కూర్పు

రక్తమాంసాలకి రంగుల హొయలద్ది

అనుబంధాలన్నీ జీవనాళాలుగా చేసి

చంచలమైన ఆపేక్షలని ఊపిరిగాపోసి

ముఖకవళికలకి నవరసాలంటూ నేర్పి

అస్తిపంజరాన్ని అందంగా అలంకరించి

ముద్దుగుమ్మగా చేసి మురియబోవ....

కలవని రక్తమే విరిగి రంగులే కరిగిపోయె

బంధం వద్దంటూ ప్రేగుబంధమే తెగిపోయె

ఆపేక్ష ఆస్తికాదని ఆత్మస్థైర్యం ఎగిరిపోయె

నవరసాలు ఏకమై పెదవులపై నవ్వైపోయె

అస్థిత్వమే అలంకారమై అస్థికలుగా మిగిలె!

70 comments:

  1. నవరసాలు ఏకమై పెదవులపై నవ్వైపోయె
    అస్థిత్వమే అలంకారమై అస్థికలుగా మిగిలె!
    వండర్ఫుల్ మాడం _/\_

    ReplyDelete
    Replies
    1. ఈ లైన్స్ నా కంట నీరు పెట్టించాయి కల్కిగారు.

      Delete
  2. మరీ ఇలా ఢీల పడిపోయే కవితలు రాస్తే మేము ఏమైపోవాలి. కాస్త హుషారు పుట్టించండి మేడంగారు.

    ReplyDelete
  3. అస్తికలని అస్తిత్వంతో పోల్చడమనేది ఎంతో ఉన్నతమైన భావన. చివరిలైన్లు అధ్భుతం మేడం. చిత్రం కూడా అధ్భుతం.
    చిత్రం గురించి సతీష్ గారి కామెంట్ కై వైటింగ్...

    ReplyDelete
    Replies
    1. అయ్యా/అమ్మా....ఎవరైనా మీరు అభిమానులకి అందనంత దూరాన్న ఉన్నారు. అజ్ఞాతవాసమా లేక అభిమానులతో ఆడుకుంటున్న నాటకమా!

      Delete
    2. ఆకాంక్ష...100% correct, expecting answer.

      Delete
    3. నాకు నచ్చిన లైన్స్ మీరు మెచ్చడం బాగుంది.

      Delete
    4. కాస్త ఈ అజ్ఞాతవాసం వీడితే చాలా బాగుంటుంది అభిమాన సంగాధ్యక్షులుగారు. Me too waiting to see Her/Him

      Delete
    5. పద్మార్పిత గారి గురించి మీరు ఒక్క కవితైనా రాసి పంపారా ? ఆకాంక్ష, నయని & అనికేత్ మీకోసమే వైటింగ్... ఇప్పుడెలాగూ రాయరని తేలిపోయింది :-) wait for next :-)

      Delete
    6. ఆపాటి కవిత్వం రాయడం రాకనే కదా సామెతల సోది చెబుతున్నది. వస్తే కుప్పలు కుప్పలు రాసేయను. నాకు మీరొక అభిమాన సంగం పెట్టేవారు. దేనికైనా ప్రాప్తం ఉండాలి.

      Delete
    7. కవితలురాసే కపాసిటీకి చేరుకోవాలేనే కళ్ళు కాయలు కాసేలా కాపలాకాసి మరీ పద్మార్పిత గారి కవితల క్లాసులు చూస్తున్నది.
      ఉండండి...ముందు ముందు మీరంతా నా ప్రతాపానికి జుట్టు పీక్కుంటారు. ఇప్పుడిప్పుడే చిన్నిగా మొదలెట్టానులే :-)

      Delete
  4. ప్రతిలైన్ మనసుని తాకి గుండెని పిండేలా వ్రాసారు.

    ReplyDelete
    Replies
    1. మరో కవితలో నవ్విస్తానుగా.

      Delete
  5. కలయో! వైష్ణవ మాయయో!! ఇతర సంకల్పార్ధమో!!! సత్యమో!!!!
    మీరు మీరేనా?

    ReplyDelete
    Replies
    1. వాస్తవమే కదా....అచ్చంగా పద్మార్పితనే :-)

      Delete
  6. పద్మా చాలా బాగుందమ్మా, సున్నితంగా అనిపించినా సూటిగా చెప్పారు ,మీరు నిజ్జంగా మనసు(ఉన్న)కవయత్రే

    ReplyDelete
    Replies
    1. మీరాజ్ గారు బాగుంది అంటే పండువెన్నెల జాబిలి విరిసినట్లుంది.

      Delete
  7. కవిత చదివి కన్నీళ్ళు వచ్చాయి .

    ReplyDelete
    Replies
    1. మరీ ఇంత సున్నితంగా ఉంటే ఎలా :-)

      Delete
  8. Padmaa....fantastic heart touching lines. Just bow my head in front of your poetry.

    ReplyDelete
    Replies
    1. Sandya thanks for your inspiring words my dear.

      Delete
  9. ముద్దుగుమ్మగా చేసి మురియబోవ....
    కలవని రక్తమే విరిగి రంగులే కరిగిపోయె
    బంధం వద్దంటూ ప్రేగుబంధమే తెగిపోయె
    ఇలా ఏడిపిస్తే ఎలా పద్మగారు. :-( :-(

    ReplyDelete
    Replies
    1. ఏడవకు ఏడవకు వెర్రినా తండ్రీ...ఏడిస్తే నీ కళ్ళు ఎర్రబడతాయి :-)

      Delete
  10. రక్తమాంసాలకి రంగుల హొయలద్ది
    అనుబంధాలన్నీ జీవనాళాలుగా చేసి
    చంచలమైన ఆపేక్షలని ఊపిరిగాపోసి
    ముఖకవళికలకి నవరసాలంటూ నేర్పి
    అస్తిపంజరాన్ని అందంగా అలంకరించి
    అక్షరాలతో అందంగా ఆవేదన అందించి
    మనసుని మెలిపెట్టి మదిలో నిలుస్తారు

    ReplyDelete
    Replies
    1. మెచ్చుకోలు కవిత బాగుంది నందూగారు

      Delete
  11. వేదనాభరితం. ఈసారి చిత్రం చిలకాకుపచ్చన నాదే నాదే :-)

    ReplyDelete
  12. jevan ke safar mein rahe milte jai bichad janeko aur tanhaye mein tadapaneko

    ReplyDelete
    Replies
    1. Zindagi ka safar koyi samja nahi Payalji.

      Delete
  13. ఆహా! అనిపించేలా అందమైన తెలుగు అక్షరాలతో, ఓహొ అనిపించేలా అతి సుంధరమైన బాపు బొమ్మల్లాంటి మీ చిత్రలతో, చెవులకు విన సొంపుగా ఉండె పాటతో మనసు మైమరచిపోయే అందమైన ప్రపంచంలోకి వచ్చినట్టుంది.. ప్రతీ ఒక్క పధం హృదయానికి తాకి ఫీల్ అయ్యేలా ఉంది. మీ కవిత మలికకు సుమాంజలి. సూపర్..

    ReplyDelete
    Replies
    1. ఏమైపోయారో అని కంగారు పుట్టించావు. అంతా క్షేమమే కదా శృతి. థ్యాంక్యూ

      Delete
  14. వీలుకుదరక రాలేదు. మీ బ్లాగ్ ని, మిమ్మల్ని చాల మిస్స్ అయ్యాను ...

    ReplyDelete
  15. Replies
    1. అంతరంగం యధావిధి.:-)

      Delete
  16. పద్మార్పిత వేదనలోను వేడుకలోను నవ్వే అన్నారు, మరి ప్రతీ అక్షరం ఇలా కన్నీరు పెట్టిస్తే ఎలా. ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డ కళ్ళు నార్మల్ అవడానికి ఇంత సమయం పట్టింది. అందుకే కామెంట్ పెట్టడం ఆలస్యమైంది.

    ReplyDelete
    Replies
    1. ఆకాంక్ష గారు, ఎప్పుడెప్పుడు పద్మగారు కవిత రాస్తారో ఎప్పుడెప్పుడు సతీష్ కొత్తూరి గారు విశ్లేసిస్తారో అని ఎదురు చూసే మీ కన్నుల నుండి కన్నీరా.. ఏలా?

      Delete
    2. ఆకాంక్ష....ఆ అందమైన కళ్ళలో కన్నీరు నే చూడలేను. ఇకపై నీ కంట ఆనందభాష్పాలు రాలించే పూచీ నాది.

      Delete
    3. Sridhar Bukyagaru....ela unnaru.

      Delete
    4. Nenu Baagunna.. Padma Gaaru..!

      Delete
  17. అనుబంధాలన్నీ జీవనాళాలుగా చేసి
    చంచలమైన ఆపేక్షలని ఊపిరిగాపోసి
    మీరే కవితలకి జీవంపోసి ఆకృతిని ఇవ్వగలరు. చాలా అర్ద్రతగా ఉన్నాయి కవితాక్షరాలు.

    ReplyDelete
    Replies
    1. మీరు కూడా సున్నిత హృదయులే అని నిరూపించారు.

      Delete
  18. ​నేటి కాలపు కొన్ని మింగుడుపడని బంధాలను (బంధాలు కాని ) బంధాలను వాటిలో దాగిన మర్మాన్ని విపులంగా సున్నితంగా తెలిపారు పద్మ గారు. బంధమనేది రక్త పంజరాలనుంది కాదు బంధమనేది ఒకరినొకరు అర్ధం చేసుకునే దానిలో ఉంటుందన్న సత్యాన్ని మీ రీతి లో ఆవిష్కరించారు.​

    ReplyDelete
    Replies
    1. Sridhar Bukyagaru...hope everything is fine.
      బంధాలు బాధ్యతల గురించి మీకు తెలినంత బాగా నాకు తెలీదు. మీ స్పందన నూతన తేజాన్నిస్తుంది నాకు. మీ తిరిగిరాక ఆనందదాయకం థ్యాంక్యూ.

      Delete
    2. థంక్ యు పద్మ గారు. ఐ అం వేరి ముచ్ ఫైన్

      Delete
  19. పద్మా !

    అన్ని లైన్లు చక్కగా తగినట్లుగా చాలా చాలా బాగున్నాయి .

    కాని యీ ఒక్క లైనులో చిన్న సవరణ అవస్రమనిపించింది .

    " నవరసాలు ఏకమై పెదవులపై నవ్వైపోయె "

    నవరసాలు ఏకమై నవ్వి పోయె
    లేకుంటే
    నవరసాలు ఏకమైన వేళ నవ్వే పోయె .

    కొంచెం ఆలోచించి చూడు .

    మార్చాలన్న ఒత్తిడి ఏమీ లేదు . ఇది నా అభిప్రాయం మాత్రమే సుమా !

    ReplyDelete
    Replies
    1. ముందస్తు మీ స్పూర్తిదాయక స్పందనలకు వందనాలు.
      మీరు చెప్పే సవరణలు నాకు ఎప్పుడూ ఆమోద యోగ్యమే.
      "నవరసాలు ఏకమై పెదవులపై నవ్వైపోయె "
      అన్ని ఆహభావాలు (నవరసాలు) నవ్వుగా మారి కప్పబడినాయని అర్థం స్పురింపచేయాలనుకున్నాను.

      Delete
  20. మీరు ఈ వేదన నుండి బయటికి రాలేకపోతే, మీలోకం చూడలేరు

    ReplyDelete
  21. ఆపేక్ష ఆస్తికాదని ఆత్మస్థైర్యం ఎగిరిపోయె
    నవరసాలు ఏకమై పెదవులపై నవ్వైపోయె
    అస్థిత్వమే అలంకారమై అస్థికలుగా మిగిలె!
    మనసుని మెలిపెడుతున్నాయి...చాలా బాగారాశారు

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు అభివందనాలు.

      Delete
  22. అనుబంధాల కూర్పుని చివరికి అస్తికలుగా మలచి మనసుని భారంగా చేసావు పద్మార్పిత-హరినాధ్.

    ReplyDelete
    Replies
    1. భారమైన మనసుని తేలిక చేయడం మీకు నేను చెప్పాలా హరినాధ్ గారు:-)

      Delete
  23. Feel it....అంతే ఇలాంటి వ్యధకి సామెతలు వెతికి రాస్తే నన్ను బండరాయని ఆరు చివాట్లు మూడు దెబ్బలు వేస్తారు. కవిత గురించి కమెంట్ ఏం పెట్టలేక తప్పుదోవ పట్టిస్తున్నాను అనుకోకండి పద్మగారు. తప్పడంలేదు.

    ReplyDelete
    Replies
    1. సామెత దొరకలేదు కదా నయనిగారు :-) డొంకతిరుగుడుగా అభాండం నాపైనా :-)

      Delete
    2. "​ఆరు చీవాట్లు మూడు దెబ్బలు అంటూ" ​మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాన సామెత దొరకలేదని సామేతలతోనే సమాదానపరిచారు నయని గారు

      Delete
  24. మనసేం బాలేదు. ఈ కవిత చదివి కలతచెందె. :-(

    ReplyDelete
    Replies
    1. సృజనగారు....మీ స్మృతులసవ్వడి మ్రోగించండి అంతా హాస్యమేకదా... అయినా మీరు రాయడం పూర్తిగా మానేసారు ఎందుకనో.

      Delete
  25. ఇంత వేదన ఎందుకు, ఓ నాలుగు ప్రేమ పలుకులు కూర్చి రాయండి.:-)

    ReplyDelete
    Replies
    1. అందరికీ ప్రేమ దక్కితే వ్యధభారమెవరికి తెలుస్తుంది :-)

      Delete
  26. కొంచెం ఆలస్యమైంది. నా కామెంట్లు అతి సాధారణమైనవి. వాటికోసం ఎదురు చూసేంతగా ఉన్నాయంటారా..? ఏమో. కానీ... జీవితాన్ని కాచి వడబోసినట్టుంటే పద్మ కవితల్లో సారాంశాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నమే నా విశ్లేషణలు. అవి.. జీవితం నుంచి జారిన అనుభవాల తునకలని నా ఊహ. రక్తమాంసాలకు రంగులద్దిన కవితలేగా ఇవి... అనుబంధాల జీవనాళాలు, ఆపేక్షలు... ఇవన్నీ కలిపితేనే కదా జీవితం. చివరికి మిగిలేది కేవలం అస్తికలే. అదే అసలైన అస్తిత్వం. జీవితంలో ఎన్నో రంగుల ఊహలున్నా చివరికి మిగిలేది నలుపు తెలుపుల బూడిదే, ఆ చిత్రంలో రంగుల కలలను చెదరగొట్టిన నిరాశల వైధవ్యం, ఆశల పేగు బంధాన్ని తుంచేసినట్టుంది. అయినా చుట్టూ ఉన్న రంగులు ఆశలు చెదిరిపోలేదని చెప్తున్నాయి. నిశీధి ఒడిలో కాదు ఆమె సేదతీరుతున్నది... ఆశల రంగుల్లో... లోపల అందమైన శిల్పాలెన్నిటినో దాచుకున్న శిలలపై సేద తీరుతున్న ఆమె ఆశ... అడియాశ కాదులెండి. చాలాబాగుంది... ఫిలసాఫికల్‌ హైపోథిసిస్‌....

    ReplyDelete
    Replies
    1. No doubt in it Satishgaru.You are rocking with comments.
      మీరు ఏం రాస్తారో అని ఎదురుచూసే క్యూలో నేనే మొదట ఉంటాను. వాళ్ళంతా చెబుతున్నారు నేను చెప్పడంలేదు. చక్కని విశ్షేషణతో పాటు అవగాహనా శక్తి కూడా మీలో మెండు. సదా మీ నుండి ఈ స్ఫూర్తిని కోరుకుంటాను. ధన్యవాదాలు.

      Delete
    2. Satish Sir. ఫిలాసఫికల్‌ హైపోథిసిస్‌....దీని అర్థమేమి మహానుభావా. అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటేయొద్దు. మీకు ఇందులో కూడా ప్రవేశముందన్నమాట.

      Delete
    3. ముందుగా మీరు సార్‌.. అని సంబోధించడం నచ్చలేదు. ఫిలాసఫికల్ హైపోథిసిస్‌ అంటే మీకు తెలియదంటే నేను నమ్మను గాక నమ్మను. మీకు తెలిసే ఈ అల్లరి.

      Delete
  27. మదిలోని బరువేదో మోచేతి మీద తలనానించి
    కనుల నీరు క్రమ్మంగ తలపుల అలజడితో
    నిదురకు కూడా దూరమైన ఓ నీలవేణీ!

    ReplyDelete
    Replies
    1. చాన్నాళ్ళకి మీ దర్శనభాగ్యం. ఎలా ఉన్నారు?
      మీ ప్రేరణాస్పూర్తికి నెనర్లు.

      Delete