అంతర్ముఖ కల్లోలిత అంతరంగం అనుకోకు
ఆందోళనలతో కలవరపడిన అంతఃపురమది
అంతర్యమంతా ప్రేమ నిండిందని పొరబడకు
ఆరని వేదనలని నిద్రపుచ్చుతున్న గూడది
అరవిరసిన అందాల నందనవనం అనుకోకు
ఆర్ద్రతామిళిత ఆలోచనలతో ఆరి వెలిగిందది
అలరించే సరాగ సరిగమ రాగాలు వెతుకకు
ఆవేదన్ని జాలువార్చే విషాదగీతాల నెలవది
అందమైన అక్షరాలతో అల్లినమాల అనుకోకు
ఆవేశాలకు ఆనకట్టలువేసి అణచిన భావమది
అరమరికల అంతస్తులతో అమరిన మిద్దెనకు
ఆప్యాయతతో అక్కున చేర్చుకునే పూరిల్లది!
ఎంతో అందమైన మనసు మీది.
ReplyDeleteఅందరినీ మీ అనుకుని అక్కున చేర్చుకునే ఆప్యాయత.
ReplyDeleteI can view so confidence in your lyrics & picture.
అఆ ల మధ్య ఇన్నిన్ని భావాలను కూర్చిన మీ అంతరంగం అనురాగ ఆత్మీయతల నెలవైన ఏడంతస్తుల మేడే అర్పితాజీ... అభినందనలు
ReplyDeleteఅచంచల అక్షరాలతో అనాలోచితమైన అర్థం అద్ది
ReplyDeleteఆలోచనల ఆంతర్యాన్ని ఆర్ద్రతతో ఆకట్టుకున్నారు
మనసులో మెదిలే భావోద్వేగాల సారాన్ని రాగద్వేషాలతో
కలగలిపి మీదైన శైలిలో చక్కని కవితనందించారు పద్మ గారు.
Emotions should always be a Strength to tackle adversities with Courage. Strength always gives a reason to Stay Bold.
~Sri~
Jai Srimannarayana
ఏం లేదు అంతా కల్లోలమని చెబుతూ అందులోంచి కమలం వంటి కల్మషంలేని మది మీదని నిర్ధారించి చూపారు. చిత్రం చూడ ముచ్చట.
ReplyDeleteఆవేశాలకు ఆనకట్టలువేసి అణచిన భావమది...మన మనసు గురించి మనకి కాకుండా ఎవరికి తెలుస్తుంది చెప్పండి. చాలా బాగారాసారు మేడం.
ReplyDeleteమీ మదిని చిక్కని భావాలతో చిత్రీకరించారు.
ReplyDeleteమీ అంతరంగం కల్మషం లేనిదని వ్రాసినారు.
ReplyDeleteMee manasu vippi maa manasu docharu. Congrats.
ReplyDeleteతిరుగులేదు మీ హృదయ భావాలకు.సున్నిత సరళ సరిగమలు పలికాయి ఆర్ద్రతతో.
ReplyDeleteఅరవిరసిన అందాల నందనవనం అనుకోకు
ReplyDeleteఆర్ద్రతామిళిత ఆలోచనలతో ఆరి వెలిగిందది..అందంగా ఆశలు పెట్టుకుని అతిగా ఊహించుకోవద్దని సున్నితంగా వివరించారు.
ReplyDeleteహ! యచంచల యక్షరముల
భయంబుల గనితివిగాద! పద్మార్పితవై
పయనంబు గొనుము పరువపు
నయగారంబుల రహస్య నగరియటగనన్ :)
జిలేబి
నా మది చదువ గుండె జారి గల్లంతాయే.....హ హా
ReplyDeleteఅంతర్ముఖం కల్లోలితం అనుకున్నది ఎవరు? మేమంతా అసలుసిసలు అయితే కదా మీ అంతరంగం గురించి వాకబు చేసి అనుకోవడాని.
ReplyDeleteఅయినా మీకు ఆందోళనలు ఏల చెప్పండి. మంచి హృదయ భావాన్ని కాదు వేదనని తెలిపారు కవితలో.
Always your writings touch the heart. Rocks Padma.
ReplyDeleteమీ మది చల్లగా...:)
ReplyDeleteసూపర్ వ్రాసారు మనసులోని అలజడి.
ReplyDelete❤☺✓
ReplyDeleteనీకు నీ అక్షరాలకు తిరుగులేదు.
ReplyDeleteగుండెలోకి డైరెక్ట్ దూసుకెళ్ళింది
ReplyDeleteమంచి మనసు.
ReplyDeleteతెలిసింది మీ మది విశేషం.
ReplyDeleteఅందరి ఆత్మీయ స్పందనలకు అభివందనములు _/\_
ReplyDelete