ఏడుపులేదు :)

రాత్రి ఏడవలేదెందుకో తెలిసింది 
నా వ్యధలన్నింటినీ మరచిపోయి 
నిబ్బర గుండెతో తల వాల్చేసి.. 
నిరాశ వీడి ఓర్పుని వాటేసుకుంటే 
కలిగిన నిశ్చింతతో  ఏడవలేదు!

ప్రేమ ప్రాంగణంలో పక్షిలా ఎగిరి 
అనురాగ తీపి ఫలాలని ఆరగించి 
పువ్వుల పరిమళాన్ని ముద్దాడి.. 
నిన్నటి కష్టాలకి రెక్కలు కట్టి వదిలి 
తేలికబడ్డ మనసుతో  ఏడవలేదు!

కన్నీటినే విత్తనాలుగా విసిరేసి
ఆనందాన్ని ఉద్యానవనంగా మలచి 
నవ్వుల్ని పన్నీరులా గుప్పిటతో చల్లి..
సంతోషాన్ని దుప్పటిగా పరచి పడుకుని
గాఢనిద్రలో ఏడుపురాక  ఏడవలేదు!

26 comments:

 1. వ్యధలని పారద్రోలిన విధానం బాగుంది
  ..

  చిత్రం మరింతగా నప్పింది.
  ..

  ReplyDelete
 2. మండే ఎండలను చినుకులు చల్లబరచినట్లు
  ఉరిమే మేఘాలను మెఱుపులు తళుకులీనినట్లు
  మదిలో నిండిన వ్యధనంతటిని కన్నీరు ప్రక్షాళనం చేసినట్లు
  ఎపుడులేదు ఏడుపులేదు
  యాజిఫ్ ది టర్బులంట్ టైడ్స్ హ్యావ్ కామ్ డౌన్
  ది పోయెమ్ డెపిక్టెడ్ దీ కరేజ్ యాండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ హ్యుమన్ సైకాలజి ఇన్ దీజ్ ఫ్యూ లైన్స్ పద్మ మ్యాడమ్

  ReplyDelete
 3. వేదనలని కన్నీటితో కడిగి పడేసారు..
  ఇక పై నో ఏడుపు:)

  ReplyDelete
 4. మేము వద్దని చెప్పేది అదే కదా
  నో టియర్స్ ఓన్లీ హ్యాపీనెస్ అని
  ఫోటో సూపర్ అదుర్స్--

  ReplyDelete
 5. నిరాశ వీడి ఓర్పుని వాటేసుకోవడం కష్టమే అయినా ఏడవడం నవ్వడం రాత్రి పగలుగా వచ్చిపోతుంతాయి అనుకుని కొనసాగించడం జీవితం.

  ReplyDelete
 6. ఏడుపు భాధలకు వేదనకు నిదర్శనం
  అవి లేని జీవితాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి.

  ReplyDelete
 7. Natural feelings.
  keep on writing.

  ReplyDelete

 8. పదాలు పారవస్యంతో రాస్తూ
  ఎంతగా పరవశించి పోతావో
  నీ కన్నిటి విత్తనాలు విసిరేసి
  ఎంతగా మురిసిపోతావో
  ఎంత మురిసిపోయావో
  చిత్రాన్ని చూస్తూ
  నీవు రాసింది చదువుతూ
  అంతకు రెట్టింపు ఆనందిస్తాము
  తెలుగుతల్లిని అబ్బుర పరిచే
  రచనలు మరిన్ని చేయాలని కోరుతూ..

  ReplyDelete
 9. didi badiya painting.

  ReplyDelete
 10. కన్నీటి విత్తనాలు మరల మొలకెత్తనీయక తగు జాగ్రత్తలు తీసుకుని ఉత్తేజంతో పుంజుకోండి.
  :)

  :)

  ReplyDelete
 11. వ్యధలన్నింటినీ మరచిపోవడం ఎలాగో మాకూ నేర్పించండి.
  నిబ్బర గుండెతో తలవాల్చి నిదురించడం నేర్పండి.

  ReplyDelete
 12. మిమ్మల్ని మీరు ఓదార్చుకుంటూ మమ్మల్ని ఓదార్చినట్లుందండీ మీ కవిత ఇంకా చిత్రము అధ్భుతం.

  ReplyDelete
 13. ఆనందాల ఉద్యానవనం...ఎంత అందంగా రాసారు అందమైన బొమ్మను జోడించి,
  మీ ఆలోచనలకు ప్రెజంట్ చేసే తీరుకు అభినందనలు.

  ReplyDelete


 14. కన్నీటి విత్త నంబుల
  కన్నిటికీ నీళ్ళపాదు కట్టన్ తగదౌ !
  చాన్నాళ్ళవి వుండవు మన
  మన్నాసయు కారణము సమాళింప దగున్!

  జిలేబి

  ReplyDelete
 15. కలకాలం ఉండవులే కన్నీళ్ళు కలనైనా ఇలనైనా కొన్నాళ్ళు అనే ధైర్యంతో సాగిపోతే దానికి తగ్గట్లు పల్లవిస్తు ఉంటాయి మన భావాలు ఆలోచనలు. వానలా కురిసిన కన్నీళ్ళు ఆగిపోతే మనసు ప్రశాంతమై ఆపై ఏ బాధలు ఉండవులే. కవితనో భావం ధైర్యాన్ని ఇచ్చింది. అందరి మనసులు ఆనంద ఉద్యానవనంలా వికసించాలని కోరుకుంటున్నాను-హరినాధ్

  ReplyDelete
 16. కన్నీటిని వెసిరి పారేసారు...అవి మీ ధైర్యం ముందు నిలబడక ఇంక మీ జోలికి రావు. హాయిగా నవ్వుతూ ఉండండి ఇకపై.
  సూపరుంది పెయింటింగ్.

  ReplyDelete
  Replies
  1. ఎగిసే ప్రతి అల ఒక రాగం
   పలికే ప్రతి పదం ఒక భావం
   ఇసుక రేణువు ఉప్పు నీరు కలగల్పితే సంద్రం
   చిరునవ్వు కంటిచెమ్మ కలగల్పితే జీవితం :'(

   Delete
 17. మీరు యమ అదృష్టవంతులు :-)

  ఏడుపుని ఆమడ దూరం తరిమేసారు

  ReplyDelete
 18. ""సంతోషాన్ని దుప్పటిగా పరచి పడుకుని
  గాఢనిద్రలో ఏడుపురాక ఏడవలేదు""
  హాయిగా గుర్రుపెట్టి నిద్రపోతే ఏమీ గుర్తుండవు-అహ హా

  ReplyDelete
 19. Fantastic narration padma

  ReplyDelete
 20. :-( :-( :-(

  No No No

  :-) :-) :-)

  ReplyDelete
 21. కన్నీటినే విత్తనాలుగా విసిరేసి ఇదే మూలం నవ్వుకు

  ReplyDelete
 22. ఏడుపు కూడా ఇంత అందంగా ఉంటుందా
  ఓదార్పును ఇచ్చే కవితాచిత్రము.

  ReplyDelete
 23. అప్సరస ఆకాశాన పోతూ పోతూ చల్లగాలికి మత్తిల్లి మెత్తని గడ్డివాము మీద మేని వాల్చి సేదతీరు వేళ... ఆ పక్కనే లేనందుకు మగ హృదయం ఏడవాలిగానీ, మీరెందుకు ఏడవడం చెప్పండి?

  ReplyDelete
 24. అందరి హృదయాత్మక స్పూర్తిస్పందనలకు నమోః వందనములు._/\_

  ReplyDelete