గాజుముక్కలే కొన్ని గుండెని గుచ్చుతున్నాయని
మోము అందాన్ని చూసి మనసుని అంచనావేసి
మదిని ముక్కలుగా విరచి బంధాన్ని బీటలుచేస్తే
అది తన ఉనికిని చూపడమే తప్ప తప్పు కాదు
నిన్ను తన ఉనికిలో చూడాలనుకోవడం నీ తప్పు
లోకం లోటుపాట్లు ఎంచి మన లొసుగుల్ని దాచి
మన తప్పేం లేదని నిందలు ఎదుటి వారిపై వేసి
సొంత సమస్యల్ని సోమరిపోతువై గాలికి వదిలివేస్తే
ఒంటరితనమే నీకు శత్రువైన తప్పు దానిది కాదు
పరిణితి చెందకనే అంచనాలతో అడుగేయడం తప్పు
వ్యధలు వేడుక చేసుకుంటున్నాయని వేసారి వగచి
ప్రయత్నం చేయకుండా ఫలితం లభించలేదన్న కసి
మదిలో నింపుకుని రాని వినలేని రాగాలు ఆలపిస్తే
పట్టుదల లేకపోవడం తప్పు కాని విధి తప్పు కాదు
వచ్చిన పని చేరవలసిన గమ్యాన్ని మరవడం తప్పు
మోము అందాన్ని చూసి మనసుని అంచనావేసి
మదిని ముక్కలుగా విరచి బంధాన్ని బీటలుచేస్తే
అది తన ఉనికిని చూపడమే తప్ప తప్పు కాదు
నిన్ను తన ఉనికిలో చూడాలనుకోవడం నీ తప్పు
లోకం లోటుపాట్లు ఎంచి మన లొసుగుల్ని దాచి
మన తప్పేం లేదని నిందలు ఎదుటి వారిపై వేసి
సొంత సమస్యల్ని సోమరిపోతువై గాలికి వదిలివేస్తే
ఒంటరితనమే నీకు శత్రువైన తప్పు దానిది కాదు
పరిణితి చెందకనే అంచనాలతో అడుగేయడం తప్పు
వ్యధలు వేడుక చేసుకుంటున్నాయని వేసారి వగచి
ప్రయత్నం చేయకుండా ఫలితం లభించలేదన్న కసి
మదిలో నింపుకుని రాని వినలేని రాగాలు ఆలపిస్తే
పట్టుదల లేకపోవడం తప్పు కాని విధి తప్పు కాదు
వచ్చిన పని చేరవలసిన గమ్యాన్ని మరవడం తప్పు
అద్భుతమైన పద శైలితో
ReplyDeleteఅందమైన కవనం మీ అక్షరచిత్రాల్లో.
తప్పులు ఎంచేవారు తమ తప్పులు ఎరుగరు అని సున్నితంగా వ్రాసినారు.
ReplyDeleteతప్పు చేయడం ఒక తప్పు ఎదుటివారి పై రుద్దడం మరో తప్పు ఒప్పౌకోక పోవడం అసలు తప్పు.
తప్పుని ఒప్పు అంటే తప్పు కాకపోదు మాడంజీ. :)
ReplyDeleteఅహహా తప్పు ఇంతకీ ?????
ReplyDeleteలోకం లోటుపాట్లు ఎంచి మన లొసుగుల్ని దాచి మన తప్పేం లేదని నిందలు ఎదుటి వారిపై వేసి ఇది నిజం.ఇంచుమించు అందరూ తప్పు తమదని వప్పుకోరు సరి నిందలు నిష్టూరంతో మాటలతో ఎదుటివారిని బాధలకి హింసచేస్తారు. చక్కని పద్యం వ్రాసినారు
ReplyDeleteతెలియక తప్పటడుగులేస్తే తనవారికే తప్పదు వ్యాకులత
ReplyDeleteతెలిసి తప్పటడుగులేస్తే తనకే తప్పదు వ్యాకులత
మనసు మందిరాన మసకబారదు మమకారం
మదిలో మెదిలే మాటలే మౌనమై మిగిలేనా
మొత్తం కవిత సారాంశం:
తప్పుని ఒప్పుగా పరిగణించి తప్పుకునే కంటే
తమవారిని తప్పుదోవ పట్టించి కష్టాలలో నెట్టే కంటే
విచక్షణ ఇంగితం కోల్పోకుండా ఉండి మంచిని పంచితే
ఎటువంటి తప్పుకు తావు వుండదు ఏనాడు
మౌనం దరిచేరినా దూరం పెరిగినా అవన్ని సమసిపోయి
నాణ్యత పెరిగి బంధమౌతుంది కలకాలం శాస్వతం
వేదనలో జారే కన్నీరులా తన దరిమిల చేరే
ప్రతి బంధం అక్కున చేరి సాంత్వన చేకూరుతుంది
ఇమేజ్ లో నాకు ముగ్గురు ఒక్కరై కనిపిస్తున్నారు పద్మ గారు.. రాధికలో మమేకమయ్యే కృష్ణుడు.. కృష్ణ స్వామిని కీర్తించిన మీరా బాయి.. ఏక్ తారా తంతి అయినా పిల్లనగ్రోవి రాగమైనా అందియల మువ్వల ఘల్లునైనా ఆలకించి దరిచేరే కృష్ణతత్వం..
తెలిసి తప్పులు చేసి అనర్థాలకు దారి తీసేకంటే
అప్రమత్తతో ఆప్యాయతతో మెలగటమే మంచిది
తెలియక జరిగే పొరపాట్లను సరిదిద్దేది నేనే
కనుక నాలో మనసు లగ్నం చేయటం శ్రేయస్కరమంటు
శ్రీకృష్ణ భగవానుని గీతోపదేశ సారం.. ఎంత దూరానా ఉన్నా అలకలు కోపతాపాలు మౌనరాగాలు గట్టిబంధాన్ని విడదీయలేవని రాధికకృష్ణుల మనోగతం.. తెలిసి చేసినా తెలియక చేసినా మంచి మనవారిని మనల్ని కూడా ఏదో ఒకరోజు కాపాడుతుందని మీరాబాయి కృష్ణ లీలామృతం..
~శ్రీ~
రాధాకృష్ణార్పణమస్తు
మరోసారి మా పాత పద్మార్పిత దర్శనం ఇచ్చారు కవితలో.
ReplyDeleteచెప్పిన తీర్పు ఎవరికి😎
ReplyDeleteతప్పు ఎవర్జేసినారు
ReplyDeleteఎందుకు చెపిండ్రు...
లోకం లోటుపాట్లు ఎంచి మన లొసుగుల్ని దాచి
ReplyDeleteమన తప్పేం లేదని నిందలు ఎదుటి వారిపై వేసి
సొంత సమస్యల్ని సోమరిపోతువై గాలికి వదిలివేస్తే
ఒంటరితనమే నీకు శత్రువైన తప్పు దానిది కాదు
పరిణితి చెందకనే అంచనాలతో అడుగేయడం తప్పు
లైన్స్ బాగున్నాయి
తప్పులు లేనివారెవరు? తప్పులు చేయక తప్పునా భువిన్ ?
ReplyDeleteతప్పులనొప్పుకో గలుగు ధైర్యము గల్గుట గొప్ప , మందిలో
తప్పులు జూచుచున్ తనదు తప్పులు గొప్పలుగా వచించుచున్
తప్పుడు దారిలో ఘనులు తాము చరించెదరెంత వింతయో !
గాజుముక్కలే కొన్ని గుండెని గుచ్చుతున్నాయని-మీరు వ్రాసిన కవితలు మా మనసుని గుచ్చుతుంటాయి కొన్ని సున్నితంగా మరికొన్ని ఆలోచించే విధంగా.
ReplyDeleteతమ తప్పు దాచి ఎదుటివారిది తప్పు అని చెప్పే నా లాంటి వారి తప్పుల తుప్పు వదిల్చేలా ఉంది మీ తప్పు కవిత... సారీ తప్పు అనే టైటిల్ ఉన్న కవిత ☺☺
ReplyDeleteతప్పుని తప్పు చేసావని చెప్పడం మాపెద్ద తప్పు మాడం..హా హా హా నవ్వినా తప్పంటే తప్పుకాదు.
ReplyDeleteపదచాతూర్యంతో కట్టిపడేసే కవిత... సలాం.! చిత్రం సరిగ్గా అమరింది.. తప్పు ఒప్పుల కోలాటంలో నలిగి మిగిలేదే జీవితం💐💐💐 అభినందనలు మేడం!!
ReplyDelete
ReplyDeleteరణమేల రాని రాగము
ల నాలపించుచు జిలేబి లకుముకి పిట్టా!
కనులన జూడకు తప్పొ
ప్పను మాట వలపుల మాటు పలుకన్నేలన్ :)
జిలేబి
తప్పులు ఎంచాలి అనుకున్నవారు ముందుగా తమ తప్పుల్ని సరిచేసుకుంటే మంచిది.
ReplyDeletePadma leave all these sad thoughts write in joyful mood my friend.
ReplyDeleteఅసలు ఆలోచన్లకి స్పాట్ పెడితే వేదనలు ఉండవు కదా. షూట్ ఎట్ సైట్ ఆడర్స్ ఇవ్వాలి.
ReplyDeleteమన తప్పులు మనం తెలుసుకుని మెలగాలి చెప్పిన తీరు బాగుంది.
ReplyDeleteఅందరి అభిమానాస్ఫూర్తి వ్యాఖ్యలకు పద్మార్పిత వందనములు _/\_
ReplyDeletewell written Padmarpita
Deleteవేదన గోచరిస్తున్నప్పటికీ అక్షరాల్లో సందేశాన్ని జోడించి చెప్పినతీరు బాగుంది.
ReplyDelete