వలపు వుత్తర్వు

జాజుల జడివానలో నన్ను ఒంటరిగా వదిలేసి
వద్దు వద్దంటున్నా వినక వెళ్ళిపోతున్నప్పుడు
తడబాటుతోనో లేక గ్రహపాటునో నన్ను తగిలి
వెళ్ళలేక నడకాపి నన్ను చూసిన చూపు చాలు
నీవు నాతోనే ఉన్నావన్న ధీమాకది దస్తావేజు!!

కలువరేకుల వంటి కళ్ళలో కన్నీరొద్దని కసిరేసి  
కలిసిరాని కాలమే కదలిపోతుందని నీవన్నప్పుడు
విరబూసిన వెన్నెలో లేక మన్మధలీలో నిన్ను లేప
కరిగి కదిలిన నీ గుండె సవ్వడుల లయలు చాలు
నీ మదిని ఆక్రమించిన అధికారిణినన్న ముద్రకి!!

ముద్దమందారలా మురిపించ నీవు మీసం మెలేసి 
తొణక్క బెణక్క మనసు బిగపెట్టి బీసుకున్నప్పుడు    
మమతే మంచులా కరిగెనో లేక నీ మనసే మారెనో
పరుగున వచ్చి గట్టిగా నన్ను వాటేసుకున్నది చాలు 
నీ నా సంగమానికి త్రిలోక అంగీకార ఆమోదమని!!  
 

17 comments:

 1. మమతే మంచులా కరిగెనో లేక నీ మనసే మారెనో పరుగున వచ్చి గట్టిగా నన్ను వాటేసుకున్నది,మీరు మెప్పించారు.

  ReplyDelete
 2. గిట్ల జేసుట్ల మీరు మస్తు హుషారు...అహా హా హా

  ముఖం మస్తు జబర్దస్తుగుంది

  ReplyDelete
 3. ప్రకృతి పరవశానా నందనవనం వెల్లి విరిసే
  నవవసంతాగమనాన్ని పూవులతో స్వాగతం పలికే
  ఉత్సాహభరితమై అడుగు ప్రతి అడుగు కదలాడే
  భావాలన్ని గోముగా మారి స్తబ్దుగా నిలిచే సమయానా

  కేరింతలన్ని అంబరాన్ని అలవోకగా తాకే
  పులకింతల పర్వం హావభావాలతో ఉర్రూతలూగే
  గుండె లయగతులతో నూతనోత్సాహం పురివిప్పే
  ఆశలన్ని విరబూసి ఆనందమే పంచే సమయానా

  మీ పదప్రయోగం చక్కగా ఉంది..
  ప్రకృతితో స్త్రీ మనసుని పోల్చుతు ఉత్తరువు జారిచేయటం కొత్తగా ఉంది పద్మ గారు

  ReplyDelete


 4. జాజులజడి వానలటన్
  గాజుల సవ్వడులలోసు గాత్రిని! ఓ ‌నా
  రాజా వలపుల వయసున్
  రాజేయకురా జిలేబి రమణిన్ రారా :)

  జిలేబి

  ReplyDelete
 5. ఫోటొ
  పదాలు
  రెండూ
  సూపర్

  ReplyDelete
 6. తొణక్క బెణక్క మనసు బిగపెట్టి
  correct :)

  ReplyDelete
 7. మనసు పొరల్లో నిక్షిప్తం
  పదాల అల్లికలో పొందిక
  ధీటుగా అమరిన చిత్రము

  ReplyDelete
 8. ఉత్తర్వులు జాబితా బాగు.

  ReplyDelete
 9. వద్దు వద్దంటే మాత్రం వలపు వదలదు.
  సాధించి తీరుతుంది.

  ReplyDelete
 10. జడివానకు తడిసిన జాజి పరిమళాలు
  నిగ్రహాన్ని సవాలుగా నిలచి
  కలువరేకు కళ్ళు కాయకాచేలా చేసి
  గుండెనే మరపించి
  మురిపించి సొంతం చేసుకోవడం
  భావాక్షరాలకే చెల్లును
  సాగిపో విజయం తద్యం...

  ReplyDelete
 11. జాణ వాలు చూపులకు
  జాజుల వాసనకు పడిపోనివారు ఎవ్వరు
  అందునా ఆమె మురిపించిన కాదన తగునా?

  ReplyDelete
 12. beautiful picture and lines.

  ReplyDelete
 13. తొణక్క బెణక్క మనసు బిగపెట్టి చదివిస్తారు ;-)

  ReplyDelete
 14. జడివానలో మంచుముత్యాలు మీ వలపు అక్షరాలు.

  ReplyDelete
 15. మదిని ఆక్రమించిన అధికారిణి

  ReplyDelete
 16. ముద్దమందారలా మురిపించ నీవు

  ReplyDelete