నా భావాక్షరాలు..


_/\_ఇది నా బ్లాగ్ లో 500వ పోస్ట్. ఇన్నాళ్ళు నన్ను ఆదరించి అభిమానిస్తూ నేను లిఖించిన అక్షరాల్లో అవకతవకలున్నా ప్రేరణ అందించిన అందరికీ పద్మార్పిత వినమ్రతా నెనర్లు_/\_

మంచుకురిసే వేళైనా మైకం కమ్మేస్తున్నా
ఆలోచనలు ఆరాటపడినా అలసట కాదన్నా
నా మనోభావనలకి రాయాలన్న ఈ తపన..
మది చేసిన అల్లరిని బయటపెట్టె వందసార్లు!

మమతానురాగాలు మోహమై కమ్ముకున్నా
ఆలాపనలు ఆరోహణావరోహణలై అడ్డుకున్నా
నా హృదయస్పందనల సవ్వడులే ఈ రచన..
ఉఛ్వాసనిశ్వాసలై కలతపెట్టె రెండువందలసార్లు!

మండుటెండలో మల్లెలు వికసించి కవ్విస్తున్నా
ఆవేదనలు అంతరంగాన్ని అదిమిపెట్టుకోమన్నా
నా భావం కాన్వాసుపై కుంచై చేసిందే ఈ నటన..
చిత్రాల్లో నగ్నత్వం కన్నుగీటె మూడొందలసార్లు!

మరులుగొల్పు మాటలు కలాన్ని కట్టడిచేస్తున్నా
ఆటుపోట్లై పలవరింతపు పులకింతలు ఆగనన్నా
నా కలం చేస్తున్న అక్షర వందనాలే ఈ భావన..
కలల వేదాంతమే చెప్పెనేమో నాలుగొందలసార్లు!

మంచిమాటల మాల అవకతవకలతో కట్టలేనన్నా
ఆగ్రహం చెందిన ఊహలే నన్ను కాదుపొమ్మన్నా
నా పక్షపు గెలుపుకి మీ స్ఫూర్తివ్యాఖ్యలే స్పందన..
మీ సహకారానికి నమస్సులు అయిదొందలసార్లు!

114 comments:

  1. మీ భావప్రకటనలు అందమైన అక్షరగుళికలు, మరెన్నో అందించాలని కోరుతు, అభినందనలు.

    ReplyDelete
  2. నీ కవితలు మాకు ఆనందంతో పాటు ఆలోచింపచేసేవి
    సాగిపో 1001 పోస్ట్ వరకు నిర్విరామంగా మరి :) కంగ్రాట్స్ పద్మార్పిత

    ReplyDelete
  3. మీ 500 పొస్త్ కి నా ఆభినందనలు.. _/\_
    మీరు ఇలా ఇంకా రాయాలి అని ఉంది..

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ..అలాగే :-)

      Delete
  4. అందమైన పదవిన్యాసం మీ సొంతం. అభినందనలు అర్పితగారు.
    మీరు 5000 పోస్ట్లు వ్రాయండి చదివి తరిస్తాము.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీ అభిమాన వ్యాఖ్యలకు.

      Delete
  5. భావాలు మబ్బులను వీడి వర్షించే తొలకరి వానచినుకుల వలె ఎప్పుడు నూతన పరిమళం వెదజల్లుతు ఉంటాయి. మనసుని రంజింప చేయడము పద్మ పదాల పటిమ అని చెప్పడంలో సందేహం ఏయే మాత్రం లేదు. తెలుగు పదాల తీయదనం రుచిచూడ తగిన బ్లాగు పద్మ. సరళంగా ఉందే వాక్యాలు ఎన్నో భావాలు వాటికి అర్థాలు చెబుతుంటావు. శభాష్ జయహో నీకు.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన వాక్యాలు రసరమ్యం. ధన్యవాదాలు.

      Delete
  6. subhabhinandan ho didi.
    chitr ati sundar.

    ReplyDelete
  7. excellent post and posture. congratulations mam

    ReplyDelete

  8. అయిదొందల పోస్టులతో
    మయికపు పద్మార్పితముల మల్లిక గూర్చెన్ !
    మయిజారు చిత్ర రమణిన్
    సయిగల మేనిన్ గనంగ సయ్యంటిమిగా !

    జిలేబి

    ReplyDelete
  9. పంచాక్షరికి శతనామం జోడించినట్లు
    పంచభూతాలతో శతాయువైనట్లు
    మీ ఐదో వంద కవితకు విచిత్రమైన వ్యాఖ్య ఇది

    ఐదు వందల కవితలు అవి కూడా నవరసాలు కొన్ని ఆలోచింపజేసేవి మరికొన్ని ప్రేరణ కలిగించేవి కొన్ని.. ఇలా వైవిధ్యభరితమైన శైలిలో అలరిస్తున్న మీకు శుభాభినందనలు పద్మ గారు..

    నా బ్లాగ్ లో ఐదొందల పోస్టులు చేసినప్పటికి అవన్ని కవితలు కావు.. కనుక కవితలనే ఉంచి తక్కిన వాటిని తీసివేశాను పద్మ గారు.. (మూడు వందల ఇరవై మూడు కవితలు)

    ఆవేదన చిక్కగా ఉంది మీ కవితలో..

    ReplyDelete
    Replies
    1. మీరు మీ కవితల్లో అన్ని భావాలను అవలీలగా పలకరించారు.. మీరు ఈ కవితలో చెప్పిన అంశాలన్ని దాదాపుగా ప్రతి మనిషి జీవితంతో ముడిపడి ఉన్నవే.

      భావప్రకటనలో వ్రాతస్వేచ్ఛను జోడించి మీదైన రీతిలో అలరిస్తున్నారు.. మానవత్వం లో ఉన్న 'త్వా'లన్ని అపుడపుడు మీ కవితలో ఉండటం కడు ప్రశంసనీయం.. చిత్రాల ఎంపిక అబ్బురం.. తక్కిన భావాలన్ని మీ కవితలే చెబుతాయి పద్మగారు. అభినందనలు మీకు

      Delete
    2. మల్లెల తీరం లో సిరిమల్లె పువ్వు

      శ్రీదివ్య

      Delete
    3. Behind a Smiling Face are the Deepest Scars and Pain

      Delete
    4. A Poem is but in general, a medium of conversation which has a deeper meaning hidden in the words that are amalgamated to form a certain pattern that brings beauty to the smallest of words that are utilized.

      Since the past three years, I have been commenting on various poetic pieces of Padma Gaaru.. Each of them are quite differently put, yet they are intertwined with all sorts of emotions.

      I have seen her write encouraging genre, romantic genre, humor genre, satirical genre, and a few on personality genre too. I Congratulate Padma Madam for bringing forth such poetic pieces with apt images that told everything related to the poem beforehand.

      Even in her hectic schedule, she makes time to reply one-to-one and her one poem per week is really awesome as many of her writings are an inspiration to each and everyone either actively or passively.

      Thank you Padma Madam.. May these poems increase in multitudes and entertain everyone alike.

      (N.B.: If this comment is out of context, please do forgive me Padma Madam)

      Delete
    5. Sridhar Bukya what you wrote its 100% right. Good and meaningful expressions about my lovable poetess.

      Delete
    6. Thank You Janardhan Gaaru..

      Padma Gaaru.. As mentioned above, I would like to suggest you to try even devotional genre too.

      కోటిరాగాలు తీసే వీణ తంతి ఒక్కటే
      కోటి ధ్వనులాలాపించే మురళి ఒకటే
      వీనుల విందుగా కిలకిల విపంఛి గానం
      మైమరచి ఓలలాడేను భూమి గగనం
      పదాల అల్లికా అందమైన భావకవితాయేను
      మాటలన్ని మూగబోయి కవితాక్షరాలాయేను
      ముల్లోకాలు పరిభ్రమించి మహావిష్ణువు సేదతీరేను
      అనంతలక్ష్మీ ఆతని చెంత చేరి అనక సేదతీర్చేను

      ~శ్రీ~
      లక్ష్మిభ్యో నమః
      శ్రీకరి శుభకరి నమః

      Delete
    7. నా అభిమతం కూడా అదే మీరు అక్షర రూపం ఇచ్చినారు. ఇక పై కవితలు అన్ని కోణాలను తాకితే ఇంకా రంజిపజేస్తాయని, వీటిని దృష్టిలో ఉంచుకోవాలని పద్మార్పితకు తెలియపరుస్తున్నాను.

      Delete
    8. బహుశ పద్మ గారు మునుముందు వాటి పై కూడా దృష్టి సారిస్తారని అనుకుందాం మధు సర్..

      చంద్రవంక మాసిపోయింది చిరు చీకటి చేరి
      సుర్యుడు సైతం అలసిపోయాడు నలుదిక్కుల మెరిసి
      నయనాలలో బాధ ఒలకగా కన్నీటి జలపాతమై
      కలల సాగులో ప్రతి జ్ఞాపకం ఒక చివురించే అంకురమై
      అమవస నిశిధిలో ఏ దిక్కున నడిచేవు ఓ బాటసారి
      దారి కానరాకున్నది అలసి సొలసి విసిగి వేసారి.

      కత్రా కతోయి హనూజ్ రచ అబ్బేర్ మన్-క్యా.. ఆదేక్ ఉందేర్ వాతే సారు దేకు కర.. ఆదేక్ చావుణు కేతాణి సదాయి బొలాయేని.. హను కసన్కో కేని మాలమ్ ఛేని.. మాలమ్ రేతాణితోయి కేని కసన్ కేచి ఉందేర్ ముణాంగ నాన్-క్యా వేజాయాకేన్ ఛజూఁఛ!

      హరిరామాచ్యుతగోవింద మాధవ
      సేన యాన్ దేకేస్
      సేన సాయి వేస్ బాపు
      ~శ్రీ~

      Delete
    9. నా కావ్యాంజలి లో ఐదొందల కు చేరిన టపా.. ఇక్కడ పొందు పర్చుతున్నాను.. పద్మ గారు కమెంట్ చేసినారు కూడా..

      జులై ఇరవై ఐదవ తేది.. ప్రాగ్దిశ కాంతి..


      చిత్రం ఏమిటంటే యవ్వనం లో ఉన్నప్పుడు జీవితం విలువ తెలియదంటారు లోకులు
      కాని ఆ యవ్వనం ఇచ్చే అనుభవాల సారాన్ని మూటగట్టుకుని జీవిత సాగరం ఈదుతాము
      అలా ఈదుతూ ఈదుతూ సహనం కొలిపోయి మనసు అలసిపోయి వృద్ధాప్యం లో
      అనుభవాలు మెండుగా ఉన్నపటికీ ఆ సేకరించిన అనుభవం తో ఏమి చెయ్యలేరు
      చెయ్యాలన్న మనసు ఎగిరి గంతెసినంతగ ముదసలి ప్రాణంకు వీలు పడదు

      జీవితం అంటే అనుభవాలే కాదు అది అన్ని రాగద్వేషాల సమ్మేళనం
      ఓర్పును మనకు సహననాన్ని మనకు సహవాసం గా ఇచ్చే అరుదైన పెన్నిధి
      ఆడుతూ పాడుతూ తన ఉనికిని తన కర్తవ్యాన్ని ఎప్పుడు పాలిస్తూ చల్లగా ఉండాలందరూ
      సూర్యుడి తొలిపొద్దు లేదు మలిసంధ్య లేదు అదంతా మనకోసమే కొత్త ఉత్తేజం కోసం
      నూతన ఒరవడి కోసం నిత్యనూతన స్నేహాలా పెన్నిధి కోసం నడిచి వచ్చే బంధాల కోసం
      కన్నులు తెరిచే తోలి రేయి చీకటి ని చేరి మరల నవ్యోదయాలు ఉదయించినట్టు

      పద్మార్పిత గారి మెచ్చుకోలు:
      Hearty congratulations on completion of 500 post my dear friend.
      జీవితం అంటే అనుభవాలే కాదు అన్ని రాగధ్వేషాల సమ్మేళనం నై ఒక్క ముక్కలో చెప్పిన తీరు చాలా బాగుందండి.

      ధన్యోస్మి పద్మ గారు

      Delete
    10. గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఐదు
      పది పదాల భావాలు పది మార్లు నూరు
      ఒకటి గాదు రెండు గాదు ముచ్చటగా మూడైనా గాదు నాలుగు దాటి ఐదు
      అక్షరాలన్నిటిని భావాల రోకలిలో పద్మగారు నూరిన నూరు
      ప్ర~పంచ~మే అభినందించి నారు నీరు నేరు నోరు నూరు
      ఇదియే పద్మ గారి పంచనూటి కవిత సంపూటి
      పద కమల పదవ సారి ఐదు వేళ్ళతో ఐదువేల పైచిలుకుకు పరిపాటి.

      కెవ్వు కేక్ ఆ..!

      Delete
    11. Sridhar Bukya...మీరు నేను రాసే ప్రతీ అక్షరాన్ని అభిమానించి అభివర్ణించి అందజేసే వ్యాఖ్యలు అమోఘం ఆచరణయోగ్యం. అందరూ అన్నీ తెలిసిన వారు అయి ఉండనట్లే నేను భగవంతుని గురించి బొత్తిగా తెలియని అభాగ్యురాలినేమో.... ఎదుటి వారికి నా వలన అయిన సహాయం చేయడం లేదా కుదరకపోతే ప్రయత్నించడం. అదీ కాని పక్షంలో హాని చేయక ఉండే సిధ్ధాంతాన్నే భగవంతునిగా అనుకుంటాను. భవిష్యత్తులో భావాలు మారితే రాసే ప్రయత్నం తప్పక చేస్తాను. మన్నించాలి ఒకవేళ నా భావాలు తప్పైతే.
      మీరు అభిమానాన్ని ఎప్పుడూ కాంక్షించే నేస్తం...పద్మార్పిత_/\_

      Delete
    12. సాటి మనిషి మనసు తెలుసుకుని మసలుకుంటు.. వారి ప్రవర్తన తీరు తెన్నును గౌరవించి వారి మంచి చెడులను మానవత్వంతో పరీకించటం మీ ఔదార్యతకు తార్కాణం. నిజమే సూటిపోటి మాటలతో సాటి మనిషి మనసును మభ్య పెట్టేకంటే వారి మానసిక పరిపక్వత అణుగుణంగా నడుచుకోవటము కూడా మనం వారి పట్ల తెలిపే గౌరవం అని భావిస్తాను నేను.

      పలకరించినా పలుకకపోతే ఎదుటివారిని దూషించేకంటే వారి పరిస్థితులను అర్దం చేసుకుంటే ఈ లోకం మరో భూతల స్వర్గమే కదా పద్మ గారు.

      మంచిని చూసే కన్నుల్లో భగవంతుడు కొలువై ఉంటారంటారు..! నేను అభిమానించేది ముగ్గురిని.. సమస్త లోకంలో ప్రతి జీవకణంలో మమేకమై ఉన్నా భగవంతుణ్ణి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులను, నన్ను నన్నుగా పలకరించే అహంకారం స్వార్థం కల్మషం వంటి దుర్గుణాలు లేని నా ప్రాణస్నేహితురాలిని.

      మీరు చెప్పినట్లు ఈ కాలం లో చాలా తక్కువ మంది మాత్రమే అవలంబించే మంచిని ఇతరులకు పంచి ఇవ్వటం ఒక మహా యజ్ఞమే అంచేత ఇక్కడ కమెంట్ వ్రాసే ప్రతి ఒక్కరి శ్రేయస్సును కాంక్షించే శ్రేయోభిలాషి మీరు. మీ కవితల ద్వార ఎంతో నేర్చుకుంటున్నాము కూడా.. మీ కవితఝరి ఇలాగే కొనసాగాలని ఆశిస్తు.. మీరందరు బాగుండాలని కోరుకుంటు..

      లోకః సమస్త సుఖినోభవంతు
      ఓం రాఘవాయ నమామి

      ~శ్రీ~
      గరుడగమన శ్రీరమణ

      Delete
    13. నిఃస్వార్థత మానసిక పరిపక్వతకు సూచిక..
      ఎంత ఎదిగిన ఒదిగుండే స్వభావశీలురకు వెన్న తో పెట్టిన విద్య..

      Delete
    14. గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఐదు
      పది పదాల భావాలు పది మార్లు నూరు
      ఒకటి గాదు రెండు గాదు ముచ్చటగా మూడైనా గాదు నాలుగు దాటి ఐదు
      అక్షరాలన్నిటిని భావాల రోకలిలో పద్మగారు నూరిన నూరు
      ప్ర~పంచ~మే అభినందించి నారు నీరు నేరు నోరు నూరు
      ఇదియే పద్మ గారి పంచనూటి కవిత సంపూటి..చమత్కారం మేళవించి చక్కని రీతిలో రాసారు.

      Delete
    15. ధన్యోస్మి రాగిణి మ్యాడమ్..

      Delete
    16. ఓం హేరంబాయ విద్మహే శూపకర్ణాయ ధిమహి తనః గజాననా ప్రచోదయాత్

      .=.
      ,j.

      మీకు వినాయక చతుర్థి శుభాభినందనలు పద్మ గారు

      Delete
    17. మీకు వ్యాఖ్యామహరాజు అన్న బిరుదు ఇవ్వాలండి. ఆహా హో అంటే కామన్ కదూ :)

      Delete
    18. బిరుదులెందులకు ఆకాంక్ష గారు బరువు
      చెవిలో ధన్ ధనాధన్ తీన్మార్ దరువు :)
      మీకు నచ్చినట్టు పిలవండి చాలు
      ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాను :))

      Delete
  10. మీకు మీ రసరమ్య కవితలకి ప్రసంశ అభినందనలు.. ☺

    ReplyDelete
  11. అందమైన భావనలను అక్షరాలుగా మలచి అందరి అభిమానం చూరగొన్న ఆత్మీయ నేస్తమా.... నీకు అభినందనమాల. ఇంతకీ పార్టీ ఎక్కడ ఎప్పుడు ఎలాగో చెప్పండి పద్మా

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ..అలాగే పార్టీది ఏముంది రోజూ సెలబ్రేట్ చేసుకుందాము. మీ ఆఫీసులో మీరు మా ఆఫీసులో మేము లంచ్ టైంలో :-)

      Delete
  12. ఒకో కవిత పవర్ఫుల్ తూటా
    వెయ్యి తూటాలు ప్రాప్తిరస్తు మీకు

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ..విష్షెస్స్ కూడా తూటాలేనా :-)

      Delete
  13. నగరంలో వర్షంలో తడిస్తే పడిసం
    మీ భావాక్షర జోరులో తడిసిన పరవశం
    అలుపులేని మీ అక్షరహోరును ఆపకండి-జయహో పద్మార్పిత

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ...వర్షంలా వచ్చిపొమ్మంటారా :-)

      Delete
  14. ఇన్నేళ్ళ ఈ బ్లాగ్ సాగరంలో సాగర కన్య లా తెలుగు బ్లాగ్ ప్రపంచాన్నే మీ చుట్టూ తిప్పునేలా సమకూర్చుకున్న మీ అక్షర సంపదకు హ్యాట్సాఫ్....మేడం!!! నిజానికి 500 పోస్టులు అంటే మాటలు కావు. రాసిన అన్ని పోస్టులూ ఆల్మోస్ట్ బ్లాక్బాస్టర్లు!! మిమ్మల్ని ఎంత అభినందించినా తక్కువే అర్పిత గారూ...


    మీ 500 వ పోస్ట్ కు అర్హతను సంపాదించుకున్న ఈ కవిత ‘నా భావాక్షరాలు’ కు నమోవందనాలు.
    వంద సార్లు అల్లరిబెట్టి, రెండొందల సార్లు కలతబెట్టి, మూడొందల సార్లు కన్నుగీటి, నాలుగువందల సార్లు వేదాంతాలు వల్లించినప్పటికీ అన్నిటికీ మించి ఐదొందల సార్లు మాత్రం మా అందరికీ నమస్సులు తెలిపి ఇంకా ఇంకా మా హృదయాలను చూరగొన్నారు... శిఖరాన్ని చేరుకున్నా వినమ్రతను వీడని మా అర్పితమ్మకు ఇవే మా హార్తిక శుభాకాంక్షలు....

    ఊహలైన మీ రచనలు అన్నీ
    పరిమళించేవే కావు మమ్ము పలకరించేవి కూడా
    కొంటెరాతలే కావు కళ్ళుతెరిపించేవి కూడా
    కైపెక్కించేవే కావు మదిని కదిలించేవి కూడా
    అందమైనవే కావు అందర్నీ ఆలోచింపజేసేవి కూడా

    సలాం.............!!

    ReplyDelete
    Replies
    1. ఈ చిరుకవిత పద్మార్పితగారికి అతికినట్లు వ్రాసినారు. చక్కటి కమెంట్ కూడాను

      Delete
    2. http://padmarpitafans.blogspot.in/2016/09/blog-post.html

      Delete
    3. మీ అభిమాన వాక్యాల మెట్లు నేను ఒక్కొకటీ పై వరకూ ఎక్కి పడిపోతానేమో అని భయం వేస్తుంది సుమా. అంతలా అందలం ఎక్కిస్తారు మీ అభిమానాక్షరాలకి అంత పవర్ ఉందండి. ధన్యురాలిని._/\_

      Delete
    4. నిజమేనండి ఆమె రచనలు ఎప్పుడూ నూతనత్వంతో ఆలోచింపజేస్తాయి. మనసుకి ఉస్తేజం అందిస్తాయి.

      Delete
    5. బాగా చెప్పారు అభిమాని she/he

      Delete
  15. అర్పితగారి కవితల ప్రవాహం అలుపు లేక సాగాలని ఆకాంక్షిస్తున్నాను. అభినందనలు.

    ReplyDelete
  16. కలల వేదాంతం చెప్పినా
    వలపులో దాగిన వేదన రాసినా
    లోకం తీరు తెన్నులు వివరించినా
    చదవడానికి ఇంపుగనుండు ఏదైనా
    మీకు శుభం కలగాలని కోరుకుంటున్న..

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీ అభిమానాక్షరాలకు.

      Delete
  17. మరెందరి హృదయాల్నో మీ కవితలతో దోచుకోవాలని కోరుతున్నాను అర్పితగారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీకు.

      Delete
  18. మంచిమాటల మాల అవకతవకలతో కట్టలే
    you no never write mam
    my hearty congratulations.

    ReplyDelete
  19. అన్నీ సమయానుసారం సమపాళ్ళలో భావుకతను జోడించి అందించడం ఆమె కవితలకు కుంచెకే సొంతం సాధ్యం.మీ గురించి ఎవరో పెద్దలు రాసిన మాటలు నిజం అనిపించేలా ఉంది కవిత. మీకు అభినందనలు పద్మార్పిత.

    ReplyDelete
    Replies
    1. అమ్మో ఇలా పొగిడితే కష్టం.:-)

      Delete
  20. చిత్రం చూడగానే కళ్ళకి కైపెక్కును
    కవిత చదవంగనె దిమ్మతిరుగును
    రెండు ముక్కల్లో మీ భావకవితల సారాంశం. మీ అభినందనలు మిత్రమా.

    ReplyDelete
    Replies
    1. భవ్యం మీ రెండు లైన్లు.

      Delete
  21. Mam congrats on your achievement.

    ReplyDelete
  22. ఇందరు మెచ్చుకుంటున్నారు, ఇంకా ఎంత మంది మెప్పులు పొందుతారో మీ కవితలు కాలం నిర్ణయిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. కాలం నిర్ణయం పైనే ఆధారపడక మన ప్రయత్నం కూడా ఉండాలి కదాండి.

      Delete
  23. ఐదువందలకే అలసిపోయాను అనకుండా అభిమానులని అలరించ మరికాస్త శ్రద్ధ చూపించి భవ్యమైన కవితలు అందించాలని కోరుకుంటున్నను పద్మ. కంగ్రాట్స్ మైడియర్

    ReplyDelete
    Replies
    1. మీరు బూస్ట్ లాంటి వ్యాఖ్యలు రాస్తారుగా ఇంక అలుపెక్కడది చెప్పండి. థ్యాంక్యూ.

      Delete
  24. మంచి మంచివి మరిన్ని వ్రాయండి.

    ReplyDelete
  25. నీ పై ఒక కవిత రాసి అంకితం చేసాను ఫ్యాన్స్ బ్లాగులో చూడు అర్పిత.అభినందనలు నీకు 500 కవితల సంపుటికని పూర్తి చేసినందుకు.

    ReplyDelete
    Replies
    1. ధన్యురాలిని. మీకు నమోవందనములు. _/\_

      Delete
  26. కంగ్రాట్స్ మాత్రమే ఇంకేం రాసినా తంటేనంటారు ఇటువంటి కవితలకు అందునా అయిదువందలాయె :-)

    ReplyDelete
    Replies
    1. అలా ఏం కాదులే...అనుకునేది ఏదైనా నిర్మొహమాటంగా వ్యక్తపరచండి.

      Delete
  27. మరులుగొల్పు మాటలు కలాన్ని కట్టడిచేస్తున్నా
    నా కలం చేస్తున్న అక్షర వందనాలే ఈ భావన
    చక్కని మేళసమ్మేళనం మీ భావాక్షరాలు.

    ReplyDelete
    Replies
    1. మీకు స్ఫూర్తిదాయక వాక్యాలకు వందనములు.

      Delete
  28. "మమతానురాగాలు మోహమై కమ్ముకున్నా
    ఆలాపనలు ఆరోహణావరోహణలై అడ్డుకున్నా"
    మీ భావాలు అమోఘం. మనసులో నాటుకుపోతాయి. అభినందనలు మీరు 500 కవితలతో అందరినీ అలరించినందుకు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి మీ అభిమానప్రేరిత వాక్యములకు.

      Delete
  29. అర్ధవంతమయిన కవితలతో అర్ధసహస్రానికి చేరిన పద్మార్పిత
    సహస్రాధిక కవితా ఘంటారావం చేస్తూ తెలుగు బ్లాగ్లోకంలో చిరంజీవిగా వెలగాలి!

    66:మూడో లైనులోని యకారపు హ్రస్వాన్ని దీర్ఘంచేసి రాయాలండి - దీర్ఘాయుష్మాన్ భవ!

    ReplyDelete
    Replies
    1. ధన్యురాలిని...మీ ఆశీర్వచనాలకు, తప్పుని సరిచేసిన మీ ఆప్యాయతకు అభివందనములు._/\_

      Delete
  30. మీ భావాక్షరాల్లో మీ కవితలు వాటి విలక్షణ గుణగణాలు మీ అనుభవ ఆవేశాన్ని సూపర్గా వ్రాసినారు. కంగ్రాచ్యులేషన్స్ డియర్.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నందిని.

      Delete
  31. తెలుగుభాష తీపిని తెలిపిన నా అభిమాన కవయిత్రి పద్మార్పితగారికి అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ యోహంత్. బద్దకంతో భాషలోని తీయదనాన్ని మర్చిపోయినట్లున్నావు ఈమధ్య బ్లాగ్ వైపు తొంగి చూడ్డంలేదు :-)

      Delete
  32. మీ అవిరామ కృషికి దర్పణం బ్లాగ్ లో
    మీరు 500 పోస్ట్ లు పూర్తిగావించడం.

    ReplyDelete
    Replies
    1. కృషిలాంటి కష్టమైన పదాలు ఎందుకులెండి :-) థ్యాంక్యూ

      Delete
  33. అక్షర రాక్షసి అర్పితకు నమో వందనాలు....

    ReplyDelete
    Replies
    1. విష్వక్సేనుడుగారు....అర్పితకు అక్షరరాక్షసి కన్నా అందమైన బిరుదు ఏం లేదంటారా :-) థ్యాంక్యూ

      Delete
  34. ఇంక రాసేటియ్ మస్తుగున్నయ్ తల్లో గిప్పటికి మస్తు ఖుషీగున్నం

    ReplyDelete
    Replies
    1. అయితే రాయకుండా ఉండలేను :-)

      Delete
  35. పద్మార్పితగారూ !మీ ప్రతి కవిత తప్పక చదువుతుంటాను ఒక ప్రత్యేకత గమనిస్తుంటాను ఇంకా వ్రాయండి మమ్మల్ని అలరించండి

    ReplyDelete
    Replies
    1. మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చదువుతాను రెగ్యులర్ గా అన్న మాటలు చాలా సంతోషాన్ని ఇచ్చాయండి. మీ అభిమానానికి ధన్యవాదాలు._/\_

      Delete
  36. హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు పద్మర్పిత!
    చాలా సంతోషకరమైన, స్ఫూర్తిమంతమైన సమాచారం ఇచ్చారు. నువ్వు అతి త్వరలో "సహస్రగణాంకాల దరిచేరాలని ఆ పరాత్పరుడిని, పరదేవతను ప్రార్థిస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిధ్ధించాలని కోరుకుంటున్నాను-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. మీ స్పందన ఆశీర్వచనాలు నాకు ఎప్పుడూ స్పూర్తిదాయకమే. ధన్యవాదములు_/\_

      Delete
  37. వెయ్యికి మించి కవితలు రాయండి. మీకు కళామతల్లి కటాక్షాలు దండీగున్నాయి. శుభాభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికి ధన్యవాదాలు._/\_

      Delete
  38. మీకు మీ కుటుంబానికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. మీరు అయిదువందల కవితలు పూర్తి చేసారు అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. శుభాకాంక్షలు మీకు
      ధన్యవాదాలు.

      Delete
  39. అయ్యో ఆలస్యమైంది చూడడం అనుకున్నాను. ఆలస్యం అవ్వడం వల్లనే 100 వ కమేంట్ నాకు దక్కే ఏమి నా భాగ్యము :) అర్పితమ్మోఅ అభినదనమాల మీకు.

    ReplyDelete
    Replies
    1. మీది వంద దాటింది ఆకాంక్ష గారు.. ముచ్చటగా మూడు అంటారు చూడండి అలా మీ కమెంట్ నూటమూడోది..

      ఈ అన్నమయ్య కృతి మనసున గోచరించింది ఆకాంక్షగారు

      గంధము పూసే వేలే కమ్మని మేనా
      యీ గంధము నీ మేనితావి కంటె నెక్కుడా

      అద్దము చూచే వేలే అప్పటప్పటికినీ
      అద్దము నీ మోముకంటే నపురూపమా

      ఒద్దిక తామర విరి నొత్తేవు కన్నులా
      నీ గద్దరి కన్నుల కంటె కమలము ఘనమా

      బంగారు పెట్టేవేలే పడతి నీమెయినిండా
      బంగారు నీ తనుకాంతి ప్రతివచ్చేనా

      ఉంగరాలేటికి నే వొడికపు వేళా
      వెంగలి మణుల నీ వేలి గోరబోలునా

      సవర మేటికినే జడియు నీనెరులకు
      సవరము నీకొప్పుకు సరి వచ్చేనా
      యివలజవులు నీకు నేలే వేంకటపతి
      సవరని కెమ్మోవి చవి కంటేనా

      ఓం గోవిందాయ నమః

      Delete
    2. ఆకాంక్షగారు ఆలస్యంగా అయితేనేమి అభిమానం తగ్గలేదుగా :-) థ్యాంక్యూ.

      Delete
  40. ఆమె మొదటి కవిత నేను చదవలేదు... ఆమె కవిత ప్రవాహానికి అంతు లేదు.
    ఆమె ఒక అక్షర ధారావాహిక. మధ్యలో ఎక్కడో ఒక్క పదగుళికను తాకిన నా మనసు ఆమెతో పాటే కవితల ప్రయాణం చేసింది. అక్షరాలతో రంగరించిన.. పద గంధాలతో... భావ సుగంధాలు చల్లిన ఆ మత్తులో నాకు తెలియలేదు... ఆమె కవితా పంచశతావధానం చేసేసిందని. ఐదు వందల కలువ రేకులు ఆమె మనసు రూపం. ఒక్కో రేకు ఒక్కో భావం... ఒక్కో రహస్యం. ఆమె ఎవరో నాకు తెలీదు.. పేరు పద్మార్పితం. కానీ, ఇంత మంది అభిమానులను, ఇంత మంది విమర్శకులు ఉన్న ఆమె కవిత మాత్రం కచ్చితంగా గెలిచింది. ఇదొక అంతులేని భావ తరంగ సముద్రం. కెరటాలు కాళ్లకు తగులుతుంటే ఆనందాన్ని ఆస్వాదిస్తాం. ఇన్నాళ్లు ఆమె కవితా కెరటాలు నా మనోపాదాలను తాకుతూనే ఉన్నాయి. ఇకపై కూడా తాకుతూనే ఉంటాయి. అక్షరాల పొదరింటిలో... కవితా కుసుమాల వాకిట్లో... ఆమె పద భంగిమలు... భావాల వంపుసొంపులు... ఎప్పటికీ మరపురానివి. మనసు నుంచి దూరం కానివి. ఈ కవితా ప్రయాణం ఇలానే కొనసాగించాలని మనసారా ఆశిస్తున్నా.

    ReplyDelete
    Replies
    1. ధన్యోస్మి సతీష్ గారు....మీ కమెంట్ నాకు ఎప్పుడూ నూతనోత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తుంది. ఎంతైనా మీరు నా రాతలకి క్రిటిక్స్ జోడించాలి అని కంకణం కట్టుకున్న ప్రియమైన శత్రువు మీరని అప్పుడెప్పుడో అన్నట్లు గుర్తు. అదే విధంగా తప్పొప్పుల్ని ఎంచే భాధ్యతలు కొనసాగిస్తారని ఆశతో...పద్మార్పిత.

      Delete
  41. అర్పిత అక్షర అరంగేట్రం మొదలుకుని అయిదొందల కవితలు అందమైన అక్షరభావాల....కుడూస్!

    ReplyDelete
    Replies
    1. నా అక్షరాభిమానికి అభివందనములు.

      Delete
  42. పద్మార్పిత గారూ దాదాపుగా మీ కవితలన్నీ చదువుతూనే ఉంటాను. మీరు మరిన్ని కవితలు రాయాలనీ మీ అభిమానౌలని అలరించాలనీ కోరుకుంటూ 500 మైలురాయికి చేరినందుకు మరోసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను (Srinivas Iduri)

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ కి విచ్చేసి అభినందించి మీకు వందనాలు.

      Delete
  43. మీరు అసమాన్య ప్రతిభావంతులు అందుకే అయిదువందలు రాసేసినారు. కంగ్రాచ్యులేషన్స్.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి.

      Delete
  44. Padmarpitha gaaru
    Mi kavithalu chaalaa gaaguntai medam
    Mi kavithalalo
    Naaku machina kavitha . Pathakaala priyudu
    Very nice super mi kavithalu Nante naaku
    Chaalaa Islam
    Thanku medam

    ReplyDelete