విముక్తి

అనుభవాలన్నీ పాఠాలు నేర్పి దూరమౌతుంటే
ఆలోచనా విధానమే మారి జీవనగతే మారింది
నేను మాత్రం మారలేక నిన్న రాలిన వేకువనై
సంధ్య వెలుగులో సంతోషాలు వెతుకుంటున్నా!


                       
మనుషులేమారి లోకం మారిందని వెక్కిరిస్తుంటే
కానరాని ఆత్మవంచనే మబ్బులమాటునదాగింది
స్వఛ్ఛహింస సెలయేటిలోకంలో స్నానమాడి శుద్దై
నమ్మకం తగ్గిన నాసిరకపు దారంతో బంధమేస్తున్నా!


                          
నిగ్రహమే నిటారుగోడలా ఒంటరిగా నిలబడుతుంటే
చేయూతనీయలేని సూక్తులు నీతులని బోధించింది
సొమ్మసిల్లిన నిబ్బరాన్ని కన్నీరు చల్లి లేపి బండనై
గుండెగూటిలో దాగిన ఆశయాశలకు విముక్తినిస్తున్నా!

27 comments:

  1. నిజమే చావుకి బ్రతుకుకి బ్రతుకుకి చావుకి నడుమ ఈ బాంధవ్యాలు బంధాలు తెగిపోని దారాలే కాని ముక్తి అంటూ విముక్తి పొంది భావసాగారాలు నడిమంత్రపు సిరి లాగా తోస్తాయి. కొన్ని బంధాలు కలకాలం నిలుస్తాయి కొన్ని బాంధవ్యాలు విముక్తి గావించి మరల పలకరిస్తాయి ఏడేడు జన్మాల అంతం అది మరి చివరికి కాటికే సొంతం కాదంటారా పద్మ గారు

    ReplyDelete
  2. ముందుగా ...
    బ్లాగ్లోకంలో కవితలు రాస్తూ 6 వసంతాలు పూర్తి చెసుకున్న మీకు అభినందనలు మేడం.

    చక్కని కవిత్వాని మంచి భావం తో పొందిగ్గా అందించారు.
    ఎలా రాయగలరో ఇలాంటి వేదనాభరిత కవితల్ని...
    నిబ్బరం కోల్పోక సాగిపోండి మేడం... ( మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు )

    ReplyDelete
  3. ఇంతటి వేదనను మనసులో దాచుకొని మోములో చిరునగవును తరగనీక కవితలల్లె బంగారు దారప్పోగు మీరు. అభినందనలతో...

    ReplyDelete
  4. గాప్ తీసుకుని వ్రాసినది కవిత అయితే చాలా బాగుంది. మీ వ్యక్తిగతం కారాదని కోరుతూ....మీ నవ్వుతో అన్నింటినీ అధికమించగలరని ఆశిస్తూ

    ReplyDelete
  5. పోయమ్ ఇరగదీసారు. మనసుని మెలిపెట్టే మాటలు మీ సొంతం .

    ReplyDelete
  6. ఎలా ఉన్నారు? చాలా రోజుల తరువాత వ్యధాభరిత వాక్యాలు రాసి మనసులో మరోసారి నిలిచిపోయారు.

    ReplyDelete
  7. మనుషులేమారి లోకం మారిందని వెక్కిరిస్తుంటే
    కానరాని ఆత్మవంచనే మబ్బులమాటునదాగింది
    మస్తుగ రాసిండ్రు.ఎప్పటి ఇట్లనే రాయుండ్రి పద్మజీ

    ReplyDelete
  8. Chaalaa baagundi padmarpita gaaru..

    ReplyDelete
  9. ఎప్పుడూ... ఏడుపుగొట్టు కవితలే... అయినా నాకు నచ్చేస్తాయి ఎందుకో మరి...!! :-)

    ReplyDelete
  10. పద్మా బాగుంది

    ReplyDelete
  11. ఇంతకీ విముక్తి మీకా మాకా? బంధాల నుండి విముక్తి అయితే సరే మా నుంది మాత్రం అనకండి :-)

    ReplyDelete
  12. చేయూతనీయలేని సూక్తులు నీతులని బోధించింది
    సొమ్మసిల్లిన నిబ్బరాన్ని కన్నీరు చల్లి లేపి బండనై
    గుండెగూటిలో దాగిన ఆశయాశలకు విముక్తినిస్తున్నా
    ఇంతలా ఎలా వ్రాస్తారు. వ్యధా వాక్యాలతో ఎదను పిండేసారు.

    ReplyDelete
  13. వేదనతో మనసు మూగబోతే... వెన్నలే వచ్చి మత్తు జల్లి... ముచ్చట్లాడే.. కమల వదనం ఉందిగా. రాలిన వేకువ జాబిలిని తెస్తుంది. జాబిలి చల్లిన వెన్నెల... ఉషోదయాన్ని ఇస్తుంది. అంటే రాలిన వేకువతో ఉషోదయాన్ని ఆహ్వానించిన కవితా చాతుర్యం బాగుందండి. స్వార్థపరుల లోకంలోనూ మంచి మనుషుల గుబాళింపులను గుర్తించే వాడి చూపులవి. అనుభవాలకే పాఠాలు నేర్పే ఆత్మవిశ్వాసం అణువణువునా ఉంది. మబ్బులున్నదే కరిగిపోడానికి, ఇక ఆయుష్షే లేని ఆ మబ్బుల్లో ఆత్మవంచన ఎన్నాళ్లు దాగుతుంది..?
    ఆత్మవంచనా అర్ధాయుష్షే.. అని చెప్పకనే చెప్తూ.. వేదనెందుకో..?
    సూక్తుల్లో మాటల గాలి తప్ప... ఇంకేముంటుంది..? నిబ్బరాన్నిచ్చే కన్నీటి లేపనం దగ్గరుండగా... స్వార్ధ లోకంతో నీకేం పని... నీవే ఒక నిస్వార్ధ లోకమైతే... కలువరేకులకనులదానా. బాగుందండీ... చిత్రంలో తెలియని భావాలేవో నిక్షిప్తంగా ఉన్నాయి. బేసిగ్గా నాకు అమ్మాయిల్లో నచ్చేవి కళ్లు. ఈ చిత్రంలో కనులు... వర్ణనాతీతం.

    ReplyDelete
    Replies
    1. పద్మార్పితగారికి బూస్టప్ ఇస్తున్నారా సతీష్ గారు :-)

      Delete
    2. మేము కూడా నాలుగు ముక్కలు వ్రాసే చాన్స్ ఇవ్వండి సతీష్ గారు.:-)

      Delete
  14. మీ పలాన్న మీరు వేదన నుండి విముక్తి పొంది హాయిగా ఉన్నారు. కవిత చదివిన మేము మాత్రం రోధిస్తూ ఉన్నాము. బట్ రోదనలోనూ నవ్వేస్తూ. హా హా హీ హీ :-)

    ReplyDelete
  15. తుపాకీ గుండ్లకన్నా వాడైన పదాలతో గుండెను పిండేసారు.

    ReplyDelete
  16. భారమైన గుండెలో ఉద్భవించిన భావం బాగుంది.

    ReplyDelete
  17. వేదనని తెలపడంలోనూ సున్నితత్వం చూపిస్తారు అందుకేనేమో మీ కవితలు మనసుని తాకుతాయి. ఇది మరొకటి మీ బ్రాండ్ కవిత.

    ReplyDelete
  18. రాసేదేదైనా పూర్తిగా మనసుతో రాయం మీకే చెల్లు పద్మార్పిత గారు... అద్భుతః

    ReplyDelete
  19. నిగ్రహమే నిటారుగోడలా ఒంటరిగా నిలబడుతుంటే
    చేయూతనీయలేని సూక్తులు నీతులని బోధించింది...simply superb.

    ReplyDelete
  20. painful heart touching feels madam.

    ReplyDelete
  21. " అనుభవాలన్నీ పాఠాలు నేర్పి దూరమౌతుంటే
    ఆలోచనా విధానమే మారి జీవనగతే మారింది
    నేను మాత్రం మారలేక నిన్న రాలిన వేకువనై
    సంధ్య వెలుగులో సంతోషాలు వెతుకుంటున్నా! "

    feelings woven from the experiences...
    yet again, another show of expertiseness...

    ReplyDelete
  22. Padmarpita Madam...
    I wish you a very Happy Birthday in an advance...
    Please visit: fansblog today in the evening..!!

    ReplyDelete
  23. అనుభవాలకే పాఠాలు నేర్పగలరు మీరు.:-)

    ReplyDelete
  24. అభిమానుల ఆశ్శీస్సులే నా అక్షరాలు
    అభిమానులందరికీ వందనాలు..._/\_

    ReplyDelete
  25. ఇంతటి జీవితానుభవసారం మీకు ఎలా అలవడిందో చెప్పవలసిందిగా కోరుతున్నాను. అద్భుతంగా వ్రాశారు పద్మ.

    ReplyDelete