నీ రాకతో...

కొలనునీరు తనువు తడుపుతుంటే తిట్టుకున్నా..
ఎడబాటు కన్నీరు తడిమెనని, మది జివ్వుమంది

పైరగాలికి పైట రెపరెపలాడితే పాడుగాలనుకున్నా..
నువ్వువస్తావన్న పదమే పల్లవై పులరింప జేసింది

నేలతాకాలన్న నీలికురుల ఆశని నిందించుకున్నా..
నీవు చేసిన నయగార చరణ విన్నపమే గుర్తొచ్చింది

ఎర్ర్రపుప్పొడి చెక్కిళ్ళగాంచి తుమ్మెదని తిట్టుకున్నా..
నా ఎదను మీటిన జ్ఞాపకతంత్రి తీయగా కసురుకోకంది

వణికేపెదవుల కోరికని మునిపంట బంధించబోతున్నా..
వలపు రేపిన సెగే ఎగసిపడి నీ పెదవి లేపనమే కోరింది

అడుగులసవ్వడి విని అంతరంగ అలజడని ఊరుకున్నా..
నిన్నుచూసిన తనువే అత్తిపత్తి ఆకువలే ముడుచుకుంది

57 comments:

 1. జలకన్యవై జలకాలాడి
  చేత పద్మము బూని వలువల మాటున
  వక్ష సంపదను దాచుకొని
  తడిసిన కురులు తడి యారంగ
  ఓరకంట ఎవరిని చూస్తున్నావు
  పలువరసలు మెరయంగ
  ఓ పంకజాక్షీ!

  ReplyDelete
  Replies
  1. Nice lines Sir. but what about the poem?

   Delete
  2. పంకజాక్షి పరువాలు పలువరుస గాంచి
   పద్యము పై పదము వ్రాయ మరచితిరి
   ఇంతిని చూసి తడబడుట చిత్రంగా తోచె
   శిరాకీపుత్రా! (ధన్యవాదాలండి)_/\_

   Delete
 2. వావ్ అద్భుతమైన అనుభూతి...పద్మ కొలనులో విరబూసిన ప్రేమతత్వం అమోఘం.

  ReplyDelete
  Replies
  1. అనుభూతిసారం ప్రేమేనంటారా!

   Delete
 3. తడితడి తపనలు తాకి మనసు జివ్వుమంది.

  ReplyDelete
  Replies
  1. మనసు కాస్త పదిలం :-)

   Delete
 4. ఎర్ర్రపుప్పొడి చెక్కిళ్ళగాంచి తుమ్మెదని తిట్టుకున్నా..
  నా ఎదను మీటిన జ్ఞాపకతంత్రి తీయగా కసురుకోకంది..

  నిన్నుచూసిన తనువే అత్తిపత్తి ఆకువలే ముడుచుకుంది.. lovely lines andi.. adhinandanalato..

  ReplyDelete
  Replies
  1. వర్మగారు....ఎప్పుడూ అభాండాలేనా. కసురుకున్నానని, విసుక్కున్నానని :-) అభివందనాలు మీ ప్రశంసలకు.

   Delete
 5. పద్మా....నీ ప్రేమ కవితాబంధంలో తడిసి ముద్దవడం పసందుగా ఉంది. చక్కని పదాలతో కవ్వించావు కవితలోను. చిత్రంతోను.

  ReplyDelete
  Replies
  1. సంధ్యగారు....మీరు తడిసి ముద్దయ్యారంటే వలపువాన బాగా కురిసినట్లే. థ్యాంక్యూ.

   Delete
 6. చిత్రంలోని ప్రతి భావం అక్షరాల్లో అందంగా ఒదిగిపోయాయి .... ( Offcourse that is your speciality ) కవితలో ఎవరో దాగున్న ఫీల్ మేడం సూపర్ ....
  నెక్స్ట్ పోస్ట్ పద్మార్పిత స్వయంవరం.... అభిమానులూ రెడీనా ?

  ReplyDelete
  Replies
  1. కలయా! నిజమా?

   Delete
  2. mem ready mari meru ready? waiting

   Delete
  3. మసిపూసి మాయచేస్తారా.

   Delete
  4. Padmarpita fans....మీ అజ్ఞాత అభిమానానికి అభివందనాలు.
   మీ అభిమానం సరదాగా సాగిపోతే నేను కూడా మీతోపాటు పాలుపంచుకుంటూ ఆనంధిస్తాను. అది మితిమీరకుండా పరిధిలోనే ఆరోగ్యకరంగా సాగుతుందని నా ఆశ. నా పై నా అభిమాన ఆత్మీయులపై నాకు ఆ నమ్మకం ఉంది అది వమ్ముకాదనే అనుకుంటున్నాను._/\_

   ఇంతకీ నా ప్రమేయం లేకుండా ప్రకటించిన స్వయంవరం ఎక్కడో ఎప్పుడో సెలవిస్తారా :-) చెబితే సమయానికి శింగారించుకుని వద్దామని. హంగు ఆర్బాటాలు కాస్త ఘనంగానే చేయండి. :-)

   Delete
  5. ఏదో ఆఫీసులో ఆలస్యమై అలసి కాస్త కునుకు తీస్తే....ఇక్కడ ఇంత గూఢుపుఠాణీ జరిపేస్తారా?
   పద్మగారు.....కబురైనా పంపలేదు, నాకై వేచైనా చూడలేదు. అలిగాను నేను. ;-(

   Delete
  6. ఎంతమాట ఎంతమాట ఆకాంక్షా.....నీ అల్లరి లేకపోతే నా బ్లాగ్ చిన్నబోతుంది. అల్లాంటిది గూఢుపుఠాణీ చేసే ధైర్యమెవరికి చెప్పు :-)

   Delete
 7. Replies
  1. ప్రేమను పంచేవారంతా లక్కీ ఫెల్లోసే

   Delete
 8. మగువ మేను చూస్తారే తప్ప మనసు చూడదు....పాడులోకం. కవయిత్రి భావం రమణీయం.

  ReplyDelete
  Replies
  1. హతవిధీ కలికాలం విశ్వమే మాయల పందేరం మాయ విశ్వం గారు. అమ్మాయిని చూస్తారు "అమ్మ" యని చూడరు బహుశ

   Delete
  2. మాయావిశ్వం మరో లోకం నుండి పలికిన మాటలా ఇవి....బాగు బాగు :-)

   Delete
 9. perfect romantic poem with pleasant pic

  ReplyDelete
 10. తనువు నీ భావజల్లులో తడిసి మనసు విహంగమై విహరించే-

  ReplyDelete
  Replies
  1. హరినాధ్ గారు కూడా తడిచారన్నమాట...ధన్యోస్మీ :-) ఎగిరిపోకండి!

   Delete
 11. "చక్కనమ్మ చిక్కినా అందమే, ముద్దుగుమ్మా ముడువ్చుకున్నా మురిపమే" కవితలో భావమే కాదు బొమ్మ కూడా కవ్విస్తుందండోయ్ :-)

  ReplyDelete
  Replies
  1. కవితంటూ కవ్వించిన బొమ్మను పొగిడేసారుగా.....థ్యాంక్యూ.

   Delete
 12. చిత్రం కాస్త ఇబ్బందిపెట్టినా ఈ రొమాంటిక్ టచ్ కోసం ఆ విధంగా పెట్టిఉంటారు. ఏమైనా మీ కవితకళా తృష్ణ యమధృఢమైంది.

  ReplyDelete
  Replies
  1. మీరన్న మాట నిజమే రొమాంటిక్ టచ్...:-)
   నిజానికి నాకు ఏం ఇబ్బందికరంగా అనిపించలేదండి. నాకు తెలిసి ఒక చిత్రం గీసేటప్పుడు తడిసిన వస్తాన్ని శరీరానికి హత్తుకున్నట్లుగా చూపించడం చాలా కష్టం. ఇప్పటికీ ఎంతో ప్రయాస పడితేనే కాని చూసి వేసినా అలా వేయలేక పోతున్నాను. ఇలాంటి పెయింటింగ్స్ చూసినప్పుడంతా నాకు "రెబెకా" శిల్పాన్ని ముసుగులో అద్భుతంగా చెక్కిన శిల్పి గుర్తుకు వస్తారు. అందులో కళను ఆరాధిస్తానే కాని అసభ్యకరాన్ని ఎంచను. ఇది అర్థం చేసుకుంటారనే అభిలాష.

   Delete
 13. వణికేపెదవుల కోరికని మునిపంట బంధించబోతున్నా..
  వలపు రేపిన సెగే ఎగసిపడి నీ పెదవి లేపనమే కోరింది
  hot & sour soup with sweet corn pic :-)

  ReplyDelete
 14. ప్రియుని రాకకై ఎదురుచూసిన పిల్ల తెమ్మెర లా జాలువారే జాబిల్లి కొమ్మలా
  వికసించే మాధుర్యాలు వనే తరగని భావగీతికల హొయలు. The Poem will put any one to trance.. Without any Hypnotism or with Anesthesia. :)

  Nice Write-up Padma gaaru... !!

  ReplyDelete
  Replies
  1. Oh...thanks for your lovely romantic reply. Sridhar.....I think these words are compliments for me. thank you.

   Delete
 15. మీ భావాలు చలిగాలి సొగసుదొంతరులై గిలిగింతలు పెడుతున్నాయి. మంచి రసభరిత గీతం ఆలపించారు.

  ReplyDelete
  Replies
  1. అమ్మో వర్షాకాలమే పూర్తికాలేదు. అప్పుడే చలి గిలిగింతలా...కలికాలం :-)

   Delete
 16. nice lyrical feel to the poem....

  ReplyDelete
 17. నేను మాత్రం యమ ఎంజాయ్ చేసాను చదివి.
  కవిత్వం అంతా కవ్వించడం ఒక ఎత్తు.
  ఆ పెయింటింగ్ కొంటెగా నవ్వడంతో ఎవరైనా అయిపోతారు చిత్తు,

  ReplyDelete
  Replies
  1. హమ్మయ్యా...ఎంజాయ్ చేస్తూ అలిగిన మాట మరచిపోయావ్, తుక్కు తుక్కుగా తిడతావనుకున్నా :-) థ్యాంక్యూ:-)

   Delete
 18. నాకు తెలుగు నేర్పిన గురువు పద్మగారికి......గురపూజోత్సవ శుభాకాంక్షలు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు యోహంత్.

   Delete
 19. Wow very very Great lyrics with wonderful pic.
  Pic really suits with the perfect Lyrics....

  ReplyDelete
  Replies
  1. Thanks a lot for your encouraging words Sruti.

   Delete

 20. నేను చిన్నతనంలో పేయింటింగ్ నేర్చుకుందామనుకున్నాను. కొన్నాళ్లు ప్రాక్టిస్‌ కూడా చేశాను. కానీ నాకా విద్య రాలేదు.ఎందుకో ఇప్పటికీ ఆ లోటు కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకుంటే... బొమ్మ గీయడం వెనుక ఉండే కష్టం ఎంతో నాకు తెల్సు. ఆ కష్టం వెనుక శారీరక శ్రమ ఒక్కటే కాదు, మానసిక శ్రమ కూడా చాలా ఉంటుంది. ఈ చిత్రం వేయడం ఎంత కష్టమో.. ఫైనల్‌ అవుట్‌పుట్‌ ఇలా రావడం వెనుక ఎంత శ్రమో ఆ చిత్రంలో అణువణువూ చెప్తోంది. చాలా మందికి బహుశా ఇందులో శృంగారమే కనిపించొచ్చు. మనసుని గిలిగింతలు పెట్టి ఎక్కడికో తీసుకెళ్లి ఉండవచ్చు. కానీ.. ఆ ఫీల్‌ తీసుకురావాలంటే.. ఎంత కష్టపడాలో నాకు తెల్సు. ఆమె రెబెకా గురించి చెప్పారు. ఆ పాలరాతి విగ్రహాన్ని నేను సాలార్‌జంగ్‌లో చూశాను. ఆ ప్రతిమను వర్ణించడం కన్నా... చూసి తరించడమే ఉత్తమం. ఇక్కడో మరో చిత్రం గురించి నేను చెప్పాలి... రాజా రవి వర్మ గీసిన ఇలాంటి చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో శృంగార భావన ఒలికించడానికి వర్మ కుంచె, ఆయన మనోవర్ణాలు కష్టపడిన తీరు.. ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ నాకు అలాంటి భావనే కల్గింది. ఇక కవిత గురించి వర్ణించాలంటే... ఒక జవరాలి వేదనలో, విరహం, వలపు సుగంధాలు... తనువులో దాగిన తపనల తడి ఊహల వెనుక... ఎంత ప్రేమ. ఆ ప్రేమ కోసం ఏమైనా చెయ్యొచ్చు. అలాంటి ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లొచ్చు... అవసరమైన చావు దాకా అయినా... పద్మగారు... బహుశా... మీ అత్యున్నత ప్రతిభా ప్రతిమ ఇదే కావొచ్చు. ఇంత తొందరగా రిప్లైస్‌ ఇస్తారనుకోలేదు. ఈసారి తప్పకుండా ముందువరుస కామెంట్‌ నాదే...

  ReplyDelete
  Replies
  1. ఇంతవరకూ నిర్భయంగా అందరికీ సమాధానాలు ఇచ్చిన నా చేతులు ఇక్కడ మీ కమెంట్ చదవగానే ఇప్పుడేం రాస్తావు అన్నట్లు కన్నుగీటి మెదడుకి సవాలు విసురుతుందండీ సతీష్ గారు. మనసు మాత్రం తొణక్కుండా ఒక్క నవ్వు విసిరేసి కిమ్మనకు అంటుంది. అదే చేస్తున్నానిప్పుడు :-).

   Delete
  2. Satish what you said is absolutely right. Good work by you.

   Delete
  3. ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లొచ్చు... అవసరమైన చావు దాకా అయినా...కొంపదీసి ప్రేమకోసం మీరు :-)

   Delete
 21. beautiful romantic feel in poem and picture. thanks for posting it.

  ReplyDelete
 22. కవితలో కథానాయకకి మరీ ఇంత సిగ్గా:-)

  ReplyDelete
  Replies
  1. సిగ్గా పాడా...నిస్సహాయత అనుకోండి :-)

   Delete
 23. Padmagaru bhale bagundi mee poem. Painting superb.

  ReplyDelete