ఏదో అనుకుంటే...

మాటకి మాట తోడనుకుని
మౌనంవీడి పలకరించబోయి
మనసుని మరీ గాయపరిచా...

కళ్ళలో కళ్ళుపెట్టి చూసుకుని
ఎద ఊసులు ఏవో చదవబోయి
తడబాటులో అక్షరార్థం మరిచా...

తనువుల ఎడబాటు మిధ్యనుకుని
ప్రేమ మేఘసందేశాలు పంపబోయి
ఉలికిపాటు ఉరుమువానలో తడిచా...

వేదనా రుసుము కోరి తీసుకుని
ఆనందాన్ని అత్యాశతో అమ్మబోయి
నష్టమని కన్నీరు వరదయ్యేలా ఏడిచా...

ఇదిచాలదని తలచినదే తలుచుకుని
భావలఝరిలో ఎదభాధ తీర్చుకోబోయి
నవ్వులపాలై జీవన రూపురేఖలే మార్చా!!

60 comments:

  1. వేదనా రుసుము కోరి తీసుకుని
    ఆనందాన్ని అత్యాశతో అమ్మబోయి
    నష్టమని కన్నీరు వరదయ్యేలా ఏడిచా......

    మనసంతా బాధతో నిండింది చదవగానే.
    Excellent expression!

    ReplyDelete
    Replies
    1. చదివి స్పందించిన మీ సున్నిత హృదయాన్ని సత్వరం నవ్వమని కోరుతున్నాను అనూ :-)

      Delete
  2. ఊసులు ఏవో చదవబోయి తడబాటులో అక్షరార్థం మరిచా...!
    ఉలికిపాటు ఉరుమువానలో తడిచా....
    కన్నీరు వరదయ్యేలా ఏడిచా...

    చక్కని చిక్కని భావావేశం!
    అభినందనలు పద్మార్పిత! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందన స్ఫూర్తిదాయకం.....సదా కోరుకుంటాను._/\_

      Delete
  3. బావుంది, ప్రక్రియ మార్చి ’హైకూ’ల కొచ్చారా!

    ReplyDelete
    Replies
    1. ఏదోలెండి.....మీలాంటివారిని మెప్పు పొందడం కోసం :-) నెనర్లండి _/\_

      Delete
  4. హృదయ భాషను అనువదించే ఉపకరణమేదో మీ సొంతం అర్పితా..
    అభినందనలతో...
    మౌనంగా..

    ReplyDelete
    Replies
    1. అమ్మో....హృదయభాషను అనువదించే ఉపకరణమా? ఇంకా ఫృదయాన్ని అర్థం చేసుకోవడంలో పట్టభద్ధురాలినే కాలేదుగా వర్మగారు :-)

      Delete
  5. వేదన అంతా ఉమ్మడిగా దాడిచేసి నీ భావావావేశాల ముందు తలక్రిందైనట్లున్నాయి కవితలో.

    ReplyDelete
    Replies
    1. తలచినదే జరిగితే జీవితం కాదుకదండి....తలక్రిందులైతేనేం నేను అలా శీర్షాశనంవేసి చూస్తే పోలా :-)

      Delete
  6. painful expressions and feelings but hope in real life you are happy. nice picture. keep writing mam.

    ReplyDelete
  7. మనసు చెప్పిన కథ ఇది. ఆ మనసులో దాగిన వ్యధో, వేదనో ఇది. కన్నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిన
    అనునాయపు అక్షరాలా ఇవి. లేదా... మేఘ సందేశం పంపిన భావావేశ వర్షంలో చినుకులా జారిన ఆవేదనా ఇది. మొత్తానికి ఇది మీ కలం నుంచో కుంచె నుంచో జాలువారిన కుసుమం కాదు... మనసు తెరలు దాటుకుని
    వచ్చిన అక్షరఝరి ఇది. నేనే మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కవితలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.

    ReplyDelete
    Replies
    1. Padmarpita itself is unique personality.

      Delete
    2. సతీష్ గారు......నేను రాసినవాటిని మీరు భూతద్దంలో చూసి మరీ వివరిస్తున్నారేమో :-) జవాబులివ్వడం కష్టమే ఇలాగైతే:-)

      Delete
    3. Mahee....its enough :-)

      Delete
  8. Maanasika Dhorani Indulo Prasfutanga Kanipistundi.
    Yedabaatulo kalige vyadha, Baadhanu kooda Chakkaga Varnanichharu
    Bhesh Anaalo Bhesh kanna merugaina inkemaina padam vaadaalo tatapataayistunnanu

    ReplyDelete
    Replies
    1. Sridhar garu.....meeru padaalani vetukkovadam kadu vichitramgaa anipistundi. :-) abhimaanamgaa oka navvu navvandi. thank you

      Delete
  9. వేదన కుడా ఇంత వయ్యారాలుబోతూ చెప్పాలా? కలువభామకు ఈ కలతలేమిటో....
    మార్పు అనివార్యం. కవిత అద్వితీయం.

    ReplyDelete
    Replies
    1. వేదన కన్నీటితో తడిచి వణుకుతుంటే వయ్యారాలుబోతుంది అనడం ఏంటండి వినోద్ గారు....:-) కలువభామకు కలతలు లేవుకాని కళాపోషణ ఉందండోయ్....అందుకేనేమో ఈ వయ్యారాలు వగలు :-) _/\_

      Delete
  10. మీ అందమైన కవితాసుమాలకు నమసుమంజలి:-) కవిత అందంగా ఉంది, అధ్బుతంగా ఉంది:-) పిక్ సూపర్:-)

    ReplyDelete
    Replies
    1. శృతి థ్యాంక్యూ.....అయినా ప్రేమపరిమళం అందించు, నమస్సుమాంజలి అని దూరం చేయకు :-)

      Delete
  11. మనోవేదనని కుడా మురిపిస్తూ చెప్పడం మీ అక్షర పర్యాయపదాలకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదండి పద్మార్పితగారు.

    ReplyDelete
    Replies
    1. ఏ భావమైనా అక్షరాలకి అన్నీ సమానమేనేమో అందుకే అవి అవసరాన్ని బట్టి మనకి అక్కరకి వస్తాయనుకుంటాను. అక్షరాలన్నిటికీ నా వందనం_/\_

      Delete
  12. వేదనా రుసుము కోరి తీసుకుని
    ఆనందాన్ని అత్యాశతో అమ్మబోయి
    నష్టమని కన్నీరు వరదయ్యేలా ఏడిచా...సూపర్ అండీ, ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండి మీకు?

    ReplyDelete
    Replies
    1. s correct andi nijanga inni alochanalu ela vastayoo..

      Delete
    2. ఇప్పుడు ఏదైనా వ్యాపారమే కదా, భావాలతో వ్యాపారం అనే ఆలోచన వచ్చిన వెంటనే అలా రాసాను.....ఇదే ఈ పోస్ట్ కి మొదట రాసిన లైన్ స్ఫూర్తి కూడా...థ్యాంక్యూ

      Delete
    3. శృతి...thank you

      Delete
  13. మనోవేదన సహించే అంచులు దాటి, అనుకున్నవి అన్నిఈ తలక్రిందులైతే వచ్చే భావావేశం...బాగుంది పద్మార్పిత, దేన్నైనా అధికమించడంలోనే ఉంది నైపుణ్యం.

    ReplyDelete
    Replies
    1. మీరన్నది నిజం.....అన్నీ సజావుగా సాగితే యేముంటుంది గొప్పదనం, ఎన్నో ఉలిపోట్లకు తట్టుకునేగా శిల అవుతుంది శిల్పం.

      Delete
  14. ఉలికిపాటులు,తడబాటులు వల్ల వచ్చే నష్టం ఎంతో కష్టం పద్మగారు.
    వివరణ తీరు ,పిక్ చాలా బాగున్నాయి.

    ReplyDelete
    Replies
    1. నష్ట కష్టాలని అధికమించడంలో చాకచక్యం చూపించి సత్ఫలితం పొందే ప్రయత్నం :-) థ్యాంక్యూ _/\_

      Delete
  15. హృదయవేదన వర్ణనాతీరు ప్రశంసనీయం అర్పిత

    ReplyDelete
  16. చిత్ర భావప్రకటనలు అమోఘం.....ప్రతీసారి ఒక కొత్త ప్రక్రియతో మనసుని ఉల్లాస పరచడమే కాకుండా చదివిందే పదే పదే చదివించే పద్మార్పిత పదజాలాన్ని పొగడ్డం అనితరసాధ్యం.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్సండి _/\_.....అనితరసాధ్యాన్ని సాధ్యం చేస్తూ కమెంట్ స్మైలీని ఆశ్రయించండి :-)

      Delete
  17. ఎప్పుడూ ఏం కమెంట్ పెడతాంలే అనుకున్నంలో మదినితాకే మరో కవిత రాసి ఆకట్టుకుంటారు.

    ReplyDelete
    Replies
    1. లిపి....మరీ అన్యాయం చేసి వెళ్ళిపోతున్నట్లుగా కమెంట్ ఏం పెడతాంలే అనుకుంటే ఎలా? అంత శీతలకన్నా నాపై :-)

      Delete
  18. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందని అడ్జస్ట్ అవ్వడమా మానడమా అనేది కూడా విశదీకరిస్తే మాలాంటివారి మనసుకు కాస్త ఊరట కలిగేది పద్మగారు. ఏదైనా మీరు చెబితే ప్రేరణ :-) కవిత చిత్రం రెండు మనసులో నిలిచిపోతాయి.

    ReplyDelete
    Replies
    1. ఏదైనా సాధించాలి పట్టుదలతో అని నమ్మేదాన్ని...అడ్జస్ట్ అవ్వమని చెప్పను, అలాగని అన్నీ మనం అనుకున్నట్లు జరుతాయి అనుకోవడం కూడా సమంజసంకాదుగా :-)

      Delete
  19. హమ్మయ్య...ఎదురు చూసినందుకు వేదనే అయినా మనసున ముద్రపడేలా రాశారు. అందుకేనేమో మీ కవితలకి ఇంత క్రేజీ, ఆలస్యమైతే ఆగడంలేదు.

    ReplyDelete
    Replies
    1. ఆకాంక్ష.....అంతలా ఎదురుచూసి కనులు కాయలే కాచాయి అంటే నేను భాధ్యురాలిని కాను :-) అంతా అభిమానం అంటే మంచులా కరిగిపోతాను.

      Delete
  20. ఏమోనండి పద్మార్పితగారు మీరు సునాయసంగా చెప్పేస్తారు దేన్నైనా...కమెంట్ ఏం వ్రాయాలా అని బుర్ర చించుకుంటున్నా :-)

    ReplyDelete
    Replies
    1. ఏంటో ఇలా ఎందుకన్నారో అని బుర్ర చించుకుంటున్నా అర్థం కావడంలేదు ;-)

      Delete
  21. Medamji aapnetho kamaal kardiyaa.....Mogambo khush huaw :)

    ReplyDelete
    Replies
    1. kamaal ki kavitaa tho nahee likhpaa rahee hoon :-)

      Delete
  22. Wah !! well constructed sarrow poetric dam.

    ReplyDelete
    Replies
    1. All due to you people love and affection....I am not a poetic engineer (poetess) who can easily construct a words dam into beautiful poem.

      Delete
  23. Poignant and touching Padmarpitha garu :)

    ReplyDelete
    Replies
    1. Sri Valli...after a long time. Thank you

      Delete
  24. " వేదనా రుసుము కోరి తీసుకుని
    ఆనందాన్ని అత్యాశతో అమ్మబోయి
    నష్టమని కన్నీరు వరదయ్యేలా ఏడిచా..."

    వేదనా భరిత మైన మీ ఈ 'ఏదో అనుకుంటే ' కవిత - నమ్మండి ... గుండెని చాలా బరువుగా మార్చింది. ప్రతి మనిషి జేవిత పుటల్ని ఓ మారు తిరగేస్తే ... తన జీవితంలో కూడా ఎక్కడో అక్కడ కొంతైనా ఇలాటి బరువైన అనుభూతిని చవి చూసి ఉంటాడని నా నమ్మకం . బరువనిపించినా ... కవిత చాలా బావుంది పద్మార్పిత గారు - శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. గుండె బరువెక్కేంత వేదనంటారా? కాదులెండి.....మీ హృదయ స్పందనల సవ్వడేమో. మీ ప్రశంస నాకు స్పూర్తిదాయకం. థ్యాంకూ _/\_

      Delete
  25. Madamji waiting for replies

    ReplyDelete
    Replies
    1. Mahee.....at last i am ending with this reply. :-)

      Delete
  26. Super padmarpita gaaru..:-):-)

    ReplyDelete
  27. naa life antaa saripotundi ivi chadivi artham chesukovadaniki

    ReplyDelete
    Replies
    1. artha kashtamaina artham kani words nenu raayaledu. :-) njoy my writings with smile and pleasure.

      Delete
  28. చాలాబాగారాస్తారు మీరు అని నేను రాస్తూపోవాలి చదివిన ప్రతీకవిత.

    ReplyDelete