నిస్వార్థ జీవి

ఈ తోడేళ్ళ లోకంలో తోడెవ్వరని తొంగి చూస్తే
ఇంతందమైన లోకం వేరేదీలేదు అనిపించింది
అందుకే వాటితోటిదే సావాసమని చేయికలిపి
గర్జించే పులికన్నా చొంగకార్చే తోడేలే మిన్నని
కోరికేదో కోరమని దాని కుటీరాన్నే ఆశ్రయించా..

తొలుత తోడు-నీడ అవుతానని తోకూపిన తోడేలు
తొందరపాటేనని తెలివిగా తనని తానే తిట్టుకుంది
అందినంత జుర్రుకుని గుట్టు చప్పుడేలని జారుకుని
వాసనమరిగి మరునాడు మరల మభ్యపెట్ట చూసె
అనుభూతులే అనుభవమైతే వద్దని మొరాయించా..

మరోమారు మరువలేనంటూ కొత్త అస్త్రం చేతబూని
జిత్తులగారాలే వలపుబాటని వల్లిస్తే మనసే నవ్వింది
తొణకని నిబ్బరం చూసి వణికిన తోడేలు తోకముడిచి
సంధి బాసలే చేసి జామురేతిరి సరసమంటూ దరిచేరె
సర్దుబాటే సరైనది అనుకుని ఆశలచాపనే పక్కపరిచా.

చివరికి మంత్రమేసి తోడేలుని మనిషిగా మార్చబోవ
మాయపొరలు కరిగించి జీవితసత్యమేదో భోధించింది
మార్చడమేల మర్మం తెలుసుకుని మనం మారాలని
మృగమైనాసరే ఎవరి అవసరం వారినే సమర్ధించునని
స్వార్థంలేనిప్రాణిని బ్రతికిఉండగా చూడలేనని గ్రహించా..

47 comments:

  1. నేరమంతా మగతోడేళ్ళదేనా? ఆడతోడేళ్ళు నిస్వార్థజీవులా?

    ReplyDelete
    Replies
    1. ఆడతోడేళ్ళ గురించి మగవాళ్ళు చెప్తారని వదిలేసాను.

      Delete
  2. తోడేలుతో పోల్చి అల్లిన మీవ్యంగ్యాస్త్ర కవిత చాలా బాగుందండి. కవితా వస్తువుగా తోడేలును తీసుకొని వాస్తవిక కోణంలో ఆపాదిస్తూ... స్వార్థ నిస్వార్థ ప్రేమ గూర్చి చొప్పించినతీరు అమోఘం. సలాం . ..

    ReplyDelete
    Replies
    1. నేను వ్యక్తపరచాలనుకున్నా భావాన్ని చెప్పాననే అనుకుంటాను.

      Delete
  3. madam ela tidite mem emaipovali. aina manchivallu untaru kontamandi.

    ReplyDelete
  4. పద్మా ఎవరిపై ఈ అక్రోశం. స్వార్థపూరిత లోకం తప్పదు మనమే మారాలి. చాలా మంచి భావమున్న కవిత వ్రాశావు.

    ReplyDelete
    Replies
    1. నా పై నేనే కోపగించుకోవాలి ఎవరిపై కోప్పడితే ఎవరు ఊరుకుంటారు :-)

      Delete
  5. లోకం తీరిదే అని తెలిసినా స్వార్థం పాళ్ళు పెరుగుతున్నా నిస్వార్థతను పాటించి జీవనోన్ముఖానికి నవనాందులు పలికే భావం మీ కవితలో కనిపిస్తుంది. ఎప్పటిలానే కవిత అలరించింది కాపోతే ఆ తోదేలుని చూస్తె వేరేవోల్ఫ్ గుర్తుకొచ్చింది. ప్రయోగం అద్భుతం. వామ్మో ఆ తోడేలు అసలే అరుపులు చెవుల్లో మారుమ్రోగుతున్నట్టు ఉంది.కవిత బాగుంది పద్మ గారు

    ReplyDelete
    Replies
    1. మీరు అతీతులు కదా...అరుపులు మారుమ్రోగడం విచిత్రంగా ఉంది.:-)

      Delete
    2. మీరు తోడేళ్ళ అరుపులు వింటూ సామెతలు మరిచిపోతే ఎలాగండి శ్రీధర్ గారు. నాకు సహాయం చేయండి.:-)

      Delete
    3. వెనకటికెవడో తోడేలనుకొని కుక్క కాలు తోక్కాడట
      నక్క తోక తొక్కితే అదృష్టం కలిసోచ్చేది పుండు మీద కారం చల్లినంత పనైంది

      Delete
  6. ప్రస్తుతకాలంలో స్వార్థంలేనిదే మనిషి జీవించలేడు. అవసరానికి వాడుకుని తనని తాను సమర్ధించుకోవాలి లేకపోతే మనుగడే లేదు నేడు మనిషికి. మరో మంచి కవిత నీ కలం నుండి...ఆశ్శీస్సులు- హరినాధ్

    ReplyDelete
  7. మార్చడమేల మర్మం తెలుసుకుని మనం మారాలని...అంతే మరి వేరే దారిలేదు బ్రతకాలంటే :-(

    ReplyDelete
    Replies
    1. తప్పదు...అదే ప్రయత్నంలో ఉన్నాను.

      Delete
  8. తోడేళ్ళతో పోలిస్తే చూడండి ఎలా అరుస్తున్నాయో

    ReplyDelete
    Replies
    1. వాటికి కూడా నాపై కోపమేనేమో!

      Delete
  9. "తోడేళ్ళ లోకంలో జిత్తులమారి నక్కే నక్కి నక్కి ఉంటే. విశ్వాసం గల కుక్కెంత దాని బ్రతుకెంత"
    మహామహులే ఈ మాయాలోకంలో మతిచెడి తిరుగుతున్నారు. ఈ కవితనుబట్టి చూస్తే పద్మగారు త్వరగానే కళ్ళుతెరిచారు.:-)

    ReplyDelete
    Replies
    1. Suparoooo:-) గట్టిగా ఒక విజిల్(((((((((((((((((((((((((((

      Delete
    2. ఇంతకీ ఈ సామెతల పుట్ట ఎక్కడిదండి మీకు.

      Delete
    3. ఆకాంక్ష...నేను కూడా నీతో పాటు ఒక విజిల్ :-)

      Delete
    4. వెతకలేక, అల్లలేక చస్తున్నా...
      మీకు విన్న వించు కున్నా...
      కష్టమైనవి రాయకండి అని, వింటేనా
      తప్పదు నాకు ఈ సామెతల వేట..:-)

      Delete
  10. Wonderful wordings with catchy painting. A Big Clap.

    ReplyDelete
  11. కవితలో తోడేలుకు తోక ఉందా లేదా చెప్మా

    ReplyDelete
    Replies
    1. ఇంతకీ మీరు అడిగింది ఏ తోడేలు తోక గురించి.

      Delete
  12. తోడేలును మార్చాలన్న మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటూ..

    ReplyDelete
    Replies
    1. నేనే మారాలికదా వర్మగారు. తోడేలుని మార్చమని దీవిస్తే ఎలా :-)

      Delete
  13. ఇది కేవలం మగతోడేళ్ళకేనంటారా పద్మార్పితా :-)

    ReplyDelete
    Replies
    1. కాదు...కొన్ని మార్పులతో అన్వయించుకుంటే ఆడతోడేళ్ళకి కూడా

      Delete
  14. తొలుత తోడు-నీడ అవుతానని తోకూపిన తోడేలు
    తొందరపాటేనని తెలివిగా తనని తానే తిట్టుకుంది
    అందినంత జుర్రుకుని గుట్టు చప్పుడేలని జారుకుని
    వాసనమరిగి మరునాడు మరల మభ్యపెట్ట చూసె
    తిడుతున్నారో పొగుడుతారో అర్థం కాకుండా బుధ్ధి చెప్తారు.

    ReplyDelete
    Replies
    1. తిట్టేంత ధైర్యమా నాకు :-)

      Delete
  15. పద్మార్పితగారు మీరు మనుషుల్ని మరీ ఇలా తోడేళ్ళు నక్కలు అంటే మేము ఒప్పుకోముగాక ఒప్పుకోం. ఐ హర్టెడ్ అంతే :-)

    ReplyDelete
    Replies
    1. ఆకాంక్ష అలిగితే అల్లకల్లోలం...వద్దు తల్లీ వద్దు.

      Delete
  16. padmaji ye thodha mushkil hai samjnah.

    ReplyDelete
  17. Its something Different, meeru cheputunte idi nijangaa nijamee anipitundi, inta kaalam alochinchaledu... Nice one with different theme with different pic...

    ReplyDelete
    Replies
    1. Sruti....common yaar. its old wine only :-)

      Delete
  18. స్వార్ధం లేకపోతే అసలు మనిషేకాదు పద్మ. ఆలోచించవలసిన విషయం .

    ReplyDelete
    Replies
    1. మీరు చెబితే తిరుగులేదు..ఆలోచనెందుకు. :-)

      Delete
  19. ముందు పద్మగారు నన్ను మన్నించాలి. వరుస విపత్తులతో జీవితం కకావికలమైంది. ఫస్ట్‌ నా ముద్దుల స్మార్ట్‌ ఫోన్‌ చేయి దారి... స్పర్శ కోల్పోయింది. అదే టచ్‌ పోయింది. దానికి స్పర్శ కల్పించేందుకు వైద్యుడి దగ్గరకెళ్తే... ఇప్పటి వరకు ఆ ఫోన్‌ రిపేరు కాలేదు. కొత్తది కొందామంటే మనసొప్పలేదు. ఈ లోపు నాకు ఆరోగ్యం బాగోలేదు. నాలుగు రోజులుగా మంచానపడ్డాను. ఈ నాలుగు రోజులు నా అర్ధాంగి...నన్ను మంచం దిగనివ్వలేదు. అందువల్ల నా బదుళ్లు లేవు. అందువల్ల మన్నించాలి. మగ తోడేళ్ల కోరలు పీకే ధైర్యం ఆడవాళ్లకు రానంతవరకు... ఇలా తోడేళ్ల గురించి తలుచుకుని తలుచుకుని బాధపడటం తప్ప ఆడవాళ్లు ఇంకేమీ చెయ్యలేరు పద్మగారు. అవును ప్రతీ మగాడిలోనూ ఓ తోడేలుంటుంది. ప్రతీ ఆడదానిలోనూ కోరలు పీకే ధైర్యముంటుంది. తోడేలుకి భయపడుతూ బతుకుతారా....? ధైర్యాన్ని బయటకు తీసి తోడేలుని తరుముతారా...? ఛాయిస్‌ ఈస్‌ యువర్స్‌...

    ReplyDelete
    Replies
    1. త్వరగా బయటపడండి విపత్తుల నుండి. :-)
      నైస్ గా మాకే ఫిట్టింగులు పేట్టేస్తే ఎలా :-)

      Delete
    2. అయ్యో...అనడం తప్ప ఏం చేయలేం. త్వరగా వచ్చేద్దురూ నూతనోత్సాహంతో :-) decision maa pai vadaladam...too clever :-)

      Delete
  20. పద్మగారు బ్రతిమాలించుకోవాలా ప్రతీసారీ. మీరు రిప్లైస్ ఇవ్వని పోస్ట్ లు చిన్నచూపు చూసావంటూ ఏడుస్తున్నాయి. (మీ మాటల్లోనే)

    ReplyDelete
    Replies
    1. ఈ సారికి రిపైల్స్ ఇవ్వను ఒగ్గెయ్ అందాము అనుకున్నా....ఇంకేమైనా ఉందా సునామీ ఎదురుగ వస్తుందని ;-)

      Delete
  21. మీరు ఇంత ఆలస్యంగా ఈ విషయం తెలుసుకుంటారని అనుకోలేదు పద్మార్పితగారు.

    ReplyDelete