పోరాటం


పరచుకున్న మార్గం మొత్తం శూలాలని
ఉన్న సంబంధాలకు దుమ్మంటుకుందని
పరిష్కరించ ప్రతికూల పరిస్థితులు లేవని
తడుముకుని నీకు నీవు అవరోధం అవకు
లే లేచి నీ స్వంత మార్గాన్ని నీవే తవ్వుకో!



సూర్యుడు చీకటిలో గల్లంతు అయితేనేమి
రాతిరివేళ ముగియగానే తెల్లవారిపోయేను
కాంక్షలే నిన్ను కౌగిలించుకుని ఉన్నాయి
ఒంటరివైతివి అనుకుంటూ బెంబేలు పడకు
నమ్మిన సిద్ధాంత చట్టాన్ని నీవే నిర్మించుకో!



జీవనపోరులో మనోబలాన్ని విల్లుగా వంచి
కోరికల బలగాన్ని కొలిమిలో కాల్చి గట్టిచేసి
అడ్డంకులున్నా గెలిచే వరకు ప్రయత్నించు
నీ మనోధైర్యము వదిలేసి సహనం కోల్పోకు
సత్యానిదే విజయం అదే నీకు లక్ష్యం అనుకో!

26 comments:

  1. జీవితపు బాటలో ఎదురయ్యె ప్రతి అంశం పై అవగాహనపూరితమైన సదుదేశ్యమైన కవితను మీ రీతి మీ శైలిలో బాగా వివరించారు.. ఎంతటి అవంతరాలనైనా సునాయాసగా ఎదురుకునే శక్తి ప్రతి ఒక్కరిలో ఆంజనేయూనిలా కలిగి ఉంటాయని హితబోధ చేశారు పర్మ గాదు.. ఆఖరి లైను ముండక ఉపనిశత్ లో గల సత్యమేవ జయతే ను గుర్తు చేసింది.. ఎంతటి చేదు నిజమైనా మంచిదే.. వేపలా..

    చిత్రం లో నాకు కాళింది తటినా కడవలో నీళ్ళను పడుతునట్లుగా ఉంటూనే మరో వైపు కృష్ణుని పిలుపు వినాలని ఆత్రంగా ఎదురు చూస్తున్న రాధికలా కనిపిస్తోంది..

    మీకు మీ కుటుంబ సభ్యూలకు ముందస్తుగా శ్రీకృష్ణ జన్మాష్టమి విషెస్ పద్మ గారు.

    ~శ్రీ~
    భాగవత కృష్ణ భగవత్గీత కృష్ణ

    ReplyDelete
    Replies
    1. మీ కమెంట్ good.

      Delete
    2. Thank you আকাংক্ষা గారు

      Delete
  2. ఉత్తేజపూరితమైన వాక్యాలతో ఉసిగొల్పుతున్నారు జీవనపోరాటనికి.

    ReplyDelete
  3. Madam how are you?
    Thanks for more encouraging inspire lines.

    ReplyDelete
  4. ధైర్యంగా పోరాడమని చెప్పి చివరిలో సత్యానిది విజయం అంటే ఎలాగండి, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు ఏమైపోతారు నష్టాలతో కొట్టుకుని చెప్పండి.

    ReplyDelete
    Replies
    1. మీరు నాస్తికురాలు అనుకుంటాను.

      Delete
  5. నమ్మిన సిద్ధాంత చట్టాన్ని నీవే నిర్మించుకో
    ఎవరి చట్టం వారిది బాగుంటుంది :-)

    ReplyDelete
  6. చీకటివెలుగులు ఒకదాని వెంబటి ఒకటి వచ్చునని
    ప్రయత్నించి గెలుపు సాధించాలని సున్నితమైన పదకవితను తీర్చిదిద్దినారు అర్పిత..

    ReplyDelete
  7. "కాంక్షలే నిన్ను కౌగిలించుకుని ఉన్నాయి
    ఒంటరివైతివి అనుకుంటూ బెంబేలు పడకు"
    నిగూఢ అర్థం...చిత్రం మురిపిస్తుందండి.

    ReplyDelete
  8. జీవిత సమస్యలకి దగ్గరగా ఉండి హృదయానికీ హత్తుకుని మెదడుని ఆలోచింపజేసే కవిత. అభినందనలు.

    ReplyDelete
  9. నువ్వు గిసోంటి ముచ్చట్లు మస్తుగ జెప్తావు.

    ReplyDelete
  10. nice inspiring lines with lovely pic.

    ReplyDelete
  11. జీవితం మీరు వ్రాసినట్లు పోరాడుతూ సాగిపోవడమే అయితే జీవితాంతం యుధ్ధం చేస్తునే ఉండాలి

    ReplyDelete
  12. సత్యమేవ జయతే

    ReplyDelete
  13. ఒంటరివైతివి అనుకుంటూ బెంబేలు పడకు..ధైర్యాన్ని పెంచారు.

    ReplyDelete
  14. అన్నిటికీ మనోబలం తెగింపు ఉండాలి అంటారు. మంచి ప్రోత్సాహకరం కవితలొ

    ReplyDelete
  15. తుపాకీలు తూటాలతో పోరాటం చేయమనాలి హా హా ఆహా..
    బాణాలు విల్లంబులు ఇప్పుడు అవుటుడేట్ అయ్యింది మాడం

    ReplyDelete
  16. జీవనపోరులో మనోబలం కావాలి.

    ReplyDelete
  17. అదే పద్మా ఆత్మస్థైర్యం అడుగంటి పోతున్నా మున్ముందు మంచి జరుగుతుందని ఆశతో ముందుకు అడుగువేస్తున్నాము. నిరాశపడితే నీరశం గాక మరేం ఉండదు :-)

    ReplyDelete
  18. ఎక్సెలెంట్ అన్న చిన్నమాట సరిపోదు. చాలా చాలా నచ్చేసింది. ప్రేరణాత్మక కవిత .

    ReplyDelete
  19. గెలుపు ఓటములు ఎలా ఉంటేనేమి జీవితపోరాటం సాగించవలసిందే చివరి వరకు. మీదైన రీతిలో వివరించారు.

    ReplyDelete
  20. ఆచరణయోగ్యమైన అక్షరాలు అందంగా అమరినవి.

    ReplyDelete
  21. జీవనపోరులో మనోబలాన్ని విల్లుగా వంచి
    కోరికల బలగాన్ని కొలిమిలో కాల్చి గట్టిచేసి
    అడ్డంకులున్నా గెలిచే వరకు ప్రయత్నించు
    ఈ లైన్స్ చాలు పోరులో విజయం సాధించడానికి.

    ReplyDelete
  22. _/\_అందరికీ వందనములు_/\_

    ReplyDelete