నీరెండ కులుకుల్లో నీ మాటలు మెలిపెట్ట
విడిపోలేని మన శ్వాసలు చేసిన బాసలు
చురుక్కుమన్న నీ చూపుల చమత్కారంతో
మనసాయె చెమక్కులు కావు నీ జిమిక్కులు!
గమనించావో లేదో ఆనాటి సద్దుమణిగినవేళ
అల్లుకున్న వలపుల్లో అయిన అధరాల గాట్లు
నీవు చేసిన అల్లరికి కందిన తనువు వంపులు
వేడి తాళలేక విచ్చుకున్న కోరికల కవాటాలతో
సాగిన రాసలీలకి కుళ్ళుకున్న వెన్నెల సెగలు!
గిలిగింత జ్ఞాపకముందో లేదు నాటి పొద్దువేళ
జాగారం చేయించి జారుకోమాకని నడుం గిల్లి
దాహం తీరలేదని తడిమిన తిమిరపు లోయలు
లేవబోవ బాహువుల బంధిట్లో పరస్పర రాపిడ్లతో
సన్నగా మూల్గి సిగ్గుతో ఒదిగిన సరస సరాగాలు!
గడిచిన గతం మరలి వచ్చునో లేదో తెలియనివేళ
ఆ తీయని తలపులే తుమ్మెదలరోదనై జివ్వుమన
బంధించలేని అలసిన మనసు చేస్తున్న అలజడులు
స్మృతుల ప్రవాహాన్ని గతకాలపు కలల సాగరంతో
సంధి చేయలేక నెమరేసుకునే మధురానుభూతులు!
అంత త్వరగా తీరిపోయెనా అనుభూతులు. అయినా మీరు ఏం చెప్పినా ఏదో నిగూఢ అర్థంతో చెబుతారు. ఇందులోని మర్మం ఏమిటో మీరే చెప్పాలి మరి....
ReplyDeleteఆ అన్వేషణ ఇంకా పూర్తికాలేదుగా చెప్పడానికి...
Deleteఅన్నీ సక్రమంగా జరిగతే అందమైన అనుభూతులు లేదంటే నరకం☺
ReplyDeleteథ్యాంక్యూ...అంతేనేమో.
Delete
ReplyDeleteఅలనాటి సంధ్య వేళన
చెలికాడి సరసపు లాట చేసిన సెగలన్
వలపుల దోచిన తొలి వే
ళల వయ్యారము గుసగుసలాడె జిలేబీ
జిలేబి
మరోసారి జ్ఞప్తికి...:-) థ్యాంక్సండి.
Deleteశృంగార అనుభూతులు తలచిన కొలదీ మధురాతిమధురం.
ReplyDeleteథ్యాంక్యూ
Deleteawesome sweet memories to remember padma. you are so lovable.
ReplyDeleteజాగారం చేయించి జారుకోమాకని నడుం గిల్లి
ReplyDeleteదాహం తీరలేదని తడిమిన తిమిరపు లోయలు మొత్తానికి చెలికాడు సో రొమాంటిక్ అన్నమాట:)
థ్యాంక్యూ మార్కండేయజీ..
Deleteచెప్పకనే చెప్పబడినవి అవి మధురానుభూతులని . చిత్రంలో జీవకళ ఉట్టిపడ్తున్నది ఎప్పటిలాగే .
ReplyDeleteమీ అభిమాన వ్యాఖ్యల ప్రోధ్బలం. ధన్యవాదాలండి శర్మగారు.
Deleteమోహాల సెగదాకి ముంజేతి మురుగులు
ReplyDeleteకనకన వేడెక్కె గడుసు వాడ !
నెట్టన కడియాలు పట్టుట లేదురా
రెట్టలు బరువాయె ప్రియ సఖుండ !
నుదుటి సింధూరము మదిలోకి దిగజారి యొల్లంత తమి రేగె అల్లరోడ !
కంఠహార మెదను తంటాలు వెట్టెడు
ఊపిరాడుట లేదు రూపు రేడ !
సంధ్య వేళకె వినువీధి చాటు చేరి
పగలె రేరాజు వొడమెను , పాడు బుధ్ధి
ఏలరా వీడి కిపుడు నన్నేలు వేళ ,
అంతు తేలదేమిర ? మధురానుభూతి .
మీ పద్య జగతికి ముందు నా రాతలెంత చెప్పండి. అభివందనములు.
Deleteఅధరాల గాట్లు
ReplyDeleteఅల్లరికి కందిన తనువు వంపులు
వేడి తాళలేక విచ్చుకున్న కోరికల కవాటాలు
రసవత్తరంతో సాగిన వలపుజరికి మేను పులకరించెను.
థ్యాంక్యూ.
Deleteమాంచి రసపట్టుతో సాగిన అనుభూతులు,ఇంతకూ రసాధరుడు ఎవ్వరు ఏమా కధ కొంచెం వివరించుము.
ReplyDeleteమీరు ఆస్వాధించడాన్ని బట్టి కదా :-) థ్యాంక్యూ.
Deleteతిరిగిరాని అనుభూతులని నిరుత్సాహపడి మమ్మల్ని నీరుగారిస్తే ఎలా మాడంగారు? మమ్మల్ని మరింత ఉత్తేజ పరచాలి. హా హా హా
ReplyDeleteథ్యాంక్యూ ఎప్పుడూ ఉత్సాహపరచలేం కదా :)
Deleteగడిచిన గతం మరలి వచ్చునో లేదో తెలియనివేళ
ReplyDeleteఆ తీయని తలపులే తుమ్మెదలరోదనై జివ్వుమన
బంధించలేని అలసిన మనసు చేస్తున్న అలజడులు aasa repe madhurohalu.. meke sontam ila rayadam.. abhinandanalu
థ్యాంక్యూ వర్మగారు...మీ ప్రేరణలే రాయిస్తున్నాయి.
Deleteఓహో ఎంత మధురం ఈ అనుభవాలు అనుభూతులు.
ReplyDeleteరమ్యం మీ అనుభూతులు.
ReplyDeleteథ్యాంక్యూ..
Deleteగిట్ల గడియకో పారి కలవరించుకుంటే ఎట్లైతది :)
ReplyDeleteఏం చేసేది తప్పదు :)
Deleteలేవబోవ బాహువుల బంధిట్లో పరస్పర రాపిడ్లతో
ReplyDeleteసన్నగా మూల్గి సిగ్గుతో ఒదిగిన సరస సరాగాలు!
ప్రేమ అనుభూతిని ఆస్వాదించే విధంగా వ్రాసి ఆనందాన్ని ఇచ్చారు.
థ్యాంక్యూ నందిని...
Deleteఅందమైన గతస్మృతులు ఎప్పుడూ అనుభూతులుగా మిగిలిపోతాయి పద్మా. తప్పదు గుర్తొచ్చినప్పుడు నెమరు వేసుకోవడమే మరి :-)
ReplyDeleteఅలా నెమరువేసుకునేవే జ్ఞాపకాలు కదండీ..
Deleteమీ అనుభూతులతో తడిపి ముద్దచేసారు.
ReplyDeleteథ్యాంక్యూ..
Deleteప్రేమైక జీవన అమాయక మైకపు కునుకుపాట్లు....సరస శృంగారాధనాభరితం.... సూపర్
ReplyDeleteథ్యాంక్యూ..
Deleteమధురాతి మధురం.
ReplyDeleteథ్యాంక్యూ..
Deleteగడిచిన కాలం తిరిగిరాదు కనుకనే ప్రెసెంట్ డేస్ ఎంజాయ్ చేయాలి మాడం. గతించిన కాలాన్ని తవ్వుకుని ఏం లాభం చెప్పండి.
ReplyDeleteఎంజాయ్ చెయ్యాలంటే ఎనర్జీ కూడా కావాలి :)
Deleteగడిచిన అనుభూతులు జ్ఞాపకాలు అద్భుతమంటూ శృంగారాన్ని జోడించి చక్కటి చిత్రాన్ని జతచేసి అందించావు-హరినాధ్.
ReplyDeleteమీ వ్యాఖ్యలకు ధన్యవాదాలండి.
DeleteNice poetry.
ReplyDeleteNo postings.
thank you.
Delete