నిరాశావేదం వదన్నకొద్దీ వెంటాడి వేదిస్తుంటే
కవ్వించే కమ్మని కల్లబొల్లి కబుర్లు ఏంచెప్పను
ఆశల అంకురార్పణకి ఆదిలోనే చెదలు పడితే
ఆశయాలనే రెమ్మలతో పూయమని ఏంకోరను
ఆవిరైన కన్నీట పెదవులు ఆరిపోయి పగిలితే
ఆనందం ఆమడదూరంలో ఉందని ఏంచూడను
నిజాలన్నీ నిర్వికారంగా నవ్వి బేలగా చూస్తుంటే
మంచికాలముందని అబద్ధపు భరోసా ఏమివ్వను
అక్కరకురాని ఆవేశం అదునుచూసి మరీ ఆడితే
అదుపు తప్పవద్దని అంతరంగాన్ని ఎలా ఆపను
అహర్నిశలూ ఆలోచనలతో మెదడు తపనపడితే
అద్భుతమే జరిగేనని వెర్రీఅశతో ఎదురుచూస్తాను!
కవ్వించే కమ్మని కల్లబొల్లి కబుర్లు ఏంచెప్పను
ఆశల అంకురార్పణకి ఆదిలోనే చెదలు పడితే
ఆశయాలనే రెమ్మలతో పూయమని ఏంకోరను
ఆవిరైన కన్నీట పెదవులు ఆరిపోయి పగిలితే
ఆనందం ఆమడదూరంలో ఉందని ఏంచూడను
నిజాలన్నీ నిర్వికారంగా నవ్వి బేలగా చూస్తుంటే
మంచికాలముందని అబద్ధపు భరోసా ఏమివ్వను
అక్కరకురాని ఆవేశం అదునుచూసి మరీ ఆడితే
అదుపు తప్పవద్దని అంతరంగాన్ని ఎలా ఆపను
అహర్నిశలూ ఆలోచనలతో మెదడు తపనపడితే
అద్భుతమే జరిగేనని వెర్రీఅశతో ఎదురుచూస్తాను!
ఇంతటి నిరాశతో కూడిన వేదాంతం అవసరమా చెప్పండి.
ReplyDeleteవేదన నిరాశ నిస్సహాయత ఉద్విగ్నత ఉదాసీనత నిర్లిప్తత
ReplyDeleteఇవున్నప్పుడే కనుజారే తడి చినుకు విలువ తెలుస్తుంది..
వేదన నిరాశ నిస్సహాయత ఉద్విగ్నత ఉదాసీనత నిర్లిప్తత
ఇవున్నప్పుడే మనోబలం స్థాయి అవగతమౌతుంది..
వేదన నిరాశ నిస్సహాయత ఉద్విగ్నత ఉదాసీనత నిర్లిప్తత
ఇవున్నప్పుడే మానవత్వం ఏ తీరుగా ఉందో తెలిసొచ్చేది..
వేదన నిరాశ నిస్సహాయత ఉద్విగ్నత ఉదాసీనత నిర్లిప్తత
ఇవున్నప్పుడే అహంభావం కరిగి మది ప్రక్షాళనమయ్యేది..
బట్టలు మురికిగా ఉన్నా.. వాటిపై మరక పడినా.. చిరిగినా.. వెంటనే వాటిని విడిచి కొత్త బట్టలు ధరిస్తారు.. మరి మదిని లోలోపలే తొలిచివేసే ఆలోచనలకు విరుగుడుగా మంచి ఆలోచనలను రేకేతిస్తే.. అహంకార భావాన్ని ఈర్ష్య అసూయ అసహనాన్ని వీడనాడి వాటి స్థానంలో సంతోషం ఆత్మీయత చిరునవ్వులు మానవత్వాన్ని చేర్చితే.. మనిషిగా పుట్టిన ఈ జన్మ చరితార్థమౌతుంది..
మీ కవిత ఆలోచింపజేసింది పద్మ గారు.. వేదన పాళ్ళు ముప్పావు వంతు ఉంది మరి..
~శ్రీ~
పెరుమాళాండాళ్
శ్రీధర్ చక్కటి వివరణతో కూడిన రివ్యూ వ్రాశావు. అభినందనలు నీకు-హరినాధ్
Deleteమీరు జతచేసిన కమెంట్ కవిత నచ్చింది.
Deleteమీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు హరినాథ్ గారు మరియు ఆకాంక్ష గారు
Deleteపద్మార్పితా ఏ ఆశా లేకుండా మనిషి మనుగడ సాగించడం కష్టమే కాదు వ్యర్థం కూడా. అందమైన చిత్రాన్ని పెట్టి ఆమె పెదవులపై నవ్వు లేకపోతే బాగుండనట్లే ఏదో ఆశ లేనిదే ఎలా జీవించగలము చెప్పు. ఆలోచించవలసిన విషయం కదా-హరినాధ్
ReplyDeletepadma why so depression way..be in cheerful mood and write yaar :)
ReplyDeleteఆశనిరాశల దాగుడుమూతల బాట ఈ లోకం అంటూ పాడుకుంటే సరి :-)
ReplyDeleteఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది
ReplyDeleteనిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకున్నది
ఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుంది నిశీధిలో ఉషోదయంలా..సాంగ్ సింగనా
asha asha asha
ReplyDeleteఈ నిట్టూర్పులు నిరాశావాదాన్ని వదిలేయాలి కానీ వాటిని వీడిపొమ్మని చెప్పడం ఏమిటి, మనం చెబితే మాత్రం అవి వింటాయా ఏమిటి చెప్పండి. 2016 నిరాశని వదిలేద్దాం 2017 లో నో నిరాశ అంతా ఆశ...ఆశా...ఆశే!
ReplyDeleteagain pathetic scene in poem.
ReplyDeleteఅక్కరకురాని ఆవేశం అదునుచూసి మరీ ఆడితే
ReplyDeleteఅదుపు తప్పవద్దని అంతరంగాన్ని ఎలా ఆపను
వ్యధను అద్భుతంగా పండించారు ప్రశ్నల రూపంలో.
ఆశ జీవితానికి శ్వాస.
ReplyDeleteమీ వ్యాఖ్య నన్ను ఒక్కసారిగా నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చింది ప్రార్థన గారు. నా చిన్నప్పుడు అంతరంగాలు అనే సీరీయల్ వచ్చేది..ఆ సీరియల్ లో ఒక పాట "ఎంత గొప్పది బ్రతుకు మీద ఆశ అది భూమి పైన దేవుని శ్వాస.. మాయమవనిది మాసిపోనిది లోకమెంత మలినమైనా మలిగిపోనిది.."
Deleteఈ ధనుర్మాసానా ప్రతి ఒక్కరిపై ఆ మలయప్ప స్వామి ఆశిస్సులు ప్రసరించాలని కోరుకుంటు. మరో పదిరోజుల్లో రాబోయే కొత్త సంవత్సరం అందరికి శుభాలను చేకూరాలని ఆశిస్తు..
ReplyDeleteఈ ఈ-క్యాలెండర్ లింక్ ను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను
శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి
goo.gl/UmiVub
మీకు ఆశలతో పనేమిటి..హా హా
ReplyDeleteఆశకే ఆశలు పెట్టి బ్రతకమంటారు.
Hope and positive thoughts
ReplyDeleteకవిత్వం మీ పుట్టిల్లు వేదనలు మీ మెట్టిల్లు
ReplyDeleteమొత్తానికి మీలో భావుకత్వం చాలా జాస్తి.
వర్క్ తో నీరసం పైగా మీ నిరాశ వాక్యాలు ఏమిటి పద్మా
ReplyDeleteప్రశ్నించక మంచికాలం ముందుందని నిజంగా భరోసా ఇవ్వండి అది ఉపయోగం :)
ReplyDeleteఆశకు ఉన్నా పవర్ అదే మరి తెలిసి కూడా ఏదో ఆశని నిరాశపడితే ఎలా చెప్పండి.
ReplyDeleteContinue it.
ReplyDeleteఆశావాదంతో సాగాలి.
ReplyDeleteఇలా వేదనలతో మమ్మల్ని వేపుకుతినడం మీకు భావ్యమా...
ReplyDeleteనిరాశ నీ అక్షరాలని ఆశగా చదివేసి నవ్వుకుంటుంది..అధ్భుతమే కదూ ఇంకేం కావాలి.
ReplyDeleteఆశే కొనసాగింపు కదా? బాగుంది పద్మాజీ
ReplyDeleteఆశలు లేక ఆశయలు సాధించలేము. అటువంటి జీవితం ఎందుకు చెప్పండి.
ReplyDeleteఅందరి అభిమానానికీ బోలెడన్ని వందనములు_/\_
ReplyDeleteఆశ మనిషికి సర్వసం.
ReplyDelete