మేఘాలతో మెరుపులే ఊసులాడెనేమో
చినుకులే ధారగా కురిసి చిందులేసెనే..
వలపు వాయిద్యాలై రాగాలు ఆలపించగా
పులకరింతలే పురివిప్పి నాట్యమాడెనే..
మచ్చటించిన మాటలతో ఎదకొలనే తడవ
ఎత్తు నుండి పల్లానికి పరవశం పారెనే..
మురిసే నీటిముత్యాలే మోముకి సొగసులద్ద
అలలై ఎగసే ఆనందం పెదవులపై తేలెనే..
ప్రసరించే కిరణపు కాంతిలో కళ్ళు మెరవ
మైమరచి తనువే ఇంద్రధనస్సుగా వంగెనే..
ప్రకృతల్లిన పచ్చని పందిట్లో ప్రేమకు పెళ్ళవగా
నేల మట్టివాసనలతో కమ్మని విందు చేసెనే..
ఊరటించిన కొమ్మరెమ్మలు కోటిదీవెనలు ఇచ్చి
పువ్వులనే అక్షింతలుగా చల్లుతూ దీవించెనే..
చినుకులే ధారగా కురిసి చిందులేసెనే..
వలపు వాయిద్యాలై రాగాలు ఆలపించగా
పులకరింతలే పురివిప్పి నాట్యమాడెనే..
మచ్చటించిన మాటలతో ఎదకొలనే తడవ
ఎత్తు నుండి పల్లానికి పరవశం పారెనే..
మురిసే నీటిముత్యాలే మోముకి సొగసులద్ద
అలలై ఎగసే ఆనందం పెదవులపై తేలెనే..
ప్రసరించే కిరణపు కాంతిలో కళ్ళు మెరవ
మైమరచి తనువే ఇంద్రధనస్సుగా వంగెనే..
ప్రకృతల్లిన పచ్చని పందిట్లో ప్రేమకు పెళ్ళవగా
నేల మట్టివాసనలతో కమ్మని విందు చేసెనే..
ఊరటించిన కొమ్మరెమ్మలు కోటిదీవెనలు ఇచ్చి
పువ్వులనే అక్షింతలుగా చల్లుతూ దీవించెనే..
ప్రకృతి పులకరించి పరవసించేంత బాగారాశారు
ReplyDeleteమీ కలం అతిసుందరం.
"Personalization of Nature" is the Precise Description of Your Poem Padma Gaaru..
ReplyDeleteWith its lush greenery, and flowing rivers, it is a beauty in itself. The scents of flowers, the Myriad Hues of the Sky at various points of time, brings in a positive energy.
The mesmerizing Waterfalls that are both a feast to Eyes and Ears, the Sunshine, Moon-lit Night and Cycle of seasons which the nature accomplishes brings in vibrant and vivid ambience that is peerless.
~Sri~
kunikuniko kannaayi kannayi keni kaayi kanajuj rees karla.. panan yaadi baap kannaayi thoi under chuchaarepar thaalo thaalo rees kareni.. kasan kechi under reesemaa sadaai laad racha.. ghadeek rees karla.. ghadeek undena ramaadla.. ethini jaapaa yaadi an baapen kaayi rewnu..
Deletekonni konni saarlu teliyakundaane okariki okaripai kopam raavachu.. kaani talli dandrulu vaari pillala patla chupinche kopam lo entho aapyaayata vuntundhii.. konsepu kopaginchukuntaaru.. konsepu vaallathone chakkagaa aadukuntaaru.. inthakante talli dandrulaku em kaavaali..
at times, some get into a feud or quarrel without any particular reason whatsoever, but at times, the parents get angry upon their children, even it has more affection filled in it.. sometimes they get angry.. sometimes they play with them.. what else will the parents require other than this..
kabhi kabhi anjaane hi sahi ek doosre ke beech ek ghussa aur aapas mein jhagdaa panap uttha hai.. balki.. kabhi kabhi apne bachon par mata pita ko bhi katai roop se thoda bahut naaraazgi ke kaaran tang ho utthe hein.. par us naaraazgi mein bhi ek apnaapan hota hai.. kabhi kabhi ghussa kar liya karte hain.. to kabhi kabhi unhi se mann bahlaapaate hain.. aakhirkaar isse jyaada aur kyaa chaahte hoti hai harek maata-pitha ko..
lovely lines
ReplyDeletebeautiful painting
but you are lazy :)
ప్రకృతి కురిపించిన ప్రణయానికి పద్మార్పిత అక్షరరూపం అద్భుతం.
ReplyDeleteమీ పదకుసుమాలకు మేము పరవశం.
ప్రేమతో కాదు మీ పదాలతో పకృతిని మురిపింపజేసారు...కుడోస్ పద్మార్పితా
ReplyDeleteపరవశంతో ప్రకృతి చిరుజల్లులుగా కురిసింది మేడంగారు
ReplyDeleteప్రేమభావం పల్లంవైపుకి జారి ఆకాశాన్ని
ఎగిరివెళ్ళి తాకినట్లు ఉన్నాయి మీరు వ్రాసిన కవితాక్షరాలు
అందుకోండి అభినందనలు.
మీరు ఎప్పుడూ అద్భుతమైన కవితలు రాస్తారు.
ReplyDeleteonce again you proved padmarpita-fantastic lyrics
ReplyDeleteప్రేమజల్లుతో మనసు పులకరించింది
ReplyDeleteబొమ్మలు పెట్టడంలో మీకు సరిలేరు
నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను
Lovely Poem
ReplyDeleteమీ అక్షరాలతో మంచు బులెట్స్ వేసారు
ReplyDeleteఈమధ్యకాలం లైఫ్ బిజీ అయిపోయింది
ReplyDeleteమనసు ఊరటగుంది పద్మా కవితతో..
పువ్వులనే అక్షింతలుగా చల్లుతూ love it
ReplyDeleteప్రకృతిని పదజాలంలో బంధించి తీరు మనసుకి నచ్చించి, ఆశిస్సులు-హరినాధ్
ReplyDeleteఎత్తు నుండి పల్లానికి పరవశం బావుంది.
ReplyDeleteపక్షులు
ReplyDeleteప్రకృతి
పుడమి
పద్మార్పిత
పులకరించె
హా హా హా
మసక వెన్నెల పుల్కరింతలు
ReplyDeleteవాన జల్లు గిలిగింతలు
కారుమబ్బుల వెనుక దాగిన చంద్రుడు
నిన్ను చూసిన వాడి చూపులు..
..
..
మయూరి నర్తనలో వయ్యారాలు
నీ సుగసుల ముందు దిగదుడుపు
ప్రకృతితో కరిగి కదిలే నీ పదాలు
మనసుని మురిపించె సవ్వడులు..
బాగుంది మేడంజీ
ReplyDeleteగిలిగింతలు పెట్టింది :)
ReplyDeleteప్రకృతి ఆమె అందాల్ని పెంచి ప్రేమ పుట్టించి కదా!
ReplyDeleteతానే మారెనా లేక నన్నే మార్చెనా?
ReplyDeleteఏమైనారు పద్మార్పితజీ మీ పోస్ట్లు కరువైనాయి
ఏల ఎందువలనా? యెల్లరూ కుశలమేనా?
అందరికీ పద్మార్పిత అభివందనములు _/\_
ReplyDelete