ముద్దు మతలబుముద్దు ముద్దుకీ ఒక మతలబు ఉంది..
ప్రతి ముద్దుకీ హద్దే కాదు అర్థం ఉంది...

ఎప్పటికీ నువ్వు నా సొంతం అంటుంది
నుదిటిపై నున్నని పెదవి అద్దిన ముద్దు!

శృంగారాన్నే శృతి చేసుకోమని నవ్వింది
చెవిపై చిందులు వేస్తున్న చిలిపి ముద్దు!

నువ్వంటే నాకెంతో ఆరాధన అంటుంది
చేతిపై సాక్షిసంతకం అద్దిన చిరు ముద్దు!

నాకునువ్వు నీకునేను ఒకరికొకరమంది
మెడవంపున మారాంచేసే గారాల ముద్దు!

కష్టమో నష్టమో నువ్వు నాకు కావాలంది
భుజంపై వాలి భేషజాలు వదిలేసిన ముద్దు!

"ఐ లవ్ యు" అని లిపిలేని భాషలో అంది
పెదవులు పెదవులని పెనవేసుకున్న ముద్దు!

57 comments:

 1. ఓహో....ముద్దు ముద్దుకీ ఒక మతలబుంది అది చెప్పిన తీరు ఇంకా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. మరి అన్ని వేళ్ళు ఒకేలా ఉన్నాయా ఏంటండి :-)

   Delete
 2. పద్మా ,

  ముద్దు ముద్దుకీ మతలబు , ముద్దు మతాబు లా వెలిగిపోతోంది .

  ReplyDelete
  Replies
  1. అదేంటండి...దీపావళికి ముందే మతాబులు వెలగడం :-)

   Delete
 3. ముద్దుపై మీ స్టైల్లో రాసిన కవిత చాలా ఇంఫర్మేటివ్ గా ఉందండోయ్... ఎటువంటి సబ్జెక్టునైనా సమయస్పూర్తితో డీల్ చేయగల మహారాణి మీరు... రాకింగ్ మేడం. . .

  ReplyDelete
  Replies
  1. ఈ ఇంఫర్మేషన్ ఆలోచించి యూస్ చేయాలండోయ్ :-)

   Delete
 4. ముద్దు ముద్దుగా చెప్పి మురిపించావు.

  ReplyDelete
  Replies
  1. (=) ముద్దుకి సింబల్ :-)

   Delete
 5. వామ్మో... వామ్మో... వామ్మో... తడి ఆరని పెదవి చెప్పే చిలిపి సంగతులెన్నో. పెదవి భాషే వేరు. ఆ భాష నేర్పే పాఠాలూ వేరు. చుంబన కావ్యంలో ప్రేమతత్వాలు అబ్బో... చాలా బాగున్నాయి. చిరుచెమటలు పట్టించాయి. మీలో ఉన్న రసమయ దృష్టికి... నా జోహార్లు....

  ReplyDelete
  Replies
  1. సతీష్ గారు చిరు చెమటలు ఎందుకో మరి.:-)
   Are You OK?

   Delete
  2. కొత్తూరిగారు కొత్తసంగతులంటూ కొంగ్రొత్త భాషలో...అబ్బో ఎటో వెళ్ళిపోయారు. :-)

   Delete
  3. ఆకాంక్ష....hope he is perfectly fine.

   Delete
 6. padmaji maanliya aap ki behatarein andaz ko.

  ReplyDelete
 7. లేలేత పెదవులు ముద్దు ముద్దు ఊసులెన్నో చెప్పె.

  ReplyDelete
  Replies
  1. అంటే ఊసులు నచ్చాయన్నమాట :-) థ్యాంక్యూ

   Delete
 8. ఇన్ని ముద్దు మురిపాలు ఎవరి సొంతమో...:-P always you are a trend setter..

  ReplyDelete
  Replies
  1. ఎవరి ముద్దులు వారికే...:-) thanks for inspiring words.

   Delete
  2. Evari muddu vaarike ani ila open ga cheppaku, address vetukkoni vachi mari Inti mundu Q kadataru.😀 Jara badhram Sumi.

   Delete
 9. మతలబు మతలబుకు ఒకో ముద్దు :-) ఎలా రాసేస్తావో ఏమో ఇలా

  ReplyDelete
  Replies
  1. సంధ్యాగారు....ఎలా అంటూ మర్మమడిగితే ఏం చెప్పను.

   Delete
 10. ముద్దు ముచ్చట్లు మాబాగా చెప్పారు పద్మ

  ReplyDelete
  Replies
  1. మొత్తానికి మెప్పించానుగా మిమ్మల్ని :-)

   Delete
 11. కమెంట్లకు రిప్లయ్ గా ముద్దులిచ్చేరు జాగ్రత్తండోయ్

  ReplyDelete
  Replies
  1. అలా ఇవ్వవలసి వస్తే మీతోనే ఇప్పిస్తాలే :-)

   Delete
 12. ముద్దులైనా గుద్దులైనా
  నాటైనా నీటుగా నాటుకునేలా చెప్తారు.
  బొమ్మ మాత్రం ఖచ్చితంగా మీరు వేయలేదు:-)

  ReplyDelete
  Replies
  1. నాటు నీటు
   మాస్ క్లాస్
   అన్నీ తెలుసన్నమాట :-)

   Delete
  2. నయనీగారు...సామెతలతో పాటు మార్కులుకూడా వేస్తున్నారు.

   Delete
 13. ముద్దుకే ముద్దొచ్చేలా చెప్పారు. మీ ముద్దుల వృక్షం బాగుంది. కవిత రూపంలో ముద్దుల వర్షమూ బాగుంది. ఇలా నేను కూడా ముద్దు ముచ్చట చెప్పే ప్రయత్నం గతంలో చేశాను. పద్మ గారు! మీకు వీలైతే ' అంతా సౌందర్యమే' అన్న బ్లాగులో 'ముద్దు - ముచ్చట' అంటూ నేను రాసిన బ్లాగు ఒకసారి చదవండి. ఇంకా వీలైతే మీ అభిప్రాయమూ చెప్పండి.

  ReplyDelete
  Replies
  1. chandramohangaru mee blog lo muddu-muchata bagundi.

   Delete
  2. నటనాజీవితం నుండి నిజ జీవితానికి వస్తే అంతా సౌందర్యమే మరి. నా బ్లాగు చదివినందుకు, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు కృతజ్ఞతలండి!

   Delete
  3. మీ పోస్ట్ చదివానండి....చాలా బాగారాసారు.

   Delete
 14. ముద్దు గురించి ముద్దు ముద్దుగా చెప్పారు.. సూపర్. పిక్ చాల బాగుంది అందమైన పెదాలతో...

  ReplyDelete
  Replies
  1. మీరు కమెంట్ కూడా ముద్దు ముద్దుగా ఇచ్చారు

   Delete
 15. మరోసారి పర్మార్పిత పేరు మారుమ్రోగింది :-) ముద్దు ముద్దుగా చెప్పారు

  ReplyDelete
  Replies
  1. యోహంత్...అలా అందరు పేరుని అరిచి కనిపిస్తే కరుస్తారేమో :-)

   Delete
 16. మా చిలకలజంటకి తెలియవు ఇన్ని ముద్దు మాటలు.

  ReplyDelete
  Replies
  1. చిలుకలకి చేతలుంటేగా మాట్లాడ్డానికి

   Delete
 17. oko point muddu bullets la shoot(written) chesaru.

  ReplyDelete
 18. ఒకో ముద్దుకి ఇంతర్థం ఉంటుందని ఇప్పుడే తెలిసింది

  ReplyDelete
  Replies
  1. మరి ఫీజ్ చెల్లించరా :-)

   Delete
 19. వేదనతోనే మనసును పిండేస్తారు అనుకున్నాను. రొమాన్స్ తో అంతకన్నా పదింతలు అలరిస్తారని తెలిసింది. చక్కగా రాశారు.

  ReplyDelete
  Replies
  1. ఎప్పుడు ఏడ్చి ఏడిపిస్తే కుమ్మేస్తారని ఇలా :-)

   Delete
 20. పద్మా...అల్లరి ఎక్కువైపోతుంది నీకు. సరదాకి అన్నాను. హా హా హా బాగుంది-హరినాధ్

  ReplyDelete
  Replies
  1. మీ అందరి దగ్గరే కదా నేను అల్లరి చేసేది :-)

   Delete
 21. " మీసమే మెలేసి మగాడినంటే....
  ముద్దు ఇయ్యి మీసాలు గుచ్చుకోకుండా"
  అందట వెనుకటికి ఒక వగలాడి :-)
  post adurs. pic kevvuuuuu keka

  ReplyDelete
  Replies
  1. పాపం ఆ మగాడిని మరీ అలా ఢీలా చేస్తే ఎలా :-) thank you.

   Delete
 22. ముద్దులు ప్లేసెస్ చెప్పారు రకాలు ఎప్పుడు చెప్పబోతున్నారు :-)

  ReplyDelete
  Replies
  1. ఆ పై ప్రాక్టికల్స్ అడిగితే కష్టం కదా...ఇక్కడితో ఆపేద్దాం :-)

   Delete
 23. chala chakkaga chepparu madam

  ReplyDelete
 24. ముద్దు ముద్దుగా బాగుంది

  ReplyDelete
 25. రిపైల్స్ ఇవ్వడం మానేసారు.....కవితలన్నా వ్రాయండి మాడంజీ

  ReplyDelete
  Replies
  1. నా రిప్లైస్ కోసం పరితపించే.....మీకై :-)

   Delete