ఎవ్వరు?

నేను నువ్వు అలిగి కలత పడితే
బ్రతిమిలాడి అలుక తీర్చేది ఎవ్వరు?
నేడు ఇరు హృదయాలు బీటబారితే
అతుకువేసి గాయం మార్పేది ఎవ్వరు?
నువ్వు నేను మౌనంగా ఉన్నామంటే
ముందుగా మౌనం వీడేది ఎవ్వరు?
చిన్ని విషయానికి పెద్దరాద్దాంతం చేస్తే
బంధాన్ని పీతముడేసి బిగించేది ఎవ్వరు?
నేనూ ఏడ్చి నువ్వూ కంటనీరు పేడితే
కన్నీరు తుడిచి బుజ్జగించేది ఎవ్వరు?
నువ్వు నేను ఇద్దరం రాజీకి రాకపోతే
మరి క్షమించి దయతో కట్టేసేది ఎవ్వరు?
నీలోను నాలోను అహం గెంతులువేస్తే
అహాన్ని అణచి అలసట తీర్చేది ఎవ్వరు?

ఎవ్వరికీ సదా సొంతమవని జీవనయాత్రలో
ఒంటరి గడియల్ని ఒడిసి పట్టేది ఎవ్వరు?
నువ్వు ముందో నేను ముందో కన్నుమూస్తే
మరలా రేపిలా పశ్చాత్తాపం పడేది ఎవ్వరు?

32 comments:

  1. సచ్చిపోతామని తెలిసి తిక్క తింగరి పనులు సేయమంటవా ఏంది పద్దమ్మ?

    ReplyDelete
  2. WHO?
    Well narrated lines padma.

    ReplyDelete
  3. ఎవ్వరు..!

    బ్రతికున్న నాడే బ్రతిమిలాడుకోవాలి
    బ్రతికున్న నాడే అతుకువేసుకోవాలి
    బ్రతికున్న నాడే గాయాన్ని మార్పుకోవాలి
    బ్రతికున్న నాడే మౌనం వీడాలి
    బ్రతికున్న నాడే పీఠముడి బిగించుకోవాలి
    బ్రతికున్న నాడే కన్నీరు తుడిచి బుజ్జగించుకోవాలి
    బ్రతికున్న నాడే క్షమించుకోవాలి
    బ్రతికున్న నాడే అహాన్ని అణుచుకోవాలి
    బ్రతికున్న నాడే గడియల్ని నెమరేసుకోవాలి
    బ్రతికున్న నాడే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి

    తిరిగిరాని వసంతం ఈ జీవితమని తెలుసుకోవాలి
    మనః స్పర్ధలు వచ్చినా వీడనాడి మంచిగా మెలగాలి
    అహం భావం మదిలో మెదిలినా ఓర్పుతో భరించాలి
    నువ్వు నేను కాదు మనమనుకుని కడదాకా సాగిపోవాలి

    పద్మగారు.. మీ కవితతోనే మీ కవితకు ప్రతిస్పందన..
    ఎవరిని ఉద్దేశించినది కాదు పద్మార్పిత గారు సరదాగా వ్రాశాను..

    "నువ్వే నువ్వే" అనే మూవిలో ఒక లైన్ గుర్తుకొచ్చింది పద్మగారు మీ ఈ కవితను తిలకించాకా..!

    "గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా"
    "నను వదిలి నువ్వు ఉండగలవా నిజం చెప్పవమ్మా"

    దేవి శరన్నవరాత్రి శుభాభినందనలు మీకు పద్మగారు

    ~శ్రీ~
    అఖిలాండకోటి బ్రహ్మాండనాయక
    ఆదిమద్యాంత రహిత మలయప్ప

    ReplyDelete
  4. శుభోదయం .

    ఇంతవరకు చిత్రం , భావం , కవితా పోకడ బాగున్నదని మాత్రమే చెప్తూ వచ్చాను . ఈ కవితకు శ్రీధర్ బుక్యా ప్రతిస్పందన కూడా చాలా చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలకి ధన్యోస్మి శర్మ సర్.
      థ్యాంక్యూ ఫర్ ది కాంప్లిమెంట్స్..
      ఆల్వేస్ ఆబ్లైజ్డ్ యాండ్ హంబల్డ్ ఫర్ దీ కైండ్ వర్డ్స్.

      ~శ్రీధర్ భూక్యా

      Delete
    2. తిరిగిరాని వసంతం ఈ జీవితమని తెలుసుకోవాలి
      మనః స్పర్ధలు వచ్చినా వీడనాడి మంచిగా మెలగాలి
      అహం భావం మదిలో మెదిలినా ఓర్పుతో భరించాలి
      నువ్వు నేను కాదు మనమనుకుని కడదాకా సాగిపోవాలి...సర్దుకుపోయి సాగిపోవడం అనే సూత్రాన్ని పాటించాలి అంటారు.:-)

      Delete
    3. ఔననే అంటాను అమ్ము గారు.. మీ వ్యాఖ్య కు ధన్యోస్మి.. జై శ్రీవేణుగోపాల

      Delete
    4. మీ కవిత బాగుంది శ్రీధర్గారు.

      Delete
    5. థ్యాంక్యూ ఆకాంక్ష గారు.

      అక్షరం బోలిన అక్షరంబునుండా భావంబు వేరగున్
      వేవేల భావాలైనా అక్షరంబునందేనిటుల ఇమిడేన్

      Delete
  5. అంతర్లీనంగా ఏదో తెలియని వేదన తెలిపినట్లుగా ఉంది మీరు. కవిత భావం బాగుంది.

    ReplyDelete
  6. ఎవ్వరికీ సదా సొంతమవని జీవనయాత్రలో
    ఒంటరి గడియల్ని ఒడిసి పట్టుకోవడం కష్టం

    ReplyDelete
  7. నువ్వు నేను ఇద్దరం రాజీకి రాకపోతే క్షమించి దయతో కట్టేసేది ఎవ్వరు?...ఇగోతో కొట్టుకునే బ్రతుకులు ఇంతేనేమో :-)అయినా అన్నీ సర్దుకుపోయి రాజీతో బ్రతకడమే జీవితం అని చెబుతారు మీరు :-)

    ReplyDelete
    Replies
    1. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పూర్వికులు..
      కాని ఆ విపరీత బుద్ధికి కారణం ఈగో అని తెలిసి కూడా తెలియనట్లు ఉంటారు కొందరు..
      కాని ఇఫ్ వన్ ట్రైస్ టూ థింక్ కూల్లీ కెన్ ఒవర్కమ్ దీ ఈగో బై రీ ఇన్-స్టాలింగ్ ఇన్నర్ పీస్.. ఇన్నర్ పీస్ కెన్ ఒన్లి బీ అచీవ్డ్ బై దీ వే ఆఫ్ కాంప్రమైజ్ యాండ్ బియీంగ్ కమ్పాషనేట్ విథ్ ఫెల్లో హ్యూమన్స్. ఇజ్ ఇట్ నాట్ దీ బెస్ట్ వే టూ ట్యాకిల్ దీ సిచువేషన్స్ విత్ పర్సివీయరెన్స్ అమ్ము గారు..!

      డిస్క్లైమర్:
      ఇట్ ఇజ్ బట్ మై పర్సనల్ ఒపినియన్ రిగార్డింగ్ దీ మ్యాటర్ అండర్ డిస్కషన్.

      ~శ్రీ~
      రంగనాథాండాళ్

      Delete
  8. ఎవ్వరు అనేది తెలుసుకున్నా తెగిన బంధం అతికేనా ఏమి మాడం?

    ReplyDelete
    Replies
    1. అతకకుండా ఉతికేది ఒకటి
      ఉతకకుండా అతికేది మరొకటి

      ఒకటి సర్ఫ్ ఎక్సెల్ టాప్ లోడ్
      మరొకటి పిడిలైట్ ఫెవికాల్ అధేసివ్

      సరదాగా వ్రాశాను అన్యథా భావించకండి
      దసరా ముందస్తు శుభాకాంక్షలు మీకు మహి గారు

      ~శ్రీ~
      ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర

      Delete
  9. జీవితం చాలా చిన్నది. ఇందులో గొడవలు అలుకలు ఎందుకు హాయిగా అనందంగా సాగిపోక అంటూ మంచి సందేశాన్ని అందించావు అర్పిత-హరినాధ్

    ReplyDelete
  10. చిన్ని విషయానికి పెద్దరాద్దాంతం చేస్తే బంధాన్ని పీతముడేసి బిగించేది ఎవ్వరు అని అడగడం ఎందుకు చాలా వరకు అందరూ ఇంతే.కవిత బాగుంది పద్మగారు.

    ReplyDelete
    Replies
    1. నా పర్సనల్ ఒపినియన్ చెప్పమంటే నేను చెప్పేది ఒకటే నందిని గారు..
      ఒకరిపై ఒకరు కోపగించుకుని ఎడమొహం పెడమొహం పెట్టుకుని కంట నీరు తెప్పించేకంటే.. ఎప్పుడైనా మనఃస్పర్ధలు వచ్చినపుడు అసలు ఏ విషయానికి ఇలా తగాదా పడ్డామని సమాలోచన చేసుకుంటే ఒకరినొకరు దూషించుకునే బదులు వారి తప్పులేమైనా ఉంటే ఇద్దరూ తెలుసుకుని సరిచూసుకుంటే ఆ జంటను చూసి అన్యోన్యతకు తార్కాణమని ఖితాబునిస్తారు సమాజం లో గౌరవం పొందుతారు. కాని పక్షానా ఆ సమాజం కన్నుల్లో చులకన భావం మెదిలితే ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లు ఎవరు ఎవరిని పట్టించుకోరు. అందుకే కీడెంచి మేలెంచమన్నారు.. ముందు మనలోని దుర్గుణాలు తెలుసుకుని వాటి స్థానంలో సద్గుణాలను పెంపొందించుకుని మసులుకుంటే అందరికి ఆదర్శంగా నిలుస్తారు.. ఔనో కాదో మీకు అవగతమై ఉంటుందనుకుంటాను.

      జీవితం ఒక్కటే ఒక్కసారే వస్తుంది..
      అహం ఈర్ష్య అసూయలకు లొంగే కంటే..
      మంచి మానవత్వం విశ్వసనీయత అవలంబిస్తే..
      ఆ జీవితం సార్థకం పరిపూర్ణం చరితార్థం ఔతుంది..

      హ్యాపి వీకెండ్ నందిని గారు.

      Delete
  11. ఇంచుమించు అందరూ ఎప్పుడో ఒక్కప్పుడు ఈ కోవకే చెందుతారు.

    ReplyDelete
    Replies
    1. మీకొక విషయం చెప్పమంటారా సర్..
      మంచిని మంచి అని మాత్రమే అనుకుని అటకెక్కించి చెడును మాత్రం వెంట పెట్టుకుంటారు లోకులు. ఎవరైనా ఏదైనా అంటే ఆ మాట ఎంతవరకు వాస్తవం.. నిజంగా ఏదైనా పొరపాటు జరిగిందా లేకుంటే ఎందుకిలా అంటున్నారు అని ఎవరిని వారు విశ్లేషించుకుంటే కలహం అనే మాట ఎప్పుడో సమాధి అయ్యేది. ఆలోచన విచక్షణ ఔనత్యం నిరాడంబరం అనే గుణాలు మనిషిని మంచివైపు అయస్కాంతంలా లాగుతు ఉంటాయి.. ఐతే మానసిక పరిపక్వతతో తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి ఎంత చిన్నదైనా కలకాలం గుర్తుండిపోతాయి. అవే ఆ జీవితానికి విలువను ఇస్తాయి

      ఖుదా హఫీజ్ సాహేబ్ పాషా జీ

      Delete
  12. మరో సందేశాత్మక కవిత.

    ReplyDelete
  13. నేను నువ్వు అలిగి కలత పడితే ???

    ReplyDelete
    Replies
    1. నేను నువ్వు అలిగి కలత పడితే ఏమొస్తది

      ముందు మాటోస్తది
      అనక ఏడుపోస్తది
      ఆపై ముక్కోస్తది

      మీరిలా కమెంట్ లో క్వెషన్ చేస్తే ఏమైతది
      అల్లు అర్జున్ పాటోస్తది
      ఆ పాటకు పెరడి వస్తది
      పేరడి చూసి మీకు నవ్వోస్తది

      ఊరికురికే నువ్ అలగమాకే
      ఆగి ఆగి మూతి వంకర పెట్టమాకే
      శివమ్ పాట వస్తాదే..
      పేరడికి నవ్వు వస్తాదే..

      ఇది సంగతి నందుగారు
      మరి నవ్వుకున్నారా లేదా..!

      Delete
  14. కవితలో నిగూఢ అర్థం ఉందండీ.

    ReplyDelete
  15. ఎప్పటివలెనే బాగుంది.

    ReplyDelete
  16. రైలు పట్టాల్లాంటి ప్రేమైక జీవనంలో కలతలూ, కోపతాపాలు సహజం... అలాంటి సన్నివేశాన్ని అక్షరాల్లో హృద్యంగా మలచి అంతర్లీనంగా నిర్లిప్తతను వీడమంటూ విన్నవించడం అద్భుతంగా ఉంది మేడం.....సలాం..!!

    ReplyDelete
  17. అర్పితమ్మీ... యేమైతావుండాది నీ గుండెల్లో... ఇట్ట రాసేస్తుండావు :)

    ReplyDelete
  18. అంత ప్రభావితం చేయలేకపోయింది.

    ReplyDelete
  19. ఎవ్వరు ఏమిటి ఎలా అంటూ ఇంకా ఎన్నిన్నాళ్ళు అడుగుతారో :)

    ReplyDelete
  20. అందరి స్పందనలకు వందనములు _/\_

    ReplyDelete