కొసరు కాపురం

కొంటెగా తుంటరివై కొన్నాళ్ళు కాపురముండు
ఆ పై కరిగి చెదిరిన కలని కాలం గడిపేస్తాను

ముఖం పై కొన్ని ముద్దుమురిపాల రంగులద్దు 
గాట్లు పడితే సలిపే గాయాలని సర్దుకుంటాను 

హత్తుకుని హద్దుదాటిన ప్రతిబింబమై అగుపించు
సిగ్గుదొంతర్ల చీర చుట్టుకుంటినని సంబరపడతాను

బిడియం వీడమని బ్రతిమిలాడి వలపుసెగ రేపు
రగిలి చల్లారిన కోరికల్ని కిమ్మనరాదని కట్టేస్తాను

చిలిపిచేష్టలకి తుంటరి తెగులు అంటించి చూడు 
సరసం సంగీతరాగం ఆలపించెనని ఆడిపాడతాను

ప్రణయపు పరిమళాలను చేయి పసందైన విందు
ఆ పై వెళ్ళలేని నీతో కొన్నాళ్ళు కాపురమంటాను   

31 comments:

  1. కొంటెగా తుంటరివై కొన్నాళ్ళు కాపురముండు
    ఆ పై కదలక పడిఉంటాడని అందరికీ తెలుసు...హహహహా

    ReplyDelete
  2. mattulo maimarachi he will stay heeeee :)

    ReplyDelete

  3. ఏమో నండీ !

    ఈ పద్మార్పిత ఏళ్ల తరబడి విరహ గీతం పాడేసు కోంటోంది ! అయినా ఆ బావ చూసేటట్టు లేదు :)

    జిలేబి

    ReplyDelete
  4. విరహానికి అంతం ఎక్కడుంటుంది?
    వలపు అసలు ఎలా పుట్టుకొస్తుంది? :)

    ReplyDelete
  5. కాపురం మొదలుపెట్టినాక చాయిస్ ఉండదు కొసరు వడ్డించడాలు ఉండవు తల్లో....ఆటోమ్యాటిక్ మెషీన్ అయిపోతుంది లైఫ్.

    ReplyDelete
  6. ఏ క్షణానా ఎలా ఉంటుందో తెలియని జీవిత గమనం
    కడదాకా వెంట ఉండే ప్రాణమైనా తుదిలో విడిచి పయనం
    కనుక
    అసలు ఆనందాన్ని అలుసు కానిక
    కొసరు మెరుగులకి ఆకర్షితమవ్వక

    ~శ్రీ~
    హరిః ఓం

    ReplyDelete
    Replies
    1. ఆయోద్యరామయ్యదరిచేరగామిథిలానగరినవైదేహి

      Delete
    2. అద్రిజరాకతోదాసోஉహమనేనుముల్లోకాలునవగ్రహాలువిశ్వనాథునితోడ

      Delete
  7. అసలు లేనమ్మ కొసరు అడిగింది అనిపిస్తుంది. చిత్రం బాగుంది.

    ReplyDelete
  8. అందరు పైసల పరేషాన్లో ఉన్నరు.
    పిస్టోల్ మాట ఎవరు వింటారు? :-)

    ReplyDelete
  9. సిగ్గుదొంతర్ల చీర చుట్టుకుంటినని సంబరపడతాను-నిజంగానే నమ్మమంటారా లేక నమ్మకం బూటకమని నిరుస్తాహపడతాడో నాయకుడు :-)

    ReplyDelete
  10. కాపురం చేసి సంసార బరువు మోసిన తరువాత కొసరు కాపురం కాదు అసలు కాపురం చద్దు సంసారం అస్సలు వద్దని సన్యాస్సుల్లో కలుస్తారు మగవారు. 19 నవంబరు మెన్స్ డే అని ఇలా రాసినట్లున్నారు.

    ReplyDelete
  11. Lovely touching expressions.

    ReplyDelete
  12. ఈ ప్రేమలొల్లి తీరేదికాదు తపించడం తప్ప

    ReplyDelete
  13. ప్రేమ ఎప్పటికీ పరిపక్వానికి రాకపోతే కష్టం.
    అయినా మేము చెబితే మాత్రం వింటారా మీరు
    ప్రేమలో పుట్టి ప్రేమలో అంతం అంటారు :)

    ReplyDelete
  14. అసలు కన్నా కొసరు ముద్దని ఈ రూట్లోకి వచ్చారా...హ హ హా

    ReplyDelete
  15. పద్మా ట్రెండ్ మారినట్లుంది. అనుగుణంగా నీవు మారిపో :-)

    ReplyDelete
  16. కొసరు కాపురం
    పిసినారి కాపురం
    బాగుంది-

    ReplyDelete
  17. అందమైన అనుభూతి.

    ReplyDelete
  18. కాసుల కోసం కొట్టుకుంటున్న కాపురాలు నేడు
    ఇక కొసరు వడ్డింపులు ఎక్కడివి పద్మార్పిత??

    ReplyDelete
  19. కొంతకాలమేనా?
    కొంతకాలం అయిన పిదప
    కొసరుకు మలి కొసరు అడగాలి
    అంతేనా పద్మగారు లేక ఎంతకాలం అని అడగమంటారా!

    ReplyDelete
  20. .... పలుకే బంగారమాయేనా అంటు రాముని ప్రశ్నించిన ఓ సాటిమేటి మంగళంపల్లి బాలమురళికృష్ణ .....
    పలుకే బంగారమాయెనా అన్నది భద్రాచలరామదాసస్వామి గారి కీర్తన అండి. బాలమురళిగారి కల్పన కాదు. గమనించగలరు.

    ReplyDelete
    Replies
    1. మన్నించాలి సర్.. భావోద్వేగంలో అలా వచ్చేసింది.. సరి చేసినందుకు కృతజ్ఞతలు శ్యామలీయం సర్.. ప్రశ్నించింది కంచర్ల గోపన్న (రామదాసు) కాని గాత్రంతో వీనులవిందు చేసిన మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారని కొనియాడాను సర్.. నేను కమెంట్ సరి చేస్తాను సర్.. ఇంతక్రిమున్న కమెంట్ తీసివేస్తాను. మీ వ్యాఖ్యకు నెనర్లు ఆచార్యవర్య

      Delete
    2. రాగతాళాన్విత రసామృతమిళితమైన వాగ్గేయకారునిగా కీర్తి గడించి మనందరిని నేడు విడిచి అనంతలోకాలకు పరమపదించిన ఓ రాగముని.. మీ సంగీత సామ్రాజ్యపు పరిమళాలద్దిన ప్రతి గానం ఓ కనకకుసుమం.. ఓ సాటిమేటి మంగళంపల్లి బాలమురళికృష్ణవర్య.. మీ స్థానం సంగీతలోకంలో భర్తి కానీది..

      "ఇసైదా నం ఇరవుమ్.." అంటు మిలే సుర్ గానంలో మా బాల్యాన్నికన్నా మునుపే ముగ్ధమోహన గానం చేసీనా..
      "చింతలు రేచకు మమ్ము చిత్తమా.." యంటు అన్నమయ్య గారి జతిని మీ గాత్రంలో ఆలాపన చేసి వేంకటేశుని కీర్తించినా..
      "బాలమురళికృష్ణ మాకు బాల్యమిత్రుడే.." యంటు బాలుగారితో పాటు మాయందరి మనసులో చెరగని ముద్ర వేసుకున్న భారత సాంప్రదాయ శాస్త్రీయ సంగీతానికి మకుటం లేని మహరాజుగా ఏలినా ఓ మహానుభావా.. అశృతప్తనయనాలతో వీడుకోలు పలుకుతున్నాను..

      Dr. Mangalampalli Bala Murali Krishna Sir, May Your Soul Rest in Peace.

      వ్యాఖ్యలో పొరపాటును సరిజూపిన శ్యామల్ రావు తాడిగడప ఆచార్యవర్యనకు.. తమ బ్లాగ్ లో వ్యాఖ్య నమోదు పరిచే వీలు కల్పించిన పద్మార్పిత గారికి కృతజ్ఞతాభివందనలతో..!

      Delete
    3. "వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట
      చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట

      చేతిలో అమృతము ఉన్నంత సేపే అన్నదమ్ములంట
      ఆ ఘాధం బై పోయేనాడు ఎవరురారు వెంట..."
      :(

      "రతనాల సీమ" లో కీ. శే. బాలమురళిగారి స్వరాన వెలసిన ఈ పాట అంతర్జాల వేదిక నుండి


      విశాదమలుముకున్న వేళ సాంత్వన చేకూర్చేవి మాటలు కావు పదాలు కావు.. అనిశ్చితివేళలో మౌనముగా మిగిలిన జ్ఞాపకాలను స్మరించుకుని కనుజారే అశృవులు.. తడి కన్నులతో ఉన్నవారిని అక్కున చేర్చుకునే ప్రాణ స్నేహితుని/ప్రాణ స్నేహితురాలి భుజం..

      మనదేమున్నది ఈ లోకానా మట్టిబొమ్మలం
      ఏ కీలుకాకిలు కదిపే లక్కబొమ్మలం
      మానవత్వం మరువని మనసుగల మనుషులం
      దివిలో దేవునికి భువిలో ప్రతిరూపాలం

      కన్నాయితోయి కేనితోయి ఏక్ దాడేర్ పర భగ్వానేర్ ఘర్ జాయేరోజ్.. జావ జేరాంగ ఏకిర్ దలేమాతోయి హర్దే రియాఁ తోయి ధేర్ ఈ జన్మాన ఏతిని జాపా కేని కాఁయి చాయేని.. మార్ ఆచస్ దోస్త్ కీ హను

      Delete
    4. శ్రీధర్ గారు!

      సమయం కాదుగానీ...

      మీరు మీ మనసులో భావాన్ని మాటలలో పలికించిన అశ్రు నివాళి
      మానవులు ఇటువంటి సందర్భాలలో ఎలా స్పందిస్తారు,స్పందించాలి అన్నదానికి ఒక గొప్ప ఉదాహరణ, మీ వ్యాఖ్య.

      ద్వైదీభావ సమయాల్లో
      ఏమి చేతుర లింగా! ఏమీ చేతు ఆ కంఠంలో పలికిన తీరు ఎంత స్వాంతన కలిగిస్తుంది....
      వస్తా ఒట్టిదె పోతావట్టిదె ఆశ ఎందుకంటా
      చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట...

      శ్రీ రమారమణ గోవిందో హరి

      Delete
    5. మీ వ్యాఖ్యకు ధన్యోస్మి శర్మ గారు..!

      మీరంటున్న మాట నిజమే.. ఆ గాత్రమాధుర్యంలో పలికే ప్రతి పదం అజరామరం..

      ~శ్రీ~
      యాదాద్రినిలయాయ యదుకులతిలకాయ

      Delete
    6. శ్రీధర్ భేష్...చక్కని సమయానుసారంతో స్పందించిన అందరి వ్యాఖ్యలు బాగున్నాయి. శ్రీ బాలమురళీకృష్ణగారికి నివాళులు-హరినాధ్

      Delete
    7. మీ వ్యాఖ్య కు కృతజ్ఞతాభివందనాలు హరినాథ్ సర్..
      ఎందరో మహామహులకు జన్మనిచ్చిన భారతావని మనది. ఎందరికో స్ఫూర్తినింపిన సాంప్రదాయం మనది. భాషా కట్టుబాట్లు వేషధారణ వైవిద్యమైనా భిన్నత్వంలో ఏకత్వం మనది. స్త్రీలను పెద్దవారిని గౌరవించటం నేర్పే సద్భావన నిండిన దేశం మనది అట్టి దేశమున జన్మ పొందటం నిజంగా భాగ్యమే.

      ఓం శ్రీ సాయి రామ్

      ~శ్రీధర్ భూక్య

      Delete

  21. మీ అందరి స్ఫూర్తి స్పందన వాక్యాలకు వందనాలు._/\_

    ReplyDelete