గుండె గదిలో ఏదో ఒక మూల
ఎప్పుడూ తచ్చాడుతూనే ఉంటావు..
రేయింబవళ్ళు అలసటలేక అంతటా నీవై
ఆరని జ్యోతివలె వెలుగుతుంటావు....
ఆ వెలుగులో ఆనందం కానరాక ఆర్పనూలేక
నీ ఆలోచనలు వద్దన్నా గిలిగింతలు పెడితే
నన్ను నీలో బంధించిన నిన్ను నింధించక
నన్ను నేను తిట్టుకుని మనసు తలుపు తీసి
నిన్ను పారద్రోలాలని ప్రయత్నించినా ఫలించక
ఏకాంత రాయబారమే జరిపి పంపించనూలేక..
సతమతమై ఎదురుగా లేని నీతో ఎన్నో ముచ్చటించి
నా మనసుకు నేనే అలుసైపోతూ నీకు దగ్గరౌతాను!
ఎప్పుడూ తచ్చాడుతూనే ఉంటావు..
రేయింబవళ్ళు అలసటలేక అంతటా నీవై
ఆరని జ్యోతివలె వెలుగుతుంటావు....
ఆ వెలుగులో ఆనందం కానరాక ఆర్పనూలేక
నీ ఆలోచనలు వద్దన్నా గిలిగింతలు పెడితే
నన్ను నీలో బంధించిన నిన్ను నింధించక
నన్ను నేను తిట్టుకుని మనసు తలుపు తీసి
నిన్ను పారద్రోలాలని ప్రయత్నించినా ఫలించక
ఏకాంత రాయబారమే జరిపి పంపించనూలేక..
సతమతమై ఎదురుగా లేని నీతో ఎన్నో ముచ్చటించి
నా మనసుకు నేనే అలుసైపోతూ నీకు దగ్గరౌతాను!
చిత్రం మెప్పించి కవితతో మురిపించారు.
ReplyDeleteచివరి వాక్యాలు మనసును తగిలినవి
ReplyDeleteమనసులో పానుపు వేసుకున్న వ్యక్తులను అసలు మరచిపోవాలి అనుకోవడం సాహసం దూరం చేసుకోవాలి అనుకుంటే దగ్గరవడం వారి లక్షణం.
ReplyDeleteరేయింబవళ్ళు అలసటలేక అంతటా నీవై
ReplyDeleteఆరని జ్యోతివలె వెలుగుతుంటావు....
ఆ వెలుగులో ఆనందం కానరాక ఆర్పనూలేక
నీ ఆలోచనలు వద్దన్నా గిలిగింతలు పెడితే...ఏమిటి పద్మగారు రాగం ధ్వేషం కలగూరగంపలా కలిసి ఇలాంటి ఇక్కట్లు తీసుకు వచ్చినాయి. కష్టకాలమే 😃
*!*
ReplyDeleteFace nachaka track change chesi try cheyandi padma prayatnam success autundi. Picture innocence undi.
ReplyDeleteబాగుంది .
ReplyDeleteఅంత సులభతరమా మరపు?
ReplyDeleteఅయినా తలచుకోనేల మరచిపోనేల? మీ భాషలోనే :)
లవ్లీ కవిత పద్మా.
ReplyDelete
ReplyDeleteఅంత సులభతరమా మరు
పంత సులభమా జిలేబి పరువపు వేళన్,
పంతము వలదే ప్రియునిన్,
కొంతయు జూడన్ లలామ గోముగ నిలుపూ :)
జిలేబి
Ha haaaa
ReplyDeleteసతమతమై ఎదురుగా లేని నీతో ఎన్నో ముచ్చటించి
ReplyDeleteనా మనసుకు నేనే అలుసైపోతూ నీకు దగ్గరౌతాను!సున్నితంగా చెప్పారు
రేయింబవళ్ళు అలసటలేక అంతటా నీవై
ReplyDeleteఆరని జ్యోతివలె వెలగడం అంటే వృధా పరుస్తున్నట్లు పరిగణించి నష్టపరిహారం కోరడం సమంజసం పద్మార్పిత.
మరచిపోవడం ఒక వరం. అది అందరికీ దక్కదు :)
ReplyDeleteఅసలు ఎవరినైనా మరచిపోవాలి అనుకోవడం పాపం మేడమ్.
ReplyDelete"నా మనసుకు నేనే అలుసైపోతూ నీకు దగ్గరౌతాను!"..
ReplyDeleteహ్మ్. పద్మార్పిత గారు ఎంత కష్టమొచ్చిందండీ...ఐనా "మీభావాలకు తెలిసిన భాష ఒక్కటే కదండీ... "వేదనలోను వేడుకలోను నవ్వడం" ఈ సారికి అలా కానిచ్చేయండీ :)
దూరం ఔతున్నాము అనుకుంటూనే దగ్గరతనం అంతే ఇదేనేమో:-)
ReplyDeleteగుండెని గదిగా చేసి మూల కూర్చోబెట్టిన తరువాత తెరతీసి తొలిగిపోమని అంటే ఎక్కడికి పోతాడు చిన్నవాడు ఏమైపోవును అంతడి హృదము ఆలోచించి నిర్ణయము తీసుకోవాలి. హా హా హా
ReplyDeleteప్రణయం సుధామథురం, అందులో ఇవి సర్వసాధారణం చిట్టమ్మో
ReplyDeleteనీకు నేను అన్నవేళ మరచిపోయే ఆలోచన అనవసరం. చిత్రం బాగుంది.
ReplyDeleteఈ మధ్య కవిత్వంలో పదును కాస్త తగ్గినట్లుంది పద్మ. నీ నుండి అధ్భుతమైన కవిత కోసం ఎదురుచూస్తున్నాను.
ReplyDeleteGood one
ReplyDeletewhere is today's post?
మనసును తడిమేసే కవిత...
ReplyDeleteకుశలమా పద్మార్పిత. ఈ మధ్య కవితలు కొరవడినాయి. కారణం అడగాలని కాదు. ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండు తల్లీ-హరినాధ్
ReplyDeleteఅందరి ఆత్మీయ స్పందనలకు ధన్యవాదాలు _/\_
ReplyDelete