గరిక కొనల్లోని సూర్యుడు మేల్కొన్నది మొదలు
ఉండీ లేనట్లున్న జ్ఞాపకాల నడుమ రాయబారమే
ముఖకవళికలకి రంగులద్దుతూ అలజడి చేస్తుంటే
తలుపు తడుతున్న సంబరాలే కరిగి కలవరపడె!!
ఆకునీడ దాగిన పూలు గాలి తాకిడికి కదులుతూ
చిరుజల్లులు తమని తడిపి నేల తాకవని తలుస్తూ
నవ్వులు రువ్వ అంతలో ఆకశాన్న ఉరుము మెరవ
తెరిపి కోసం ముడుచుకున్న ఆకుల్ని తడుముతుంటే
సాంగత్యాన్ని తాళలేని కాండమే కరకుగా విరిగిపడె!!
హృదయాన్ని అద్దంలో చూపలేని ప్రకృతి పరవశంతో
తలపులని తట్టిలేపి అస్థిరమైన రూపాన్ని కానుకిచ్చి
తేలికవని మనసుని కరిగిపోనిచ్చి కుదుటపడమని
పల్లపు లోయలో దాగని జ్ఞాపకాలని పారిపోమనంటే
దిక్కుతోచని గమ్యం అవిటిది అయిపోయి మూలపడె!!
awesome painting
ReplyDeletesuperb poetry padma
keep rocking my dear..
జ్ఞాపకాల దొంతెరలు.. జలతారు వెన్నెలలు
ReplyDeleteమూగబోయిన గొంతుకలో.. పలుకలేని భావాలు
చూసే కన్నుల్లో చెమరింతలు.. దారి కానరాక తడబాటు
ఎగిసే అలలపై తేలియాడే నురగలా.. వీచే గాలి తరగలా..
అపుడపుడు నవ్వులు.. వెనువెంటే నిట్టుర్పులు
అలసిన మదినిండా.. పెనవేసుకునే తలపులు
కాసింత పలవరింత.. కాసింత కలవరింత..
అద్భుతమైన రంగుల దివిలో మంచుపువ్వుల నవవసంతం విరాజిల్లగా..
మనసే హాయిరాగం కొఱకు గడిచిన నవ్వుల క్షణాలను వెతికేనుగా..
The Ambience of this Poem all of a sudden takes one into a magical world of trance. All majestic moments have come across the mind.
Awesome Poem Padma Gaaru
హ్యాపి శయన ఏకాదశి
వైకుంఠ తొలి ఏకాదశి శుభాభినందనలు మీకు పద్మ గారు..
~శ్రీ~
శేషతల్పశాయి.. ళోళోళోళోఆయి
అహ్లాదమైన పదాలు శ్రీధర్.ఆశిస్సులు-హరినాధ్
Deleteధన్యోస్మి హరినాథ్ సర్
Deleteముఖకవళికలకి రంగులద్దుతూ అలజడి చేస్తుంటే
ReplyDeleteతలుపు తడుతున్న సంబరాలే కరిగి కలవరపడె
కలత చెందెను హృదయం చదివి.
Nice poetic lines.
ReplyDeleteజీవితాన్ని అందమైన ప్రకృతితో ముడిపెట్టి, చివరికి నిరాశ నిసృహతో అంతం ముగింపు పలకడం నచ్చలేదు. చిత్రంలో కోమలాంగి కూడా అదే పంధాలో ఉన్నప్పటికి బాగుంది-హరినాధ్
ReplyDeleteచిరుజల్లులు తమని తడిపి నేల తాకవని..అయ్యో ఏం ఎంజాయ్ చేస్తాం!
ReplyDeleteవేడి సెగలున్న చోట చినుకు తడి ఉండదంటారు.. కాని మనసు పడే వేదనంతా వేడి సెగలు రేపినపుడు.. కునుకు రాని కన్నుల వెంట తడి తేమ ఉంటుంది ఎందుకో మరి..!
Delete~శ్రీ~
గిట్ల పరేషాన్ జేస్తివి
ReplyDeleteఏం చేసేది అర్పితమ్మ
తేలికవని మనసుని కరిగిపోనిచ్చి కుదుటపడమని
ReplyDeleteపల్లపు లోయలో దాగని జ్ఞాపకాలని పారిపోమనంటే
తెరిపి కోసం ముడుచుకున్న ఆకుల్ని తడుముతుంటే
సాంగత్యాన్ని తాళలేని కాండమే కరకుగా విరిగిపడె!!
మీకు ఇలాంటి పదాలు కొట్టినపిండి.చాలా బాగావ్రాశారు.
ఒక్క ముక్కలో:అద్భుతం
ReplyDeleteನಿಜಂ ಚೆಪ್ಪೋದ್ದು ಸಂಧ್ಯ ಶ್ರೀ ಗಾರು.. ಈ ಕಮೆಂಟ್ ಲಾಗಾನೇ ಮೀಕು ಪದ್ಮಗಾರಿ ಕವಿತ ಅರ್ದಂ ಕಾಲೇದು ಕದಾ.. ಅಂದುಕೇ ಒಕ್ಕ ಲೈನ್ ಲೋ ಕಮೆಂಟ್ ಚೇಶಾರು.. ಔನಾ..!
Deleteఅటు ఇటుకాని సందిగ్ధత..
Deleteఎటు తేల్చలేని నిస్సహాయత..
అగమ్యగోచరమగు నిర్లిప్తత..
ఇవన్ని కలగల్పి రాశారేమో పద్మ గారు..
అందుకే కవితకు కమెంట రాస్తే ఉద్విగ్నత.. 🙄
ఆకునీడ దాగిన పూలు గాలి తాకిడికి కదులుతూ
ReplyDeleteచిరుజల్లులు తమని తడిపి నేల తాకవని...సున్నిత భావప్రకంపనలు మీ కవితాచిత్రాలు
Check Out this Flower:
DeleteDiphylleia Grayi..
When Raindrops fall on the Petals of the Flower, they turn Translucent, but otherwise when dry, exhibit white flowers.
See Lyrebird too.. The Multi modulatory Mimicking Bird.
Thank You..
Jai Sriram
00:01
చివరిలో వైకల్యాన్ని అంటగట్టారు జీవితానికి. విషాదం మీకు కడు ప్రియం కామోసును పద్మార్పితకు.
ReplyDeleteమీరు అటు ఇటు పదాలతో ఆడుకుని అక్షరాలతో ఆడుకుంటున్నారు. ఏమి అనగలం చెప్పండి
ReplyDeleteఅటు ఇటు కాని ఆటబొమ్మలు మనుషులు అని చెప్పి కళ్ళు తెరిపించారు.Picture extraordinary painting.
ReplyDeleteLife is nothing but, a mix of emotions, amalgamated with best and worst moments.
DeleteWhen the mind feels elated, even a painful journey seems to be enjoyable. It is not how a situation can change a person. It is but how a person reacts to a situation.
Everyone has tears, Everyone has pain, life is a bridge that connects humanity with divinity.
Whatever we possess today, is just a matter of what we hold physically. For a small acorn can hold a huge oak inside. Is it not Nayani Gaaru
*Acorn: Scrat*
Ice Age Part 5, Collision Course.15 07 2016 3D Animation
23:55 19 07 2016
తెరిపి కోసం ముడుచుకున్న ఆకు, బాగుంది ఎప్పటిలా.
ReplyDeleteఅదిరింది మీ భావుకవిత్వం చిత్రం.
ReplyDeleteమీరు కవిత రాసి పాతరోజుల్ని మరోమారు గుర్తు చేసారు. ధన్యవాదం.
ReplyDeleteउन हाथों को याद रखना जो ज़िन्दगी के हर कदम पर अपनी साया बिछायी हो
ReplyDeleteउन बातों का कदर करना जो पराया ही सही अपनापन का एहसास दिलायी हो
वक्त किस समय पर कैसी मोड ले यह किसको पता
साँसे कब तक चले इसका किसे क्या अन्दाज़ा
उन हाथों को याद रखना जो ज़िन्दगी के हर कदम पर अपनी साया बिछायी हो
उन बातों का कदर करना जो पराया ही सही अपनापन का एहसास दिलायी हो
कभी फ़ूलों की महक वाली प्रकृति भी न जाने तूफ़ान का ज़ोखिम उठा लेती है
कभी हँसता चेहरा पर उदासी और मायूसी आँसू से दस्तख़त कर जाती है
उन हाथों को याद रखना जो ज़िन्दगी के हर कदम पर अपनी साया बिछायी हो
उन बातों का कदर करना जो पराया ही सही अपनापन का एहसास दिलायी हो
मेहमान हैं धरती पर चन्द दिनों के न फ़िर लौट आयेगी ये अलबेला जिन्द़गानी
सिर्फ़ होंठों पर शब्द व यादें दिमाग में रह कर दोहरायेगी अपनी अनोख़ी कहानी
उन हाथों को याद रखना जो ज़िन्दगी के हर कदम पर अपनी साया बिछायी हो
उन बातों का कदर करना जो पराया ही सही अपनापन का एहसास दिलायी हो
~श्रीधर भूक्या
హృదయాన్ని అద్దంలో చూపలేని ప్రకృతి పరవశంతో
ReplyDeleteతలపులని తట్టిలేపి అస్థిరమైన రూపాన్ని కానుక ఇవ్వడం బాగుంది.
శైలి మార్చిన నూతనత్వం కవితలో కనిపించింది. పెయింటింగ్ బాగుంది.
ReplyDeleteఎటు కాని జీవితాలు నిరాశ నిట్టూర్పులు :)
ReplyDeleteరేపన్నది శ్వాస మాత్రమే..
Deleteశ్వాస లేకుంటే శాశ్వతమిక గాఢ నిద్ర..
జీర్ణమయ్యాకా ప్రాణమే నిలవదు..
నీడలా వెంట వచ్చేది ఏది..
వెలుగులో దేహపు చీకటే నీడన్నది..
చీకటిలో ఆత్మజ్యోతి వెలుగన్నది..
కరిగిన మైనపు చమురులాటి దేహానా..
వెలుగు ప్రసరించేదే ఆత్మజ్యోతి..
ఆ జ్యోతి కూడా కొండెక్కే సమయం రాక మానదు..
స్వస్తి
కలవరపాటులో కునుకు కూడా మరచి
ReplyDeleteతత్తరపాటులో నిన్నే నీవు మరిచి
ఏవరి రాకకై ఎదురేగి ఈ నిరీక్షణ బేలా
కారడవిలో ఆకులైనా లేని చేట్టు క్రింద ఎంత సేపని ఇలా
మీ కవిత కు ప్రేరణ ఐన చిత్రానికి నా మార్కు కవితాక్షరి పద్మగారు..
హ్యాపి గురుపూర్ణిమ మరియు సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ (సింహాద్రి అప్పన్నా) గిరి ప్రదక్షిణ ఆషాఢ మాసోత్సవ శుభాభినందనలు పద్మార్పిత గారు
Deleteకనురెప్పలు నీ రాకకై ఎదురు చూసి వేసారే
Deleteచెవులు నీ పిలుపుకై స్పందించాలని ఆరాటపడే
ఆశకు అడియాసకు నడుమ ఏకాకినై
కాలానికి కలలకి నడుమ వారధినై
తపన తాపత్రయాల వెల్లువలో గళం మూగదై
జీవమున్నా తోలుబొమ్మలా ఆడుతు
దారం తెగిన గాలిపటంలా రెక్కలు తెగిన పంఛిలా
వాసంతం విడిచి ఆకురాలి మోడుబారిన వనంలా
పద్మ గారు.. నేను మీ కవితాక్షర ఝరికి మాత్రమె వైవిద్యంగా కమెంట్ చేస్తున్నా కదా అని ఈ సారి చిత్రానికి తగిన భావం జోడించి వ్రాస్తే ఇదుగోండి ఇలా అమరినాయి..! అచ్చు తప్పులేమైన ఉండవచ్చు..అర్దం తప్పైతే క్షంతవ్యుణ్ణి.. !!
జై శ్రీమన్నారాయణ
రాధమాధవ
~శ్రీ~
నవనీతచోర నందనందన
After going through your poem, the following quotation flashed in my mind, Padma Arpita Gaaru:
DeleteThere comes a time, when you have to stop crossing oceans for people who won't even cross a puddle for you.
Shivam Shankaram
~Sri~
పల్లపు లోయలో దాగని జ్ఞాపకాలని పారిపోమనంటే touching words mam. Fantastic painting.
ReplyDeleteగడిచిన మధుర ఘట్టాలనే మనసు జ్ఞాపకాలుగా మలచి పదిలంగ దాచుకుంటుంది..
Deleteగడిచిన తీపి కబురులనే మనసు ఊసులుగా చిత్రించుకుంటుంది..
గతించిన హాయి రాగాలనే మనసు నెమరేసుకుని ఓలలాడుతుంటుంది..
అటు ఇటు కాకపోవడం అన్యాయం కాదా :-)
ReplyDeleteన్యాయాన్యాయాల బేరిజు వేసి చేసేదేమున్నది..
Deleteమంచి అనేది మనిషిలో ఉంటే అదే చాలన్నది..
రేపటి రోజున కన్నీరే చెంపను తడిమితే..
ఒక్క క్షణం చిరు నవ్వు సంతకం చేస్తే..
మనసనే పూదోటలో భావాల మిణుగురులు..
వెలుగు ప్రసరించే మానసికొల్లాసపు సమిధలు..
~కేశవ మాధవ మధుసూదన~
మంచి పట్టుగల కవిత.
ReplyDeleteసముద్రిక పట్టు
Deleteకాంచిపురం పట్టు
ఉప్పాడ పట్టు
గద్వాల్ పట్టు
ధర్మవరం పట్టు
మైసూరు పట్టు
ఉడుము పట్టు
వీటిలో ఏ పట్టు కల్కి గారు 😛
శ్రీధర్ బుక్యా గారు
Deleteచిత్రిక పట్టు :)
జిలేబి
☺ జిలేబి గారు
DeleteSo nicely wrote
ReplyDeleteMadam what happened?
ReplyDelete_/\_అందరికీ అభివందనములు_/\_
ReplyDelete