మేలుకో..

హేయ్ నా అల్లరి వయస్సా..
నేను ఏదో చేస్తూ గెంతులేస్తాను
నువ్వు మాత్రం పట్టనట్లుంటావు
బాల్యాన్ని లాక్కుని నవ్వగలవు
నా పసిమనస్తత్వాన్ని ఏం చేయలేవు!

ఓయ్ తెలుసుకోవే వెర్రి మనసా..
ప్రతీ మాటకు సమాధానం ఉండదు
ప్రేమించే ప్రతీ మనసు నిర్మలం కాదు
ప్రతిప్రాణికీ ఏదోక పిచ్చి ఉండక తప్పదు
అలాగని ప్రతీ ఒక్కళ్ళు పిచ్చివారు కాదు!

హాయ్ నీ ఆలోచన్లు నీకు అలుసా..
మౌనంలో మతలబులు లేవనుకోకు
నవ్వేవారికి లోతుగాయాలు ఉండవనకు
తరచుగా నీతో తగువాడి అలిగి కోప్పడితే
వారిది సిసలైన సంబంధంకాదు పొమ్మనకు!

ఒసేయ్ నిర్ణయాలు నీటిబొట్లు తెలుసా.. 
కంటికి కనబడే వారందరూ చెడ్డవారు కారు
విన్నమాటలు చూడని సత్యాలుగా మారిపోవు
తైలము తగ్గి వెలుగుతున్న దీపం ఆరిపోవచ్చు  
ఆరితే తడవతడవా తప్పు గాలిదని నిందించకు!

34 comments:

 1. కంటికి కనబడే వారందరూ చెడ్డవారు కారు
  విన్నమాటలు చూడని సత్యాలుగా మారిపోవు
  మనసులో నాటుకున్నాయి.

  ReplyDelete
 2. తిరుగులేని అక్షరాలు మీ పదకవితలు
  చిత్రం చక్కని సోయగాలతో అలరిస్తుంది

  ReplyDelete
 3. కాలానుగుణంగా మంచితనమనేది మాత్రమే మనసులో నింపుకుని మెలిగితే అది మానవాళి మానవత్వానికి పునాది తలమానిక రెండు అవుతాయి పద్మ గారు..

  చెడు ఆలోచనలు ఒక్కోక్కసారి మనసుని వికలం చేస్తాయి.. అన్యమనస్కంగా అనాలోచితంగా జరిగేవి పొరపాట్లు..

  ఐతే జీవిత ప్రయాణం లో ప్రతి దశ మనిషిని మనిషిగా మలవగలగాలి.. మానవత్వమే పరమావధిగా మసలుకోవాలి..

  మంచి చెడు అనేది సాటి మనిషి ఆలోచన దృక్పథాన్ని తెలియజేస్తుంది.. మనిషి ఎంత ఎదిగినా ఒదిగుండాలి.. మనసు మాత్రం పసితనములోనే ఉండాలి..

  ~శ్రీ~
  కౌముదికపాణి కౌసల్యపుత్ర

  ReplyDelete
 4. Jeevita satyalu rasinaru.

  ReplyDelete
 5. ప్రతీ మాటకు సమాధానం ఉండదు
  ప్రేమించే ప్రతీ మనసు నిర్మలం కాదు
  ప్రతిప్రాణికీ ఏదోక పిచ్చి ఉండక తప్పదు సూక్తులు చెప్పి చేతావనుల్ని చేస్తున్నారా లేక....

  ReplyDelete
 6. మనసు పసితనంతో పరవళ్ళు త్రొక్కనివ్వండి పద్మార్పితగారు. నియమాలు నిబంధనలు అనుకుని కట్టిపడేయడం ఎందుకు. భిన్నమైన కవిత మీ నుంచి ఈమారు.

  ReplyDelete
 7. చదివి ఆచరించడం కష్టం కాని ఆనందించడం ఆరోగ్యం :-)

  ReplyDelete
 8. ఇలా మేల్కుని పయనం తిరుగులేని విజయం.

  ReplyDelete
 9. మంచమాటలు మీ తీరులో చెప్పిన విధానం బాగుంది.

  ReplyDelete
 10. తియ్యని మాటలు దాగి ఉన్న చేదు నిజాలు. ఫోటో భిన్నం మిగతా వాటితో చూస్తేనండి.

  ReplyDelete
 11. మేల్కుని మీరు వ్రాసిన సత్యాలు చదివి ఒంటబట్టించుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కడా ఒక పట్టాన్న ఎక్కి చావడంలేదు. జీవితం అనత సాగర మదనం అని విన్నాము మీ కవితలు కూడా అదే బాటలో సాగిపోతుంటేను క్యాచ్ చేయడం కష్టం కదూ అర్పిత ;-)

  ReplyDelete
  Replies
  1. జీవితం చాలా చిన్నది అమృతవల్లి గారు.. పాల కడలి నుండి వెన్నను చిలికినట్లు బాధ నుండి సంతోషాన్ని వెలికి తియ్యటమే జీవిత సారం.. ఐతే ఈ కొద్దిపాటి జీవితానికి ఆశలనేవి కైవళ్యానికి దారి చూపే కాగడలాటివి.. అపంతానంతాలోచనల సదృశ్యకావ్యమాలిక జీవితమనేది.. నవ్వుతు పలకరించటానికే వెసులుబాటు కాని ఈ జన్మ కి దుఃఖం మాత్రం వద్దన్న వెంటే ఉంటానంటది.. కనుక.. సహేతుకమై సాగటమే జీవితానికి మేలిమలుపు..

   ~శ్రీ~
   రామలింగేశ్వర ఆపద్బాంధవ

   Delete
  2. అనంతానంతాలోచనలు*

   Delete
  3. ప్రోఫైల్ పిక్ లో సాగరుణ్ణి గాంచి ఘనాపాటి అనుకునేరు.. కామెంట్ బట్టి నాకు వచ్చే ఆలోచనలనే ప్రస్తావిస్తాను.. కొన్ని విన్నవి మరికొన్ని తిలకించినవి.. మరికొన్ని ఈ పాతిక ప్లస్ నాలుగేళ్ళ వయసు బోధించినదినూ..

   హరిరామాచ్యుత గోవింద

   Delete
  4. మీరు గురువర్యులు అని నాకు ఇప్పటికి అర్థమైనది శ్రీధర్ గారు.:)

   Delete
  5. వామ్మో.. మూడు పదులే నిండలేదు సుమి.. గురువర్య అంటు బిరుదాంకితం చేస్తే ఎలా ఆకాంక్ష గారు.. మానవత్వాన్ని గౌరవిస్తే అదే మహిమాన్వితమై విరాజిల్లునని నా ప్రగాఢ విశ్వాసం.. :)

   ~శ్రీధర్ భూక్య

   శేషశయన శేశాద్రివాస

   Delete
 12. మంచితనం మంచులాంటిది.. కొద్దికొద్దిగా పంచితేనే విలువ.. ఒకేసారి కుమ్మరిస్తే కరిగి నీరుగారిపోతది..!

  సర్వే జనాః సుఖినో భవంతు

  ReplyDelete
  Replies
  1. હમને ઐસા ક્યા ગુનાહ કર દિયા પતા નહીં
   ખુશિયાઁ તો દૂર મુસ્કુરાહટ ભી આહટ હો ગયી
   જ઼િન્દા હૈ હમ અબ સિર્ફ઼ રહી ધુન સાંસો કી
   બસ કન્તજ઼ાર હી કન્તજ઼ાર કા માહૌલ છા ગયી

   ~શ્રીધર ભૂક્યા~

   Delete
  2. Life is a mix of all emotions taken together..
   Sometimes Anger.. Sometimes Pain..
   Sometimes Joy.. Sometimes Rain..
   At last.. It is just but one Life..
   Live it with Everlasting Memories..

   Delete
 13. తరచుగా నీతో తగువాడి అలిగి కోప్పడితే, వారిది సిసలైన సంబంధంకాదు పొమ్మనకు...తగువాడినవారిదే సిసలైన సంబంధం అనుకోమంటారా.
  ఏదైనా మీరు వ్రాస్తే తూచా తప్పక పాటించాలి అనిపిస్తుంది. ఇదేమి మాయ చేస్తిరో.

  ReplyDelete
  Replies
  1. కాదు కాదని కానిదేది కనికరించదని కకావికలం కావద్దని కద్దు కల్లా కపటమెరుగని కల్మషాలే కడదాకా కానరాని కుసుమమే కదా కలలా కనులలో కనిపించే కాంతిపుంజం మనిషి జన్మ అన్నది..

   తగువులాడి అలిగి వేసారినా గాని కోపగించుకొకుండా పలకరించే మనసున్నవారిని అపార్దం చేసుకుని బంధాన్ని వెలివేయ కూడదనే థీమ్ లో పద్మ గారు రాసినట్టున్నారు ఆకాంక్ష గారు.

   ~శ్రీ~

   కన్నా కూణ్ కుఁరచకో కేని కేర్వేని

   Delete
 14. sleeping & wake up bore bore.

  ReplyDelete
 15. సత్యాలు అక్షరాలుగా కూర్చి చక్కని మేల్కొల్పును అందించావు. అభినందనలు-హరినాధ్

  ReplyDelete
 16. బాల్యాన్ని లాక్కుని నవ్వగలవు
  పసిమనస్తత్వాన్ని ఏం చేయలేవు
  avunu correct.

  ReplyDelete
 17. కాస్తా ఘాటుగా మరికొంత చేదుగుంది మేలుకొల్పు.
  ఒసేయ్ నిర్ణయాలు నీటిబొట్లు తెలుసా..ఏంటో ఇలా ఇబ్బంది పెడితున్నారు :-)

  ReplyDelete
 18. ఇది అంతగా నాకు నచ్చలేదు అంటే ఏమంటారో అని నా బుర్రకి ఎక్కలేదు అంటున్నాను.

  ReplyDelete
 19. వయాసా...మనసా...తెలుసా... అలుసా ... అంటూ అందమైన కవిత్వం రాయడం మీ సొంతం.... అద్భుతమైన పద-చిత్రం... 2012, 2013 పద్మార్పిత లా రాసారు ఈ కవిత... ఎప్పటికీ నూత్న యవ్వనంగానే ఉంటాయి మీ కవితలు... సలాం!!... మేడం!

  ReplyDelete
  Replies
  1. షీ ఈజ్ ఎవర్గ్రీన్ హీరోయిన్ :)

   Delete
 20. జ్ఞానోదయ మేలుకొల్పు మాకు చెప్పినట్లున్నారు. హీ హీ హా ఆహా

  ReplyDelete
 21. ఇదేదో...సెల్ఫ్ హిప్నటిసం లా ఉంది అర్పితా... సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం సరైన మందు ఇదే.... జంపర్ మే బంపర్... యు ఆర్ వెరీ సూపర్...

  ReplyDelete
 22. నాకు నేను చెప్పుకున్న మేల్కొల్పులో మీ చేయూతాభిమానానికి నమోఃవందనాలు _/\_

  ReplyDelete