ఈ కలలుకనే కళ్ళని ప్రేమించే వారే
కైపెక్కించే కళ్ళని కవితలు అల్లేవారే
కనపడని కన్నీటిని తుడిచేవారే లేరే!
ఈ పెదవి పలికే ముత్యాలు ఏరేవారే
ఈ పెదవి వంపు మెరుపు చూసేవారే
తడారనీయకంటూ పెదవి తాకబోతారే
పంటితో పెదవి అదిమిన భాధని కనరే!
ఈ నల్లనికురుల నిగారింపు గాంచెదరే
ఈ పట్టుగిరజాలకై గింగిర్లు తిరుగుతారే
సవరించబోతూ సన్నగాగిల్లి సైగచేస్తారే
కారుమబ్బు కురుల కసిని కోరికంటారే!
మనసులోని భావాన్ని చదవగలిగే వాళ్ళుంటే అసలు బాధలెందుకు వస్తాయి పద్మగారు .బాగుంది భావ వ్యక్తీకరణ,చిత్రం.
ReplyDeleteమనోభావాలని చదివేవారు లేరనే భాధండి.....మీ స్పందనకు నెనర్లండి.
DeleteSmall one but Its enough to express lots of feelings. Thanks for a Good Poem. Keep rocking Madam.
ReplyDeleteThis is unbelievable that blog is having this much fans following.
Deletesome times small words express much emotions...thanks for comment.
Deletenatana jeevitam.....its my luck and pride.
Deleteఇలా మ(ప)గవారి మనసును ఎక్స్ రే తీసి కవిత చేస్తే ఏమని కామెంటగలం..:-)
ReplyDeletebeautiful pic..<3
బాగుంది పద్మార్పిత గారు..
మగవారిని పగవారన్నానని నిందవేయడం అన్యాయం. :-) thank you
Deleteఈ కసి అంతా మాబోటి వారిపైనేనా......అంటే? గుమ్మడికాయల దొంగంటే భుజాలెందుకు తడుముకోవడం అంటావు కదా పద్మా :-) అయినా తప్పదు అడిగేసాను. ఏమాటకామాటే సన్నగా చురకవేసినా ఆ కళ్ళలో కసి, కవితలో పస నచ్చింది.
ReplyDeleteఅన్నీ మీరే అనేసుకుని నేను అంటాను అండం ఎందుకు మహీ...:-) మెచ్చినందుకు ధన్యవాదాలు.
Deleteసూపరో సూపరు
ReplyDeleteధన్యవాదాలు.
Deletewah wah nazar na lag jaaye aap ke tarweer ko aur aap ko
ReplyDeletetasweer ko nazar lagetho parvaa nahee magar aap meri likhaavat ko nazar andaaz math keejiye :-)
Deleteతక్కువ గ్యాప్ లోనే చాలా మంచి భావన. నిజానికి అది అందం కాదు.. అద్దం. అది ఎలాంటి అద్దమంటే... మగాళ్లు
ReplyDeleteఆ అందం ముందు నిల్చుంటే... వారి మనస్తత్వాలను వారికే చూపించే అద్దం. మీరు చెప్పింది దాదాపుగా అదే. అందమైన కళ్ల వెనుక చెమ్మ ఉంటుందని, మధురమైన అధారాలు ఎంతో బాధను కూడా దాచుకుంటాయని, వేదనతో నిండి దిగాలుని నల్లని కురు దాస్తాయని... ఇవన్నీ గ్రహించి మసులుకోవాలంటే... కాస్త మనసుని
తట్టి లేపాలి. పద్మగారు... beauty lies in the eyes of the beholder... ప్లేటో ఈ మాటంటాడు. చూసే కళ్లను
బట్టి అందం, అంతరార్ధం ఉంటాయని. దానికి మీ భావన అచ్చంగా సరిపోతుంది. థ్యాంక్యూ ఫర్ బ్యూటిఫుల్ ఫీల్ విత్ రెస్పాన్సిబిలిటీ...
నా భావాలకి మరో భాష్యం చెప్తారు మీరు సతీష్ గారు. ధన్యవాదాలండి.
Deleteకసెక్కిస్తారని వస్తే ఇలా కసిరేస్తే ఎలా? (జస్ట్ కిడ్డింగ్)... :-)
ReplyDeleteకసిరేసాను అన్నారు...ఇంకా నయం కత్తి దూసాను అనలేదు...సంతోషం :-)
Deleteనల్లని చీకటి నుండి తెలవారే పోద్దుల్లా
ReplyDeleteఆల్చిప్పలాంటి కన్నులు చూసి చూడగానే వాలిపోతాయి
తామరాకు రంగును పులుముకొని
నిగారింపుల పెదవి మాటరాక మూగాబోతాయి
గాలితోపాటు గింగిర్లు పోయే నల్లని సిరోజాలు
మీ కవితను చదువుతూ ఉంటె గాల్లో అలా అలా తేలిపోతాయి
బహుచక్కని వర్ణన పద్మ గారు 'కసి' అన్నారు
'క'న్నులతో మొదలుపెట్టి 'సి'గ వరకని చెప్పడానికి కామోసు ఆ శీర్షిక
ఏదేమైనా చాల విపులంగా వివరించారు భేష్ వహ్వా
'క'న్నులతో మొదలుపెట్టి 'సి'గ వరకని చెప్పడానికి కామోసు ఆ శీర్షిక.....మీరు చెప్పించి నచ్చింది, కొత్తపంధాలో...థ్యాంక్యూ.
Deleteగీసుకున్న 'బొమ్మ'కు .......
ReplyDeleteరాసుకున్న 'కవిత' .........
కసి కసిగా పోటీ పడుతున్నా రెండూ బాగున్నాయ్ !
కళ్ళు ' ముంచిన' సైగ సరదాలు ,
పెదవి 'పంచిన' ముత్యాల సరాలూ .......
కసిని రంగరించి , రసికత్వాన్ని సున్నిత పదాలతో పలుకుతూనే , బరువయిన భావాలను అంతే గంభీరంగా మా ముందించి,
మును ముందుగా పొందిన తీయని అనుభూతుల్ని
మెల్లగా సాగనంపి , తర్వాత పదాలన్నింటినీ మసక కళ్ళ తోనే చదివేలా చేసారు మమ్మల్ని .
వాఖ్యాలు పన్నెండే అయినా . వ్యాఖ్యానించడానికి, అభినందించడానికీ
ఎంతో ఉంది ..... అర్ధవంతమైన మీ 'కసి' కవితలో .
పద్మార్పితా గారూ ... అందుకోండి నా అభినందనల మాల.
- శ్రీపాద
శ్రీపాదగారు....కష్టపడి కవితరాసి మురిపిద్దాం అనుకుంటాను...మీరు సులువుగా కమ్మటి కమెంట్ తో మనసు దోస్తారు.
Deleteసరదా కబుర్లు, కలల ప్రేమలు, కైపు కవితలు కన్నీళ్ళను చూడవు. తుడవవు.
ReplyDeleteముత్యాల పలుకులు, పెదవి మెరుపులు, తడి స్పర్శలు పంటి ఒత్తిడి బాధను గమనించలేవు.
ఆలోచనలను రేకెత్తించే చక్కని భావనల నిట్టూర్పులు.
అభినందనలు పద్మార్పిత గారు.
భావనిట్టూర్పులకి ప్రశంసాస్పందనలు అందించిన మీకు వందనములు
Deleteఆ కమలనయని కంటిచూపు చాలదా కసి తీర్చుకోవాలంటే, కలువరేకు పెదవి విప్పి పరుషంగా పలుకాలా, కురులువిప్పి పరచాలా మోము మసికావడానికి?:)
ReplyDeleteహరినాధ్ గారిలోని భావప్రకంపనలు ప్రశ్నిస్తున్నాయి నాలాగే....బాగు బాగు.
DeleteNice one...but not everyone....
ReplyDeleteప్రతీ హృదయం కోరుకునే దాన్ని హృద్యంగా చెప్పారు
Yes you are right.....ధన్యవాదాలండి.
Deleteకవ్వించడం మీ వంతే....కసి ఎక్కించడం మీ వంతేనా పద్మార్పితగారు :-) ఇక్కడ విచిత్రం ఏమిటంటే మీరు అన్నది అభిమానులనే కదా అందుకే కసిరినా అభిమానం కవర్ చేస్తుందేమో దాన్ని :-) ఏవంటారు?
ReplyDeleteకవ్వించాను అంటే ఏదో సర్దుకుపోతాను కానీ మరీ కసి ఎక్కించాను అనడం ఏంటో అర్థం కాలేదు :-) అందునా ప్రేమ ఊసులు చెప్పే తెలుగమ్మాయి ఇలా అనడం :-(
DeleteIn Aankhon Ki Masti Ke Mastaane Hazaaron Hain
ReplyDeleteIn Aankhon Se Vaabastaa Afasaane Hazaaron Hain
Ik Tum Hii Nahin Tanhaa, Ulafat Mein Meri Rusavaa
Is Shahar Mein Tum Jaise Deevaane Hazaaron Hain
Padmaji aap ne in lafzon ko yaad dilaaya-@ Nalottam
nalottam saab bahoot badiya gazal yaad dilaaya
DeleteNalottamjee...jo baath maine kehana chaahaa aap gazal andaaz mein farmaa kar dil ko chooliyaa...sukriyaa
Deleteబొమ్మ బావుంది.
ReplyDeleteపై మెరుగులకే భ్రమసేరు..
.లోని వ్యధను కనలేరు.
ధన్యవాదాలండి....భలే చెప్పారు.
Deleteఅర్పితా ఇలా కవ్వించి కైపెక్కించే చూపుకి పడకపోతే మగవాడి కంటికేదో లోపమనేది కూడా మనమేనేమో! కాస్త డిఫరెంట్ గా థింక్ థింక్ :-)
ReplyDelete: -)
Deleteచూసే చూపునిబట్టి ముఖం పై భావాలని చూడగలమేకానీ మనసులోని మర్మాన్ని కాంచలెము ఆకాంక్ష....అయినా అందరివీ నీ అంత అందమైన కళ్ళుకావుగా :-)
Deleteఅందరూ ఒకేలా ఉండరు పద్మార్పితగారు. కళ్ళలోని కసిని, పెదవిమాటున దాగిన వ్యధని, కురులలోని కారుచీకటిని చూసి ఓదార్చేవారు కూడా ఉంటారు. అయినా మీకు తెలియనిదా ఇది చెప్పండి.
ReplyDelete: -)
Deletes
Deleteనిజమే యోహంత్ అందరూ ఒకేలా ఉంటే మనిషికీ గొడ్డుకీ తేడా ఏముంటుంది చెప్పండి :-)
Deleteఅక్కా మరీ అంతలా సూపులిసిరి రింగుల జుత్తుతో కసెక్కించి కవ్వెక్కిస్తే బావ వూరుకుంటాడా? నన్నొగ్గేసి లగెత్తుకొచ్చేడా? (హు (హు (హు
ReplyDeleteఓలమ్మో....అలా తుమ్మితే ఊడిపోయే ముక్కుని వేళాడ్డం ఎందుకు? అయినా లగ్గెత్తుకొస్తే నేనొగ్గేయనుగా :-) ఏడవమాకు
Deleteమగవారలు ' పగవార ' ని
ReplyDeleteమగువలు దరిచేర రార ? మగువల దరికిన్
' పగవార ' ని మగలు రార ?
తగవేల ? ' మగలు , మగువలు ' తప్పదు దరియన్
----- సుజన-సృజన
మగవారియందు పగవారును
Deleteమగువల అందు వగలును....
లేనిచో తగవులేల పుట్టున్ :-)
బహుకాల దర్శనం, వందనం_/\_
కళ్ళతోనే అన్ని భావాలు...
ReplyDeleteఇంత అందమైన చిత్రాలు...
ఎక్కడనుంచి...
మనసులోని భావాలు...
Deleteకుంచె నుండి చిత్రాలు...
మీకు ధన్యవాదాలు_/\_
ఈ కళ్ళ సరదా కబుర్లన్నీ వినేవారే..?
ReplyDeleteకళ్ళలో కాంతులను చూడాటానికే టైం చాళడంలేదు
ఈ కలలుకనే కళ్ళని ప్రేమించే వారే..?
కళ్ళలు చూడన కల్ల వెనుక ఉన్న కలను తాకనా
కైపెక్కించే కళ్ళని కవితలు అల్లేవారే..?
ఆ కైపులో కరిగిపోతుంటే అక్షారాలేం రాయను
కనపడని కన్నీటిని తుడిచేవారే లేరే!...?
ఆ కన్నీరు నాదై నప్పుడు తుడవడానికి ఏముంటుంది లే.
ఈ పెదవి పలికే ముత్యాలు ఏరేవారే....?
ఆ పెదవుల్ మాటున దాగిన మౌనంలో ఉన్నా ...
ఈ పెదవి వంపు మెరుపు చూసేవారే...?
అ వంపుసొంపుల్లో వదిగిపోయి ఇరుక్కపోయా
తడారనీయకంటూ పెదవి తాకబోతారే...?
తడారని పెదాల మెరుపుల్లొ కళ్ళూ కనిపించలేదు
పంటితో పెదవి అదిమిన భాధని కనరే!..?
కన్నాను కనుకనే కనిపించకుంద పోయా ..?
Note:- మళ్ళి నీ కవితను పిప్పి చేసి అర్దం చెడగొట్టానేమో క్షమించమని మనవి తప్పని తెలినా ...మనసుండబట్టలేక ఏదో వింత ప్రయత్నం చేశా పద్మా గారు
మీ మనోవేదన మీ భావాల్లో ప్రస్ఫుటమౌతుంటే...ఏం వ్యాఖ్యలిడను.
Deleteఅధ్యక్షా, నేను ఈ బ్లాగులోే 300 వ పోస్టులో వ్రాసిన కామెంటుకి ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని మనవి చేసుుంటున్నాను.
ReplyDeleteComment on 300th post by....
DeletePantula gopala krishna rao19 September, 2013
మీ అంతరంగం అంతు తెలియని భావాల తరగని గని.మూడు వందలేం అంతకు పది రెట్లయినా కవితలు వ్రాయగలరు మీరు.మీ కవితలు స్త్రీల హృదయాల్లాగా అథివాస్తవిక చిత్రాల్లాగా అర్థమయీ అవనట్లున్నామనోరంజకంగా ఉంటాయి.అన్నీతప్పక చదువుతుంటాను.మనఃపూర్వక అభినందనలు.
Reply by Padmarpita19 September, 2013
స్త్రీ హృదయాన్ని పసిగట్టేసారుగా.....మీ ఆస్వాధించే హృదయానికి, అభిమానానికి నఃమోవందనములు.
ఆర్యా, మీ స్థిర అభిమానానికి మరో మారు ప్రణామములు _/\_
Wonderful words with beautiful pic. Marvelous:-)
ReplyDeletethank you my friend.
Deleteఅందంగా ఉన్నవాటిని ఆస్వాధించగలం కానీ సొంతం అనుకుని చేరదీయమంటే....దూరం దూరం! చిత్రం అదిరిందండోయ్
ReplyDeleteమనవి సొంతం కాని వాటిపై మనకి మోజు ఎందుకు అనికేత్ :-) థ్యాంక్యూ
Deletewe all are with you, no need to worry
ReplyDeletethis hope strengthener me a lot. thank you
Deleteకసిగా కవ్విస్తుంటే చిత్రం కవితలో మీరు ఎంత వద్దని వారించినా వింటుందా వెర్రిమనసు చెప్పండి:-)
ReplyDeleteవెర్రి మనసుకి కళ్ళెం వేయడంలోనే ఉంది కదండి విజ్ఞుల వివేకం :-)
Deleteమొత్తానికి ఆడవారి మాటలకు అర్థాలే వేరని అనుకునేలా అనిపించింది కవిత చదివి చిత్రంలోని చిన్నదాన్ని చూస్తే.
ReplyDeleteఅవునంటే కాదనిలే అని చెప్పి ఆడవారు వద్దన పని చేస్తే అనవసరంగా అభాసుపాలు అవుతారు కదండీ :-)
Deleteప్రతి కంటి భాషనూ చదవగలిగే మనసుంటుంది,
ReplyDeleteకానీ ఆమనస్సునే వెతకాలీ కన్ను.
మంచి కవిత స్వచ్చంగా ఉంది డియర్.
మీరు మనసువిప్పి చెప్పిన భావం మల్లెకన్నా తెల్లగా ఉందండి...ధన్యవాదాలు.
DeleteOutstanding poetry as usual. keep it up my dear padma.
ReplyDeletethanks for following my blog regularly and for encouraging me.
DeleteMarvelous painting with simple words
ReplyDeletewelcome to my blog. thank you
Deleteఅక్షరసత్యాలు అందంగా చెప్పారు.
ReplyDeleteమీ అభిమానం అహ్లాదాన్ని అందించిందండి. Thank you _/\_
Deleteవండర్ ఫుల్ లుక్స్ అని అంటే కోపం వస్తుంది అయినా అలా అనక తప్పడంలేదు....ఆ చూపుల పవర్ అలాంటిది.:-)
ReplyDeleteఆ లుక్స్ పై లుక్ ఇచ్చుకోండి అంతే కానీ ఆ లుక్స్ లో పడి కొట్టుకుపోకండి.:-)
Delete