వలపుచెర

వసంతమై నీవు ఉరకలు వేస్తూ వచ్చి వాలితే
మల్లెలతోటలో కోయిలనై నేను పాడుతుంటాను!

నిండు పున్నమి వెన్నెలవై నువ్వు విరబూస్తే
చంద్ర కిరణకాంతులు విరబూసే కలువనౌతాను!

వేసవిమాటున చిరుజల్లులా నీవు వర్షిస్తానంటే 
ఏడురంగుల ఇంద్రధనస్సునై వెల్లివిప్పారుతాను!

వలపు సంగీతానికి పల్లవిగా నీవు జతకూడితే
నర్తించే మువ్వనై సరాగపు చిందులు వేస్తాను!

మమతానురాగాలను మనసువిప్పి రుచిచూపిస్తే
మనసున్న మగువగా నిన్ను చేరి మైమరిచేను!      

నీ శ్వాస ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు నేనే అన్నావంటే 
మనిరువురి ప్రేమకి ప్రాణము నేనై ఊపిరిపోస్తాను!

ఏడేడు జన్మల జతే కాదు, సర్వం నేనని పలికితే
వలపుచెర బంధీనై ప్రేమకు పర్యాయ పదమౌతాను!
  

24 comments:

  1. అంతా ప్రేమమయం
    జగమంతా ప్రేమ మనము ప్రేమించి మనల్ని మెచ్చిన వారు తోడుంటే.

    ReplyDelete
  2. this poem gives the warmth of summer, freshness of spring and an embodiment of enchanting ethereal feel.

    the blooming full moon, the twinkling stars, the five elements, the blazing sun, the cooling flakes of snow on grass blades, the icicles on the tip of window-sill bring about an embalming ambience.

    these all are wrapped in the lines of your poetry.

    feel good poem padma gaaru..

    ~sri~

    ReplyDelete
  3. వలను చెరలో బంధీలం అయిపోవడం ఖాయం.

    ReplyDelete
  4. వలపు చిచ్చు రగిలించి ఆరిపోనీయకు అంటే మాత్రం ఆరిపోతుందా చెప్పండి. చిత్రం కనులకి విందు మీ కవిత భలే పసందు.

    ReplyDelete
  5. బహూథీ బడియా..
    ప్యార్ నిభాతే రెహనా పద్మాజీ..హా హ హా

    ReplyDelete
  6. వలపు సంగీతంలో ఓలలాడించారు.

    ReplyDelete
  7. ప్రేమకి పులుస్టాప్ చెప్పేద్దం అనుకుంటే మీరు గన్ షాట్లా ప్రేమను కురిపిస్తారు, ఏం చెసేది???

    ReplyDelete
  8. మీరు ఎంత స్త్రీ పక్షపాతి అయినా పురుషులదే తప్పు అంటే ఎలా?

    ReplyDelete
  9. Poetry is when an emotion has found its thought and the thought has found words. I admire your thoughts and words Padma.

    ReplyDelete
  10. సుమధుర దృశ్యకావ్యం వలపుచెర.

    ReplyDelete
  11. వలపు జడివానలో మీరు తడిసి మమ్మల్ని తడిపినారు.

    ReplyDelete
  12. blog vedana poyi valapu puttea dhaaaammmmm dhaaaaammm :)

    ReplyDelete
  13. ఏడురంగుల ఇంద్రధనస్సు మీ మనసు.
    వివిధ వర్ణాలతో అక్షరాలు అలంకరించి కవితలు వ్రాస్తారు.

    ReplyDelete
  14. ప్రేమ పండిది కవితలొ.

    ReplyDelete
  15. very artistic paints collection in this blog and poems are heart touching too.

    ReplyDelete


  16. వలచి వచ్చే కాంత ఉంటే ఏకాంతమెందుకు? వలపు కోయిల ప్రేమ పల్లవులు పాడాలే కాని... 'చరణ' దాసులు కానివారెవ్వరు. మనసు మనసు రమించాలే కానీ వసంతమెందుకు? మల్లె కన్నా పరిమళ సుగంధాలు చిమ్మే మగువ మదిని చేరాలే కాని పున్నములెందుకు, వెన్నెలలెందుకు? హరివిల్లులిస్తానంటే.... మండు వేసవిలో చిరుజల్లు కురిపించని బతుకెందుకు? పలుకు పలుకులో చిలకలా.. ఆనంద భైరవి రాగాలు పలికించే చెలి ఉంటే... శివరంజనులు ఎందుకు? ప్రణయ గంధాలు చిలికించే జవ్వని జీవితంలో సగమైతే చాలు... ఏడేడు జన్మలు... ఒక్క క్షణంలా వెళ్లిపోవా. ఎదకలువలతో... అన్నీ నువ్వేనంటూ... కోమల జవ్వని ఎదురు వస్తుంటే కాదనే జన్మెందుకు.? పద్మగారు... కుంచెలో పదును ఏ మాత్రం తగ్గలేదు... పిక్‌ కదిలించేసింది అంతే....

    ReplyDelete
    Replies
    1. కలయా నిజమా...
      మీరు కమెంట్ పెట్టింది నిజమేనా అని?
      ఎలా ఉన్నారు? బ్లాగ్ విడిచిపెట్టేసారు అనుకున్నాను :)

      Delete
  17. ఎన్నటికీ తరగని ప్రేమను అక్షరాల్లో పండించారు. మీ కలానికి కుంచెకు ఎప్పటికీ హోరా హోరి పోరు.

    ReplyDelete
  18. వలపు చెరసాల అనుకుంతూనే తెలియకనే మనసు ఇస్తారు
    అదో మదురానుభూతి జీవితంలో.చిత్రం బాగుంది.

    ReplyDelete
  19. తలచినది తలచుకుని వగచేకన్నా సౌఖ్యమే లేదు.

    ReplyDelete
  20. ప్రేమానురాగాలు కలబోతల్లో కల్మషం లేని ప్రేమ మీ ఇరువురి సొంతం...

    ReplyDelete
  21. మొత్తం ప్రేమనే ధ్వేషం లేదు :)

    ReplyDelete
  22. అందరి అభిమానాక్షరాలకి నెనర్లు _/\_

    ReplyDelete