కంటికెదురుగా ఉంటే నీవు తలుచుకోవని
దూరమైతే రోజంతా నీ తలపుల్లో నేనేనని
తెలిసికూడా తడి ఆరని తపన ఏలనోమరి!!
నన్ను తలవక నిదురించే అలవాటు నీకు
నిన్ను వీడి శాస్వితంగా నేను నిదురపోతే
నీవు నిదురనే ఛీదరిస్తావన్న బెంగ నాకు!!
లాభం లేకనే నీ జ్ఞాపకాల వ్యాపారమే చేసి
తలచి తలచి నిన్ను నేను అలసిపోయాను
ఇకపై నీ తలపుల్లో నేను ఉండిపోతానుమరి!!
కన్నీటికి కారణం తెలిసి వెతుకుతావెందుకో
కంటినిండా నిన్ను చూసుకోమని కోరతావు
కనులనిండా నీటితో నీవు కానరాకున్నావు!!
నీ జ్ఞాపకాలో లేక నేను అణచుకున్న వలపో
ఉండుండి కొట్టుకునే గుండెని మెలిపెడుతుంది
నా వ్యసనమైన తలపునైనా వీడిపోరాదామరి!!
దూరమైతే రోజంతా నీ తలపుల్లో నేనేనని
తెలిసికూడా తడి ఆరని తపన ఏలనోమరి!!
నన్ను తలవక నిదురించే అలవాటు నీకు
నిన్ను వీడి శాస్వితంగా నేను నిదురపోతే
నీవు నిదురనే ఛీదరిస్తావన్న బెంగ నాకు!!
లాభం లేకనే నీ జ్ఞాపకాల వ్యాపారమే చేసి
తలచి తలచి నిన్ను నేను అలసిపోయాను
ఇకపై నీ తలపుల్లో నేను ఉండిపోతానుమరి!!
కన్నీటికి కారణం తెలిసి వెతుకుతావెందుకో
కంటినిండా నిన్ను చూసుకోమని కోరతావు
కనులనిండా నీటితో నీవు కానరాకున్నావు!!
నీ జ్ఞాపకాలో లేక నేను అణచుకున్న వలపో
ఉండుండి కొట్టుకునే గుండెని మెలిపెడుతుంది
నా వ్యసనమైన తలపునైనా వీడిపోరాదామరి!!
నన్ను తలవక నిదురించే అలవాటు నీకు
ReplyDeleteనిన్ను వీడి శాస్వితంగా నేను నిదురపోతే
నీవు నిదురనే ఛీదరిస్తావన్న బెంగ నాకు!!
ఇంతగా హృదయాన్ని ద్రవింప చేసే వాక్యముంటుందా? ఉండదుగాక ఉండదు. ఎదను కోసే ఈ కవిత చదివాక కన్నీళ్ళింకా మిగిలి వుంటాయా? :-(
జ్ఞాపకాల గుభాళింపుల్లో ఎడబాటు మేళవింపులు... ఎటువంటి భావాన్నైనా హృద్యంగా అక్షరీకరించి మా హృదయాలను తడమడంలో అందెవేసిన చేయి మేడం మిది.
ReplyDeleteపద్మార్పిత భావాలు
వేదన అంచులపై ప్రవహించే ప్రేమ కెరటాలు...
వలపు వాగుల్లో ఉప్పొంగే ఎడబాటు తరంగాలు...
హ్యాట్సాఫ్ ....
పద్మా!
ReplyDeleteఎంత చక్కటి పద కూర్పు భావ పరాకాంక్షతో .
ఎటువంటి వారినైనా ఆకర్షించే ఆ పదాల పొందిక .
అలవోక చూపుల అబల సబలలా ధీమా చూపులు భీమా చేసినదానిలా .
నన్ను తలవక నిదురించే అలవాటు నీకు
నిన్ను వీడి శాశ్వతంగా నేను నిదురపోతే
నీవు నిదురనే ఛీదరిస్తావన్న బెంగ నాకు!!
కన్నీటికి కారణం తెలిసి వెతుకుతావెందుకో
కంటినిండా నిన్ను చూసుకోమని కోరతావు
కనులనిండా నీటితో నీవు కానరాకున్నావు!!
Extraordinary emotional heart touching feels from you Padmarpita. claps_/\_ claps_/\_ just claps
ReplyDeleteఏమని వర్ణించను మీ సౌమ్యభావ ప్రకటన పదవిన్యాసాలని. మీ ప్రజ్ఞాకౌసల్య పాండిత్యానికి ప్రణమిల్లుతున్నాను పద్మగారు.
ReplyDeleteపద్మా...వండర్ ఫుల్ రా. ఆ అలోచనలకి, నీ పదాలకి వందనం. మనసు గురించి ఇంతందంగా చెప్పేవారు నువ్వు తప్ప నాకు ఇంతవరకు ఎవ్వరూ తారసపడలేదు. నీ మునివేళ్ళని ముద్దాడలని అంటే నీ మాటల్లోనే చిత్రమని చిరునవ్వు నవ్వకు.One of the best heart feel this is. keep it up.
ReplyDeleteఅందమైన వెల్లువ మీ కవితా ప్రవాహం. ఇలా ఎన్నిమార్లు అన్నా తనివితీరదు.
ReplyDeleteలాభం లేకనే నీ జ్ఞాపకాల వ్యాపారమే చేసి
తలచి తలచి నిన్ను నేను అలసిపోయాను
ఇకపై నీ తలపుల్లో నేను ఉండిపోతానుమరి!!
ఇలాంటి భావాలు మీకే సొంతం.
దూరమైతే రోజంతా నీ తలపుల్లో నేనేనని
ReplyDeleteనిన్ను వీడి శాస్వితంగా నేను నిదురపోతే
నీవు నిదురనే ఛీదరిస్తావన్న బెంగ నాకు!!
లాభం లేకనే నీ జ్ఞాపకాల వ్యాపారమే చేసి
తలచి తలచి నిన్ను నేను అలసిపోయాను
కంటినిండా నిన్ను చూసుకోమని కోరతావు
కనులనిండా నీటితో నీవు కానరాకున్నావు!!
ఉండుండి కొట్టుకునే గుండెని మెలిపెడుతుంది
నా వ్యసనమైన తలపునైనా వీడిపోరాదామరి!!
ఈ అత్యద్భుత భావాలు మీవే అయినా ఆనందించే భాగ్యం మాదే.
We all are lucky enough to have you my "Poetess Queen"
ఈ చిత్రంలోని భావం పూర్తిగా పారదర్శకం. అబల బేల కాదు సబల. ఎంతటి నిరుత్సాహంలో కూడా ఆమెలొ దాగిన ఆత్మస్థైర్యం ఆ మోములో కనిపిస్తుంది. ఆ ఠీవి ఆ దర్జా పద్మార్పితగారి కధానాయకికే చెల్లు. అందులో అంతర్లీనంగా పద్మగారు కనిపిస్తున్నారు అని నాకు తెలుసునని మీ అందరికీ తెలిసిపోయిందని నాకు తెలుసు. మరి పద్మగారికి తెలుసో లేదో:-) సతీష్ గారి డూటీ నేను చేసానని ఎన్ని చీవాట్లు వేస్తారో మా మాష్టారుగారు చూడాలి. పైకి తిట్టినా లోలోపల నవ్వుతారులెండి.
ReplyDeleteSuperb painting .
ఆకాంక్ష నీవు చిత్రంపై కమెంట్ అదరగొట్టవనే మీ గురువుగారు గైర్ హాజరై ఉంటారు. :-) మస్తుగా రాసినావ్.
Deleteమంచిగఉంది మాడామ్.. Pranam Padmaji, maine telugu mein likhne ki koshish kee. galth hotho kshama karna. aap ki yeh kavitha dil ko chooliya.
ReplyDeleteనీ జ్ఞాపకాలో లేక నేను అణచుకున్న వలపో
ReplyDeleteఉండుండి కొట్టుకునే గుండెని మెలిపెడుతుంది
నా వ్యసనమైన తలపునైనా వీడిపోరాదామరి!!
heart touching way. beautiful painting n poem
కవిత చాలా బాగుంది... వచ్చినా కామెంట్స్ కూడా బాగున్నాయి :)
ReplyDeleteఏం చెప్పినా మీదే రైట్ అనేలా మీ కవితలతో ఏదో కనికట్టు చేస్తారు పద్మ అందుకే మేమే వ్యసనానికి బానిసలం. వీడిపొమ్మన్నా పోలేము.
ReplyDeleteజ్ఞాపకాల సడిలో రేగే భావమేదో మరువలేని భావం లా లా కరిగిపోని కలగా ఆశల వలయం లా మారి
ReplyDeleteకన్నిరునే కరిగించి దీపపు కుండీలో నీ అనుపమాన జ్ఞాపకాల చిరు దీపం వెలుగులు పంచుతూ ఆ చీకటి ని పారద్రోలి జ్ఞాపకాలు నిజమే కావాలని ఆకాంక్ష పద్మ గారు
నన్ను తలవక నిదురించే అలవాటు నీకు
ReplyDeleteనిన్ను వీడి శాస్వితంగా నేను నిదురపోతే
నీవు నిదురనే ఛీదరిస్తావన్న బెంగ నాకు!!
ఇలా మాట్లాడి మనసుని పిండేస్తారు. ఎలా వస్తాయో మీకు ఇలాంటి భావాలు.
హాయ్ హాయి గా ఉంది నీ కవితలు చదువుతూ ఉంటే. లాభం లేకనే నీ జ్ఞాపకాల వ్యాపారమే చేసి
ReplyDeleteతలచి తలచి నిన్ను నేను అలసిపోయాను, ఇకపై నీ తలపుల్లో నేను ఉండిపోతానుమరి!! ఎంత అందంగా రాసారో మాటల్లో చెప్పలేను... " నీ తలపుల్లో నేను ఉండిపోతాను " ఆ మాటే అధ్బుతంగా ఉంది... కవితకు తగ్గ పిచ్ అచ్చు బాపు బొమ్మలా ఉంది. సూపర్..
Than Q very very much for giving beautiful poem & wonderful pic... keep rocking Madame..
ReplyDeleteనన్ను తలవక నిదురించే అలవాటు నీకు
ReplyDeleteనిన్ను వీడి శాస్వితంగా నేను నిదురపోతే
నీవు నిదురనే ఛీదరిస్తావన్న బెంగ నాకు!!
Priyurali mouna vedhanani Chala baga rasaru madam . Above words are fantastic and the total poem is heart touched.
శిలనైనా కరిగించే కమ్మని భావాలు వాటికి తగ్గ రూపాలు మీ ప్రతి కవితలో చూస్తున్నా మళ్ళీ మళ్ళీ చదివితే మరో కొత్తరూపం మరో కొత్తభావం గోచరిస్తుంది. ఆ కోవకి చెందిందే ఇదికూడా. అభినందనలు పద్మార్పిత.
ReplyDeleteనన్ను తలవక నిదురించే అలవాటు నీకు
ReplyDeleteనిన్ను వీడి శాస్వితంగా నేను నిదురపోతే
నీవు నిదురనే ఛీదరిస్తావన్న బెంగ నాకు!!
ఈ మాటలకి మనసు మారనివాడు మనిషేకాడు.
నీ కవితల్లో ఇలాంటి సున్నితభావాలు కోకొల్లలు. అందుకే నీకు అభిమానుల ఆశిస్సులు పదివేలు-హరినాధ్
జ్ఞాపకాల వ్యాపారం లాభం లేకపోయినా, కొత్త ప్రయోగం బాగుంది మేడం
ReplyDelete"తలపుల్ని తట్టిలేప కూడదని తలకి కట్టు కడితే
ReplyDeleteకంటినిండా నీరుకార్చి తడిసి మోపెడయ్యిందట."
అయినా ఇలాంటి కవితలకి కమెంట్లు పెట్టాలంటే కష్టం తల్లో అర్పితమ్మా కాస్త నా సామెతలకి అనువుగా కవితలు రాయమ్మా.
కవితకి తిరుగులేదు. నా దగ్గర మెచ్చుకోలు కవితా లేదు.
నాగురించేనేమో :-). Super Poem with rocking pic :-))
ReplyDeleteనన్ను ఇంతగా ఆదరించి అభిమానిస్తున్న అందరికీ పేరు పేరునా వందనం._/\_. మన్నించాలి విడిగా రిప్లైస్ ఇవ్వనందుకు-పద్మార్పిత
ReplyDeletethank you. slowly give replies padmagaaroo. don't disappoint us.
Deleteపద్మా గారు! మొదటిసారి నేను మీ బ్లాగు చూస్తున్నాను.....ఓ కవితా సముద్రాన్ని చూస్తున్నట్లనిపిస్తుంది, చాలా బాగా రాసారండి.
ReplyDeletewww.veerublog.blogspot.com
welcome to my blog. mee blog chusanu. manchi creativity meelo
Delete