మరోదారి

ప్రతి ప్రయత్నం ఒకదాని వెంట ఒకటి శత్రువై
రోజుకి ఒక ఆశని చేజార్చి నిట్టూర్ప జేస్తుంటే
ఇంకెన్ని వ్యధలు భరించే సత్తువ ఎదకుందోనని
ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా లేచి నిలబడుతూ
 కొన్ని జ్ఞాపకాల్ని మనోపల్కం పై పేర్చుకుంటాను!!

కాలిబాటన ముళ్ళెన్నో పాదాల్ని బీటబార్చినా
ప్రతి దారిలో పయనించి పొడిబారే ప్రోత్సాహానికి
మరో ఎండమావిని ఎరగా వేసి దప్పిక తీరుస్తూ
ఆశ్రువుల అలలే ఎగసి పొంగిపొర్లుతున్న కళ్ళలో
కొన్ని అందమైన స్వప్నాల్ని అలంకరించబోతాను!!

నమ్మకాన్ని వలచి గెలవాలని కంటి కాగడాతో వెతికి
విశ్వాసానికి బదులు ఛాతీ చీల్చిన నిరాశ గాయాలకి
ఓదార్పు లేపనం అద్దబోయి మరింత మంటరేపుతూ
ఏ ప్రలోభానికీ లొంగని శిరస్సును వ్యధభారంతో వంచి
క్రొత్తదారి దొరుకునని కంటి వెలుగునే పెంచుకుంటాను!!

31 comments:

  1. వ్యధతో ఎదభారమైనా మరో క్రొత్తదారిని వెతుక్కోమని చెప్పడం ప్రేరణదాయకం. కొసమెరుపుతో పడగొట్టడం మీకు అలవాటే. చిత్రం అతికినట్లు కూడింది.

    ReplyDelete
  2. దారిలో పయనించి పొడిబారే ప్రోత్సాహానికి
    మరో ఎండమావిని ఎరగా వేసి దప్పిక తీరుస్తూ..మీ అక్షర విన్యాసం అత్యద్భుతం.

    ReplyDelete
  3. కొన్ని జ్ఞాపకాల్ని మనోపల్కం పై పేర్చుకుంటాను......మధురభావలహరి.

    ReplyDelete
  4. జీవితం గాజుపెంకులపై నడకవంటిదని తెలిసి కూడా మంచుపై నడకగా మలుచు"కోవా"లని
    ఎంతటి బాదల ఇసుక రేణువుల దారైనా మెత్తని పువ్వుల దారిని ఎన్ను"కోవా"లని
    తోవేదైన తపన తీరక తనివి తీరా పయనం సాగించాలని..
    సున్నితమైన పాదాలు కందిపోతాయని నిరాశ చెందకా మువ్వల సడివింటు కూడా పయనం సాగించాలని
    ప్రతి అడుగు ముందుకేస్తు పయనిస్తూ ఉంటే నవ్యలోకం ఎదురుపడునని చిత్రమాలికతో చక్కగా మీదైనా శైలిలో కవితలో చెప్పారు పద్మ గారు.

    ~శ్రీ~
    శంభుశాంభవితనయ గణపయ్య

    ReplyDelete
    Replies
    1. అవలీలగా అలవోకగా అనితరసాధ్యమైన శైలిలో చావు బ్రతుకుల మధ్య వ్యత్యాసం తెలియజేశారు పద్మ గారు..

      పిరికితనానికి విరుగుడు తనలోనే దాగి వుందని గమనించి కూడా తన మనోబలాన్ని మరిచి క్షణికావేశానా తనవారికే గాకా తనకు తాను ద్రోహం చేసుకోవటమే ఆత్మహత్య.. ఆత్మకు ఆసర దేహం మాత్రమే.. జీర్ణమైయ్యాకా ఎలాగు వీడిపోయే దేహాత్మద్వయాన్ని క్షణకాలం విచక్షణ కోల్పోయి.. చేసే అతిహీనమైన పని ఆత్మహత్య..
      మళ్ళి తిరిగిరానిది ఈ మానవ జన్మ..!

      Delete
    2. for a pot called life, mould it with clay of happiness, wet it with tears of gloom, spin it on wheel of circumstances, bake it in a kiln of empathy, paint it with the colours of emotions.

      Delete
    3. At the first instance.. When Relationship is compared to with a Fragile Glass, it should be taken care of with utmost gentleness. Never let it to have even a minute crackle, because.. when a glass breaks, we may purchase it as and when required. But it is not with the case of relationships.. Be it Parents, Siblings, Friends or Spouse; they are all unique and one should treat them with respect, loyalty, dignity, trust and never let the "glass goblet" break by any chance, as one may not get them back.

      19 Sep 2016 00:01

      Delete
  5. అబ్బా మళ్ళీ వేదన గీతాలేనా పద్మార్పితగారు మరోదారి లేదా :)

    ReplyDelete
  6. పొడిబారే ప్రోత్సాహానికి మరో ఎండమావిని ఎరగా వేసి పదాల ప్రయోగం వెరైటీని జోడించారు.

    ReplyDelete
  7. తిరుగులేని అక్షరాల శాసనాలు మీ కవితలు.

    ReplyDelete
  8. simply superb
    expressions narrated in well manner padma
    keep rocking.

    ReplyDelete
  9. చిత్రంతో సగం భావాన్ని చెప్పి మా అక్షరాలతో అలకరించి వ్యధని కూడా చక్కని రీతిలో అందించడం మీకే సాధ్యం. ధన్యులం.

    ReplyDelete
  10. ఆశ్రువుల అలలే ఎగసి పొంగిపొర్లుతున్న కళ్ళలో
    కొన్ని అందమైన స్వప్నాల్ని అలంకరించబోతాను.
    పాజిటివ్ ఆలోచించమని సున్నితంగా భోధించారు

    ReplyDelete
  11. వ్యధల్ని నిటారుగా నిలబెట్టి ధైర్యంగా ఎదుర్కోవాలని కొరడా ఝలిపినట్లుంది కవిత. చిత్రంలో ఆ ఛాయలు కనబడ్డంలేదు అయినా బాగుంది. ధైర్యాన్ని నూరిపోస్తూ కంటి నిండా వెలుగు నింపుకున్నప్పుడు దిగాలు వదనం ఎందుకో అర్థంకాలేదు.

    ReplyDelete
  12. వ్యధను భరించే హృదికి ఎండమావి కనిపించక మునుపే మరో నమ్మకమైన ఈ కొత్త దారిలో ప్రయాణం బావుండాలని సదా కాంక్షిస్తూ... సలాం !! చిత్రం మొరో కవితకు మరో అద్భుత దర్పణం.......

    ReplyDelete
  13. ఇక పై విషాద ఛాయలు వీడి నవ్వుతూ నవ్విస్తారని ఆశతో ఎదురు చూస్తుంటాము పద్మార్పిత.

    ReplyDelete
  14. వ్యధలు ఉన్నవి అధికమించడానికి అని వ్రాశారు.

    ReplyDelete
  15. ఏ ప్రలోభానికీ లొంగని శిరస్సును వ్యధభారంతో వంచి అంతగా కలచివేసిన వేద ఏమిటో, త్వరలో మానిపోతాయి. నవ్వుతూ ఉంటారు.

    ReplyDelete
  16. No end for these hard moments mam. ☺

    ReplyDelete
  17. ఇంకెన్ని వ్యధలు భరించే సత్తువ ఎదకుందో..ఇలా పిలిస్తే అలా వచ్చిపడతాయి. చాలా బాగుంది ఈ కవిత మనసుకి హత్తుకునేట్టు.

    ReplyDelete
  18. జీవితం ఎలాగో విషాదమే ఇంక విచారకరమైన వాక్యలు ఎందుకండి.

    ReplyDelete
  19. క్రొత్తదారి వెతుకులాట ఉల్లాసంతొ కూడి ఉండాలి అప్పుడే హ్యాపీ. మంచి కవిత అందించారు.

    ReplyDelete
  20. మీకు వేదనలు వ్యధలు దుఃఖం లేని దారి దొరికితే మీ కవితలని అభిమానించే నందుని మరచిపోకండి పద్మార్పిత. :)

    ReplyDelete
  21. డిష్ డిష్ష్ డిష్షుం...బాధల్ని పేల్చేయ్.

    ReplyDelete
  22. "మౌనం" తో మొదలుపెట్టి "మరోదారి" వరకు మీ కవితలన్ని అక్షర సుమమాలికలై భాసిల్లుతున్నాయి పద్మగారు

    ReplyDelete
  23. ప్రతి ప్రయత్నం ఒకదాని వెంట ఒకటి శత్రువై అంటూ మొదలుపెట్టి అంతంలో క్రొత్తదారి దొరుకునని కంటి వెలుగునే పెంచుకుంటాను ముగింపు అద్భుతం.

    ReplyDelete
  24. అందరి స్ఫూర్తి వాక్యాలకు వందనములు _/\_

    ReplyDelete
  25. బ్రతికినంత కాలం క్రొత్తదారులు వెతుక్కుంటూ సాగిపోవడమే తప్పదు జీవితం. చక్కగా చెప్పారు.

    ReplyDelete