భరోసా..


నిన్ను నీవు అంతలా కాపాడుకోకు
పెనుగాలి తాకిడికి తట్టుకోలేవు
వానా వరదలొస్తే తడవక ఉండలేవు!

కన్నీళ్ళు ముత్యాలవంటివి రాల్చమాకు
పెదవులకి కొంచెం పని కల్పించు
పలుకుతూ పలుకరిస్తూ నవ్వి నవ్వించు!

వెన్నెల వెలుగులు తెచ్చి అద్దమనకు
మనసు మంచిదైతే ముఖమే వెలుగు
ఆత్మతృప్తి లేనిదే ఆనందంగా ఉండలేవు!

వ్యధలు నిన్నే అంటుకున్నాయి అనుకోకు
నీరెండవోలె వచ్చిపోతాయి నిమ్మళించు 
సమయానికవే సర్దుకుంటాయి గమనించు!

ఎప్పుడూ నీగురించి మాత్రమే ఆలోచించకు
మనసిచ్చి పుచ్చుకోమని ఎవరన్నారు
చేతిలో చెయ్యేసి నువ్వున్నావన్న ధీమానివ్వు!

32 comments:

 1. మాకు ఇక్కడ వర్షం
  మీ అక్షర వానలో తడిసాం
  పిక్ చాలా బాగుంది మిత్రమా.

  ReplyDelete
 2. ఫోటో పైనే నా గురి.

  ReplyDelete


 3. రంభా ! రోసా ! రాణీ !
  గుంభన వలయును జిలేబి గునగున వలదోయ్ !
  డాంబికము వలదు! చేతల
  గంభీరత వలయు రమణి గౌరవము గనన్ !

  జిలేబి

  ReplyDelete
 4. ఫీల్ గుడ్ పోయమ్ పద్మగారు..

  ReplyDelete
 5. మంచి అనేది ఇహ పరాలను మించినది. మంచి మనసు కలవారి చెంతకు కీడైనా సరే ఆతిథిగానే విచ్ఛేస్తుంది. ఆతిథ్యం పుచ్చుకుని వెనుదిరుగుతుంది. అతిథి సత్కారం మంచిని మంచిగా మలచగలిగితే మరి చెడు కూడా మంచిగా మారిపోవాల్సిందే..!

  ReplyDelete
 6. భరోసాయే కాదు బాధ్యతను కలుగచేసినట్లుంది. చిత్రం చూసి సగం కరిగిపోతారు :)

  ReplyDelete
 7. హమ్మయ్య భరోసా కోరినారు ఇంకా నయం అవసరమా అని అడగలేదు సంతోషం ☺

  ReplyDelete
 8. వ్యధలు నిన్నే అంటుకున్నాయి అనుకోకు నీరెండవోలె వచ్చిపోతాయి..బహు ముచ్చటైన వాక్యాలు.

  ReplyDelete
  Replies
  1. బాగున్నారా ఆకాంక్ష గారు..బహుకాల దర్శనం.. వస్తూనే వర్షం తెచ్చారు.. ఇక్కడ పొద్దున్నుండి యెడతెరిపిలేని వర్షం.. అది సంగతి..!

   వ్యథలన్నాకా రుగ్మతలన్నాకా మనిషిలో దాగిన అసలైన ఓర్పును సహనాన్ని మనిషికే పరిచయం చేయిస్తాయి.. అలా జాలువారే కన్నిటి బిందువు కూడా అమూల్యమైనదే.. ఆ క్షణంలో ఉద్వేగం కట్టలు తెంచుకుంటాయి.. ఆనకట్ట కాదు సుమి.. జల్లంత తుళ్ళింత కావాలిలే.. కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే అంటు 1989 గీతాంజలి పాట ఓవైపు జలజల వర్షపు సడి ఒకవైపు.. ఆహా మస్తుగా నిద్రపడ్తది ఔ మల్ల.. జరా గి జొరం రొంపతోటే బాధ నైకుంటే గిప్పుడ్ సిన్న పోరగానిలెక్క బురదలా వాననిటిలా గెంతుడు పడవ దౌడ్ లు ఓ సిన్ననాటి జ్ఞాపకాలు మస్తు యాద్ కోస్తానాయి.. ఇగ సప్పుడు సేయను.. పండుకుంటా ఇగా.. ఆఛాంఛా గారో :-)

   Delete
 9. నిందలు అన్నీ ఎదుటివారిపైన వేసి నిశ్చింతగా ఉండమంటే ఎలా అర్పితమ్మో. ఇంక ఏం భరోసా ఇచ్చేది.

  ReplyDelete
  Replies
  1. భరోసా రభస కాకుంటే చాలు కదా మధు సర్.

   Delete
 10. భరోసాతో పాటు సమోసా కూడా ఇస్తే మీకేమైనా ఇబ్బందా :) రొంబ భరోసా పోయెమ్...

  ReplyDelete
 11. గుండె నిబ్బరాన్ని మీరు ఇచ్చి భరోసా బదులు కోరుతున్నారా పద్మా..
  అయినా ఈరోజుల్లో అందినంత చిక్కించుకుని చల్లగా జారుకునేవారే చాలా వరకు.
  ఏమంటారు?

  ReplyDelete
  Replies
  1. 35% Correct Amruthavalli gaaru. Trust and Loyalty is also present in every human being theae days.. But the problem is: They are doubtful of whether each and everyone whom they trust be reciprocating the same or not. So being in dilemma.. the percentage of trustworthiness has dipped to 35% as I told before.

   Thank you

   Delete
  2. అందినంత చేజిక్కించుకుని చల్లగా జారుకునే వారిలో నేను లేనులెండి.. ఎవరైన మనపై భరోసా ఉంచారంటే అది మన గొప్పతనం కాదు అది వారి ఔనత్యం. ఆ ఔనత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అప్పుడే మనిషి మనిషిగా మనగలడు.

   "Stating an Example is Easy. Being an Example is Difficult but is not Impossible."

   నేను వాదించలేదు అమృతవల్లి గారు.. నా మనసులో మెదిలిన భావనను ప్రస్తుతికరించాను అంతే.. స్మైల్..

   Delete
  3. అమ్ము.. అమ్మూ.. అమ్మ ను పిలిచినంత కమ్మగా ఉందండి మీ పేరు అమృతవల్లి గారు..! ఏదైనా తప్పుగా అనిపిస్తే మన్నించండి.


   వర్ష భీభత్సానికి ఇరు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం.. అన్ని వైపుల జలదిగ్బంధనం.. ఇరు జంటనగరాలైన కాజిపేట్వరంగల్ హైద్రాబాద్సికింద్రాబాద్ వాసులే కాకుండా అన్ని జిల్లావాసుల భయాందోళనం.. కాలు కదపలేనంతగా వరదనీరు.. విసుగు తెప్పిస్తున్న దోమలహోరు.. వాగును తలపిస్తు రోడు బేజారు..! విద్యుత్ కోత కుండపోత..!! ఎక్కడికక్కడ నిలిచిపోయిన జనజీవనం.. చెత్త చేదారాలు వాననీట నిలిచి అధ్వాన్నం.. ఏనాడు కలిగేనో కరుణ.. నీకైనా తెలిసేన వరుణ..!

   Delete
 12. బరోసా మాకు ఇచ్చారు.

  ReplyDelete
 13. మీ కవితల్లో ఈ మధ్య వాస్తవాలు మెండుగా కనబడుతున్నాయి. బహుశా అనుభవశాలి అయినట్లున్నారు. చిత్రం చూడ ముచ్చటగా ఉంది.

  ReplyDelete
 14. సమయానికవే సర్దుకుంటాయి..ఎంతకాలం?

  ReplyDelete
 15. మంచి గుణాలని బుధ్ధిని వికసింపజేసే కంకణం ఏదైనా కట్టుకున్నారా మీరు:-)Picture mast mast.

  ReplyDelete
 16. ఏం కమెంటాలని ఆలోచిస్తుంటే అర్థం చేసుకుని అలోచించు అంటుంది మెదడు. అలాగే అనుకుని ఆలోచిస్తుంటే ఒకోసారి ఒకో అర్థం ఎలా ఏం చేయను.

  ReplyDelete
  Replies
  1. ಠ_ಠ
   ఆలోచన: లోచన ప్రమేయం లేకుండా చూసేదని.
   అర్థం: మనసు చేసే ఆంతరంగిక భావ విశ్లేషణ..
   ఆలోచన లేని అర్థం వ్యర్థం
   అర్థం లేని ఆలోచన అనర్థం

   పైన గూడ్లగూబ కన్నులను పోలేలా కన్నడ ఠ లు
   ఏమి రాయాలో తెలియక రాసిన గమకాలు

   తెలంగాణ వైపు కూడా ధ్రోణి ఉన్నట్లుందని ఉవాచ.. మా వరంగల్ తడిసి ముద్దయిందో ఏమో..

   ఈ దసర కి తెలంగాణ ఇరవై ఏడు అందులో మా ముత్తాత వారు మల్కాజ్ గిరి జిల్లా ఐతే మా తాత వాళ్ళు వరంగల్ జిల్ల.. మా నాన్న వాళ్ళది హన్మకొండ జిల్ల.. అట్లౌతే ఏ జిల్ల ఏ జిల్ల అంటు జిల్లాలన్ని అలవాటయ్యే వరకి పాటను కొనసాగించాలేమో..

   అర్థం ఆలోచన రెండు కలగలిపి మరో ఆలోచన మరో అర్థం రాకుండా కామెంట్ ను అర్థాలోచనతొ ఆలోచనార్థంగా వ్రాశాను పద్మగారు సంధ్య గారు.. తప్పులుంటే పప్పులుడకవంటారు..! కనుక ఈ సారికి పెరుగన్నం మిన్నా.. ఏమంటారు శివసూర్యనారాయణమాత్యా వేయి స్తంభాల రుద్రవిర కోవెల కాకతీయ సుశోభితమా వీర తెలంగానమా..!
   జై భారతావని

   ~శ్రీ~
   జై భవాని భద్రకాళి

   Delete
 17. భరోసా ఇచ్చినట్లా లేక కావాలని అడుగుతున్నారా. చిత్రం బాగుంది.

  ReplyDelete
 18. మీ అక్షరాలు ఆణిముత్యలాంటివి.

  ReplyDelete
 19. Padma now a days why all sad poems. Be happy.

  ReplyDelete
 20. వర్షం వస్తాంటే జిందగీ పై భరోసా లేకపాయె ఇంకేం భరోసా ఇచ్చేది తల్లో.

  ReplyDelete
 21. వ్యధలు నిన్నే అంటుకున్నాయి అనుకోకు-వేదనలు అందరికీ ఉంటాయి ధైర్యంతో వాటిటి ఎదుర్కోవాలని చెప్పకనే వ్రాసి చక్కని సందేశాన్ని ఇచ్చావు పద్మా

  ReplyDelete
 22. The Girl

  She Resembles a Bird
  Prettiest in the World
  Childhood of the Girl is Golden Age
  Later on She Enters Beautiful Cage
  She looks Innocent Like a Fairy
  Yet Looses Her Wings to Marry
  Leads Life Serving Others
  Has a Heart None Bothers
  Dress of Happiness and Pleasure She Wears
  Beneath the Dress She Hides Pain and Tears
  20130706
  454
  :
  Give Her Freedom Which She Needs
  Give Her Protection By All Means
  Understand Her Feelings and Mood Swings
  Encourage Her Ability to Confront Difficulties
  Without Her There is No Society
  She is Integral part of the Family
  Caring is All that She knows as Duty
  Respecting Her is Our Responsibility
  She Dons Various Roles Altogether
  One may not Find Another Like Her
  20160924
  194

  ReplyDelete
 23. అందరికీ కృతజ్ఞతలు _/\_

  ReplyDelete