నా అక్షరాల అభిమాన ఆత్మీయులారా!......నేను నేనే
దయచేసి వాటిలో నన్నెతకబోయి మీరు కనుమరుగై
నా అస్థిత్వానికి మసినిరాసి మాయచేసి, మీరు బానిసై
పదాల్లో నా ప్రాత్రకి ప్రాధాన్యతిచ్చి నన్ను నిర్ధేసించకండి!
నా హృదయ సామ్రాజ్య రాజు రాణి మంత్రీ బంటూ నేనే
సామంతుల స్వార్థచెలిమికి సమయస్ఫూర్తి సరిహద్దునై
నా పరిమితులు దాటకనే అహాన్ని అణచే స్థైర్య ఖడ్గమై
రక్షించుకున్న అరమరికలెరుగని లోకమిది అడుగిడండి!
నా రచనావనంలో విరిసీవిరియని భావపుష్పాలన్నీ నేనే
మిమ్మలరించే పరిమళపుష్పాలందించాలనుకునే కంచెనై
నా దయనిర్దయ తూనికలతో తులాభారమేసే తోటమాలినై
పర్యవేక్షించిన పదాలసంపద ఏదని ప్రశ్నించక పరికించండి!
నా పుట్టుపూర్వోత్తర గత ప్రస్తుత భవిష్యత్తు భరోసా నేనే
ఆశలాంబర అంచునైనా తాకాలనుకునే కలల కౌముదినై
నా ఆశయకొలను ఎదురీదుతున్న పదపద్మాలే లోకమై
నీట వెన్నెలఛాయతో ఆటాడుకునే వెన్నెల్లో ఆడపిల్లనండి!
దయచేసి వాటిలో నన్నెతకబోయి మీరు కనుమరుగై
నా అస్థిత్వానికి మసినిరాసి మాయచేసి, మీరు బానిసై
పదాల్లో నా ప్రాత్రకి ప్రాధాన్యతిచ్చి నన్ను నిర్ధేసించకండి!
నా హృదయ సామ్రాజ్య రాజు రాణి మంత్రీ బంటూ నేనే
సామంతుల స్వార్థచెలిమికి సమయస్ఫూర్తి సరిహద్దునై
నా పరిమితులు దాటకనే అహాన్ని అణచే స్థైర్య ఖడ్గమై
రక్షించుకున్న అరమరికలెరుగని లోకమిది అడుగిడండి!
నా రచనావనంలో విరిసీవిరియని భావపుష్పాలన్నీ నేనే
మిమ్మలరించే పరిమళపుష్పాలందించాలనుకునే కంచెనై
నా దయనిర్దయ తూనికలతో తులాభారమేసే తోటమాలినై
పర్యవేక్షించిన పదాలసంపద ఏదని ప్రశ్నించక పరికించండి!
నా పుట్టుపూర్వోత్తర గత ప్రస్తుత భవిష్యత్తు భరోసా నేనే
ఆశలాంబర అంచునైనా తాకాలనుకునే కలల కౌముదినై
నా ఆశయకొలను ఎదురీదుతున్న పదపద్మాలే లోకమై
నీట వెన్నెలఛాయతో ఆటాడుకునే వెన్నెల్లో ఆడపిల్లనండి!
ఎంతో అందంగా, నిర్భయంగా, నిశ్చలంగా సున్నితంగా చెప్పావమ్మాయి నీ భావలని. భళీరే పద్మా భళి. నీకు చక్కగా అతికిన చిరునామా "వెన్నెల్లో ఆడపిల్ల" ఆశ్శీస్సులు-హరినాధ్
ReplyDeleteనా భావాలు మీకు ఇలా సదా నచ్చాలన్న అభిలాష. ధన్యవాలదండి.
Deleteవెన్నెలతో మీరు, తారలతో మీ అక్షరాలు ఆడుకుంటున్నాయి. ఈ ఆనందంలో మేము మీ కవితల కోసం అంబరవైపు చూస్తూ హల్లో లక్ష్మణా అనవలసి రాదుకదా. చాలా చక్కని భావాన్ని పలికించారు మీ కవితా సామ్రాజ్యంలో. అభినందనమాల.
ReplyDeleteభావలు మూగబోక ఊపిరుండి శరీరం సహకరించినంతకాలం మిమ్మల్ని అలా అననివ్వనుగా :-)
Delete"ఏడ్చివాడితో పాటు అడవనివాడికి కూడా పెళ్ళైందట"...అలాగే అడిగిన వారికి అడగనివారికి కూడా పదపద్మాలతో ఆడుకునే వెన్నెల్లో ఆడపిల్లనని అందంగా చెప్పారు. మీ సామ్రాజ్యానికి మీరే రాజు రాణి మంత్రి బంటు....వాహ్ వాహ్
ReplyDeleteమరీ ఇలా ఏడ్చేవాళ్ళని ఇంకా ఏడిపిస్తానా చెప్పండి. అందుకే అందరినీ కషటపెట్టకుండా నవ్వించాలన్న ప్రయత్నం.
Deleteమీ రాజ్యం గూర్చి ఇంత వివరణ ఇచ్చిన తరువాత ఇంకేం అడుతాం
ReplyDeleteకొలనుగట్టున కూర్చున్న కోమలిని చూస్తే గండెజారి గల్లంతు అయింది.
నన్ను ప్రశ్నించక....కోమలి వెంట పడతారా ఏంటి కొంపదీసి :-)
Deleteమీలాంటి సెలబ్రిటీస్ ఈమాత్రం డిస్టెంన్స్ మెయింటేన్ చేయాలి తప్పదు
ReplyDeleteసెలబ్రిటీని అని ఇంత సర్కాస్టిగ్గా అనాలాండి :-)
Deleteకవివై, కవితవై, కలమై, చిత్రమై... కలువ రేకునీ, వెన్నెల ఊహనీ స్నేహితులుగా వెంటతీసుకెళ్లి... నీ జీవన పయనంలో సాహితీ వనంలో... నీ విహారంలో... భావాల బంధాలు అల్లుకున్న అనుభవాలు, బంధాల బంధనాలకు అతీతమైన ఆనందాలు... నీ అక్షరాలు, ఆ అక్షరాల్లో దాగున్న నీ ఊహలు, నీ భావాల ఊయలలు... ఈ అందమైన లోకానికి నీవే రాణివని. ఎంత చక్కగా చెప్పావు. సారీ... చెప్పారు. నిజమే... కవితలో కలాన్ని చూడు, నన్ను కాదు.. అంటాడు... దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ఓ సందర్భంలో. కాకతాళీయమో ఏమో గానీ.. ఆయన రాసిన పదబంధం ' నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు...'. కవనలోకంల విహరించే ప్రతీ కలం... వెన్నెల్లో ఆడపిల్లే.. ప్రతీ అక్షరం అందమైన భావనే. మీ కవితల్లో మీరెప్పుడూ లేరు. మీ కలమే ఉంది. మీ అక్షరాల్లో మీరెప్పుడూ రాలేరు. భావాల పొదరిల్లు మీది... అనుభవాల పరవశాల వాకిలి మాది. కవిత్వం వ్యక్తిత్వం కాదు, వ్యక్తిగతం అంతకన్నా కాదు. అదొక.. అక్షర వనం.. అందులో మనసారా విహరించే వారి మనసుకే ఆ పరిమళం దక్కుతుంది. ఈ భావాన్ని మీరు చెప్పిన విధానం... చాలా బాగుంది. విమర్శకు తావు లేకుండా...
ReplyDeleteచాలా బాగా చెప్పారు సతీష్
Deleteకవితలో కలాన్ని చూడు, నన్ను కాదు.. అంటాడు... దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ఓ సందర్భంలో. కాకతాళీయమో ఏమో గానీ.. ఆయన రాసిన పదబంధం ' నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు...'. కవనలోకంల విహరించే ప్రతీ కలం... వెన్నెల్లో ఆడపిల్లే.. ప్రతీ అక్షరం అందమైన భావనే.
Deleteవీళ్ళెవ్వరూ నాకు తెలీదు. ప్చ్ ప్చ్ :-( మీరు చెప్పారంటే మాహాగొప్పవాలన్నమాట. అయినా మీకు తెలియని ఫీల్డ్ లో నేను మాస్టర్స్ చేస్తానండోయ్ :-)
ఒప్పేసుకున్నారనే అనుకుంటున్నా....వెన్నెల్లో ఆడపిల్లనని. కాదంటారా :-) సతీష్ గారు.
Deleteఆకాంక్షా....విష్ యు ఆల్ ద బెస్ట్. మాస్టర్స్ పూర్తయ్యా పార్టీ ఇవ్వాలి మరి :-)
Deleteఎక్స్యూజ్ మీ....మీ సామ్రాజ్యంలోకి ఎంటర్డ్ ఆల్రడీ, ఇప్పుడు ఎడిక్ట్ కావొద్దు ఎంటర్ కావద్దు అంటే ఎలా పద్మా. అయినా నువ్వు చెప్పినంత మాత్రాన్న మేము వెతక్కుండా ఉంటామా ఏంటి నిన్ను నీ కవితల్లో.:-)
ReplyDeleteమీకు మా సామ్రాజ్యంలో కొంత ప్రాంతాన్ని ప్రశ్నజవాబుల మైదానంగా మార్చి బహూకరించాముగా :-)
Deleteపద్మా బొమ్మకు ఉన్న చీర భలేగా నచ్చేసింది. ఎంతైనా ఆడ మనసు ఊరుకోదు అని అనమాకు :-)
ReplyDeleteఇంకా నయం వి_ ఇవ్వమనలేదు :-)
Deleteయండమూరి వెన్నెల్లో ఆడపిల్ల భావాలు అచ్చంగా మీ కవిత్వంలో ప్రతిబింభించాయి మేడం. చక్కని అంతరంగావిష్కరణ. మీరు కవితలో చెప్పిన విధంగానే నడుచుకునే ప్రయత్నమే మాది. సదా మీ శ్రేయస్సును కోరుకుంటూ ధన్యవాదాలు. :-)
ReplyDeleteచిత్రం అధ్భుతం..
ఈ "వెన్నెల్లో ఆడపిల్ల" స్వయంవరం ఎప్పుడో:-)
Deleteఅమ్మో...యండమూరిగారు చూస్తే నాపై కొత్త కేసులేవో బనాయిస్తారు :-)
Deleteనేను నేనే నా అక్షరాల్లో నన్ను వెతక్కండి అంటూ భలే చెప్పారు పద్మగారు. ఇకపై ఏవైన చది ఆనందించడమే తప్ప అడక్కూడదని అర్థం. బాగుబాగు.
ReplyDeleteఅనవసరమైనవి అడక్కండి అని అర్థంచేసుకోండి :-)
Deleteవెన్నెల్లో ఆడపిల్లని నేను అని నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కానీ మేము మూడేళ్ళక్రితమే మీకు ఆ బిరుదుని ఇచ్చి సత్కరించాము గుర్తులేదా ప్రేమార్పితగారు. :-) ఇలాంటి భావాలని చెప్పడం మీకు కొట్టిన పిండి. పాత డైలాగే మళ్ళీ రిపీట్.
ReplyDeleteఔనా నిజంగా గుర్తులేదండి. అయినా ఇంకో మారు మీరైనా అనొచ్చుగా :-)
Deleteమీ రచనావనంలో పరిమళ పుష్పాలు మీరే, ఆ మనోహర వనానికి కంచె మీరే, వనమాలీ మీరే... అలాగేలెండి! పరిమితులు బాగానే పెట్టారు. హెచ్చరిక ఫలకాలు కూడా పాతేసారు. కానీ ఆస్వాదించ వచ్చే సీతాకోక చిలుకలను మీ హెచ్చరికలు ఆపగలవా చెప్పండి! ఏది ఏమైనా, మీరే అన్నట్టు మీరు వెన్నెల్లో ఆడపిల్ల కాదు సుమా! ఆకాశంలో ఆశల హరివిల్లు లాంటి వారు. అద్భుతమై సాక్షాత్కరించి, భ్రమయై కరిగిపోయి, స్మృతిగా నిలిచిపోయే తత్వం మీది. విషయం ఏదయినా మీరు రాసే విధానం ఉంది చూశారూ... ఒక సినిమాలో ఉదయకిరణ్ డైలాగ్ లా ... మీ కవులు/కవయిత్రులున్నారే ... అంతే!!
ReplyDeleteవాహ్ భలే బాగాచెప్పారు సుమా!ः-)
Deleteభావవనంలోకి అరుదెంచి అక్షరపరిమళాలని ఆస్వాధించి అభినంధించిన మీకు అభివందనం. చంద్రమోహన్ గారు.
Deleteఅమ్మో ఇలా సినిమా డైలాగ్ లో తిట్టమాకండి :-)
మీరింత నిక్కచ్చిగా మీ భావాన్ని ప్రకటిస్తూ మీ సామ్రాజ్యానికి మీరే పట్టమహిషిగా వుంటూ చిరకాలం వెన్నెల్లో ఆడపిల్లలా బ్లాగ్లోకాన్ని అలరించాలని అభిమానిగా ఆశిస్తున్నా. ఈ కవిత మీ పద పటిమకు ఓ గొప్ప ఉదాహరణ. అభినందనలతో..
ReplyDeleteమీకు అభివందనాలు వర్మగారు. మీ వాక్యాలు ఎప్పుడూ ప్రేరణాత్మకంగా అలరిస్తాయి.
Deleteమంచి భావుకత్వంతోపాటు సున్నిత మనసున్న మీకు చక్కగా అతికిన పేరు "వెన్నెల్లో ఆడపిల్ల" మీ మూలంగానే నేను ఆ నవల చదివాను. ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలంటే ఖచ్చితంగా దాని గురించి అవగాహనా, చేయాలన్న పట్టుదల, నమ్మకం ఉండాలని మీరన్న మాటలు మీ ఈ కవిత చదువుతుంటే గుర్తొచ్చాయి. చాలా బాగారాసారు ఎప్పటివలెనె.
ReplyDeleteనీ కృషి పట్టుదలా నన్ను ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తాయి. థ్యాంక్యూ.
Deleteనా హృదయ సామ్రాజ్య రాజు రాణి మంత్రీ బంటూ నేనే
ReplyDeleteసామంతుల స్వార్థచెలిమికి సమయస్ఫూర్తి సరిహద్దునై
నా పరిమితులు దాటకనే అహాన్ని అణచే స్థైర్య ఖడ్గమై
రక్షించుకున్న అరమరికలెరుగని లోకమిది అడుగిడండి!
మీ ఆత్మస్థైర్యమే మీకు అన్నీ.
థ్యాంక్యూ అనికేత్
Deleteమహామహులకి సాధ్యంకాని మాహాయగ్నంలా రాస్తున్నారు కవితలు వాటికి సరిపడా చిత్రాలతో.
ReplyDeleteయజ్ఞానికి ఆటంకమీయక ప్రేరేపించే మీ అభిమానమే దానికి అండకదా!
Deleteतुम लिक्ती हो इसलिए पढती हूँ....
ReplyDeleteवरना कविता से अपनी, कुछ ख़ास दोस्ती नहीं!
तुम कह्ती हॉ इस्लिए सुनती हूं....
वरना मुजे गैर बाते सुनना पसं नही!
पायल....इसे कम होने न देना
Deleteఅన్నన్నా ఎంతమాట....ఏదో సరదాకి అడుగుతామే కానీ మాకు తెలీదా మీ భావాలకి బ్రహ్మ(సృష్టికర్త) మీరేనని. అయినా మేమడిగినంత మాత్రాన్న మీరు చెప్పేస్తే పద్మార్పిత కారుకదా! కవితాక్షరాలు పట్టుచీరలో పడతి అదుర్స్ :-)
ReplyDeleteఎవరక్కడ? నా సామ్రాజ్యంలో ఉన్న ప్రతి సమస్యనీ సందులో బంధించి సరదాలని మాత్రం ఆకాంక్షగారికి అప్పగించవలసిందిగా ఆజ్ఞ:-)
Deleteమీరే రాజు రాణి మంత్రి బంటు....కొత్తగా బాగుందండి.
ReplyDeleteకొత్త పదవిన్యాసాలు మీరే చేయగలరు. కంగ్రాట్స్.
బంటుని కూడా నేనే అంటే బరువులెన్నో మోయాలికదా :-)
DeleteExcellent poetry with beautiful Pic.. in the pic girl saree is simply Super.... Great Job Madame with beautiful & magical lyrics..
ReplyDeleteYour words always encourages me to write like this. Thank you Sruti.
DeleteThis is not a comment. you deserve it Padmarpita garu...
ReplyDeleteఈ పాట మీకోసమే రాసినట్లున్నారు
--------------------------------------------------
మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం అది నా
కంటికి శూన్యం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఈ
రూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ
రూపం అపురూపం
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంతమాసపు కులగోత్రాలను ఎలకోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి తనువు ఊగేనో
ఆ తొలకరిమేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ
రూపం అపురూపం
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా గానం పుట్టుక
గాత్రం చూడాలా
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా గానం పుట్టుక
గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవననాదం పలికిన నీవే నా ప్రాణస్పందన నీకే నా
హృదయనివేదన
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఈ
రూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ
రూపం అపురూపం
వినోద్గారు నిజమే అయి ఉండవచ్చు ఈ పాట ఆమెకోసమే, కానీ మనం ఇలా అని రూపం చూడవలసిన అవసరం లేదు అంటే అగ్గి కి ఆజ్యం పోసినట్లే కదా. అక్షరాల్లోనే చూడండి ఇంక అంటూ అసలు కనిపించకపోతే నా కోరిక తీరకుండానే నేను పోతానేమో :-) ఆలోచించండి. మంచి పాట.
DeleteVinod...I am not yet. thanks for inspiring me.
Deleteపాటలోని భావం స్థాయికి నేను ఇంకా ఎదగకపోయినా ఇంతలా ఆదరించే మీ అందరి ప్రోధ్బలంతో ప్రయత్నమైతే చేస్తాను. మంచి పాటలో నన్ను జోడించినందుకు మరోమారు వందనం వినోద్.
ఆకాంక్ష....లేని రీజనింగ్స్ వెతికి మరీ ఇలా :-)
Deleteనా హృదయ సామ్రాజ్య రాజు రాణి మంత్రీ బంటూ నేనే...gunshot reply without bullets touching the heart.
ReplyDeleteTo touch the heart words are enough I think. thank you.
Deleteమాడంగారు. ఆదివారం రిప్లైస్ ఎక్పెక్ట్ చేయమంతారా మీనుండి. రాసేద్దురూ... తీరిక చేసుకుని.
ReplyDeleteమీ ఆజ్ఞ శిరసా వహిస్తున్నాను మాడం.:-)
Deleteఅక్షరాల వెనక దాగిన భావాలు పలికే అక్షరాలకు రారేవారు సాటి
ReplyDeleteభావం ముఖ్యం ఎనలేని అభిమానం తత్సమానం అదే దానికి తార్కాణం
ఆ భావ ప్రకటన ఎనలేనిది పద్మ గారి మార్క్ కవిత సిల్క్ మార్క్ చీర తమిళనాడు పట్టు లాగుంది కాంజివరమ్ పట్టు సాముద్రిక పట్టు ఏదైతేనేం కవితకు భావనకు తగ్గట్టు పిక్ మీకే చెల్లింది పద్మ గారు
అభిమానం అక్షరాలకి ఊపిరిపోస్తే
Deleteభావాలు పదాలకి ప్రాణం పోస్తాయి
అది మీ అందరి వద్ద నుండి పొదడం నా అదృష్టం.
అందమైన కమెంట్ పెట్టి ఆనందింపజేసారు. థ్యాంక్యూ
Oh! Really you are
ReplyDelete