ఏ రాగం నా తాపం తీర్చ తగదు నీ ఊపిరి తప్ప
ఏ కాంతిపుంజం నను సోకలేదు నీ చూపు తప్ప
ఏ ధ్వనీ వినపడదు నువ్వు లేవన్న ధ్యాస తప్ప
ఏ రేయి కునుకురాదు కనురెప్పల భారమే తప్ప
ఏ ఎదకూ దాసోహం అనదు నా ప్రేమ నీకు తప్ప
ఏ చిరుగాలి రమ్మంటూ సేదతీర్చదు నీ ఒడి తప్ప
ఏ తలపు నన్ను తాకలేదు నీ రూపు నాలో తప్ప
ఎవ్వరినీ దరిచేరనివ్వదు నా తనువు నిన్ను తప్ప
ఏ భాష్యం నేను నేర్చుకోలేదు ప్రేమనే భావం తప్ప!
ఏ అందం ఆకర్షించదు తామరను తుమ్మెద తప్ప...
ఏ కొలను కలువను విప్పార్చలేదు వెన్నెల తప్ప...
ఏ కాంతిపుంజం నను సోకలేదు నీ చూపు తప్ప
ఏ ధ్వనీ వినపడదు నువ్వు లేవన్న ధ్యాస తప్ప
ఏ రేయి కునుకురాదు కనురెప్పల భారమే తప్ప
ఏ ఎదకూ దాసోహం అనదు నా ప్రేమ నీకు తప్ప
ఏ చిరుగాలి రమ్మంటూ సేదతీర్చదు నీ ఒడి తప్ప
ఏ తలపు నన్ను తాకలేదు నీ రూపు నాలో తప్ప
ఎవ్వరినీ దరిచేరనివ్వదు నా తనువు నిన్ను తప్ప
ఏ భాష్యం నేను నేర్చుకోలేదు ప్రేమనే భావం తప్ప!
ఏ అందం ఆకర్షించదు తామరను తుమ్మెద తప్ప...
ఏ కొలను కలువను విప్పార్చలేదు వెన్నెల తప్ప...
Beautiful Lines :-)
ReplyDeleteమనసులోని భావాలను మదిలో అలజడి రేపేలా ఎవరు పేర్చగలరు మీరు తప్ప...
ReplyDeleteప్రేమార్పిత....సార్థక నామధేయురాలు అభివందనం.
ReplyDeleteనీవు తప్ప....వేరేది వద్దంటు చిక్కని భావకవితను అందించారు.
ReplyDeleteఊపిరి తాపం .... చూపు కాంతిపుంజం .... కనురెప్పల భారం, దాసోహం .... ప్రేమ కు
ReplyDeleteఎంత చక్కని భావనలో
అభినందనలు పద్మార్పిత గారు!
aap ki iss kavitaa ko hindi shaayari mein anuvaad karne ki izaazath maangtha hoon arpitaji
ReplyDeleteప్రేమభావాలను ఇంత రమణీయంగా ఎవరు చిలికించగలరు
ReplyDeleteఒక్క పద్మార్పిత తప్ప..........
నీవు తప్ప....పదాలకి పదునులేదు
ReplyDeleteనీ కవితలు తప్ప....మనసునేం తాకడంలేదు
నీ స్నేహం తప్ప....ఇంకేం గుర్తుకు రావడంలేదు
నీవంటే వల్లమాలిన అభిమానం తప్ప...ఏంలేదు!
చదువుతున్నా చదువుతున్నా చదువుతూనే ఉన్నా...తరగని గని ఆమె భావాలు. అద్భుతం, ఆశ్చర్యం, అమెఒఘం. రెండు రోజుల నుండి ఏక ధాటిగా చదువుతుంటే ఇప్పటికి ఈ నాలుగు ముక్కలు రాయగలిగాను. అర్పితగారు ఎలా రాస్తున్నారో ఏమో. అసలేం గుర్తుకురావడంలేదు మీ అక్షరాల అందాలు తప్ప.
ReplyDeleteకమెంట్స్ తెలుగులో వ్రాసి పెద్ద గ్రంధం వ్రాసిన ఫీలింగ్ నాకు, ఇన్ని మంచి భావాలని వెళ్ళబుచ్చిన పద్మార్పితగారి ఫీల్ ఏంటో???? ఎంతో???
Deleteరాధామాధవ తత్వం... అనంత ప్రేమతత్వానికి ఆదర్శం. అతి పవిత్రమైంది కూడా. మురళీ గాన లోలుడి వాయులీనమే రాధ ఉఛ్చ్వాస నిచ్ఛ్వాసాలు. అందుకే ఏ ఎదకూ దాసోహం అనదు నా ప్రేమ నీకు తప్ప, ఏ తలపు నన్ను తాకలేదు నీ రూపు నాలో తప్ప.. ఈ రెండు మొత్తం ప్రేమతత్వాన్ని వర్ణించేశాయి. ఏ ఊహతో ఈ కవితరాశారో పద్మగారు. కానీ.. ఇది అచ్చంగా రాధమాధవ ప్రణయ ప్రపంచంలో వలపు లాహిరులు. ఇందులో విరహం, వియోగం, నిరీక్షణ, వాటన్నిటినీ పంచభూతాలతో ప్రేయసి పంచుకుంటున్నట్టు వర్ణించిన వైనం.. నిజంగా పద్మగారు చాలా బాగుందండి. బృందావని వీధిలోలో విహరించినట్టే ఉంది. ధన్యవాదాలు.
ReplyDeleteకొత్త పదాలు ఏం దొరకడంలేదు బాగుంది అని అనడం తప్ప.
ReplyDeleteమీ ప్రేమ చిరకాలం సాగిపోనీ....
ReplyDelete"స్వప్త స్వరాలూ" ఉపిరితోనే కదా పద్మార్పితా ఊసులాడు కునేది. చూపైనా , ధ్యాసైనా తలపు తాకగానే కదా కలవరపడి పోయేది. రాగ మాలికలెన్నైనా ప్రేమ రాగం మాత్రం వీనుల విందే కదా మీ కవిత అసాంతం ! వెన్నల 'వన్నెల'నార బోసుకున్నంత అందంగా ఉంది మీ కవిత. మీ కవితలెప్పుడూ పౌర్ణమి నాటి పిండి పండువెన్నలే మరి . పరిగెత్తించకుండా, పడేయకుండా, మా అందర్నీ సున్నితంగా నడిపించారు మీ కవిత తో పాటు సమాంతరంగా.
ReplyDelete- శ్రీపాద
ప్రతీ పదం ఉంది అద్బుతంగా,
ReplyDeleteమీరు రాయలి కలకాలం అందంగా,
మీ కవితల తీయని భావాన్ని ఆరాదిస్తాం సంతోషంగా,
అందమైనా ఊహాలోకానికి తీసుకెళ్తాయి మీ కవితలు, చిత్రాలు..
Simple and Special..
........మౌనం మౌనం మౌనం మాటలు లేవు అస్వాదించడం తప్ప
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteఏ ఎదకూ దాసోహం అనదు నా ప్రేమ నీకు తప్ప
ReplyDeleteఏ కొలను కలువను విప్పార్చలేదు వెన్నెల తప్ప...
ఈ హామీ చాలదా ప్రేమికుల హృదయానికి..
ప్రేమార్పితకు వందనం అభివందనం..
Saati leru meeku meeru thappa...:-):-)
ReplyDeleteBhaavam Madilo Medilindi, Maatalai Raaleka
ReplyDeleteMaunam Bhaashai Kurchundi Pedaala paina
Murali Ravamu vini maimarichipoyaanu
Emanaalo Sandigdham lo Baagundi ani Cheppadam Tappa...!! :-)
నాకు ఎలాంటి అక్షరాలూ కనిపించవు , మీ మంచి మనస్సు తప్ప.
ReplyDeleteLovely feel in the poem! and chitram Adurs Padmarpitha :)
ReplyDeleteనా అభిప్రాయాన్ని మార్చుకోవలసిన అవసరం కలిగించరు మీరు. శుభం.
ReplyDeleteనా అభిప్రాయం మార్చుకోవలసిన అవసరం కలిగించరు మీరు.అది నాకు సంతోషదాయకం.
ReplyDeleteమీ మరో కలువరేకు(కవిత) కై నిరీక్షణ.
ReplyDeleteనా పేరు లేదు:-((
ReplyDeleteబాగుంది... మెరాజ్ గారు.. భలే నవ్వొచ్చింది. మీరు ఆవిడ మనసులో ఉండుంటారు. అందుకే నేములేనేముంది అని వదిలేసుంటారు...
Deleteఅయితే వాకే...:-))
DeletePadmarpita fans....
ReplyDeleteఅనూ..
Yohanth..
ఆకాంక్ష..
Chandra Vemula..
Anonymous 1..
sridevi gajula..
Mahee Heart beats..
natana jeevitam..
సతీష్ కొత్తూరి..
Markandeya roopa..
వినోద్..
Sripada***శ్రీపాద..
శృతి..
తెలుగమ్మాయి..
Kcube Varma..
Bukya Sridhar..
Meraj Fathima
Sri Valli..
Pantula gopala krishna rao....
ఏమివ్వలేని అర్పితను.......స్పందిస్తున్న ప్రతి హృదయపద్మానికి పేరు పేరునా ప్రణమిల్లి ప్రేమాభివందనం చేయడం తప్ప!
ikkada Naperu ledu I HURTED....?
Deleteమీరాజ్ గారు.....మగత నిద్రలో రిప్లై ఇస్తూ నా మనసులో మత్తుగా నిద్రపోతున్న మిమ్మల్ని మరిచా.....మన్నించేద్దురూ ఎంతైనా మీ సోదరినే :-) ఇప్పుడు ఇరికించేసా మీ పేరుని వరుసక్రమంలో.
ReplyDeleteThanks for your support Satish gaaru
పదికాలాలపాటు ఇలాగే సంతోషంగా రాయాలి, నా పేరు రాయకున్నా పర్వాలేదురా.... మీ మనస్సు నాకు తెలుసు .
Deleteఅర్పితగారు ఏదో ఐస్ క్రీమ్ బొమ్మ పెట్టానని నన్ను మరీ చిన్నఅమ్మాయిని అని అనుకోకండి నేను పద్మార్పిత ఫాన్ గ్రూప్ లో చేరాం కాస్త ెలుగు తీయదనం తెలుసుకున్నాం......మాకు కూడా రిప్లైయ్ ఇచ్చి ప్రోత్సహించండి:-)
ReplyDeleteఅలా బొమ్మను చూసి బుట్టలో పడే అంత అమాయకురాలు కాదు అర్పిత.....అందమైనా అభిమానికి ఆహా అనే అద్భుతమైన రిప్లై ఎలా ఇవ్వాలా అని ఆలోచన అంతే :-)
Deleteఆలస్యంగా కమెంట్ పెట్టానని లిస్ట్ లో నా పేరు తీసేసి ఆబ్సెంట్ వేయకండి :-)
ReplyDeleteకమెంట్ల పై అభిమానపు కట్టడాలు నిర్మిస్తే అవి ఎంతో కాలం నిలువవని నమ్మేదాన్ని....ఎలా మరచిపోతాను :-)
Delete
ReplyDeleteKhoob surat Tasveer ...Khoob surat Tahreer ..Aur kya kahoon is ke siva ....
aap ka mann se kiyaa yeh taareef bhi khoob surat.
Delete