వలపు గ్రంధం

ఎదను అల్లరిపెట్టి మురిపించే భావాలని
హృదయ కుంచెతో ముచ్చటగా చిత్రించి
వలపు గ్రంధాన్ని అలవోకగా లిఖించనా!

 కలల కాపురం కనురెప్పలపై నివాసమని

అంబరాన్నున్న మెరుపుతారని చూపించి
ఎదిగిన ప్రేమ శిఖరం పై జెండా పాతిరానా!

ఆపాలనుకున్నా ఆగని మది సవ్వడులని

గీతంగా వ్రాసి రాగాన్ని జతచేసి ఆలపించి
ప్రేమలోని రెండక్షరాలు మనమని చెప్పనా!

ఇరు ఊపిర్లకు సులువైన మార్గం కలయికని

 కలిసి కన్నీరిడి ఎదపై తలవాల్చి నిదురించి
వలపు సరిహద్దులే దాటామని నిర్ధారించనా!

18 comments:

 1. కొంపదీసి మీరు కొలతలు కొలమానం డిపార్ట్మెంటా పద్మార్పితా? ప్రేమను నిర్ధారించి కొలిచేసినట్లుంది మీ కవిత. మొత్తానికి ప్రేమను జయించారు. కుడోస్

  ReplyDelete
 2. వలపుగ్రంధం ఒక్కటి కాదు వందల్లో వ్రాసేయగల ప్రతిభాసంపన్నులు మీరు కొనసాగనివ్వండి.

  ReplyDelete
 3. Grandhum opening function nadu pilavadam marachipovaddu.

  ReplyDelete
 4. జీవితమే ఒక గ్రంథం అందులో క్షణాలన్ని ఒక్కో కాగితం
  జీవితమే ఒక శిఖరం అందులో క్షణాలన్ని ఒక్కో పతాకం

  అక్షరాలను భావాల కొలనులో ముంచి తీయటం మీకు తెలియనిదా పద్మ గారు..
  మధురమైన క్షణాలను జ్ఞాపకాలుగా మలుచుకోవాలని ఏతద్వార తెలియజేశారు ఔనా..!
  చిత్రంలో జీవకళ ఉట్టి పడుతోంది.. భావం అక్షరానా సరితూగింది

  ~శ్రీ~

  ReplyDelete
  Replies
  1. May the Festival of Light Diminish the Darkness of Evil and Brighten Up the Good in Everyone.

   Wishing You A Happy Diwali Padma Gaaru

   Delete
 5. క్యా బాత్ హై మాడం
  ప్యార్ మే డూబీ హో

  ReplyDelete
 6. లిఖించండి....చదవడానికి రెడీ

  ReplyDelete
 7. వాహ్ వలపు సర్టిఫికెట్టు ఇచ్చినట్లున్నారు. గ్రంధాన్ని రాసి ఎప్పుడుbపబ్లిష్ చేస్తున్నారు.

  ReplyDelete
 8. ప్రేమామృతాన్ని సేవించి వ్రాసిన కవితగా పరిగణలోకి తీసుకి కవితలతో అలరిస్తున్న మీరు గ్రధాలు వ్రాయడం మీకు లెక్కకాదు ఏ అడ్దంకీ లేదు...ప్రొసీడ్ వ్రాసి అచ్చు వేసి తలొకటి పంచిపెట్టండి.

  ReplyDelete
 9. కలల కాపురం కనురెప్పలపై నివాసం మధురభావన మీ కలం నుండి.

  ReplyDelete
 10. నో డౌట్ రాసేయ్ పద్మా..
  పెయింటింగ్ చాలా నచ్చింది

  ReplyDelete


 11. వలపుల సర్టిఫికెట్టు
  న్నలవోకగ నిచ్చితీవు నాయెద సొబగు
  ల్లలరించెనోయి రమణీ
  కిలకిల నవ్వుల జిలేబి కిన్నెరసానీ !

  జిల్రబి

  ReplyDelete
 12. భేషుగ్గా రాసేయండి. ప్రచురించివేద్దాం ☺

  ReplyDelete
 13. May millions of lamps illuminate your life with endless joy,prosperity and wealth forever …Wishing you and your family a very Happy Diwali Didi.

  ReplyDelete
 14. దీపావళీ పండుగ శుభాకాంక్షలు.అందంగా వలపుసెగ రగిలించావు కవితలో, గ్రంధాన్ని లిఖించడానికి సంశయమేల? లిఖించు అర్పిత-హరినాధ్.

  ReplyDelete
 15. అందరి అభిమానానికి ఆలస్యంగా అభివందనములు _/\_ మన్నించాలి _/\_

  ReplyDelete