ఎందుకంటే! నా నరాల్లో ప్రేమన్నదేలేదు
ప్రేమను ఆలింగనం చేసుకున్న ప్రతిసారీ
అసంపూర్తిగా అంతరంగాన్నది కదిలించె!
నాకు ప్రేమపైన సరైన అవగాహనే రాలేదు
ఎందుకంటే! ప్రేమకి నిర్వచనమే తెలియదు
స్త్రీ పురుషుల ఆకర్షణయే ప్రేమన్న ప్రతిసారీ
కన్నప్రేగులెన్నో కళ్ళముందు కలుక్కుమనె!
నాకు ప్రేమ ఎక్కడా స్పష్టంగా కాన రాలేదు
ఎందుకంటే! ప్రేమపై స్వార్థకుబుసం ఊడలేదు
ప్రేమ ఒక మధురభావం అనుకున్న ప్రతిసారీ
తడి ఆరలేదన్న తనువుల తృష్ణ ఏదో తడిమె!
నాకు అందని ప్రేమని అంధత్వమని అనలేదు
ఎందుకంటే! ప్రేమలో కన్నీరిడని కళ్ళే చూడలేదు
ప్రేమప్రక్రియకి పరిస్థితులేవని ప్రశ్నించిన ప్రతిసారీ
తడుముకుంటూ తలాఒక తాత్పర్యం జవాబై రాలె!
నాకు ప్రేమతో సత్సంబంధం ఎన్నడూ కూడలేదు
ఎందుకంటే! అందిన ఆశగా ప్రేమ నాకచ్చిరాలేదు
అందుకేనేమో ప్రేమపై రాయాలనుకున్న ప్రతిసారీ
వేదన వరదలో పదాలు ప్రవహిస్తూ పరిహసించసాగె!
ప్రేమ గురించి పద్మార్పితకే (ప్రేమార్పిత) తెలియదు అంటే ప్రేమే ప్రేమించడం మానేసి ప్రేమను వదిలి మీ పంచన చేరుతుంది.
ReplyDeleteప్రేమ ఒక మధురభావం అనుకున్న ప్రతిసారీ
తడి ఆరలేదన్న తనువుల తృష్ణ ఏదో తడిమె!EXCELLENT
ప్రేమకి నా పై అంత ప్రేముందంటారా సంధ్యగారు :-)
Deleteప్రేమకి ఎవరైనా అర్థం ఏం చెప్పగలరు. ఎవరి అనుభవం వారు చెప్తారు. కవిత చాలా బాగుంది చిత్రం సూపరుంది.
ReplyDeleteఅంతేకదండీ....దేనికైనా ఎవరిభావం వారిదే.
Deleteప్రేమంటే తెలిసిందా?
ReplyDeleteకొందరికది సరదా ...
తొలగిందా ప్రేమ పరదా?
మిగిలిందా నిట్టూర్పుల వరద ...
అంత సులభమా చెలుసుకోవడం
Deleteప్రేమంటే అంతుతెలియని అగాధం
ప్రేమను అందరికీ పంచడం సులభం
ఒక్కరికే దక్కాలి అనుకోవడం స్వార్థం
పద్మా !
ReplyDeleteప్రేమ గురించి తెలియదంటూనే యిన్ని రకాల ప్రేమలను ప్రస్తావిస్తున్నావ్ . ఇక తెలిస్తే అమ్మో యింక ఊహించలేను సుమా !
నీకు తెలుసో తెలియదు , నీ చిత్రాలకు హొయలు ఒలకటం బగా తెలుసు కదూ ! .
తెలియని దాని గురించి అందంగానే చెప్పొచ్చు...ఊహలేకదండీ!
Deleteతెలిసింది చెబితేనే....తంటాలు.:-)
నాకు హొయలు గురించి అంతగా తెలీదు కానీ కుంచెకది చాలా బాగా తెలుసునండి :-)
మీకు ప్రేమ గురించి తెలీదు అంటే నమ్మే అంత పిచ్చోళ్ళం అయిపోయామంటారా పద్మార్పితగారు. మీ భావాలన్నీ అటుతిరిగి ఇటు తిరిగీ చెప్పేవి ప్రేమకావ్యాలేకదా!
ReplyDeleteఅదేంటండి....తెలియనిది తెలీదు అన్నాను....కొడతారా ఏంటి :-)
Deleteఅదేదో సినిమాలో మోహన్ బాబుగారి డైలాగ్....
ReplyDelete"తిరుపతిలో లడ్లూ
సినిమా యాక్టర్ దగ్గర డబ్బులూ"
పద్మార్పితకి ప్రేమ గూర్చి తెలీదంటే
అహ హా హా.....అవగాహన లేదు అనడం హాస్యాస్పదం.:-)
అవును ఇంతకీ మనలో మాట....ఇన్నాళ్ళు ప్రేమాన్వేషణ చేయడానికి వెళ్ళారు సరె....ఇలా తెలీదంటూ తెలియనివెన్నో చెప్పారు. కవిత అదిరింది.
అన్నీ తెలుసునంటే ఎక్కడలేని డౌట్లు అడుగుతారని ఇలా తప్పించుకుంటున్నా... :-)
Deleteబొమ్మను గురించి వివరిద్దాం అనుకున్నాను కాని అటువైపు తిరిగి ఉంటే ఏం చెప్పను. మొహం చూసే ఏమీ చెప్పలేను....అయినా ఆ పనేదో సతీష్ గారు చూసుకుంటారని వదిలేసానులెండి.:-)
ReplyDeleteసినిమా డైలాగ్స్ చెప్పారుగా.....ఇంకేం కావాలి చెప్పండి :-)
Deleteస్త్రీ పురుషుల ఆకర్షణయే ప్రేమన్న ప్రతిసారీ
ReplyDeleteకన్నప్రేగులెన్నో కళ్ళముందు కలుక్కుమనె!
సున్నితంగా కొరడాతో కొట్టారండి. నేటితరం ప్రేమలన్నీ స్వార్థంతో కూడుకుని ప్రేమంటే ఐ లవ్ యూ అని చెప్పి వాటేసుకునే కోణంలోనే తప్ప అనుబంధాలకి విలువను ఇవ్వడంలేదన్న వేదన. చాలా చాలా బాగుంది మీరు చెప్పిన తీరు దానికి తగిన చిత్రం .
నా భావాన్ని మీదైన కోణంలో బాగాచెప్పారు. థ్యాంక్యూ
Deleteప్రేమకి నిర్వచనం ఈరోజుల్లో చాలా సింపుల్ లవ్ యూ అని ఎంత త్వరగా చెప్పగలరో అంతే త్వరగా హేట్ యూ అని కూడా చెప్పగలరు. అదొక్కటే ప్రస్తుత ట్రెండ్. దానికి తగినట్లుగానే సినిమాలు సీరియల్స్ కూడా. తల్లిదంద్రులు పిల్లలకి స్వేచ్చని ఇస్తే వారు ప్రేమించడంలో మాత్రమే ఆ స్వేచ్చని సద్వినియోగ పరుచుకుంటున్నారు. ఇది చాలా బాధాకరం.
ReplyDeleteస్త్రీ పురుషుల ఆకర్షణయే ప్రేమన్న ప్రతిసారీ
కన్నప్రేగులెన్నో కళ్ళముందు కలుక్కుమనె!
నిజమే...అర్థం చేసుకుంటే ఈ వాఖ్యాలలో అఘాధమంత లోతైన వ్యధ భావముంది. మరచిపోయాను అనుకున్న ప్రేగుబందం పై మాటలతో కలుక్కుమంది. ఇలా మనసుని స్పర్శించగలగడం నీకే వచ్చు. నీ కవితల్లో నువ్వు నాకెప్పుడూ ఉన్నతంగా సున్నితమైన మనసున్న ప్రేమమూర్తిగానే కనిపిస్తావు అర్పిత-హరినాధ్
హరినాధ్ గారు మరిచిన ప్రేగుబంధాన్ని గుర్తుచేసి బాధపెడితే మన్నించండి. నాపై మీ అభిమానానికి ధన్యవాదాలు.
DeleteBehte ashkon ki zuban nahi hoti,
ReplyDeletelafzon mein mohabat bayaan nahi hoti.
Mile jo dosti to kadar karna,
kismat har kisi par meharban nahi hoti.
Pyaar tho pyaar hee hai Padmarpita...
pyaar toe pyaar hai magar usea baanTnea mea hii kushee hai.(ప్యార్ తో ప్యార్ హై మగర్ ఉసే బాంట్నే మే హీ కుషీ హై)
Deleteప్రేమ గురించి రాయడం రాలేదు....ఇది మీరన్న మాటలుకాదు. మాకేం తెలీదని ఇండైరెక్ట్ గా అన్నట్లుంది. కవితంతా ప్రేమగురించి చెప్పి ఏం చెప్పలేదు ఏం రాయలేదు అంటే ఎలాగండీ పద్మాజీ
ReplyDeleteఇదేం మాటల గారడి నాయనా :-)
Deleteనాకు ప్రేమ ఎక్కడా స్పష్టంగా కాన రాలేదు
ReplyDeleteఎందుకంటే! ప్రేమపై స్వార్థకుబుసం ఊడలేదు
ప్రేమ ఒక మధురభావం అనుకున్న ప్రతిసారీ
తడి ఆరలేదన్న తనువుల తృష్ణ ఏదో తడిమె!
భావతరంగాలు విరిసాయి ఈ పదాల్లో.
మీకు నచ్చాయిగా... భలే భలే.:-)
Deleteచాలా బాగుందండి కవిత. మనసంతా ప్రేమతోనిండినవారే ఇలా రాయగలరేమో. ఎటొచ్చీ ఈ వేదనను మాత్రం వదలరు కదా !!
ReplyDelete( Just fun Madam )
ఇంతకీ ప్రేమ, వేదనా, వైరాగ్యం, హాస్యం...దేన్ని వదిలేయమంటారు.
Deleteప్రేమపై మీకున్న నిర్ధిష్ట అభిప్రాయం ప్రసంశనీయం
ReplyDeleteథ్యాంక్యూ....
Deleteప్రేమను ఎడాపెడా ఆడుకోవడంలో మీరు ఎక్స్పర్టా ??
ReplyDeleteపద్మార్పితతో ఆడుకుంటే పర్వాలేదు
Deleteప్రేమతో గేమ్స్ ఆడొద్దు...:-)
"తెలీదు అన్నంత తెలివైనపని
ReplyDeleteతెలుసును అన్నంత తెలివితక్కువతనం ఇంకొకటి లేదంట" అలా ఉంది మీరన్న మాటలు. ప్రేమకి పరిభాష ఏంటని ఎవరైనా అడిగితే నేను చెప్పే అడ్రస్ పద్మార్పిత బ్లాగ్....padma4245.blogspot.com
నయనిగారు ఇలా ప్రేమ ప్రేమ అంటూ అడ్రస్ ఇచ్చి మరీ ఉసిగొల్పుతారా :-)
Deleteనాకు ప్రేమతో సత్సంబంధం ఎన్నడూ కూడలేదు
ReplyDeleteఎందుకంటే! అందిన ఆశగా ప్రేమ నాకచ్చిరాలేదు
అందుకేనేమో ప్రేమపై రాయాలనుకున్న ప్రతిసారీ
వేదన వరదలో పదాలు ప్రవహిస్తూ పరిహసించసాగె!
వేదన ఎందుకు రాస్తున్నారు అని మేము అడక్కుండా కంక్లూజన్ ఇచ్చారన్నమాట. బాగుంది :)
ఇలా కూడా ఉపయోగపడిందన్నమాట :-)
Deleteబహుశా ఇది ప్రేమలో పండిపోయి వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఏమో పద్మ. అందుకే దేనిపైనా ఎక్కువ మమకారం కూడదు . నాకు కవిత ఈ కోణంలో అర్థమైంది.
ReplyDeleteమీకు అర్థమైన తీరు అమోఘం
Deleteమాయావిశ్వానికి ప్రేమే సర్వం, అదే వారి జీవం:-)
ReplyDeleteమీది మరో లోకం :-)
Deleteప్రేమను ఇంత భావయుక్తంగా వర్ణించిన మీకు ధన్యవాదాలు. ప్రేమకు ఏం కావాలో చెప్పిన మీ చిత్రానికి జోహార్లు.
ReplyDeleteమీ చిత్రంలో తృష్ణంతా ప్రేమకు నిర్వచనాన్ని వెదికే పనిలోనే ఉంది. ప్రేమ గురించి తెలియదని తప్పించుకోడం న్యాయం కాదు. ప్రేమ చిరునామా కోసం పరితపిస్తున్న... మనసుకి ప్రతిరూపం మీ చిత్రం. రవ్వల గాజుల లాంటి కలలు పంచే చేయి కోసం ఆ బోసి చేతులు ఎందురు చూస్తున్నాయి. జీవితాంతం తోడుండే బంగారు బంధనాన్ని పెనవేసే ప్రేమ కోసం ఆచ్చాదన లేని మెడ ఆరాటపడుతోంది. జడగంటల అల్లరి మనసు చిలిపి ఊసులతో గాలిలో తేల్చే... స్నేహం కోస... ఒదిగిన నల్లని కురులు ఆశలు పెంచుకుంది. ఆత్మాభిమానాన్ని ఎప్పుడూ తన కౌగిలిలో బంధించి.. తనతోనే ఉండి, తనలోనే కలిసిపోయే చీరలాంటి... ప్రేమికుడి కోసం పడతి మది ఆలోచనలు పరుగులు తీస్తోంది. ఇవన్నీ కలగలిసిన వలపు దరిచేరి... దిద్దే కుంకుమ రేఖ... చిరునామా దొరకకే... ఆ ముగ్దమనోహరముఖారవిందం నిశీధివైపు చూస్తోంది. ఈ భావాల సంఘర్షణలోనే.... సమాజంలో నేడు పేరుకుపోయిన ప్రేమ అంధత్వం, ప్రేమ వ్యంధత్వాలపై ఇలాంటి వేదన వ్యక్తం చేసిందనుకుంటా... పద్మ. ఏమంటారు.... అంతేనా....
అయ్యా కొత్తురిగారు దండాలండి.....చిన్నప్పుడు మీరు రంగులు కుంచెలు మింగేసి ఉంటారు. అవి మీ మనసుని, మెదడుని మెలిపెట్టి మీ చేత ఇలా రాయిస్తున్నాయనుకుంటాను. కవితకి తగిన చిత్రం అంటే పద్మార్పితగారు పెట్టే అమ్మాయిల హొయలు అనుకున్నానే కాని అందులో ఇంత అంతరార్థం ఉంటుందని మీ వల్లనే తెలిసింది. ఒకో చిత్రం ఇన్నేసి భావాలు చెప్పేస్తే నేను చెప్పడానికేముంటు అచేతనంగా నోరువెళ్ళబెట్టి చూడ్డం తప్ప.
Deleteసతీష్ చాలా అభుతంగా వివరించావు. నాకు చిత్రాలని చుసి ఆనందించడమే తప్ప ఇంతలా గమనించి చూసి మరీ కవితకి తగ్గ చిత్రాన్ని పెడతారిని నీ వల్లే తెలిసింది. ఆశ్శిస్సులు-హరినాథ్
Deleteఈ మధ్యకాలంలో మీరు చిత్రాలపై వ్యాఖ్యలిడడం మొదలెట్టాక నాలో కాస్త బెరుకుతనం మొదలైనమాట వాస్తవం. ఎక్కడ ఏ తప్పుచేస్తే దొరికిపోతానో అని. మీతో ఏం అనిపించుకోవలసి వస్తుందో అని కాదండి. మీకు అంతుచిక్కకుండా దాగుడుమూతలాడాలని :-) కానీ అలా జరగడంలేదు. నాకన్నా అత్యద్భుతంగా చిత్రభావాలని చదివేస్తున్నారు. ఇంక అనడానికేముందండి...సలాములిడ్డం తప్ప.
Deleteఆకాంక్ష....భలే భలే, కొత్తూరిగారి చిన్ననాటి ముచ్చటొకటి తెలిపినావు :-) నిజమా సతీష్ గారు.
Deleteప్రేమ ఒక మధురభావం అనుకున్న ప్రతిసారీ
ReplyDeleteతడి ఆరలేదన్న తనువుల తృష్ణ ఏదో తడిమె!
తృష్ణ తడిమినా నిగ్రహం కోల్పోనివారు కూడా ఉంటారు. వారి గురించి కూడా ప్రస్తావిస్తే బాగుండేది. మీ ప్రతీ పదంలో ప్రేమ ఉన్నప్పుడు మీకు ప్రేమ గురించి తెలియకపోయినా భావాలు అవే పొంగి పొర్లుతాయి.
నాలో నేను నందూగారు అన్నట్లు....ప్రేమపై ఎవరి భావాలు వారివి. ప్రేమలో మునిగి తేలేవారు కొందరు. తృష్ణతో తహ తహలాడేవారు కొందరు. తప్పదుకదా మహీ.
Deleteప్రేమంటే పదార్థం కాదు రుచులు చూడ్డానికి
ReplyDeleteప్రేమ దక్కినవారు కదా రుచులు చూస్తారు.
Deleteప్రేమకు ప్రతిపదార్థం చెప్పగల మీరు రాయలేననడమా? ప్రతి పాదంలోనూ ప్రేమకు నిర్వచనమిదీ అని చెప్తూ మనసులోని వేదనను ఆవిష్కరించారు పద్మార్పితాజీ.. చిత్రం అలా మొఖం చాటేసి వుండడం ఈ కవితకు నిండుదనాన్నిచ్చింది.. అభినందనలు.
ReplyDeleteనాకు తెలిసిన అర్థమే చెప్పగలిగాను....థ్యాంక్యూ వర్మగారు.
Deleteనాకు తెలిసి ప్రేమ పై మీకున్న భావాలు చాల గొప్పవి. మీరు తెలియదు అని తెలివిగా రాసిన ప్రతి అక్షరంలో ప్రేమ కనిపిస్తుంది. దాచి ప్రయోజనం లేదులెండి ;-)
ReplyDeleteదాచడంలేదు యోహంథ్...మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా.
Deleteఎప్పటిలాగే బాగున్నాయి కవిత బొమ్మ కూడా
ReplyDeleteలిపిగారు ఎందుకో ముభావంగా ఇస్తున్నారు సమాధానం. అలిగారా నాపై.
Deleteఅలా ఏం లేదండి.
Delete'ప్రేమలో కన్నీరిడని కళ్ళే చూడలేదు' 'అందిన ఆశగా ప్రేమ నాకచ్చిరాలేదు' ... అద్భుత భావాలు. ప్రేమ, తృప్తి అనే వాటిని భావనల్లోనే బతికించుకోవాలి తప్ప, నిత్య జీవితంలోకి తీసుకురాలేం. తీసుకురాడానికి ప్రయత్నిస్తే అవి కోరికలుగా రూపాంతరం చెందుతాయ్. తీరకుండా బాధిస్తాయి. అప్పుడు వాటి విలువ తరిగిపోతుంది. అయినా మిమ్మల్ని మీరు ఇంతగా ప్రేమించుకుంటున్నప్పుడు ప్రేమ అచ్చిరాకపోవడం ఏంటి!
ReplyDeleteనా బ్లాగ్ కి మీ స్వాగతం. .ప్రేమపై మీ సున్నిత భావాలని ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలండి.
Delete