ప్రేమో ఏమో!!

 అందరూ నన్ను వలచి దరిచేర ప్రయత్నిస్తుంటే
నేను నిన్ను వలచి నీకై వగచడం వెర్రని తలచి..
విధిలించుకోలేనన్న హృదయం వదిలించుకోబోవ 
పసిపిల్లాడిలా ప్రేమించమంటూ ప్రాకులాడతావు!!

అడ్డాలనాడే బిడ్డలు కాని గెడ్డాలనాడు కాదనంటే
అవసరానికి వాడుకునే అవకాశవాదిని కాదని..
ప్రాయం వచ్చినా పరిపక్వత కరువాయనంటూ
గెడ్దాలదేముంది అడ్డగాడిదలా ఎదిగినానంటావు!!

అజ్ఞానం అలముకున్న అమాయకుడివి నీవంటే
ఆ జ్ఞానమేదో ఆర్జించినాకే అగుపిస్తానంటూ పలికి..
పైకాన్ని కూడబెట్టి కాసుల మూటలు ముందుంచి
ధనమే అన్నింటికీ మూలమంటూ ఉపదేశించావు!!

అందలమెక్కిన నీకు అగుపించని అందం నాదంటే
నటించలేని నాలో కల్మషంలేని నవ్వు చూసానని..
తెగింపులేని నా వలచిన గుండెపై జాలిగా జారబడి
నన్నెరిగిన నాలో నీ ప్రతిరూపాన్ని చూస్తున్నావు!!

26 comments:

  1. మారో నూతన ప్రేమఘటానికి స్వాగతం.
    అదిరింది మీ 501 ప్రేమకావ్యం అర్పితగారు.

    ReplyDelete
    Replies
    1. ప్రేమ అనేది నాజుకైనదని దానిని కుండతో పొల్చి వ్యాఖ్యానించటం బాగుంది శ్రీనాథ్ గారు..

      Delete
  2. చిత్రం అదిరింది కవిత కూడా సుమా.

    ReplyDelete
    Replies
    1. చిత్తరువును చిత్తగింపగా కవితను కానగా నేమి గోచరించేన్ "ఆఛాంఛా గాలు"

      ఎపులు కవితలను నాలుగు పంక్తుల్లో అర్దవంతంగా తెలియజేస్తాలుగా.. కమెంట్ కూలా చింగల్ లైన్ బలే బలే బాగున్నది అంతు..

      నాకిపులు నిద్లొత్తాంది నేను బజ్జు

      Delete
    2. అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
      పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భవంబు దెలిపె నీ వుయ్యాల

      Delete
  3. హాట్ గా ప్రేమ పండించారు.
    గుడ్ కొనసాగించండి.

    ReplyDelete
  4. అయ్యో పాపం..!
    ఎవరి వంత పాడాలో ఏమో తెలియరాలేదు పద్మ గారు..!
    ఏదైతేనేమి తిడుతూనే అందలం ఎక్కించారు కవితలోని నాయకుణ్ణి..

    ఈ లైన్ లో మాత్రమే రాధాకృష్ణులు కనిపించారు నాకు అందుకే భలే నచ్చేసింది:
    నన్నెరిగిన నాలో నీ ప్రతిరూపాన్ని చూస్తున్నావు!!

    ఓం రామాంజనేయా
    ~శ్రీ~

    ReplyDelete
    Replies
    1. అందలం సంగతి దేవుడెరుగు కనీసం ఉట్టి ఎక్కినా సంతోషమే అంటున్నారా.. లేకా అందలం అంటూనే గార్దభమంటు అటకెక్కంచినారా మీ కవితా నాయకుణ్ణి..

      !

      చెట్టునెక్కగలవా ఓ నరహరి పుట్టనెక్కగలవా
      చెట్టునెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా

      Delete
    2. ఆశ నిరాశల నడుమ ఊగిసలాడేది జీవితం
      సంతోషం దుఃఖం సమపాళ్ళలో ఉండేది జీవితం
      ఆయువు కు ఊపిరులూదగా నవవసంతమే జీవితం
      అలుపెరుగని బాటలో సాగే భావగీతం జీవితం

      పురుడు పోసుకున్న వేళ ఊయల జంపాలతో స్వాగతించేది జీవితగమనం
      మృత్యువు ఒడి చేరగా కాటిలో కాలే కణిక జీవిత చరమగీతం

      Delete
    3. బేలన్ మిలా నహి.. చకనాచూర్ హో జాతా బేచారా
      లాపర్వాహి కా సబక్ తో మిలా ఉస్కో అన్జానా
      ఆయిందా కభీ ఐసి చాల్ న చలేఁ మిల్ గయి ఉసే సిలా
      పాంచ్ సౌ ఏక్ వాఁ కవితా ఆప్కీ రహి లాజవాబ్ కడి
      బ్రాహ్మి స్క్రిప్ట్ మేఁ దేవనాగరి స్క్రిప్ట్ లిఖ్ దియా దేఖ్ లీజియే పద్మ జి

      Delete
  5. so beautifully narrated padma. lovely poem and picture too.

    ReplyDelete
  6. ప్రేమో ఎమో.. :)

    ReplyDelete
  7. ప్రేమలో అర్పిత అండ్ అనానిమస్... గడ్డం పెంచుకున్న అడ్డగాడిద గారు ఎవరబ్బా.... ☺

    ReplyDelete
  8. Prema pyaar ishq...ahaaaaa

    ReplyDelete
  9. ఇంతకీ ఆ అభాగ్యుడు ఎవరో పాపం ☺

    ReplyDelete
  10. ఎంత ఘాటు ప్రేమయో...

    ReplyDelete
  11. ప్రేమో ఏమో తెలియకనే ప్రేమలో పడ్డారు అంటే మేము నమ్మాలి. ఇంతకీ అంత అమాయకులమా మేము ఏమో..
    నమ్మేంత అందంగా అల్లారు ప్రేమకావ్యాన్ని.

    ReplyDelete
  12. అందలమెక్కిన నీకు అగుపించని అందం నాదంటే నటించలేని నాలో కల్మషంలేని నవ్వు చూసానని..వామ్మో ఏంది తల్లి ఇలగెలగా

    ReplyDelete
  13. ఆహా...ఇలా అందరి ఎదుటా కాదని ఆపై ఆడవారు అమితంగా ప్రేమిస్తారని చెప్పకనే చెప్పినట్లు రాసింది ఖచ్చితంగా ప్రేమేనమ్మో పద్మార్పితా...డౌటేలేదు.

    ReplyDelete
  14. ప్రేమకు మారో గోలీ..

    ReplyDelete
  15. ప్రేమికుడు విరహంలో గెడ్డాలు మీసాలు పెంచుకోవడం విన్నాం కానీ ఇదేమి విచిత్రమైన ప్రేమికుడో కాదనుకుంటాను మీ దృష్టిలో అడ్డగాడిదలా గెడ్డాలు పెంచుకున్న ప్రేమికుడు అవునా పద్మా :)

    ReplyDelete
  16. మరోసారి ప్రియుడి మదిని కొరడాతో సున్నితంగా తాకినట్లుంది.

    ReplyDelete
  17. ఆహా ఓహో అనలేం...ప్రేమ పండింది.

    ReplyDelete
  18. అందరి ఆదరణ అభిమాన వ్యాఖ్యలకు అంజలి ఘటిస్తున్నాను. _/\_

    ReplyDelete
  19. 100% ప్రేమనే

    ReplyDelete