అక్షరాభయం

ఒకమారు రెండు అక్షరాల "ప్రేమ"ని

మూడు అక్షరాల "మనసు"తో తెలుప

నాలుగు అక్షరాల "ప్రవర్తన" బయటపడి

ఐదు అక్షరాల "అనుభూతులు" మిగిల్చి

ఆరు అక్షరాల "పరాజితపాలు" చేస్తేనేమి

ఏడు అక్షరాల "అనుభవసారము" వచ్చె..

ఎనిమిది అక్షరాల "పరిజ్ఞానసామ్రాజ్యపు" పట్టాతో

తొమ్మిది అక్షరాల "ఆశలసౌధాశిఖరము" ఎక్కితే

పది అక్షరాల "పరిపూర్ణజీవితనెలవు" అగుపించె!

పరిపక్వతని పదిఅక్షరాల్లో చూసి పద్మార్పిత నవ్వ..
అక్షరం అజ్ఞానాన్ని తొలగించే అక్షయపాత్రగా వెలసె!  

79 comments:

  1. పూర్వం అష్టవక్రుడనే వాని బుద్ధి కౌశలానికీ తిరుగులేనట్టే మీ ఈ కవితలో మనషులు పాటించవలసిన ఎనిమిది సూత్రాలను మీ శైలిలో వర్ణించారు పద్మ గారు.

    రేపటి రోజున పుట్టిన రోజు జరుపుకునే మీకు ముందస్తుగా పుట్టినరోజు శుభాభినందనలు పద్మగారు.

    జై శ్రీమన్నారాయణ

    ReplyDelete
    Replies
    1. The Ocean remains humble even if thousands of rivers flow into it.

      Emotions are like the Reagents that bring out the true self into the light.

      Good Night Padma Gaaru
      Happy Birthday to you Once Again
      00:02
      04 12 2016

      Delete
    2. మీ అభిమాన పూరిత వ్యాఖ్యలు నాకు ఎప్పుడూ స్ఫూర్తితోపాటు ఆనందాన్ని అందిస్తాయి.
      థ్యాంక్యూ వేరీ మచ్.

      Delete
  2. అక్షరాల పరిపూర్ణత మీలో మెండుగా ఉన్నది అని చెప్పడానికి ఈ కవితే తార్కారణం.
    అందమైన చిత్రంతో పాటు అక్షరాలని అందగా మలచిన మీ శైలి గొప్పది.మీరు మరిన్ని కవితలతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటూ, మీకు జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. మెండుతనం పరిపూర్ణతా ఏం లేదండీ. తెలుసుకోవలసిందే మెండుగా ఉంది. థ్యాంక్యూ

      Delete
  3. మీరు అక్షరజ్ఞాన సంపన్నులు
    ఇక అభయాలు ఆశీర్వచనాలతో పని ఏమిటండి మీకు?
    Lively/Lovely Painting.

    ReplyDelete
    Replies
    1. వామ్మో ఇలా అవసరంలేదంటూ తప్పించుకోకండి. థ్యాంక్యూ

      Delete
  4. మీరు పదికాలాలు ఆనందంగా ఉండాలి. పుట్టినరోజు విషెస్ ముందస్తుగ మీకు.

    ReplyDelete
  5. Marvelous Poetry.
    Awesome Picture.

    ReplyDelete
  6. సాహితీ కొలనున సాక్షర పద్మాల
    కవితలు వికసించి ఘనత దాల్చు
    పద్మ గార్కి పలు శుభాకాంక్ష లందింతు
    జన్మ దినము నాడు సాయి కృపను .

    ReplyDelete
    Replies
    1. మీ అక్షర ఆశిస్సుమమాలకు, శుభాకాంక్షలకు నెనర్లండి _/\_

      Delete
  7. ప్రత్యేక బాణిలో సాగింది మీ కవిత.

    ReplyDelete
  8. Your poetry is language at its most distilled and powerful.
    Janmdin mubarak padmadidi.

    ReplyDelete
  9. మీ కవితలు పుడమిని పులకరింపజేసే తొలకరిజల్లుల మనసుని పరవశింపజేస్తాయి. మీరు పెట్టే చిత్రాలు ఆకాశంలో వచ్చే హరివిల్లువలె మనసులో ముద్రించుకుంటాయి, చిన్నారుల బోసి నవ్వులా మీ కవితలు మా కనులకు కాంతిని ఇస్తుంది. అందుకే మీ కవితాప్రస్తానం నిర్విరామంగా సాగుతుంది. జన్మదిన శుభాశిస్సులు.

    ReplyDelete
    Replies
    1. ఇంతలా పొగిడితే తట్టుకోగలనా.:-) థ్యాంక్యూ.

      Delete
  10. కవితలు చదివి అంచనా వేస్తే
    అంతుచిక్కని ప్రశ్న పద్మార్పిత
    పట్టువదలక ప్రయత్నిస్తే
    జవాబుగా నీడైనా అగుపడని వనిత
    ఎందుకులే అనుకుని వదిలేస్తే
    వెలితి ఏదో గోచరించే నేస్తం ఆమె
    ప్రశ్నజవాబులు పక్కనపెట్టి
    హాయిగొలిపేవి ఆమె అక్షరవిన్యాసాలు
    "హ్యాపీ బర్త్ డే"

    ReplyDelete
    Replies
    1. నందినీ...ఇంతలా ఆభిమానాన్ని చూపిస్తే అక్షరాలు నా పై అలిగేను సుమా :-) థ్యాంక్యూ

      Delete
  11. జన్మదిన శుభాకాంక్షలు
    "ప్రేమ"
    "మనసు"
    "ప్రవర్తన"
    "అనుభూతులు"
    "పరాజితపాలు"
    "అనుభవసారము"
    "పరిజ్ఞానసామ్రాజ్యపు"
    "ఆశలసౌధాశిఖరము"
    "పరిపూర్ణజీవితనెలవు"
    పద్మార్పితా నీకు అభినందనలు

    ReplyDelete
    Replies
    1. లిస్ట్ తయారుచేసారుగా థ్యాంక్యూ

      Delete
  12. తూర్పు కోసము వేకువ వైపు
    వెన్నెల కోసం పౌర్ణిమ వరకు
    ప్రియుణి కోసం ప్రేయసి చూసినట్లు
    మీ కవితల కోసం ఎదురు చూస్తాను.
    -తీపిగుర్తులు
    HAPPY BIRTHDAY PADMARPITA

    ReplyDelete
    Replies
    1. ఎదురుచూపులోని హాయిని ఆస్వాధించండి :-).థ్యాంక్యూ

      Delete
  13. హృదయపు చీకటిలో వెలుగునిచ్చు నీ కవితలు
    ఒంటరి బాటసారికి తోడు మీరు వ్రాసే అక్షరాలు
    ప్రేమ కొవ్వొత్తుని వెలిగించే దివ్వెలు మీ పదాలు
    అందుకో పుట్టినరోజునాడు అభినందన ఆశిస్సులు

    ReplyDelete
    Replies
    1. నాలుగులైన్స్ రాసి వెలుగు నింపారు ముఖంలో.థ్యాంక్యూ

      Delete
  14. అద్భుతమైన ఆలోచనకు ఇంత అందంగా అక్షర రూపం ఇవ్వడం మహాద్భుతం... మీ అక్షర అరంగేట్రం కవితను గుర్తుచేస్తోంది మేడం... సలాం!

    అక్షరాక్షరం గర్వించే అలుపెరుగని కవితా కుసుమానికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు...
    Plz. visit fans blog madam & fans...

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానమే భావాలతో కలసి అక్షరాలుగా రూపాంతరం చెంది రాయిస్తుందండి...థ్యాంక్యూ.

      Delete
  15. పద్మార్పిత నీ పదజాలంలో ఎన్నో హృదయాలని కట్టిపడేసి అందరి అభిమానాన్ని చూరగొన్న నీకు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్య ఆనందాలు పుష్కలంగా లభించాలని భగవంతుని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందుకో-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. మీ ఆశీర్వచనాలు నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటాను...ధన్యురాలిని హరినాధ్ గారు.

      Delete
  16. కవితాచిత్రానికి తిరుగులేదు. అక్షరాలు అందంగా నాట్యమాడుతున్నాయి చిత్రము కనువిందు చేస్తుంటే-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ సర్.

      Delete
  17. Many many happy returns of the happy movements padma.

    ReplyDelete
  18. పద్మా విష్ యు హ్యాపీ బర్త్ డే.
    కవిత చాలా బాగుంది పెయింటింగ్ కూడా.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ సంధ్యగారు.

      Delete
  19. డియర్ పద్దూ పద్ధమ్మో... ఇంత మంచి కవిత ఇట్టా కుదిరేసినాది ఎందమ్మో... అది కూడా పుట్టినరోజు నాడు... సూపర్ .. I wish you a very Happy Birth Day 💐🎂 :)

    ReplyDelete
    Replies
    1. ఎంత పుట్టినరోజునాడు అయినా ఇంత ముద్దు ముద్దుగా పిలవాలా/అదే రాయాలా.. :-) థ్యాంక్యూ

      Delete
  20. Belated birthday wishes.
    Fantastic Painting.

    ReplyDelete
  21. అక్షరాలతో అస్త్రం విసిరి మంచి నడవడిక మనిషి మనుగడకు ఎంత అవసరమో చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్స్ కు థ్యాంక్యూ

      Delete
  22. కవితని చక్కగా పదాలతో పది అంకెల్లో పాటించవలసిన వ్రాశావు. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆలస్యంగా చెబుతున్నాను. చిత్రం ఎప్పటిలాగే చూడముచ్చటగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. నేను పాటిస్తున్నది చెప్పాలని..థ్యాంక్యూ

      Delete
  23. అక్షరాలని అక్షయపాత్రగా మలచి కవితలతో చిత్రాలతో కళాపిపాసకుల మనసుని రంజింపజేస్తున్న పద్మ అర్పిత నీకు వందనం.

    ReplyDelete
    Replies
    1. అక్షయపాత్ర ఉంచుకునేంత గొప్పదాన్ని కానండి..థ్యాంక్యూ

      Delete
  24. చివరి రెండు పంక్తులు మమ్మల్ని ఉద్దేసించి రాస్తిరా మేడం.
    అక్షయపాత్ర నిండుగా ఉన్న కవితల్ని అదే మీ భావాలని రోజూ కుమ్మరించండి.
    చదివి తరించి మైమరపులతో గెంతులువేస్తాం. హా హా అహా!

    ReplyDelete
    Replies
    1. నాకు నేనుగా రాసుకున్నదే తప్ప ఎవరినీ ఉధ్ధేసించి రాయనుగా...థ్యాంక్యూ

      Delete
  25. మనసుని తడిమి మధురస్మృతుల్ని తడిమిన అనుభూతి చిత్రాన్ని చూస్తూ కవితని చదువుతున్నంతసేపు. Keep it up Padma.

    ReplyDelete
    Replies
    1. స్మృతులు ఎప్పటికీ మధురమే కదా ;-). I will try.

      Delete
  26. Your blog is extraordinary.
    Impressing a lot.
    మీకు అభినందనలు పద్మార్పిత.

    ReplyDelete
  27. గాలిలో డజన్ బులెట్స్ కాల్చి మీకు పుట్టినరోజు విషెస్ మేడంజీ

    మీ అక్షరాలకి మరో అరడజన్ బులెట్స్.

    ReplyDelete
    Replies
    1. బ్లాగ్ లో బులెట్స్ బాగోతమా... :-) థ్యాంక్యూ

      Delete
  28. అక్షరం అజ్ఞానాన్ని తొలగించే అక్షయపాత్ర...మీరు
    ముమ్మాటికీ మీరే :)Sorry for belated wishes.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ నందుగారు...మరీ ఇంతలేదండి.

      Delete
  29. PERFECT LINES MATCHED WITH ALPHABETS.

    ReplyDelete
  30. మీ కవితల్లో కొత్తఅక్షర భావాలు దిద్దుతున్నాము.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ..భావాలని అభినందిస్తున్నందుకు.

      Delete

  31. తిరుగులేని కవిత.
    పంచబక్ష పరమాన్నం తిన్నంత తృప్తిగా ఉంది

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ..డైటింగ్ చేయకపోతే లావైపోతాం :-)

      Delete
  32. మీరు రాసే కవితాక్షరాలు అమోఘం.

    ReplyDelete
  33. అనుభవాలతో ఆదితాళం వేశారు. కవిత బొమ్మ రెండు చాలా బాగున్నాయి.

    ReplyDelete
  34. పదంకెలు లెక్కపెట్టలే
    గంతలోనే జీవితం మొత్తం రాసీనావ్

    ReplyDelete
    Replies
    1. అంకెలు లెక్కబెడితే ఆలస్యం అయిపోతుందని :-)

      Delete
  35. మీ అక్షర అనుభూతులతో మా అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. నా అజ్ఞానమే ఇంకా పూర్తిగా తొలగిపోలేదు:-)

      Delete
  36. మీ పలుకుల్లో పరిపూర్ణజ్ఞానాన్ని ప్రభోధించారు
    చిత్రము చూడముచ్చట గొల్పుతుంది.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ...చాన్నాళ్ళకి.

      Delete
  37. ఆలస్యంగా వచ్చానని అలుసుగా చూడమాకు
    జన్మదినం రోజున పలుకరించలేదని దిగులు చెందకు..ఈ విధంగా సంజాయిషీ చెబితే మీరు ఫ్లాట్ అయిపోరని తెలిసి మిమ్మల్ని ఫ్లాట్ చేసే ప్రయత్నం. అన్నీ మీ బుద్దులే నాకు వచ్చేస్తున్నాయి. నవ్వండి హాయిగా ఎప్పుడూ మమ్మల్ని నవ్విస్తూ. మీకు జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
    Replies
    1. నేనూ ఆలస్యంగానే రిప్లై...థ్యాంక్యూ

      Delete
  38. మీ అక్షరాలు అమోఘం

    ReplyDelete