ఛలో యుద్ధం చేద్దాం..

అంతరంగాలను ఆలయంగా మార్చేద్దాం
ధ్వేషంతో కట్టబడ్డ గోడల్ని తొలగించేద్దాం!

శత్రువు పేరుని పలుమార్లు తలచి రాసి
మనసున దాగిన పగను చెరిపివేసేద్దాం!

రాత్రి రహస్యంగా ప్రతిగుమ్మం గొళ్ళెం వేసి
ఒకరికొకరం కాపలా ఉన్నామని చాటేద్దాం!

భయపడుతూ హోటల్ లో బసచేసే వారిని
ఇంటికి రమ్మని ఆహ్వానించి ఆతిధ్యమిద్దాం!

ధ్వేషించుకుని ధూషించుకున్నది చాలాపి
ఆనందం అందరికీ అందుబాట్లో ఉంచేద్దాం!

అందరిదీ ఒక్కబాటేనన్న భరోసాను ఇచ్చి
నమ్మకంగా దాన్ని నడిపే తివాచీ పరుద్దాం!

అప్పుడు ఆకాశంలో ఆగలేనన్న చంద్రుడ్ని
భువిపైనే మకామంటూ రప్పించి మెప్పిద్దాం!  

25 comments:

  1. రాణి రుద్రమ దేవి ఝాన్సి లక్ష్మీ బాయి ల స్ఫూర్తి
    ఎల్లలులేని ఆలోచనల ధోరణిని కొనియాడిన ఘనకీర్తి

    ది పొయేటిక్ లైన్స్ హ్యావ్ వ్యాలర్ యాండ్ సెల్ఫ్ మోటివేషనల్ స్పిరిట్ హిడెన్ ఇన్ దెమ్ పద్మ గారు..

    ~శ్రీ~

    ReplyDelete
  2. పద పద్మార్పిత
    నీ వెంట వెంట వస్తాము
    అందరమూ కలసికట్టుతో
    విజయభేరి మ్రోగించి
    ఆత్మవిశ్వాసంతో
    ముందుకు సాగిపోదాం..
    అరుదైన కవితను అల్లారు

    ReplyDelete
  3. అందరి అంతరంగాలు ఆలయాలు కావాలి అనే తపన బాగుంది.

    ReplyDelete
  4. చలో పదండి
    మీతో మేము ఉన్నము
    యుద్ధానికి సిద్ధము
    వేరీ నైస్ కవిత

    ReplyDelete
  5. వాహ్ వా..
    మేము భాగస్వాములమే మీతో ఈ శాంతి పోరాటంలో.
    చిత్రం కడురమ్యంగా ఉంది.

    ReplyDelete
  6. మరో మారు కత్తి కాదు కలం ఝళిపించారు, అభినందనలు మీకు.

    ReplyDelete
  7. అంతరంగాలను ఆలయంగా మార్చేద్దాం
    ధ్వేషంతో కట్టబడ్డ గోడల్ని తొలగించేద్దాం!అలాగే

    ReplyDelete
  8. యుద్ధానికి సంసిధ్ధమేనా :)

    ReplyDelete
  9. ఛలో ఛలో యుద్ధానికి రెడీ :)

    ReplyDelete
  10. మనిషికీ మనిషికి నడుమ దూరానికి కారణమైన ధ్వేషాన్ని తొలగించడానికి చేపట్టిన శాంతి సామరస్య యుధ్ధం ప్రసంశనీయం. సరళమైన మాటలలో చెప్పావు అభినందనీయం-హరినాధ్

    ReplyDelete
  11. శాంతి పోరాటం సాగిద్దాం రండి.
    అప్పుడు ఆకాశంలో ఆగలేనన్న చంద్రుడ్ని
    భువిపైనే మకామంటూ రప్పించి మెప్పిద్దాం!

    ReplyDelete
  12. పద్దమ్మో గిసోంటి యుద్దాలు ఎన్ని సేయాలో ఏమో శాంతి కోసం

    ReplyDelete
  13. ధ్వేషించుకుని ధూషించుకున్నది చాలు
    ఆనందాన్ని అందుబాట్లోకి తీసుకురావడం ఎంతైనా అవసరమే
    చిత్రం అతికినట్లుంది యుధ్ధానికి :)

    ReplyDelete
  14. బాగుంది మీ కవితాచిత్రం.

    ReplyDelete
  15. విజయభేరి మ్రోగేనా పద్మా?

    ReplyDelete
  16. యుద్ధానికి రెడీ నేను నా సైన్యం ha ha ha :)

    ReplyDelete
  17. మేడంజీ మీరు దేన్నైనా సునాయసంతో చెప్పి ఉత్తేజపరుస్తారు.

    ReplyDelete
  18. కత్తులే తప్ప తుపాకీలు వాడరా పద్మార్పితాగారు యుద్ధంలో

    ReplyDelete
  19. అంతరంగాలను ఆలయాలుగా మార్చడం అంత సూలభమా పద్మా?
    ఏదైనా మంచి థాట్ఫుల్ పోస్ట్.

    ReplyDelete
  20. వావ్ యుద్ధంలో గెలుపు ఖాయం.

    ReplyDelete
  21. అందరి స్పందనలకు నమస్సుమాంజలి_/\_

    ReplyDelete
  22. Mam you are different.

    ReplyDelete
  23. This comment has been removed by the author.

    ReplyDelete