నేను నిన్ను వలచి నీకై వగచడం వెర్రని తలచి..
విధిలించుకోలేనన్న హృదయం వదిలించుకోబోవ
పసిపిల్లాడిలా ప్రేమించమంటూ ప్రాకులాడతావు!!
అడ్డాలనాడే బిడ్డలు కాని గెడ్డాలనాడు కాదనంటే
అవసరానికి వాడుకునే అవకాశవాదిని కాదని..
ప్రాయం వచ్చినా పరిపక్వత కరువాయనంటూ
గెడ్దాలదేముంది అడ్డగాడిదలా ఎదిగినానంటావు!!
అజ్ఞానం అలముకున్న అమాయకుడివి నీవంటే
ఆ జ్ఞానమేదో ఆర్జించినాకే అగుపిస్తానంటూ పలికి..
పైకాన్ని కూడబెట్టి కాసుల మూటలు ముందుంచి
ధనమే అన్నింటికీ మూలమంటూ ఉపదేశించావు!!
అందలమెక్కిన నీకు అగుపించని అందం నాదంటే
నటించలేని నాలో కల్మషంలేని నవ్వు చూసానని..
తెగింపులేని నా వలచిన గుండెపై జాలిగా జారబడి
నన్నెరిగిన నాలో నీ ప్రతిరూపాన్ని చూస్తున్నావు!!
మారో నూతన ప్రేమఘటానికి స్వాగతం.
ReplyDeleteఅదిరింది మీ 501 ప్రేమకావ్యం అర్పితగారు.
ప్రేమ అనేది నాజుకైనదని దానిని కుండతో పొల్చి వ్యాఖ్యానించటం బాగుంది శ్రీనాథ్ గారు..
Deleteచిత్రం అదిరింది కవిత కూడా సుమా.
ReplyDeleteచిత్తరువును చిత్తగింపగా కవితను కానగా నేమి గోచరించేన్ "ఆఛాంఛా గాలు"
Deleteఎపులు కవితలను నాలుగు పంక్తుల్లో అర్దవంతంగా తెలియజేస్తాలుగా.. కమెంట్ కూలా చింగల్ లైన్ బలే బలే బాగున్నది అంతు..
నాకిపులు నిద్లొత్తాంది నేను బజ్జు
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
Deleteపలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భవంబు దెలిపె నీ వుయ్యాల
హాట్ గా ప్రేమ పండించారు.
ReplyDeleteగుడ్ కొనసాగించండి.
అయ్యో పాపం..!
ReplyDeleteఎవరి వంత పాడాలో ఏమో తెలియరాలేదు పద్మ గారు..!
ఏదైతేనేమి తిడుతూనే అందలం ఎక్కించారు కవితలోని నాయకుణ్ణి..
ఈ లైన్ లో మాత్రమే రాధాకృష్ణులు కనిపించారు నాకు అందుకే భలే నచ్చేసింది:
నన్నెరిగిన నాలో నీ ప్రతిరూపాన్ని చూస్తున్నావు!!
ఓం రామాంజనేయా
~శ్రీ~
అందలం సంగతి దేవుడెరుగు కనీసం ఉట్టి ఎక్కినా సంతోషమే అంటున్నారా.. లేకా అందలం అంటూనే గార్దభమంటు అటకెక్కంచినారా మీ కవితా నాయకుణ్ణి..
Delete!
చెట్టునెక్కగలవా ఓ నరహరి పుట్టనెక్కగలవా
చెట్టునెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా
ఆశ నిరాశల నడుమ ఊగిసలాడేది జీవితం
Deleteసంతోషం దుఃఖం సమపాళ్ళలో ఉండేది జీవితం
ఆయువు కు ఊపిరులూదగా నవవసంతమే జీవితం
అలుపెరుగని బాటలో సాగే భావగీతం జీవితం
పురుడు పోసుకున్న వేళ ఊయల జంపాలతో స్వాగతించేది జీవితగమనం
మృత్యువు ఒడి చేరగా కాటిలో కాలే కణిక జీవిత చరమగీతం
బేలన్ మిలా నహి.. చకనాచూర్ హో జాతా బేచారా
Deleteలాపర్వాహి కా సబక్ తో మిలా ఉస్కో అన్జానా
ఆయిందా కభీ ఐసి చాల్ న చలేఁ మిల్ గయి ఉసే సిలా
పాంచ్ సౌ ఏక్ వాఁ కవితా ఆప్కీ రహి లాజవాబ్ కడి
బ్రాహ్మి స్క్రిప్ట్ మేఁ దేవనాగరి స్క్రిప్ట్ లిఖ్ దియా దేఖ్ లీజియే పద్మ జి
so beautifully narrated padma. lovely poem and picture too.
ReplyDeleteప్రేమో ఎమో.. :)
ReplyDeleteప్రేమలో అర్పిత అండ్ అనానిమస్... గడ్డం పెంచుకున్న అడ్డగాడిద గారు ఎవరబ్బా.... ☺
ReplyDeletePrema pyaar ishq...ahaaaaa
ReplyDeleteఇంతకీ ఆ అభాగ్యుడు ఎవరో పాపం ☺
ReplyDeleteఎంత ఘాటు ప్రేమయో...
ReplyDeleteప్రేమో ఏమో తెలియకనే ప్రేమలో పడ్డారు అంటే మేము నమ్మాలి. ఇంతకీ అంత అమాయకులమా మేము ఏమో..
ReplyDeleteనమ్మేంత అందంగా అల్లారు ప్రేమకావ్యాన్ని.
అందలమెక్కిన నీకు అగుపించని అందం నాదంటే నటించలేని నాలో కల్మషంలేని నవ్వు చూసానని..వామ్మో ఏంది తల్లి ఇలగెలగా
ReplyDeleteఆహా...ఇలా అందరి ఎదుటా కాదని ఆపై ఆడవారు అమితంగా ప్రేమిస్తారని చెప్పకనే చెప్పినట్లు రాసింది ఖచ్చితంగా ప్రేమేనమ్మో పద్మార్పితా...డౌటేలేదు.
ReplyDeleteప్రేమకు మారో గోలీ..
ReplyDeleteప్రేమికుడు విరహంలో గెడ్డాలు మీసాలు పెంచుకోవడం విన్నాం కానీ ఇదేమి విచిత్రమైన ప్రేమికుడో కాదనుకుంటాను మీ దృష్టిలో అడ్డగాడిదలా గెడ్డాలు పెంచుకున్న ప్రేమికుడు అవునా పద్మా :)
ReplyDeleteమరోసారి ప్రియుడి మదిని కొరడాతో సున్నితంగా తాకినట్లుంది.
ReplyDeleteఆహా ఓహో అనలేం...ప్రేమ పండింది.
ReplyDeletePerfect prema anthe
ReplyDeleteఅందరి ఆదరణ అభిమాన వ్యాఖ్యలకు అంజలి ఘటిస్తున్నాను. _/\_
ReplyDelete100% ప్రేమనే
ReplyDelete