంగా బావుంది మీ కవిత

    ReplyDelete
  27. I am fine and thanks to all for their concern.

    ReplyDelete