కాష్మోరాని కవ్వించి కన్నుకొట్టాలని
ప్రేతాత్మని రమ్మనిపిలిచి ప్రేమించాలని
ఊడలమర్రి చెట్టెక్కి ఊయలలూగాలని
నక్కల అరుపులు సన్నాయిగా వినాలని
ఈదురుగాలికి బూడిదెగసి వెన్నుతట్టాలని
శాఖినీఢాఖినీలతో సరదాగా సరసమాడాలని
శవాలు కేరింతలు కొడుతూ కలసి నర్తించాలని
ఆత్మలన్నీ ఆశీర్వధించి అక్షింతలు వేయాలని
స్మశానంలో శోభనం అవ్వాలని....ఎందుకంటే?
వాటికి ఆహ్వానించడమే కానీ అసూయలేదని
ఆదరించి అడక్కపోయినా ఆశ్రయమిస్తాయని
అభిమానమంటే వాటిదృష్టిలో అర్థంవేరేఉందని
రాగధ్వేష, కుళ్ళుకుతంత్రాలు తెలియవేమోనని
మనిషిని చూసి మనిషి ఈష్య పడతారే కానీ...
శారీరక వాంఛలేని సద్గుణ స్వరూపాలందుకని
సరళమైన చిలిపి కోరికది తెలుసా ఎందుకని?
మనుషులుకావు మన అంతిమ ఆకారాలవ్వని
ఝడుసుసుకున్నా మొదలుపెట్టగానే....కేక పెట్టించారుగా
ReplyDeleteనిజమే కదా....ఈ ప్రాణమున్నా మనసులేని మనుష్యులను చూసీ చూసీ అసహ్యం పరాకాష్ఠకు చేరితే కురిసిన ఈ రాళ్ళవాన మనసులేని వారిని గాయపరిచేతీరుతుంది.....
జడిపించినా.....జరుగుతున్న సత్యమిందండి అనుగారు. మనిషి చేరే పరాకాష్ట అది అందుకే నాకిష్టం :-)
Deleteవామ్మో! చిలిపికోరిక ఇంత భయంకరంగా మొదలవ్వాలా?
ReplyDeleteబొమ్మ ఎవరిదో కాని అద్భుతంగా వేశారు, వెలుగు నీడలు స్పష్టంగా
అయ్యబాబోయ్....క్షమించేద్దురూ భయపెడితే :-) ఏదో చిన్ని చిలిపికోరికేగా :-)
Deletesuper ga cheparu
ReplyDeleteనిజమే లెండి. మనుషుల కన్నా ఆత్మలు ప్రేతాత్మలే నయం. ఒక వేళ ఉంటే. నిజంగా ఒక వేళ ఉన్నా మనుషుల వికృత చేష్టలు, ఉన్మాద రూపాలు, ఈర్ష్యాసూయల మనసులు చూసి ఎప్పుడో భయపడి పారిపోయి ఉంటాయి. మీ కోరికలో తప్పులేదు.
ReplyDeleteసతీష్ గారు క్యాచ్ చేసారు నా పాయింట్ ని....థ్యాంక్యూ!
Deleteబూడిదెగసి వెన్నుతట్టాలని, శాఖినీఢాఖినీలతో సరదాగా సరసమాడాలని, శవాలు కేరింతలు కొడుతూ కలసి నర్తించాలని .... ఆత్మలన్నీ ఆశీర్వధించి అక్షింతలు వేయాలని ....
ReplyDeleteవైవిధ్యంతో కూడిన అభిలాష, ఊపిరి బిగబట్టుకుని భావనల్లోకి వెళ్ళొచ్చినట్లుంది.
అభినందనలు పద్మార్పిత గారు! శుభోదయం!!
చంద్ర వేములగారు....ఏదో రాసాను అనుకోకుండా సునిశితపరిశీలనతో చదివి నా భావాల్లోని భావాన్న్ని అర్థం చేసుకున్న మీకు ప్రణామములు.
DeleteFebruary 13th horror movie inspiration tho bhayapette post anukunna mottani meedaina style lo saralamga manushulanu tattileparu.
ReplyDeleteMidnight horror movies chusi alaage anukuni poem chadivithe elaa. Aina cool ga touched my heart :-)
Deleteపద్మార్పిత గారూ !
ReplyDeleteమీ కవిత చదివాక నిస్పక్షపాతంగా రాస్తున్న కామెంట్ ఇది.
ఇది పద్మార్పిత గారి 'టిపికల్' పోయెట్రీ కావచ్చు . మీ మొదటి ఆ పది వాఖ్యాలు శృంగార రాగాలు ఆలపించినా, అంత 'యిది' గా అనిపించలేదెందుకో. అయితే రాసుకున్న భావనలకు అర్ధం ఏమిటని ఆలోచిస్తే ... తర్వాత భాగం ఎంతగానో సమర్ధ వంతంగా ప్రశాంతిని పంచాయి.. అయినా ముద్దుగా, బొద్దుగా , అందంగా, ఆకర్షణీయంగా ఉండే మీకెందుకండీ ఇంత వింతైన చిలిపి కోరికలు. ఇది అనాలోచిత స్మశాన వైరాగ్యం కాబోలు........... (సరదాగా అంటున్నాను లెండి) .
- శ్రీపాద
మీ నిష్పక్షపాత వ్యాఖ్యలకి వందనాలు. _/\_"టిపికల్ పోయట్రీ" అంటూ నన్నో అందాలరాకాసిని చేసేస్తే ఎలాగండి :-) చిలిపికోరిక అడిగిన చిన్నదాన్నే కానీ అనాలోచితంగా, స్మశానవైరాగ్యంతో మాత్రం కాదండోయ్....చాలా అంతర్మధనానికి లోనై అందించిన భావాలు ఇవ్వని మనవిచేస్తున్నాను.
Deleteఇంత వింత ప్రవృత్తి ఏంటని నాలుగు వాఖ్యాలు రాసేసి నిన్ను దులిపేయాలనుకున్నా, అసాంతం చదివితే ఆంతర్యం భోధపడింది. అమోఘం!
ReplyDeleteఎంతో అభిమానం ఉంటేనేగా అలా దులిపేయాలనుకుంటారు.....నిరుత్సాహ పడకండి మీరు తిట్టి దులిపేసే పోస్ట్ బోలెడన్ని రాసేస్తానుగా :-)
Deletechilipi korika bhayankaranga undandi:-) mee vratalaku salaam madame:-) Pic suuper:-)
ReplyDeleteSruti bhayapadaku.....mai hoon na :-)
Deleteమీ " చిలిపి కోరిక " కొందర్ని చావుదెబ్బ కొట్టింది... మీ సమయస్పూర్తికి హ్యాట్సాఫ్ .... మేడం...
ReplyDeleteచావుదెబ్బకొట్టి, చప్పట్లు కొట్టించుకుని ఏం చేస్తాను చెప్పండి. అనాలోచితంగా ఎవరినీ నొప్పించకూడని అర్థమవ్వాల్సిన వారికి అర్థమైతే చాలని ఆశిస్తున్నానండి.
Deleteఏది వ్రాసినా ఒక ప్రత్యేకత అనుకునే చదివాను, నిరాశపరచకుండా మంచి నీతిని చెప్పారు...."మనుషులకన్నా మృతదేహాలు మిన్న" అని :-)
ReplyDeleteతెలుగమ్మాయి ఏం చెప్పినా తీయతియ్యగానే ఉంటాయి :-)
Deleteఆదరించి అడక్కపోయినా ఆశ్రయమిస్తాయని
ReplyDeleteఅభిమానమంటే వాటిదృష్టిలో అర్థంవేరేఉందని
రాగధ్వేష, కుళ్ళుకుతంత్రాలు తెలియవేమోనని
మనిషిని చూసి మనిషి ఈష్య పడతారే కానీ...
శారీకవాంఛలేని సద్గుణ స్వరూపాలు అందుకని
అన్నీ అక్షరసత్యాలే, అభినందనలు
నాలో చెలరేగిన అలజడులకి ప్రతిరూపాలు ఈ అక్షరాలు...నచ్చిన మీకు ధన్యవాదాలండి.
Deleteమీరు మనుషుల అంతరంగంలోని కుళ్ళును కవితలో ఎండగట్టిన తీరు బాగుంది. చిత్రం మరింతగా నచ్చింది..
ReplyDeleteనిజానికి వేరొకరి కుళ్ళు కుతంత్రాలనే సరిగ్గా పసిగట్టలేను, ఇంక ఎండగొట్టడం మాటటుంచండి :-) థ్యాంక్యూ
Deleteనో డౌట్ .. ప్రేతాత్మతో ప్రేమలో పడ్డారు.. మరి హనీమూన్ సంగతో...
ReplyDeleteయస్ అయాం ఇన్ లవ్....అన్నీ చెప్పేస్తే ఏం బాగుంటుంది :-)
Deleteఅవును నేను బ్రతికున్నాను అని ఎవరు చెప్పారు..
ReplyDeleteనీవు నన్ను కాదన్న క్షనంలోనే ఖననం అయ్యాను
ఇప్పుడున్నది నేను కాదు నాలాంటి ఓ శవం
నిర్జీవంకాని జీవంఉన్న ఓ మట్టిబొమ్మ
నడుస్తున్నా.. మాట్లాడుతున్నా ఓడిపోయిన ఓ విగత జీవి
వందేళ్ళ జీవితాన్ని ఒక్కమాటతొ తుంచేసి
బ్రతికున్నావా అని ఎలా అంటున్నావు
అదేంటి బ్రతికున్నానా అని ఆరాతీసి మరోసారి చంపకు
ఎన్నిసారలని చావంటావు ఏన్ని యుగాళుగా ఇలా ఓడిపొమ్మంటావు
వాటిపోయిన వడలి పోయిన ఓ పిచ్చి మొక్కను ఇప్పుడు
ఛా....అన్నీ మనకే అన్వయించుకుంటే ఎలాగండి. సింప్ల్ గా స్మైల్ ఇచ్చేసి బ్రతికేయక చావడం చంపుకోవడం ఎందుకో :-)
DeleteBeautiful photo with worth to read poetry.
ReplyDeleteThanks for your compliments
Deleteఈసారికి భయపెట్టడం మీ వంతు, భయపడడం మా వంతు పద్మ గారు
ReplyDeleteమీకు గనక నిజంగా అలాటి కోరికలు ఏమైనా ఉంటె రాజస్తాన్ లోని భాన్గడ్ లోని పాలస్ ను చూడండి
మీకు రత్నావతి సింఘియ మరియు అన్యేతర ప్రేతాత్మలు దయ్యాలు కాశ్మొరాలు ఊడల మర్రిలు, భేతాళులు, విక్రమార్కులు అందరు వినిపిస్తారు
ఓ చంద్రముఖి, ఓ అరుంధతి ని రియల్ గా చూసినట్టి అనుభవం ఉంటుంది,
ఇది ఎంత నిజమంటే దాదాపుగా ఆ పాలస్ చూటుపక్కలకు వెళ్ళాలన్న అక్కడ ఉండేవాళ్ళకి హడలే
అది ముమ్మాటికి నిజం, కావాలంటే ఈ సైట్ ను చూడండి, http://en.wikipedia.org/wiki/Bhangarh
భయం వేస్తె మన్నించండి, నా మాట మన్నించి ఆ వైపునకు మాత్రం వెళ్ళవద్దు
మీ కవితను చదువుతుంటే నాకు ఆ 'భాన్గడ్' గుర్తుకొచ్చింది
పల్స్ రేట్ 50 bpm, బ్లడ్ ప్రెషర్ డయాస్తోలిక్ : 140 సిస్తోలిక్ : 90
కెవ్వు
బ్యవ్
చిత్రం కావ్యానికి అప్ట్ గా ఉంది పద్మ గారు
స్మశానాన్నికి కూడా మీ ఈ కవితతో వెలుగులు అద్దారు
నిజంగా భయమేస్తే నన్ను మన్నించండి పద్మ గారు
The Poetry is totally mesmerizing and Immersing
పద్మగారు,
Deleteమీ ఈ లైన్ లో 'టైపో' దొర్లింది, సరి చేసుకోగలరు (18th Line 'శారీక'వాంఛలేని సద్గుణ స్వరూపాలు అందుకని)
'శారిక' అని ఉంది శారిరిక అని మలుచుకుమ్మని వినమ్రంగా తెలియపరుచుకుంటున్నాను
'టైపో' ఎంచినందుకు మన్నించండి
నిజమే మనిషి లోని రోజు రోజుకు పెరిగిపోయే అసూయ ద్వేషాల కన్నా, గాలిలో కలిసిపోయే జీవాత్మాయె మిన్న ఏమో
బహుశ అందుకే బ్రతికున్ననాళ్ళు ఏదో ఒక సాకు తో దెప్పిపొడిచే వాళ్ళు ఉన్నా, చనిపోయాక మాత్రం అంజలి ఘటిస్తారు. జీవిత పరమార్థం తెలిపారు పద్మ గారు. ధన్యోస్మి
మీకు కమెంట్ కి రిప్లై ఇవ్వడానికి నేను భయపడుతుంటే మీరు నేను భయపెట్టాను అంటే ఎలాగండి.:-) అమ్మో ఎన్ని విషయాలు తెలుసో మీకు. మాతో పంచుకున్న మీకు ధన్యవాదాలు.Once again thanks for everything.
Deleteసరిచేసానండి.
Deleteపద్మగారు, నా మాటను మన్నించి అ పదాన్ని సరి చేసినందుకు నెనర్లండి. పొరపాటున 'శారిరిక' ఇప్పుడు 'శారిరక' ఐయ్యింది, మరోమారు మీకు శ్రమ అనుకోకపోతే సరిచెసుకొద్దురు, పోనీ దానిని అలానే ఉంచిన పర్వాలేదు లెండి. అయ్యో నేనేదో ఇన్ఫో కోసమే చెప్పెను, అంతేగాని మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రం కాదని గమనించగలరు. మరోమారు ధన్యవాదాలు
Deleteసృజనాత్మకంగా విషయాన్ని భిన్నంగా చెప్పడంలో మీది అందెవేసిన చేయి. ఇక్కడ అదే జరిగింది. అభినందనలు
ReplyDelete:-) థ్యాంక్యూ యోహంత్.
Deleteకాష్మోరాకి కన్నుకొట్టే కలేజా మీకుంటే -మేమంతా మీవెన్నంటే
ReplyDeleteమీరంతా నావెంట ఉంటే కన్ను కొట్టడం ఏంటీ.....దేనికైనా రెడీ :-)
Deleteశారీరిక వాంఛ లకు దూరం గా
ReplyDeleteకోరిన కోరిక , అది ఎలా చిలిపి కోరిక ?
సృష్టి లో స్త్రీ, పురుషుల కలయిక ,
లేనిదే , మానవ జాతి లేదిక !
ప్రేతాత్మ కు నీ ప్రేమ అర్హతా ?!
ఒక్క మానవాత్మ కు కూడా లేదా పద్మార్పితా ?!
మానవజాతిని సృష్టించే మహామహులెందరో ఉన్నారు కదండి....దాని గురించి చింత వదిలేస్తే అన్నీ చిలిపికోరికలే :-) ప్రేతాత్మలు ఏం పాపం చేసాయని వాటిని ప్రేమించకపోవడానికి అందుకే ప్రేమార్పితం వాటికి :-)
Deleteప్రేతాత్మలకి కూడా ప్రేమతో ప్రాణం పోయగల సత్తా ఉన్న డేర్ అండ్ డాషింగ్ అమ్మాయి పద్మార్పిత అని నిరూపించావు. శభాష్.
ReplyDeleteవావ్.....శభాష్ అని ఇలా పొగిడేస్తుంటే పిశాచాలన్నీ నన్ను పార్టీ ఇవ్వమని గొడవచేస్తున్నాయండి :-)
Deleteఇది చదివేసి నాకు ఇలాంటి చిలిపికోరికలే కలిగేస్తున్నాయ్......శాఖిని, ఢాఖిని ప్రేతపిశాచాల్లారా ఎక్కడున్నారు? :-)
ReplyDeleteనేను ఇలా చిలిపికోరిక కోరితే నే రానివారాంతా....మీ వాలుచూపుకే వచ్చి వాలిపోతారేమో అలా అడిగితే :-)
Deleteఏంటండీ... ఇక్కడేదో భయానక - భీభత్స రసాల జుగల్బందీ నిర్వహించినట్టున్నారు!!!
ReplyDeleteభయస్థులే గనక ఎరక్కపోయి ఈ పోస్టు బారిన పడితే, వారి గుండెల్ని కాపాడేదెవ్వరని? :-))
నాగరాజ్ గారు ఉండగా భయమా మీకు అని పిశాచ ప్రేతాత్మలు పక్కున నవ్వి పక్కకు జరిగాయి....భయమెందుకింక బేలగా :-)
Deleteపల్లెటూరి ప్రపంచంలో మళ్ళీ
ReplyDeleteప్రాంతీయ దురభిమానం...
ఏం?
డ్రాక్యులా ఫ్రాంకెన్ స్టీన్ వగైరాలేం
పాపం చేసారు?
వాళ్ళమీద కూడా ఒక లుక్కెయ్యొచ్చుగా?
అన్యాయం...
వాటికి తెలుగు రాదు కనక సరిపోయింది...
అయ్య బాబోయ్....ఇక్కడ కూడా ప్రాంతీయ పాలిటిక్స్ ట్రిక్స్ అవసరమా చెప్పండి :-) అయినా డ్రాకులాలు బొద్దుగా ముద్దుగా ఉన్నవారి జోలికి రావంటగా....బ్రతిపోయాం :-)
Deleteభూతప్రేత పిశాచాలుగా
ReplyDeleteమహీ....ఏంటిది? ఇలా కమెంట్ సగమే పోస్ట్ చేసి పారిపోయావు. ఇంత పిరికితనమా :-)
Deleteభూత ప్రేతాత్మగామారి నేను రెడీ.......ఎంతైనా మీ మిత్రుడ్ని నాకేం భయం :-)
ReplyDeleteఓ.....అలాగే :-)
Deleteమనిషి మనస్తత్వాన్ని మరోకోణంలో చూపించారు. బొమ్మ చాలా బాగుందండి.
ReplyDeleteమనిషి అన్నాక....ఒకో కోఅణంలో ఒకోలా తప్పదేమో :-)
Deleteకొన్ని లైన్లు చదివి బాప్ రే .. అనుకున్నాను ... ముగించాక వాహ్ రే అనుకోక తప్పలేదు .... అభినందనలు పద్మార్పిత గారు
ReplyDeleteమిమ్మల్ని బాప్ రే అని భయపెట్టకుండా.... మీతో సదా వాహ్ వా అనిపించుకోవాలన్నదే నా అభిలాష.
Deleteపదునైన పదాలు మీ పద్యాల్లో పద్మార్పితగారు
ReplyDelete