తామరాకుపై నీటిబొట్లు వంటి ఈ పరిచయాలు ఏలనో
పట్టుకుంటే జారిపోతూ ముట్టుకుంటే మాయమైపోయి
మనల్ని మనకు దూరంచేసి మనసునే శత్రువుగా మార్చి
ఏం మిగిల్చావు అంటే....శూన్యంలోకి చూపుడువేలెత్తి చూపి
తెలిసీ అడుగు వేసావు అంటూ ఎగతాళి చేస్తాయి.....ఎందుకో?
తుమ్మితే రాలిపోయే ముక్కు వంటి బంధాలు ఎందుకనో
అవసరాలకి వాడుకుని ఆపైన నక్కి జీవించే నక్కలైపోయి
అంటుకుంటే రాచుకుంటుందని విడిపోతూ మనసుని కాల్చి
కాలీకాలని శవంలా మిగిలుంటే.... తెలిసీ తెలియనట్లు తలూపి
చేసుకున్నవారికి చేసుకున్నంతంటూ ఉపదేశిస్తారు......ఎందుకో?
తెరవెనుక దాగి ముసుగుతీసి మంచివాళ్ళుగా నటించనేలనో
తనువుని కోరుతూ మనసిచ్చానని మాటల్లోనే తడబడిపోయి
వ్యామోహమంటే వెసులుబాటుకాదని ప్రేమంటూ దాన్ని మార్చి
కోరికల గాలమేదో విసిరేసావు అంటే.....విచిత్ర విన్యాసాలెన్నో చేసి
గోచరించని గొప్పగమ్యం ఇదంటూ చెప్పే గుప్తజ్ఞానులు......ఎందుకో?
పట్టుకుంటే జారిపోతూ ముట్టుకుంటే మాయమైపోయి
మనల్ని మనకు దూరంచేసి మనసునే శత్రువుగా మార్చి
ఏం మిగిల్చావు అంటే....శూన్యంలోకి చూపుడువేలెత్తి చూపి
తెలిసీ అడుగు వేసావు అంటూ ఎగతాళి చేస్తాయి.....ఎందుకో?
తుమ్మితే రాలిపోయే ముక్కు వంటి బంధాలు ఎందుకనో
అవసరాలకి వాడుకుని ఆపైన నక్కి జీవించే నక్కలైపోయి
అంటుకుంటే రాచుకుంటుందని విడిపోతూ మనసుని కాల్చి
కాలీకాలని శవంలా మిగిలుంటే.... తెలిసీ తెలియనట్లు తలూపి
చేసుకున్నవారికి చేసుకున్నంతంటూ ఉపదేశిస్తారు......ఎందుకో?
తెరవెనుక దాగి ముసుగుతీసి మంచివాళ్ళుగా నటించనేలనో
తనువుని కోరుతూ మనసిచ్చానని మాటల్లోనే తడబడిపోయి
వ్యామోహమంటే వెసులుబాటుకాదని ప్రేమంటూ దాన్ని మార్చి
కోరికల గాలమేదో విసిరేసావు అంటే.....విచిత్ర విన్యాసాలెన్నో చేసి
గోచరించని గొప్పగమ్యం ఇదంటూ చెప్పే గుప్తజ్ఞానులు......ఎందుకో?
ఎవరినో దుమ్మెత్తి పోసినారు మేడం. అక్కా అమ్మా అంటే జ్ఞానులం అయిపోము. అర్పిత తిట్టాల మేము నేర్వాల. పోటో చూసినాకనే సగం జ్ఞానం వచ్చేసినాది. మీరు ఇట్లనే రాయండ్రి.
ReplyDeleteదుమ్ము ఎవరిమీదో ఎత్తి పోస్తే ఎవరు ఊరుకుంటారు :-)
Deleteమీలో నిగూఢంగా చాలా అద్భుతభావాలు దాగి ఉన్నాయి పద్మగారు. వాటిని వాడిగా వేడిగా గురిచూసి వదులుతారు. ఎంతైనా మీరు మాగొప్ప జ్ఞానులు. :-)
ReplyDeleteపోనీలెండి...ఏదో ఒకటి అ కలపకుండా జ్ఞానులు అన్నారు.:-)
Deleteకవిత్వంలో వైవిధ్యంగా మనిషి వింతప్రోకడల్ని జొప్పించి, నిజస్వరూపాల గురించి చెప్పకనే చెప్పి ఇలా ఏకిపారెయడం పద్మార్పిత గారిలోని ఆత్మీయకోణానికి మరోవైపున్న స్పెషాలిటి... ఘట్స్ ఉన్న లేడీ పద్మార్పిత అనడంలో అతిశయోక్తి లేదు మేడం... సూపర్బ్ పోయెం... చిత్రానికి మాటలు నేర్పడానికి సతీష్ గారు రావల్సిందే...
ReplyDeleteఅమ్మో....ఘట్స్ అంటే తిట్లు తినే ధైర్యం అన్నమాట :-) మీతో మాటు నేను కూడా ఎదురుచూస్తున్నాను సతీష్ గారి కమెంట్ కోసం.
Deleteవాహ్... గోముఖ వ్యాఘ్రాలు గుప్తజ్ఞానులు అయ్యారు మీ కవితలో... ఎత్తి పొడుపు లోనూ భావుకతని ఒంపిన మీ అక్షర విన్యాసం అద్భుతః
ReplyDeleteమీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండి.
Deleteశీర్షిక నుండి చిత్రం కవితా అంతా కొత్తగా కత్తిలా వున్నాయండీ.. కట్ అయిందని తెలియకుండానే కోతయినట్టు.. అభినందనలతో..
ReplyDeleteకత్తులు కటారాలతో కోతలేం చేయగలను కలాన్ని కుంచెనే నమ్ముకున్న కమలం(పద్మ) నేనైతే :-)
Deleteఇదే...ఇదే ఇటువంటి ఊపులోనే మీరు ఏంటో మాకు చెప్పి మరింత దగ్గరైపోతారు.
ReplyDeleteమార్వలెస్ రైటింగ్స్ బై పద్మార్పిత.
తిరుగులేదు తిట్టీ తిట్టనట్లు తిట్టిన మీ తిట్ట్లకు. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్....
దగ్గరయ్యానంటారు...అంతలోనే తిట్టాను అని తరిమేస్తున్నారు...అంతా కంప్యూజన్ :-)
DeleteFantastic Padma. గుప్తజ్ఞానులను వెలికితీసిన నీ పవర్ఫుల్ పదాలు పదునుగా తాకాయి. చదివేకొద్దీ కొత్త అర్థంతో హృదయాన్ని పొడుస్తున్నాయి. ఆలోచనలపుట్ట పద్మార్పిత.
ReplyDeleteనిజంగానే అంత పవర్ ఉందా :-)
Deleteతనువుని కోరుతూ మనసిచ్చానని మాటల్లోనే తడబడిపోయి
ReplyDeleteవ్యామోహమంటే వెసులుబాటుకాదని ప్రేమంటూ దాన్ని మార్చి
కోరికల గాలమేదో విసిరేసావు అంటే.....విచిత్ర విన్యాసాలెన్నో చేసి
గోచరించని గొప్పగమ్యం ఇదంటూ చెప్పే గుప్తజ్ఞానులు..మీ మార్క్ తో మనుషుల్లోని మర్మాన్ని మహాధ్భుతంగా చెప్పారు పద్మగారు.
మొత్తానికి మెచ్చారుగా :-) థ్యాంక్యు
DeleteI think it will take time to understand this poem.
ReplyDeletetake your own time Payal
Deleteఅందరూ ఇలా ఉంటారా అని అడిగితే కాదు అని మీరు సమాధానం చెబుతారని తెలుసును అందుకే అడగడంలేదు. కవిత విషయానికొస్తే ఎవరిపైనో మీ పదాలు కట్టగట్టి అక్షరతాండవం ఆడాయనిపిస్తుంది. మీ బ్రాండ్ కవిత చిత్రం కూడా. సూపర్ డూపర్.
ReplyDeleteమహీ నా స్నేహితునిగా మీకు తెలియనిది ఏముంది నా పదాల్లో. :-)
Deleteమాయామర్మాల మాటలు మదిని మనసుని
ReplyDeleteముభావం లో నిలిపి ఆపై ఎటు తేల్చలేని వ్యతగా మారిపోయే వేళా
తప్పేవరిదని అందాము ఆ మాటలు విన్న ఆ మనసుదా లేకా
మాయమాటలు చెప్పే ఆ కరుడుగట్టిన మానవత్వం లేని మనిషి దా ?
వేకువలో కానరాని తోడేళ్ళ సణుగుడు ఏమిటో తెలిసి తెలియగ నసిగి విసిగి ఉన్నా
భావాలు నోట మాట పలకలేకా మూభావం గా దిక్కులు చూస్తే
తప్పెవరిదాని అందాము నక్కి నక్కి వెనక వెనక వచ్చే మనసులోని భావానిదా
లేకా మనసు మాట ఆలకించని మనసుదేనా ?
తెరవెనుకనుండి సైగలు చేస్తే కదిలే తోలుబోమ్మలై
వేకువకై వేచి చూసే ఆకాశమై హద్దులు చెరిగి మురిపెం తో మురిసే
తప్పేవరిదని అందాము తోలుబొమ్మలాట ఆడెటోళ్ళనా
లేకా మనిషిని అర్ధం చేసుకొని మన లోని మనమేనా ?
కొన్ని కొన్ని సార్లు సమాజం లో కొన్ని రుగ్మతలు .
మనశులకి అనారోగ్యం చేకురితే వైద్యం చేయించుకునే మనమే
సమాజానికి అనారోగ్యం చేస్తే కళ్ళప్పగించి చూస్తూ ఉండటం తప్ప
ఆ అనారోగ్యానికి గల కారణం ఏమిటని ప్రస్నించుకుని సావధాన పరిస్తే
గుప్త జ్ఞానులు గుప్త అజ్ఞానిలై లుప్తమై లోకమే కొత్తగా కనపడదా ?
పద్మ గారు, కవిత లో భావం చిత్రాన్ని పోలి ఉంది
కటువుగా చెప్పినా నిజాలే చెప్పారు
హర్ష_ సిరి
శ్రీధర్
శ్రీధర్ గారు...పద్మార్పితగారు
Deleteఎందుకో?
ఎందుకో?
ఎందుకో?
అంటే అర్థంకాలేదు. మీ కమెంట్ చదివాకే తెలిసింది. మనల్ని మనం ప్రశ్నించుకోవాలని.
శ్రీధర్ గారు ఇలా ప్రశ్నించుకోవాలంటూ చెప్పి సుధీర్ఘమైన కమెంట్ తో కంగారు పెడితే కరములు జోడించడం తప్ప _/\_ ఏంచేయగలను :-)
Deleteనాకు ఇలాంటి గుప్తజ్ఞానులు తారసపడితే వద్దన్నా ఈ కవిత చదివి వినిపిస్తాను. మీరు కాదనరు కదా పద్మార్పితగారు :-). అంటే ఫీల్ అవుతారు మీరు...అయినా పాపం అ+జ్ఞానులని ఇంతలేసి మాటలంటే ఏమైపోతారు చెప్పండి.
ReplyDeleteసతీష్ గారు...రారమ్మని పిలుస్తున్నాం రండి సార్. పద్మార్పితగారి పదాలని అర్థచేసుకునే సరికి సత్తువైపోతుంది. ఇంక చిత్రం గురించి చెప్పే భాధ్యత మీదేనండోయ్ :-)
ఈ కవితే కావాలా వారిని కుమ్మడానికి. మీ కంటిచూపు చాలదా :-)
Deleteఆకాంక్ష గారు... కాస్త లేటయింది. ఈ చిత్రకథ బాగుందో లేదో చెప్పే బాధ్యత మీదే.
Deleteఏమీ అనుకోనంటే ఒక విషయం చెప్పండి సతీష్ గారు....మీ మెదదు ఇంత తెలివిగా పని చేయడానికి ఏం తింటారో చెబితే , అలాగే మీ జీవనశైలిని కూడా సేవిస్తే పాటించి మీకు పోటీకి వస్తాను. మీ కమెంట్ కి తిరుగులేదు సారు.
Deleteనేను మా ఆవిడ చేసేది ఏదైనా వంకలు పెట్టకుండా తినేస్తానండీ.. అలాగే ఆవిడకు నచ్చినవి చేసి కూడా పెడుతూ నా కడుపు నిండినంత ఆనందపడతానండీ. అప్పుడప్పుడూ కోపతాపాలు, ఎప్పుడూ సంతోషంగా ఉండేందుకూ, ఉంచేందుకు ప్రయత్నాలు... ఏంటో చిరాగ్గా.. ఈ సోది కదా. ఎప్పుడు పోతామో, ఎప్పుడుంటామో తెలియని జీవితంలో.... పంతాలు, పట్టింపులు లాంటి మానసిక సంఘర్షణలకు చాలా దూరంగా ఉంటానండి. నా దగ్గరని వాళ్లను వాటికి దూరంగా ఉండేలా మానసికంగా సిద్ధం చేస్తాను. అందులో సత్ఫలితాలు కొంత, విఫలం మరికొంత. అయినా.... నా బలమంతా నా మనసే. అప్పుడప్పుడూ నా మాట వినదు గానీ... కీలక సమయాల్లో అది నా మాటే వింటుంది. మనసు నా మాట వింటుంటే... మెదడేం చేస్తుంది మరి... చచ్చినట్టు నా మాట వినక. ఏమంటారు ఆకాంక్షగారు...
Deleteఅన్నట్టు మరిచా... నేను మీరనుకున్నంత తెలివైనవాడినేం కాదు సుమండీ...
Deleteచాల్లెండి చెప్పొచ్చారు...-) మీరు ఇలా సర్దుకు పోకపోతే, ఈ మాత్రం శాంతి కూడా కరువైపోతుందండి. అందుకే తప్పదు మీరు అప్పుడప్పుడు మేము అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం ఇవ్వకుండా మీ వైఫ్ ని పొగుడుకోక :-) haaaaaaaaaaa haaaaaaaaa
Deleteమేకవన్నె పులుల గురించి చెప్పారు సరే, వాటి నుండి రక్షణ ఎలాగో చెబితే చదివి తరిస్తాము పద్మగారు.
ReplyDeleteఏం చెప్పను...ముందు నన్ను తెలుసుకోనివ్వండి :-)
Deleteమాటలు రావడంలేదు.
ReplyDeleteఎదిగి పోయారు పద్మ
మీ నుండి ఇంత పాజిటీవ్ స్పందన...ఆనందం
Deleteతూటాలు లేవు కానీ గాయలు
ReplyDeleteకమెంట్లు లేవు కేవలం కామోషీ
అక్షరాలతో ఆటాడిస్తారు అర్పిత
టోటల్ గా తూటాలతో కమెంట్ పెట్టి మెచ్చేసారు.
Deleteగుప్తంగా దాచుకుని కుమిలిపోమంటూ నీతిసూక్తులు వల్లించే వాళ్ళకి చెంపదెబ్బవేసినట్లుంది. అందుకే నువ్వు నీ వ్రాతలు నచ్చుతాయి. దేన్నైనా నిబ్బరంగా ఎదుర్కోగల ఆత్మబలాన్ని అందిస్తాయి నీ కవితలు. నేటి సమాజంలో సగానికి పైగా గుప్తజ్ఞానులే ఉన్నది. మంచి కవితను అందించావు. అభినందనలు-హరినాధ్
ReplyDeleteమీరన్నవి అక్షరాలా అన్నీ నిజం ఒక్కటి తప్ప...నాలో ఆత్మబలం లేదన్న మాట నిజం :-) థ్యాంక్సండి.
DeleteNo words just claps claps claps
ReplyDeleteOh! thanks thanks thank Q
Deleteవ్యామోహమంటే వెసులుబాటుకాదని ప్రేమంటూ దాన్ని మార్చి
ReplyDeleteకోరికల గాలమేదో విసిరేసావు అంటే.....విచిత్ర విన్యాసాలెన్నో చేసి
ఇలా మీరే చెప్పగలరు పద్మార్పితగారు.
కవిత మొత్తంగా చాలా క్రమబధ్ధంగా పేర్చి కూర్చారు.
థ్యాంక్యూ యోహంత్
Deleteఒకవైపు నుండే వ్రాసినట్లున్నారు మరోవైపు కూడా చూసి చెప్పండి గుప్తంగా దాకున్న జ్ఞానులెవరో?
ReplyDeleteనేను చెప్పవలసింది చెప్పాను మరో కోణంలో మీరు చెప్పండి.
Deleteమరో మంచి కవిత మీ కలం నుండి.
ReplyDeleteథ్యాంక్యూ లిపిగారు.
Deleteగుప్తజ్నానులతో తమరికి పనేంటో
ReplyDeleteమరి నేను జ్ఞానిగా మారాలంటే వారితోనే పనికదా వినోద్
Deleteనిలకడలేని బంధాలపై అస్త్రం విసిరారన్నమాట ఈ మారు. బాగుంది పద్మగారు. చిత్రం చిద్విలాసంగా చెప్పకనే ఎన్నో భావాల చిట్టా విప్పుతుంది.
ReplyDeleteఅస్త్రం విసరలేదండి...భావాలకి అక్షర రూపమిచ్చాను అంతే ;-)
Deleteనేను జ్ఞానినే కాను ఇంక గుప్తంగా ఏముండను మాడం :-) కవిత అదిరిందండోయ్
ReplyDeleteనేను కూడా అంతేనండోయ్ :-)
Deleteపరిచయాలు... మేఘాలు... రెండూ ఒకటే. వర్షిస్తే మధురానుభవం, కన్నటీ మేఘాలైతే హృదయ విలాపం. మరి మీ చిత్రంలో నాయిక ఏ వర్షంలో తడిసిందో. కన్నీటి మేఘాల ముసురులో చిక్కుకుందనే నా భావన. మనసు కట్టడి చేసుకున్నా ఆ కట్లు తెంచి చేతులు చాచుతున్న నగ్న సత్యం.. ఆమె మనసు. అది తడిచీరలో స్పష్టంగా కనిపిస్తోంది. మనసుని చూడలేని కబోది చేతులు... తడి అందాలను తడమాలన్న కోరికతో పెంచుకున్న పరిచయాలు. ఆ సావాసాలు కన్నీటి మేఘాలై కరిగిపోగా... ఆ చేదు జ్ఞాపకాల క్రీనీడలు మాత్రం... మీ నాయికతో దోబూచులాడుతున్నాయి. స్వచ్ఛమైన నీటితో నిండిన తటాకం లాంటి ఆ మనసులో జ్ఞాపకాల రాళ్లేస్తున్నాయి.
ReplyDeleteమదిని కట్టిపడేసినా... వసంతాన్ని తెచ్చే స్వచ్ఛమైన సాంగత్యం కోసం.. ఆ చేయి ఆరాటపడుతోంది. గత జ్ఞాపకాల బందిఖానా నుంచి విముక్తి కోసం... కన్నీటిని కనపడనీయకుండా... వర్షంలో దాచేస్తోంది. చాలా బాగుంది చిత్రం, అందులో అంతరార్ధం. పద్మగారు... నిజంగా మీరు కవితా పద్మమే.
చిత్రానికే కదలిక వచ్చి కబుర్లు చెప్పమంటే కూడా తన భావాలని తాను ఇంత స్పష్టంగా చెప్పలేకపోయేది సతీష్ గారు. హ్యాట్సాఫ్ టు యు.
Deleteచాలా మంచి విశ్లేషణ అందించారు బొమ్మ గురించి.
Deleteమనసు తడవడం, రోధించడం, కనబడకుండా దాచడం ఇన్ని కనబడ్డాయా మీకు ఆ కుంచె గీసిన చిత్రంలో. మీరు గ్రేట్
Deleteపెయింటింగ్ లోని బొమ్మపై మీరు వ్రాసిన సమీక్షతో కవితకే క్రొత్త అర్థం వచ్చినట్లుందండి. చాలా బాగావ్రాశారు.
Deleteనా రాతలో ఇన్ని మెప్పించే భావాలున్నాయా... ఏమో... ఏమైనా... ఇంత మంది భామలకు నచ్చడం... కన్నా... అందమేముంది... ధన్యావాదాలు.
Deleteపద్మా జ్ఞానం నీ సొత్తు.
ReplyDeleteదానికి పరాకాష్ట ఇది.
Keep it up.
అంటే ఇంకేం రాయొద్దు అంటారా :-)
Deleteచాలా అర్థవంతంగా రాస్తున్నారు పద్మార్పితగారూ...
ReplyDeletethanksandi
Delete