శ్వాసని సాంతం కొనలేక పోవడం ఏమిటో!!
కొనలేనప్పుడు ధనం పై డాబూ దర్పమేలనో
వట్టి చేతుల్తో వెళ్ళే మనకీ ప్రాకులాటెందుకో!?
అందమైన యవ్వనమే ఆకర్షణ అయినప్పుడు
చివరికి జీవితం అస్తిపంజరం అవ్వడం ఏమిటో!!
వంగి కృంగిపోయే దేహానికి సింగారం ఎందుకనో
మనసు స్వఛ్ఛంగా ఉంచక మూయడమెందుకో!?
భగవంతుడు అందరిలో ఉన్నాడని తెలిసినప్పుడు
నిస్వార్థంగా ఎదుటివారికి సేవ చేయం అదేమిటో!!
పూజలుచేసి దీపధూపాలతో పుణ్యాన్ని కోరనేలనో
ఆకలనని విగ్రహానికి తీర్థనైవేద్యం పెట్టడమెందుకో!?
అదృష్టం హస్తరేఖల్లో నుదుటిరాతల్లో ఉన్నప్పుడు
నిముషాల్లో మారిపోయే జీవితవిన్యాసాలు ఏమిటో!!
శ్రమని నమ్ముకోక సులువైన మార్గం వెతకడమేలనో
వెలుగూచీకటి ఒకదాని వెంట ఒకటైన చింతెందుకో!?
Meaningful questionnaire
ReplyDeleteAwesome Painting.
How are you Padmarpita?
Why delay in Posting?
Thank you, Iam little busy Janardhansaab.
Deleteకుశలమా నేస్తం? చిత్రం అధ్భుతం, ప్రశ్నాక్షరాలు ఆలోచించవలసిన విధంగా అల్లిన నీ నైపుణ్యం అభినందనీయం.
ReplyDelete
Deleteకుశలమే...నా ప్రశ్నాక్షరాలని మెచ్చిన మీకు ధన్యవాదాలు.
గిట్ల మాయమై మమ్మల్ని పరేషాచేస్తివి
ReplyDeleteగిప్పుడు ప్రశ్నల్తో మరింత పరేషాన్ కమ్మంటే ఎట్లమ్మో
మొత్తానికి మస్తుగ రాస్తివి పద్మార్పితమ్మో..
నేనే పరేషాన్ ఉంటి పనిలో ఇంక మిమ్మల్ని ఏం చేస్తా... :-)
Deleteభగవంతుడు అందరిలో ఉన్నాడని తెలిసినప్పుడు
ReplyDeleteనిస్వార్థంగా ఎదుటివారికి సేవ చేయం అదేమిటో!!
పూజలుచేసి దీపధూపాలతో పుణ్యాన్ని కోరనేలనో?? ప్రతి మనిషిలో స్వార్ధం అన్నీ తమకు దక్కాలి అనేది కారణం.
బాగా చెప్పారు పాషాగారు
Deleteస్వార్థమే మూలం అని. థ్యాంక్యూ.
చిత్రం కనువిందు
ReplyDeleteకవిత్వం ఆలోచనాజనికం
అక్షరాలు ఆచరించి అవలంబిద్దాం☺
అమ్మో అన్నీ ఇలా పాజిటీవ్ అయితే కష్టమేమో :-)
Deleteకొన్ని భావాలు అక్షర సత్యాలై భాసిల్లుతాయి
ReplyDeleteకొన్ని భావాలు అక్షర సరాలై దూసుకుపోతాయి
కొన్ని భావాలు కరిగని ప్రశ్నల సరాలు
కొన్ని భావాలు తెలిపేను జీవిత గమకాలు
చావనేది తథ్యమని తెలిసినా బ్రతుకుపై ఆశ ఉన్నట్టే
కరిగిన కాలానికి కానరాని కాలానికి వర్తమానమున్నట్టే
స్వార్థాన్ని వీడనాడి మానవత్వాన్ని పుణికిపుచ్చుకుంటే
సమాధానాలన్ని వాటికవే మనోదర్పణానా ప్రస్ఫూటమైనట్టే
బాగున్నారా పద్మ గారు.. బహుకాల దర్శనం..
~శ్రీ~
లెస్స వాక్యాలు :-)
Deleteధన్యోస్మి ఆకాంక్ష గారు
DeleteBelated Friendship Day Wishes to you Padma Gaaru..
Delete"Friends are Faithful, Relentless, Inspiring, Enthralling, Noble, Decent."
శ్రీధర్ గారు మీరు ప్రత్యేక శ్రధ్ధతో అందరికీ జవాబులు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తప్ప ఇంకే చెప్పాలో తెలియడంలేదు మిత్రమా...వందనాలు.
Deleteవీలును బట్టి జవాబులీడుతున్నాను పద్మ గారు..!
Deleteప్రశ్నలో సమాధానం దాగుందని మీకు తెలుసు అయినా అడిగి మమ్మల్ని చైతన్యం చేయాలి అనుకున్న తీరు నచ్చింది.
ReplyDeleteనాకు నేను చైతన్యమై మారితే చాలును కదాండి నందినీగారు. థ్యాంక్యూ.
DeleteExcellent painting. Lesson in Poetic way.
ReplyDeletethank you very much.
Deleteతపన ఎందుకు అంటే మనం మనుషులం, అవి మన సహజ గుణాలు అందుకే.
ReplyDeleteఅలా అనుకుంటే ఏం రాయలేను నా భావం.:-)
Delete
ReplyDeleteఅదృష్టం హస్తరేఖల్లో నుదుటిరాతల్లో ఉన్నప్పుడు
నిముషాల్లో మారిపోయే జీవితవిన్యాసాలు ఏమిటో
చిక్కుముడి వీడితే బాగుంటుంది.
అది తెలియకేగా ఇలా మీతో పంచుకున్నది లిపిగారు.
Deleteఇన్నాళ్ళూ ఏమైనారు.
ReplyDeleteమీ కవితలు లేక బోర్ కొట్టింది. ఆఫీసులో అనుకున్నాం మీగురించి.
కాస్త పని వత్తిడండి...థ్యాంక్యూ.
Deleteఆలస్యమైతే ఎందుకో అనుకున్నాను...మమ్ములను ఆలోచింప చేయడానికే అని చదివితే అర్థమైంది. చిత్రం కడురమ్యం అర్పిత.
ReplyDeleteఅమ్మో అంతలా ఎగేయకండి...నేను మిమ్మల్ని ప్రశ్నించడమా. :-)
Deleteఅధ్భుతం కవితాచిత్రం.
ReplyDeleteథ్యాంక్యూ...
Deleteఅన్నీ మనసొంతం అనుకుని విర్రవీగడమే తప్ప ఏవీ మనతో రావని తేలికైన ప్రశ్నల రూపంలో జీవితాన్ని భోధించారు. చిత్రం చాలా బాగుంది మాడంజీ.
ReplyDeleteథ్యాంక్సండి...
DeleteExcellent painting.
ReplyDeleteWhy mam no reply from U
thank you Payal.
Deletesee msg..
అదృష్టం హస్తరేఖల్లో నుదుటిరాతల్లో ఉన్నప్పుడు
ReplyDeleteనిముషాల్లో మారిపోయే జీవితవిన్యాసాలు వింతలు విచిత్రాలు.
థ్యాంక్యూ...ఈ వింతలు విఢ్యూరాల మధ్య పయనం ఎన్నాళ్ళో? :-)
Deleteమనిషి తత్వం తెలిసిన మగువవు నీవు తపన ఎందుకని ప్రశ్నిస్తుంది నీవేనా అడగాలి అనుకుని అంతలోనే కాదు అందరినీ ఆలోచించమని ఇలా వ్రాసావు అనుకుంటున్నాను అవునా పద్మార్పితా? దీవెనలతో-హరినాధ్
ReplyDeleteహరినాధ్ గారు ఏం తెలియని నన్ను అన్నీ తెలుసు అనడం అన్యాయమండి. మీ అభిమాన ఆశిస్సులకు ధన్యవాదాలు.
Deleteపెయింటింగ్ చాలా బాగుంది కవిత్వం ఇంకా బాగుంది ఆది శంకరాచార్యులు పునరపి జననం పునరపి మరణం అన్నట్లు వైరాగ్యం ..... కానీ చిత్రానికి కవిత్వానికీ ఎమీ పొంతన లేదే
ReplyDelete
Deleteరమణ వామరాజు గారు
పద్మార్పిత చిత్రాన్ని చూడ్డానికి మని కొందరు, కవితని చదవటానికి కొందరు వస్తారు :)
జిలేబి
మనిషిలో మలినం లేని మానవత్వమే ఆంతరంగిక అందం అది ప్రస్ఫూటమై నిత్యం అలరారుతుందని కాబోలు పద్మ గారు ఆ చిత్రాన్ని పొందుపరిచారనుకుంటా రమణ వామరాజు గారు..
DeleteRamana vamarajugariki వందనం_/\_
Deleteఒక స్త్రీ తన మనోభావాలని వ్యక్తం చేస్తున్నట్లు అని ఆ చిత్రం పెట్టాను. పొంతన కూర్చలేకపోయాను...అయ్యో, అయినా అన్నింటికీ మ్యాచ్ చేయడం కష్టం కదాండి. మీ అమూల్యమైన అభిప్రాయానికి మరోసారి ధన్యవాదాలండి.
జిలేబి జీ....ఎవరికి నచ్చింది వారు చూస్తారు చదువుతారు. ఎవరినీ మన భావాలతో నిర్దేశించలేమని నేను అనుకుంటాను. థ్యాంక్యూ మీ స్పందనలకు.
Deleteపూజలుచేసి దీపధూపాలతో పుణ్యాన్ని కోరనేలనో
ReplyDeleteఆకలనని విగ్రహానికి తీర్థనైవేద్యం పెట్టడమెందుకో!?
మీ ప్రశ్నకు ఈ మెసేజ్ సరిపోతుంది అనుకుంటాను హా హా :)
రాత్రి దేవుడు కల్లోకొచ్చి వాయించి పారేసాడు.
"ఒక్కసారి మిమ్మల్ని పుట్టించిన పాపానికి ఎందుకురా రోజూ నన్ను ఇలా వేపుకుని, పీక్కొని తింటున్నారు? పడుకోనివ్వరు. ప్రశాంతంగా ఉండనివ్వరు. బాధ భరించలేక కొండలెక్కి కూర్చుంటే అక్కడికీ తోసుకుంటూ వస్తారు. ఏదో వింటున్నా కదా అని వందేసి వెయ్యేసి పిలిచిన పేర్లతోనే మళ్ళీ మళ్ళీ పిలుస్తూ, చేసిన పూజలు, భజనలే చేస్తూ, ఉన్నవీ లేనివీ కలిపి పొగుడుతూ ఎందుకురా ఇలా ఊదర కొడతారు. కనీసం ఆ పేర్లలో ఏదైనా వెరైటీ ఉందా అంటే అదీ లేదు. ఇటు తిప్పి అటు తిప్పి మా అందరికీ అవే పేర్లు... ఆవు కథ లాగా.
ఒక్కరో ఇద్దరో అంటే పర్లేదు... కానీ ఏడు కోట్లమందిని ఎలా చూసుకుని చచ్చేది. మీ హారతులకి చూడండి మొత్తం స్వర్గం మసి, జిగురు పట్టి ఎలా నల్లగా తయారైందో. తొండాలేవో తోకలేవో తెలీక కన్ఫ్యూజ్ అయి చస్తున్నాం.
మీకన్నా మిగతా జంతువులు ఎంత నయమో చూడండి. ఇవ్వేవీ చెయ్యకుండానే వాటి బ్రతుకేదో అవి బ్రతుకుతున్నాయి హాయిగా, నా సహాయం ఏ మాత్రం అడక్కుండా. మీ సుఖాలకంటే ఓకే... కానీ ప్రతీ చిన్న కష్టానికీ నన్నే బాధ్యుడ్ని చేస్తారు. తొక్కలో ప్రతీ దానికీ నన్నే సొల్యూషన్ చూపించమంటారు. నీకు రోగమొస్తే నేనేం చేస్తాన్రా? నీ పరీక్ష నువ్వు పాస్ కావడానికి నాకు కొబ్బరికాయ ఎందుకురా? ఆ బొట్లేంటీ... వేషాలేంటీ... గొడవేంటి? ఏం... మీకు మీరు సహాయం చేసుకోలేరా. అంత చేతగాని వాళ్ళా? అంత డిపెండెన్సీ ఏంట్రా నా బొంద. మీ అక్రమ సంపాదనలో నాకు కమీషన్ ఏంట్రా చండాలంగా...
ఆకలితో ఉన్నవాడికి తిండి పెట్టరు కానీ నాకు మాత్రం ముడుపులు, బంగారం, వజ్రాలు, కిరీటాలు, రథాలు." ఇంకా ఏవేవో అన్నాడు కానీ గుర్తులేదు.
గుడ్ గాడ్....అందరి కలల్లోకి వచ్చి చెబుతే బాగుండును కొందరైనా మారతారు :-)
Deleteనాథురాం గారు.. సరదాగా వ్రాస్తున్నాను ఏమనుకోమాకండి:
Deleteమీ చాంతాడంత వ్యాఖ్యలో "అహా నా పెళ్ళంట" లో అరగుండు గోవిందం గారు కాసేపు.. "వివాహ భోజనంబు" లో మహాప్రభో అంటు దర్శనమిచ్చే కవి గారు.. సోమ మంగళ బుధ.. అంటు రాజబాబుగారి పాట.. హారతి గైకొనుమా అంటు స్వర్ణకమలంలో "సాక్షి" రంగారావుగారి పాట్లు.. ఉన్నది కాస్తా ఊడింది అంటు రమణరెడ్డి గారు.. లాస్ట్ లైన్ వచ్చేసరికి.. "మన వీరో ఓ కాకా హోటల్ కు వెళ్తాడు.. వెళ్ళి ఏమున్నాయని అడుగుతాడు అపుడు సర్వర్ దోశ ఇడ్లి ఊతప్పం కాఫి వడా ఉన్నాయంటాడు.. దోశ తెమ్మంటాడు.. అపుడు నెయ్యేసి కాల్చాలా.. కిరస్నాయిలేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా" అనట్టు కాస్త వ్యంగ్యం.. కాస్త సమాలోచన దృష్టి తో మీరు వ్రాసారని అనుకుంటున్నా..! ఔనా సర్..!!
కనులకెదురుగా కనిపించే ప్రతి మనిషిలోగల మానవత్వపు ఛాయల్లో దేవుడు తిష్ఠ వేసుకుని ఉంటే ఎదుటివారి పలకరింపులకి సమాధానమివ్వని ఈ రోజుల్లో.. కలనైనా ఆహ్వానం పలికి నిశ్చల మనసుతో ఆరాధిస్తే అదే శ్రీరామరక్ష కాదంటారా ఆకాంక్ష గారు..
Deleteతచ్చు అప్పులు ఉండవచ్చు టూకిటుఅ రుతారుమా కావచ్చు హను రియతో మన కాఁయి కేలేస్మత్ ఆకాంక్ష గారు..
~శ్రీ~
హరి ఓం నారాయణ
Deleteనాథూరాం నాని గారు సూపర్ :)
జిలేబి
Forwarded msg posted :)hahahaa
DeleteWhatever it is Nathuram Ji.. That comment gave multiple ways to think in the direction of the link of humanity versus divinity.
DeleteThank you
Good message
DeleteExcellent Question Awesome Answer Nathuramgaroo
Deletenathooramji...super message forward chesaru. thank you.
Deleteవంగి కృంగిపోయే దేహానికి సింగారం ఎందుకనో
ReplyDeleteమనసు స్వఛ్ఛంగా ఉంచక మూయడమెందుకో..అలాగని అలంకరించుకోకపోతే ఎవరు చూస్తారు చెప్పండి. మీరు చెప్పినట్లు మూసిన మనసుని శుద్దిచేసి చూపినా చూడరు. మనం ప్రశ్నించుకోవడం మామూలే మరల మన దారి మందే సుమా..కాదంటారా అర్పితగారు :-)
ఒక్కోసారి దారి కఠినమైనా ప్రయాణించక తప్పదు
Deleteజీవితం కూడా ఇంచుమించు ఇలాంటిదే కదా ఆకాంక్ష గారు..!
ఆకాంక్ష గారు...అవునంటారా కాదంతారా అని నన్నే ప్రశ్నిస్తే ఏం చెప్పను చెప్పండి. అటు ఇటు కాకుండా తలాడించడం తప్ప.
Deleteఊపిరిని కొనడం ఎవరి తరం కాదు. మంచి కవిత మేడం
ReplyDeleteథ్యాంక్యూ...
Deleteఏమిటో...ఏలనో...ఎందుకో...తెలిస్తే దేవుళ్లము అయిపోతామేమో... 😇
ReplyDeleteనేను ఇలా అయితేనే మీ అందరి బుర్రలు తినొచ్చు వినోద్ జీ...:-)
Deleteప్రశ్నల పరమార్థం తెలుసుకునే లోపున జీవితం అంతమైపోవును. మీ భావఝరి మరో మెట్టు ఎక్కినట్లుంది.
ReplyDeleteథ్యాంక్యూ జీ...
DeleteVery beautiful Pic.
ReplyDeletethank you.
Deleteanswer sheet ready chesara madam.
ReplyDeleteits your turn Mahee :-)
DeleteVery nice poetry with photo.
ReplyDeletethank you.
Deleteవంగి కృంగిపోయే దేహానికి సింగారం ఎందుకనో
ReplyDeleteమనసు స్వఛ్ఛంగా ఉంచక మూయడమెందుకో!?
ఎందుకో మీరే చెప్పాలి మరొక కవితలో...
ధన్యవాదాలు, మీరు ఒక చాన్స్ తీసుకోవచ్చుగా రాగిణిగారు. :-)
Deleteఏ తపన తాపత్రయం లేకపోతే సన్యాసిగా మారి తపస్సు చేసుకోక సంసారం ఎందుకు? మనిషి అన్నాక ఇలాంటివి తప్పవు పద్మ :-)
ReplyDeleteఅయితే సన్యాసినిగా మారిపొమ్మంటారా :-(
Deleteసృజన గారు.. ఏదైనా కొత్త వస్తువును గిఫ్ట్ గా ఇచ్చినపుడు దానిని అటకెక్కిస్తే.. ఏం లాభం చెప్పండి.. జీవితం కూడా ఆ భగవంతుడిచ్చిన బహుమానమే కదా.. అందుకే దానిలో కూడా అప్పుడప్పుడు నవ్వులు కన్నీళ్ళు సహజమే.. ఏదో ఒక రోజునా దేహం విడిచీ ఆత్మ కాలం చేస్తుంది.. దానిని ఆపటం ఎవరి తరం కాదుగదా.. జీవితం ఏడిపిస్తోందని చేతులెత్తేస్తే ఎలా చెప్పండి..
Deleteసరదాగానే రాశాను.. ఎమనుకోమాకండి సృజన గారు..! మీ సృజనాత్మకత కు అభివందనాలు..
మీ బ్లాగ్ బాగుంది పద్మగారు.
ReplyDeleteVery nice poetry.
Thank You Hanumath Sir, For Resharing My Favourite Deity.
DeleteSunikethana Ramachandra Ikshwakukulatilaka Dharanidhara Harikeshava Aadipurusha Radhakrishnaaya Namaami Devam.
welcome to my blog.
Deletethanks for compliment.
మీ రిప్లైకి ధన్యవాదము.
Deleteడబ్బుకి విలువనిచ్చే ఆధునిక కాలంలో కుటుంబ వ్యవస్థలు విఛ్ఛిన్నం అవుతున్నా స్నేహబంధం మాత్రం ఇంకా పటిష్టంగా ఉంది సంతోషం.
ReplyDeleteస్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు పద్మ..
స్నేహం: సఖ్యతకు నైతికతకు హితము చేకూర్చే అహంకారమెరుగని బంధం స్నేహం.
Deleteనేను విశ్వసించే బంధాలు మూడు:
అమ్మనాన్నల ఆప్యాయతతో కూడిన కుటుంబ బంధం..
దైవత్వానికి మానవత్వానికి గల సత్సంబంధం..
మనిషి అస్తిత్వానికి ఉనికికి పరోపకారాన్ని నిఃస్వార్థ మనసుతో ఔనత్యాన్ని చాటి చెబుతు వెలసిల్లే స్నేహబంధం..
సర్వే జనాః సుఖినో భవంతు..
బిలేటేడ్ ఫ్రెండ్షిప్ డే విషెస్ టూ ఆల్ మై వెల్ విషర్స్
మరీ వేదాంతం మీకు సూట్ కాదు సంధ్యగారు...జాలీ టైపు మీ నేచర్ :-)
Deleteస్నేహమంటే...అని నిర్వచిస్తూ మీ నుండి ఒక కవితని ఎక్స్పెక్టెడ్ పద్మార్పితగారు, ఇలా నిరాశపరచడం ఏం బాలేదు. స్నేహాన్ని సరిగ్గా నిర్వచించడం సాధ్యం కాదు రాదు అని మాత్రం అనకండి. ఎన్ని అర్థాలు చెప్పినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది, స్నేహానికి మించిన గొప్పది ఈ లోకంలో లేదు ఉండదు. అలాంటి స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకునే రోజే ఫ్రెండ్ షిప్ డే...
ReplyDeleteస్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మీకు
సహి బాత్ ఫర్మాయి హై ఆప్నే సాహేబ్ పాషా జి.. ఆకాశానికి భూమికి.. సూర్యునికి చంద్రునికి.. సాగరానికి ఒడ్డుకి.. వర్షానికి చకోరిపక్షికి.. మానవత్వానికి దైవత్వానికి గల అరుదైన అనితరసాధ్యమై అపురూపమై శోభిల్లే బంధమే స్నేహమన్నది..
Deleteఒక్కరోజు విషెస్స్ తో మైత్రిని ఎందుకు గుర్తు చేసుకోవడం...ఈ దినాలు ఎందుకు అని రెండేళ్ళ క్రితం పోస్ట్ రాసినప్పటి నుండి నేను ఈ ప్రత్యేక దినాలకి దూరం దూరం మన్నించాలి పాషాజీ.....రోజూ మనందరి మైత్రీ బాగుండాలని ఆశిద్దాం కోరుకుందాం పాషాజీ... థ్యాంక్యూ
Deleteమిత్రుల దినోత్సవం శుభాకాంక్షలు.
ReplyDeleteగన్ ట్రిగ్గర్ కి గన్ రీకాయిల్ కి ఉన్న బంధమే స్నేహమని చెబుతారనుకున్నాను మీ శైలిలో..
Deleteబిలేటెడ్ ఫ్రెండ్షిప్ డే విషెస్ మీకు
thank you.
DeleteHAPPY FRIENDSHIP DAY MY FRIEND.
ReplyDeletethank you.
Deleteతక్కెట్లో తూకం వేసి కిలో రూపాయి వంద ప్రాణాలు తూగుతున్న లోకంలో బ్రతకాలన్న తపన అందరిదీ దానికోసమే బుస్తాబు అవ్వడం బేరసారాలు జరుపడం. మంచి కవితను దానికి మించిన చిత్రాన్ని అందించారు.
ReplyDeleteఉచ్వాస నిఃశ్వాసల సమ్మేళనమైన ఊపిరి ఊయలలో ఇటు అటు ఊగే తోలుబొమ్మలం..మనషులం మనం మనసున్న మనషులం
Deleteఆశ నిరాశల నడుమ ఊగిసలాడే మనసుగల దేవుని ప్రతిరూపాలం..మనషులం మనం మనసున్న మనషులం
సంతోషం దుఃఖం సమపాళ్ళలో పంచుకోలేకా కన్నీటికి పన్నీటిని కలిపి ఆయువు పోసుకున్న తపన తాపత్రయాల మధ్య లోలకంలా కుదురుగాలేని మనసులో ఆలోచనల ఆనవాళ్ళం.. మనషులం మనం మనసున్న మనషులం.. జీవితమనే కొద్దిపాటి ప్రయాణంలో సారథులం యాత్రికులం.. స్నేహపు బంధాలని విడువని కొండెక్కని చిరుదివ్వెలం.. మనషులం మనం మనసున్న మనషులం
అమృతవల్లి గారు మీ కమెంట్ చూశాకా నాకు తట్టిన కవిత ఇది.
అమృతగారు....మీరు అందనంత ఎత్తులో కమెంటారు. థ్యాంక్యూ.
Delete