నన్ను వీడకు

చినుకు పడి చిలిపి కోరిక రేగె మదిన
మనసా నీవు వలపు దాచి నటించకు
ఆ పై చెప్పలేదని నాపై నింద వేయకు.

యవ్వన ఋతువులా ఈడు జిల్లుమన 
పైర గాలివీచి పైట లేచెనని సర్దుకోమాకు
మాపటేల మబ్బుల్లో విరహాన్ని దాచకు.

పగ్గంలేని చంచల ప్రకృతి నన్ను రమ్మన
చెప్పకనే లేచిపోయానని పరువు తీయకు
మాయచేసి మంత్రమేసానని గేలి చేయకు.

ఎండ నీడ హృదయాన్ని తాకి ఆశ కమిలిన
ఆశ్చర్యపడి అణిగి ఉండమని ఆంక్షలేయకు 
నా కురుల గూడారంలో నన్నే దాగమనకు.

వలపు తెలిసిన ఒంటరితనం కౌగిలించుకొన
పగలే క్రూరమై రేయి హంతకుడాయె అనకు 
కలల వీక్షణల్లో వెర్రిదాన్నైనానని వీడిపోకు.  

30 comments:

 1. ऐ दिल मौसम है आशिकाना..लफ़्ज़ों का खेल है

  ReplyDelete
 2. మాపటేల మబ్బుల్లో విరహాన్ని దాచకు.

  ReplyDelete
  Replies
  1. మాపటేల మబ్బుల్లో విరహాన్ని దాచకు.. అశనిపాతమై అనంతరం చిరుచినుకై నిలువెల్ల తడిపిపోవును.. నందుగారు యవ్వనాన్ని ఇంతకంటే ఎలా అభివర్ణించగలం

   Delete
 3. వలపు తెలిసిన...knowing about love lovely feel.

  ReplyDelete
 4. చియపఎంవ: ఇదేదో రాశాను అనుకోకండి.. మీ కవితలో మొదటి అక్షరాలు..

  చిరునవ్వుల యవ్వనాన్ని పలకరిస్తు ఎంచక్క వర్ణన
  చివురుటాకు యదెచ్ఛగా పల్లవిస్తు ఎంచుకునే వసంతం
  చివరిగా యడబాటు పరిహసించేనని ఎందుకనో వడ్డన

  ~శ్రీ~

  ReplyDelete
  Replies
  1. మరోమారు పైన రాసిన "చియపఎంవ" అనే పదం చూస్తే బాహుబలిలో "కాలకేయ" ప్రభాకర్ పలికిన కిలికి భాష గుర్తుకొచ్చింది..!

   Delete
 5. నా కురుల గూడారంలో నన్నే దాగమనకు. excellent feel... lovely one

  ReplyDelete
 6. ప్రకృతితో పాటు ప్రేమ పరుగులు పెడుతుంది అన్నారు మరి ఎలాగండి ఆపేసి పట్టుకుని విడవక ఉంచేది :)

  ReplyDelete
 7. according to to mausam love changes :-)ha haa

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by the author.

   Delete
  2. మువ్వన్నెల భారతావని బావుట
   శాంతి సామరస్యానికి నెలవైన పూలతోట
   పంద్రాగస్త్ బధాయి వందే మాతరమ్

   Delete
 8. Love India
  Be Indian..
  Happy Independence Day

  ReplyDelete
 9. మనసుతో మొర పెట్టుకుంటున్నారా బాగు బాగు పద్మార్పిత.

  ReplyDelete
 10. ఎప్పుడో ఒక కవిత చదివాను... నిర్మాణం సరిగా గుర్తులేదు దాని రూపం ఇలా ఉంది.
  “పాపం పిట్టలు ఈ పిట్టగోడను అదేపనిగా గుద్దుకొని చనిపోతున్నాయి. బహుశా ఇక్కడ వొకప్పుడు చెట్టు ఉండేదేమో!” అని...
  మీ కవితలో కథానాయకి చివరిగా ఇలా అన్నది “ వెర్రిదాన్నైనానని వీడిపోకు” అని. ఒక వేళ మీరు వేర్రిదానిలా (అలా మారకూడదని మా ఆకాంక్ష) మారినా మైన పేర్కొన్న కవితలో లా (పిట్టలు చెట్టు కోసం వచ్చినట్లు) మీ మనసు మిమ్మల్నే అంటిపెట్టుకుని ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. బాలమిత్ర, చందమామ కధల్లో కథానాయకిలా మీరు ఎంచుకున్న చిత్రం చాలా అద్భుతం! కవిత అత్యద్భుతం!! సలాం.... మేడం!!

  ReplyDelete
 11. హిమాలయాల కిరీటం గంగయమున సంగమం గోదావరి కృష్ణ పరవళ్ళు అరేబియ హిందు బంగాళ అఖాతాల పాదప్రక్షాళనం డెబ్భై వసంతాల స్వాతంత్ర్యం.. మన భారతావని సకల కళల సకల భాషల సకల సంప్రదాయాల పట్టుకొమ్మ.. భూతల స్వర్గం.. ఎందరో మహామహులకు జన్మనిచ్చిన జన్మభూమి సకల విద్యాబుద్ధుల వేదభూమి.. ఇన్ని ఉన్నా భిన్నత్వం లో ఏకత్వం బోధించే కర్మభూమి..
  "ఏ దేశమేగినా ఎందు కాలీడినా పొగడ రా నీ తల్లి భూమి భారతిని" ~ కీ. శే. శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు

  జై హింద్..

  ~శ్రీ~

  ReplyDelete
 12. పైర గాలివీచి పైట లేచెనని సర్దుకోమాకు, మాపటేల మబ్బుల్లో విరహాన్ని దాచకు.ఏదో వంకలేనమ్మ డొంకట్టుకోవాలి కదా, మీరు అన్నీ బయటపెట్టేస్తే ఎలా చెప్పండి.వీడిపోకని జాలిగా వేడుకోవడం బాలేదు

  ReplyDelete
 13. బాగుంది పద్మగారు

  ReplyDelete
 14. Independence day wishes.
  హృదయాన్ని బుజ్జగిస్తూ తిడుతున్నారు.

  ReplyDelete
 15. భారతావని మువ్వనెల చిర.. అరుణోదయం.. పారే సెలయేరు.. పచ్చని ప్రకృతి.. Happy 70th Independence Day Padma Gaaru .. (69th Anniversary of Indian Independence)

  ReplyDelete
 16. విడువను
  విడువలేను
  వీలుకాదు..

  ReplyDelete
 17. నైస్ అండ్ నీట్

  ReplyDelete
 18. చెప్పినట్లు చేసేద్దాం
  ఒకరిని విడిచి ఒకరు ఉండొద్దు☺

  ReplyDelete
 19. పగ్గంలేని చంచల ప్రకృతి నన్ను రమ్మన చెప్పా పెట్టక పారిపోకండి హా హా :-)

  ReplyDelete
 20. గలగల కృష్ణమ్మ పరవళ్ళు
  జలజల జాలువారే తరంగాలు
  మహాబలేశ్వర విజయవాడ హంసలదీవి
  దక్షిణగంగకు సరిసమానమైన ఠీవి
  అందుకో పుష్కర హారతి
  భక్తకోటి తరించే పునీత తిథి

  కృష్ణవేణి పుష్కరాల సందర్భోచిత వ్యాఖ్య

  12 to 23 Aug 2016

  ReplyDelete
 21. ఏమైనారు?
  ఒలంపిక్స్ లో పాల్గొనడానికి వెళ్ళినారా? Why no posts?

  ReplyDelete
 22. ఓలమ్మోలమ్మో..అప్పుడే గిట్ల ఒలంపిక్సు దాకా ఎల్లిపోయినావలేంటి....

  ReplyDelete
 23. రావమ్మా పద్మార్పితా.. శ్రావణమాసం లక్ష్మీవ్రతాలు రాఖీ పండుగా అయిపోయినది మీ కవితలే కరువైనాయి, ఏమైనారని విచారం

  ReplyDelete
 24. అందరికీ వందనములు _/\_
  నేను కుశలము
  మీరు అందరూ కుశలమే కదా..

  ReplyDelete