ఒకే ఒక్కసారి....


ఒకోసారి నీవు నాలో ఐక్యమైనట్లనిపిస్తావు
అంతలోనే....అల్లంత దూరాన అగుపిస్తావు
ఎందుకిలా? అని నన్ను నే ప్రశ్నించుకుంటే
నీడనని.....వెలుగులోనే అగుపిస్తానంటావు!

మరోసారి నీవు మారువేషంలో మరిపిస్తావు
క్షణాల్లో....కంటికెదురుగా కనుమరుగౌతావు
ఏమైందని? మేలుకుని తరచి చూసుకుంటే
కలనని.....కనులు తెరిస్తే మాయమంటావు!

ఇంకోసారి నీవు నాపై నన్నే ఉసిగొల్పుతావు
అందులో....అగుపడని అనురాగమందించేవు
ఏమిటిదని? విసురుగా కసిరి పొమ్మని అంటే
మనసని.....మాటవినదు వేదనపడమంటావు!

ఒక్కసారి నా అనుమతి అడగకనే కౌగిలిస్తావు
నాలో....నా అనుకున్న బంధాలన్నీ తెంచేస్తావు
ఎవరని? నే అడిగేలోపే పాశమేసి జవాబిస్తావు
ప్రాణమని.....ఉన్నంతవరకే ప్రాకులాటలంటావు!

34 comments:

  1. చివరి పంక్తిలో జీవితసారం మొత్తం చెప్పారు. ఈసారి చిత్రం విభిన్నంగా ఉన్నా ఎప్పటిలాగానే ఆప్ట్ గా ఉందండి. అభినందనలు

    ReplyDelete

  2. ఇంకోసారి నీవు నాపై నన్నే ఉసిగొల్పుతావు
    అందులో....అగుపడని అనురాగమందించేవు....

    ఎంతో నచ్చేసింది...'నిజాన్ని 'ఆవిష్కరించారు

    ReplyDelete
  3. ఒక్కసారి నా అనుమతి అడగకనే కౌగిలిస్తావు
    నాలో....నా అనుకున్న బంధాలన్నీ తెంచేస్తావు <3 <3
    మీ కవితా హృదయానికి పుష్పాంజలి ఘటిస్తూ.. _/\_

    ReplyDelete
  4. యే తస్వీర్ నహి .. ఏక్ హఖీఖత్ హై
    వో రోష్ని తుమ్హే క్యా మంజిల్ బతాయేగి
    తుమ్ అంఖ్ తో ఖోలో ... అంధేరౌ మే భీ
    తుమ్ అప్నౌ కో పహెచాన్ సకోగీ ...... బ్యూటీఫుల్ పిక్. ....పోయెట్రీ అల్ సో ....

    ReplyDelete
  5. చెలీ.(చెల్లీ)..నీ ప్రతి పదానా నన్ను పట్టుకుంటావు,
    ఇంకొసారి కావ్యంతో కవ్విస్తావు,
    మరోసారి ఉపమానాలతో ఊపేస్తావు,
    మొత్తానికి మనసంతా ఆవహిస్తావు, ఇలా కట్టిపడేస్తావు.:-))

    ReplyDelete
  6. లోకానికి వెలుగు చూపించాలనే తపన మీలో ఔనత్యానికి ఆనవాళ్ళు పద్మ గారు
    కనులకెదురుగ మనుషులున్న పట్టించుకోని వింత లొకానికి దర్పణం లా ఉంది ఆ చిత్రం
    మనలోనే మంచి చెడు, మనసు మమత, ఆప్యాయత అనురాగం అన్ని కలగలిపి ఉన్నా
    మనలోకి మనం చుసుకోలేనంతగా మారిపోయింది జీవన విధానం

    స్వార్థం పొరలు పొగరు అహం అనే మూడు అవలక్షణాలు మనిషిని మనిషిని ఎంత దగ్గరగున్న దూరం చేస్తున్నాయి
    సమాజం మారాలంటే మనిషి దృక్పధం మారాలి మనలో చైతన్యం పెరగాలి, కాగడ వెలుగుల మాటున మిణుగురులా ఆనందాన్ని బాధని సమపాళ్ళలో పంచివ్వాలి, మనొవెదనలు తగ్గుముఖం పట్టాలి

    ReplyDelete
  7. Pseudo Romantisism with adbridged repeatition ... wow madam !! greate wordings :-)

    ReplyDelete
  8. నీడని, కలని, మనసని మనతోపాటే ఉండి చివరికి మనతో రానివి....ఇంతందంగా చెప్పే మీ భావాక్షరాలకు మరోమారు అభినందనలు.

    ReplyDelete
  9. ఇలా వచ్చి అలా మాయమయ్యేవాడిని అస్సలు నమ్మకండి పద్మా గారు... :-)

    ReplyDelete
  10. మనతోనే ఉన్నామంటూ మభ్యంపెట్టి మనిషిని నిలబెట్టి మట్టిలో కలిసాక మనతోరానివి

    ReplyDelete
  11. మనసు మాటవినదు
    కలలు మనవి కావు
    నీడ మన తోడురాదు
    మనకి మిగిలేది చావు

    ReplyDelete
  12. మరోసారి నీవు మారువేషంలో మరిపిస్తావు
    క్షణాల్లో....కంటికెదురుగా కనుమరుగౌతావు
    ఏమైందని? మేలుకుని తరచి చూసుకుంటే
    కలనని.....కనులు తెరిస్తే మాయమంటావు!

    ఇంకోసారి నీవు నాపై నన్నే ఉసిగొల్పుతావు
    అందులో....అగుపడని అనురాగమందించేవు
    ఏమిటిదని? విసురుగా కసిరి పొమ్మని అంటే
    మనసని.....మాటవినదు వేదనపడమంటావు!....( మరిప్పుడు నన్నేం చేయమంటావు )
    మౌనాన్ని చేదించే మమతాను రాగాల అల్లికలమాల
    అద్బుతంగాఉంది...ఊరించి ఉడికించి కనుమరుగైన
    ఆమనస్సు పడేవేదన చెప్పేవిదం బాగుంది
    ఎక్కడున్నా పక్కనే ఉన్నట్టుండే ఆమనుషుల
    నీడలు మనస్సులోఅల్లుకపోయి
    జ్ఞాపకాలుగా అలరిస్తూనేఉంటాయి

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
  14. ఇంకోసారి నీవు నాపై నన్నే ఉసిగొల్పుతావు...
    మనసని.....మాటవినదు వేదనపడమంటావు!
    ప్రాణమని.....ఉన్నంతవరకే ప్రాకులాటలంటావు!

    చక్కని భావనలు...


    చాలా బాగుంది...
    అభినందనలు...

    ReplyDelete
  15. చక్కని భావాలకి చిక్కని భాష్యం చెప్పావు పద్మార్పిత.

    ReplyDelete
  16. మొత్తానికి ఎవరూ ? ఏమిటీ ? ఏమయిందీ ? ఎందుకిలా ? సమాధానాలు దొరికాయి , సంతోషం పద్మగారు .బొమ్మ , కవిత సూపర్బ్ .

    ReplyDelete
  17. life ke bare mein aap ka tajurbaa

    ReplyDelete
  18. Hey Padma super:-) pic chala bagundi, kallaku gantalu kattukoni, evaru emiti ani balega adugutundi:-)) nice poetry:-)

    ReplyDelete
  19. ఐక్యమైనట్లనిపిస్తావు , మరిపిస్తావు,ఉసిగొల్పుతావు,
    అడగకనే కౌగిలిస్తావు,బంధాలన్నీ తెంచేస్తావు
    ప్రేమ బంధం చేసేదంతేగా.మనసుకు హత్తుకుపోయింది.ఈ రాత్రంతా సరిపోదేమో మీరు రాసినవి చదువుతూనే ఉన్నా.

    ReplyDelete
  20. ఆస్వాదించడమే తప్ప ఏమీ కమెంట్ రాయలేని అల్పురాలి :-(

    ReplyDelete
  21. శభాష్......సూపర్ గా చెప్పావు

    ReplyDelete
  22. అంతే తప్పదు బ్రతికున్నంతవరకు ప్రాకులాడ్డం, పిక్ చాలాబాగుంది.

    ReplyDelete

  23. మొదట మనసు కాస్తా కలవర పడ్డా ,
    నిట్టూర్పులను దరికి చేరనీయకుండా ఆశల కిరణాలను అందించారు . మధుర మైన కవిత మమతల రాగాలను పంచింది .
    "ఒక్కసారి నా అనుమతి అడగకనే కౌగిలిస్తావు
    నాలో....నా అనుకున్న బంధాలన్నీ తెంచేస్తావు
    ఎవరని? నే అడిగేలోపే పాశమేసి జవాబిస్తావు
    ప్రాణమని.....ఉన్నంతవరకే ప్రాకులాటలంటావు!"

    జీవన సారంశాన్ని ఒక్క మాటలో అందరి ముందుంచిన మీ ఆలోచనా విధానాన్ని ప్రశంశించకుండా ఉండలేక పోతున్నాను .
    అభినందలు మీకు పద్మార్పిత గారూ !
    - శ్రీపాద

    ReplyDelete
  24. ఆలస్యంగా చూసి మిస్సయ్యాను...ఇలా ఎలా రాస్తారో ఏంటో అర్థం కాదు. మీ చేతివేళ్ళు సృజనాత్మక సృష్టికర్తలు.

    ReplyDelete
  25. అర్థంకావు అల్లరిపిల్లవో లేక ఆరిందావో, ఒకోసారి అమాయకంగా అనిపిస్తావు మరోసారి మొత్తం జీవితాన్ని నాలుగు ముక్కల్లో చెప్పేస్తావు.

    ReplyDelete
  26. excellent mam

    ReplyDelete
  27. అర్పితా అంతా క్షేమమా?

    ReplyDelete
  28. madamji kya bath hai? waiting for replies

    ReplyDelete
  29. మీ కొత్తకవిత కొరకు ఎదురుచూస్తున్నాం

    ReplyDelete
  30. మొదట నేను ఈ కవితను చదివినపుడు నాకు వేరే విధంగా కన్వే అయింది. మళ్లీ మళ్లీ చూసినపుడు అసలు అర్ధం తెలిసింది. నేను పెట్టిన మొదటి కామెంట్ బాగోలేదు. అది ఈ కవితకి కన్వే కాదు. అందుకే డిలీట్ చేశాను. పద్మగారు నిజంగా చెప్పాలంటే కనిపించక...మన కట్టె కాలే వరకు మనతోనే ఉండే నాలుగు అంశాల స్వభావాలను అద్భుతంగా వర్ణించారు. నీడ, కల, మనసు, ప్రాణం... ఇవి లేకుండా మనిషే లేడు. ఎంత భావవ్యక్తికరణ మీది. చాలా బాగుంది. కానీ.. ఇక్కడ దేనికీ రూపం లేదు. అన్ని కలిస్తేనే మనరూపం. వాహ్వా... శూన్యంతో కూడా సప్తపది వేయించారు.

    ReplyDelete
    Replies
    1. మీ కవితా విశ్లేషణ చాలాబాగుంది సతీష్ గారు. ధన్యవాదాలండి

      Delete
  31. స్పందించిన ప్రతి హృదయానికి వందనం. _/\_

    ReplyDelete