అందమైన ఆలు


ఆలుగడ్డ (బంగాళాదుంప) ఒకరోజు బెండకాయకి ఫోన్ చేసి "ఐ లవ్ యు" అంది.
ఇది విని బెరుకులేని బెండకాయ....అబ్బో! నీకు అంత సీన్ లేదు, ఒక ఫిగర్ లేదు, బండలా గుండ్రంగా ఉంటావు. అందరికీ అందుబాటులో దొరికే చౌకరకం నీవు. నీకు నాలాంటి నాజూకుదే కావాల్సి వచ్చిందా అంటూ చెడామడా తిట్టేసింది.
ఆలుగడ్డ అహం దెబ్బతిని, మనసు గట్టిచేసుకుని మెత్తని మాటలతో కనబడిన కూరగాయని పలకరించి మచ్చిక చేసుకుని కలిసి మెలగసాగింది.
దీని పర్యవసానమేంటో ప్రస్తుతం మనం కలిపి వండుకుని తింటున్న కూరల కాంబినేషన్ చూస్తే తెలుస్తుంది.
ఇవి కొన్ని:-
ఆలు-కాలీప్లవర్
ఆలు-మటర్(బఠాణీ)
ఆలు-మెంతికూర
ఆలు-వంకాయ
ఆలు- టమాటా
ఆలు-పాలకూర
ఇలా ఆలుగడ్డ కూరగాలన్నింటికీ చేదోడుగా కలిసి తల్లో నాలుకలా మెలుగుతూ ఆలు లేని ఆహారం అంధకారం అన్నట్లుగా పేరు తెచ్చుకుంది.
బెండకాయ సంగతి ఏంటి అని మీరు అడగక పోయినా విషయాన్ని పూర్తిగా చెప్పాలి కనుక చెబుతున్నాను....ఏముంది నాజుకు నయగారం కూరగారాల బెండకాయ ఏది కలిసినా జిగురు అంటి...ఛీ  ఛీ అంటూ చీదరించుకునేలా మారి ఒంటిగానే మిగిలిపోయింది....ఇదీ సంగతి! :-)

మరి నీతి సంగతి :-).....వద్దు...వద్దు ...వద్దంటారా!
వద్దనుకునే వాళ్ళు చదవకండి....ప్లీజ్ ప్లీజ్!
బెండకాయ నీతి:-
1. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి
2. అందముందని అహంకారానికి పోరాదు.
ఆలుగడ్డ నీతి :-
1. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.

25 comments:

  1. మంచి చిరు కథ :-)
    చాలా బాగుంది :-)

    ReplyDelete
  2. hasyamlo sandesham ichcharu. good madam

    ReplyDelete
  3. కూరగాయల ప్రణయంలో కూడా
    వేదన మిళితం చేయకుండా వదలరు కదా !!!
    పాపం బెండకాయ!!!
    ప్రక్కదారి పట్టి, కొబ్బరి కోరు తోనూ
    మెత్తని పకోడీల తోనూ సర్దుకు పోతోంది పాపం!!!
    (నాకు తెలిసినవి ఈ రెండేనోచ్చి ...)

    ReplyDelete
  4. నేను కదూ .....సామెతలు చెప్పవలసింది. నా వెర్రి కానీ మీరు వేటిని వదిలేసారని:-) l love Aloo...

    ReplyDelete
  5. హమ్మయ్యా... పాత పద్మార్పిత మళ్ళీ పుట్టినట్లుంది. పాత పోస్టులు గుర్తొస్తున్నాయి మేడం... చాలా నచ్చేసింది.. ఆలు బెండకాయల లవ్ స్టోరీ...

    ReplyDelete
  6. నాకు తెలిసిననంతవరకు ఆలు బెండకాయ ఒకే చోట కలుస్తాయి అవి కూడా గుంపులో గోవిందం చందాన సాంబారులో మాత్రమే. ఐన అన్ని కూరకాయలు ఉండటం చేత దానిని కౌంట్ లోకి తీసుకోరనుకోండి.
    మరో విషయం బెండకాయ తింటూ ఉంటె మొహం మొత్తేస్తుంటుంది (రోజు ఇదేనా అని) , అదే ఆలు ఐతేనా ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది మీరన్న కాంబినేషన్స్ అన్ని రుచి కి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. మొత్తానికి మంచి క(థ/వ)నం అందించారు నీతి సూక్తి తో సహా. తినబోతూ రుచులేందుకు అన్నట్టు. బహు బాగు పద్మగారు.

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్ గారు....ఆలు తింటే బాలులా బెండకాయ తింటే తెలివి పెరుగుతుంది అంటారు...మరి దీనికేమంటారు. :-)

      Delete
    2. ఏమంటాను చెప్పండి ఆలు పరోట చేసుకుని బెండకాయి వేపుడు తో నంజుకుంటాను (మీది మరి వింత టేస్ట్ అని అనమాకండి కొసమెరుపు లో కిసుకు :) ఆకాంక్ష గారు

      Delete
  7. కాయగూరలతో కమ్మని కబుర్లు చెప్పించి మంచి నీతిని బోధించారు. హాస్యం కూడా పండించారు అర్పితగారు

    ReplyDelete
  8. అందమైన ఆలు
    అర్పిత అల్లరి పదాలు
    ఆచరణ ఆమోదముద్రలు
    -హరినాధ్

    ReplyDelete
  9. superb..badhaa pyaara aaloo

    ReplyDelete
  10. మరి ఆలు - మగల సంగతేంటి ?

    ReplyDelete
  11. అందుకే బెండకాయకు లేడీ ఫింగర్ అని పెరెట్టారేమో!
    అందంగా ఉన్నామనే పొగరు. అదే జిగురుగా మారింది. ముద్దొచ్చినప్పుడు చంకెక్కరు? తలెక్కి కూర్చుంటారు. ఆనక వలస బంధాలు అదీ ఇదీ అని బంధాలపై ఆరోపణలు. ఆలు కథ బాగుంది. మీరు 'ఆలు' రౌండర్.

    ReplyDelete
  12. ha ha ha Its really funny... last lo chepparugaa నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది. idi nijam... chala bagundi. meeru matrame ila raayagalru..

    ReplyDelete
  13. పద్మా చాలారోజులకి సరదాగా నీ స్టైల్లో వ్రాసి ముచ్చటగా మూడు నీతులు చెప్పావు.

    ReplyDelete
  14. కూరగాయల్లోను కరుణ చూపించారు మీకు వందనాలమ్మ. :-)

    ReplyDelete
  15. పద్మా ,

    ఆలు అలా ఎందుకో కలిసిపో ప్రయత్నించిందో తెలుసా ?

    ఆలు అంటే అర్ధం ఓ ఇల్లాలు అని . ఇల్లాలు అలా ఆ యింటిలోని వారందరితో ( వాళ్ళు ఎలా వున్నా ) కలిసి మెలసి వుంటుందో అలా ఈ ఆలు కూడా కలిసిపోతోంది .

    నైస్ .

    ReplyDelete
  16. పద్మగారికి చాలా వంటలు వచ్చని.. వాటిని ఎంతో రుచికరంగా వండుతారని అర్థమైంది. మీ వంట తినే భాగ్యం మాకెప్పుడో....

    ReplyDelete
    Replies
    1. కుశలమే అని అర్థమైంది. పద్మగారేమో కానీ మీకు మాత్రం ఖచ్చితంగా వంటలో ప్రావీణ్యం ఉందండి :-)

      Delete
  17. ఓహో....పాత ఫాంలో రాసేసారు. సూపరండి

    ReplyDelete
  18. మాడం త్వరలో పప్పన్నం వద్దులే ఆలు అన్నం పెట్టండి.:)

    ReplyDelete
  19. ప్రతీ పోస్ట్ లో మిమ్మల్ని చూస్తాం కదా....ఇంతకీ ఇక్కడ ఆలూనా లేక బెండకాయా మీరు.

    ReplyDelete
  20. మంచి సందేశాన్ని ఇచ్చారు.

    ReplyDelete
  21. నేను చెప్పిన కూరగాయల కబుర్లు చదివి ఆనందించిన అందరికీ దండాలు _/\_

    ReplyDelete